–
ఆధునిక మానవుడి సంక్లిష్ట జీవితాన్ని అద్భుతంగా వొడిసి పట్టుకున్న కవిగా విలక్షణ స్థానాన్ని సుస్థిరం చేసుకున్న అఫ్సర్ బలమైన కథకుడు కూడా. 1983లోనే అతని తొలి కథ ప్రధాన స్రవంతి పత్రికలో ప్రచురితమై విమర్శకుల మన్నన పొందింది. అంటే కథకుడిగా అతని ప్రయాణం 35 యేళ్ళకు పైగానే సాగుతుంది. కానీ కేవలం యెంపిక చేసిన పదకొండు కథలతోనే ఆలస్యంగా సంకలన రూపంగా యివ్వాళ మన ముందుకు వస్తున్నాడు. తెలుగు నేల మీద హిందూ ముస్లిం సాంస్కృతిక సమైక్యతకి చిహ్నంగా జరుపుకొనే పీర్ల పండుగ దగ్గర్నుంచీ ప్రపంచ పరివ్యాప్తంగా ప్రేమ కరుణ సమత్వ భావనల్ని ప్రచారం చేసిన సూఫీ తత్త్వాన్ని అధ్యయనం చేసే క్రమంలో అఫ్సర్ యిటీవల రాసిన కథలే వాటిలో యెక్కువ. తన అధ్యయన ఫలితాల్ని అధ్యాపకుడిగా ప్రపంచ పౌరులతో పంచుకోడానికి కొనసాగింపుగా అతని కథల్ని చూసినప్పుడు యెన్నో కొత్త కోణాలు వెలికి వస్తాయి. తన నేల నుంచి తన మూలాలనుంచి దూరమైన అఫ్సర్ వలస వేదన అతని కవిత్వంలోనే కాదు కథల్లో సైతం ప్రతిధ్వనిస్తుంది.
హైదరాబాద్ లో ‘సాహిల్ వస్తాడు – మరికొన్ని కథలు’ ఆవిష్కరణకు కొన్ని గంటల ముందు ఆ కథల నేపథ్యం గురించి లోతుల గురించి రచయిత అఫ్సర్ మాతో పంచుకున్నారు. సమకాలీన ముస్లిం సామాజిక రాజకీయ అస్తిత్వ వేదనని, పరాయీకరణ మూలాల్ని అర్థం చేసుకోడానికి అవసరమైన పరికరాల్ని సమకూర్చుకోడానికి దోహదం చేసే సైద్ధాంతిక ఆలోచనలెన్నో అఫ్సర్ తో చేసిన ఈ ముఖాముఖిలో ప్రస్తావనకు వచ్చాయి.
జాతీయంగా అంతర్జాతీయంగా తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన ముస్లిం సమాజపు సగటు పౌరుడు యెదుర్కొంటున్న హింస మూలాల గురించి సాహిల్ వస్తాడు కథలు ప్రతీకాత్మకంగా చర్చించాయి. ఆ కథల్లోని పాత్రల అనేక ముఖాల గురించి భిన్న పార్శ్వాల గురించి ముచ్చటించే అవకాశం కల్పించి తానూ స్వయంగా భాగం వహించిన సాహిల్ వస్తాడు పుస్తక ప్రచురణ కర్త ‘ఛాయా’ కృష్ణ మోహన్ బాబు కు కృతజ్ఞతలు.
ఎ. కె. ప్రభాకర్
ఫోటో: సాహిల్ వస్తాడు ఆవిష్కరణ సభ
సామరస్యమే పెద్దకల ఈ మాట ఒక్కటిచాలు వివక్ష ఎంత పీడగా మారిందో తెలుపటానికి.
కమిట్మెంట్ కథకుని అంతే కమిట్మెంట్ విమర్శక రచయిత ఇంటర్వ్యూ బాగుంది
“జాతీయంగా అంతర్జాతీయంగా తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన ముస్లిం సమాజపు సగటు పౌరుడు యెదుర్కొంటున్న హింస మూలాల గురించి సాహిల్ వస్తాడు కథలు ప్రతీకాత్మకంగా చర్చించాయి. ఆ కథల్లోని పాత్రల అనేక ముఖాల గురించి భిన్న పార్శ్వాల గురించి ముచ్చ ” ఈ పుస్తకం తెప్పించుకొని తప్పక చదువుతాను అఫ్సర్ సర్
మంచి లోతైన చర్చ. చివర్లో అకస్మాత్తుగా ఆగిపోయినట్టనిపించింది. త్వరలో మిగతా భాగాలు ప్రచురించగలరు.
… సంతోషం సర్ 🙏🙏🙏
చదవాలని కుతూహలంగా ఉంది
U r great sir 💐💐
చాలా బావుంది అండి.. అభినందన మందారాలు
chalaa bagundi
After reading one story.. we need to take a gap before reading another one!
True life stories (when life included, where is the story.. it’s just life) of Indian Muslims.
గీత గారూ: నిజమే. ప్రతి కథా కొంత ఆలోచనని కోరుకుంటుంది!
చాలా బావుందండి ..అభినందనలు
ధన్యవాదాలు!
నేను ఎంతగానో ఎదురుచూసిన, బుక్ ఇది. !నా, నిరీక్షణ. వృధా కాలేదు, అన్ని kadalu. నవరసాలు. !ఇంటర్వ్యూ. బాగుంది. !
కథల గురించి మీ అభిప్రాయం కోసం ఎదురుచూస్తూ ఉంటా..
చాలా బావుంది అఫ్సర్ గారూ.. తొలిసారి మీ వాయిస్ వినడం కూడా బావుంది.. అభినందనలు సర్
సాహిల్ వస్తాడు చదవాలని ఉంది.. బుక్ ఎక్కడ దొరుకుతుంది..
శోభ గారూ, థాంక్స్. ఇండియాలో అమెజాన్ లో దొరుకుతోంది. https://www.amazon.in/dp/B07NQL4RF2/ref=sr_1_fkmr0_3?s=books&ie=UTF8&qid=1550162563&sr=1-3-fkmr0&keywords=afsar+mohammad&fbclid=IwAR3gY0Xxl10_zJkipkVQMvhl_PwaIy-LYz2mME6aiTLgmICP0Z_ueg9Dhps
చాలా బాగుంది అభినందనలు సర్….
సాహిల్ వస్తాడు తప్పకుండా తెప్పించుకుని చదువుతాను….
ఒక వర్తమాన కథా రచయితతో చేసిన మంచి ఇంటర్వ్యూ లలో ఇదొకటి. చాలా లోతైన, సూక్ష్మ పరిశీలనతో సాగిన ఇంటర్వ్యూ. వర్తమాన సమాజంలో కొనసాగుతున్న హింస, పరాయీకరణ, హిందూ, ముస్లింల మధ్య గల సంబంధాలు… ఇలా చాలా అంశాలపైన ఒక స్పష్టతనిచ్చిన ఇంటర్వ్యూ. ప్రభాకర్ గారికి, ఛాయా మోహన్ బాబు గారికి, అఫ్సర్ గారికి అభినందనలు…
శ్రీధర్
షుక్రియా! ఏకె ప్రభాకర్ తో మాట్లాడడం అంటే కష్టమే! ఆయన చాలా హోం వర్క్ చేసి ఇంటర్వ్యూకి వస్తాడు!
నిజానికి అఫ్సర్ తో మాట్లాడటం వల్లనే చాలా కథల విషయంగా నాకు స్పష్టత వచ్చింది.
కథల తాత్త్వికత లోతుల్లోకి చూడాలంటే అఫ్సర్ మాటల్ని రెండో భాగంలో సైతం వినండి
Samarasyame pedha kala… Ee maate mee sahithya lothuni telupithundhi… Mee kadhalaku venuka meeru padina aavedhana ardhavanthamaindhi. Ee samajam ardham chesukovalsinadhi. Tku for sharing… Mee patla marintha preamaabhimaanaalu perigaayi Afsarji meeru charithraloo nilichipothaaru… Salaam..
శాంతి: కథలు చదివితే ఈ ఇంటర్వ్యూ మరింత అర్థవంతంగా అనిపిస్తుంది.
Yes… Review kuda raayalani anipinchindhi. Avasaram kuda. Maa paperki pampinatlu leru. Vijayawada lo ekkada dhorukuthayo chebithe theppinchukunta Afsar ji
Yes… Review kuda raayalani anipinchindhi. Avasaram kuda. Maa paperki pampinatlu leru. Vijayawada lo ekkada dhorukuthayo chebithe theppinchukunta Afsar ji