నేటి రాజకీయాలే రేపటి చరిత్ర.మన కళ్ళముందు జరిగిన “లాంగ్ మార్చ్” ఒక చారిత్రిక సంఘటన.ఒక చారిత్రిక యధార్థం.చారిత్రిక యధార్థాలు చరిత్రకు ముడిసరుకు వంటివి.
సామాన్యుడికి చరిత్ర గురించి తెలియజేయడానికి చారిత్రిక గ్రంథాలకంటే ఎక్కువగా కళారూపాలే ఉపయోగపడతాయి.ఈ విషయంలో సాహిత్యం నిర్వహించే పాత్ర గురించి ప్రత్యేకం గా చెప్పుకోవాలి.సమకాలీన చరిత్ర- పరిణామాలు కథ,నవల వంటి సాహిత్యరూపాల్లో శక్తివంతంగా రికార్దు అయితే,అవి సామాన్య పాఠకుడికి కూడా చారిత్రిక పరిజ్ఞానాన్ని అందజేస్తాయి.
ఇందుకు మంచి ఉదాహరణ రష్యన్ విప్లవం. రష్యన్ విప్లవానికి ప్రభావితులు కాని రచయితలే లేరు. ఎర్రసైన్యం పక్షాన అంతర్యుద్ధంలో చురుకుగా పాల్గొన్న వీరునిగానూ,తన గ్రంథాలలో ప్రజల విప్లవ వీరకృత్యాలను కీర్తించిన సోవియట్ రచయితగాను బోరిస్ లవ్రెన్యోవ్ ప్రసిద్ధులు.ఇలాంటి రచయితలు ఎంతోమంది అక్కడ కనిపిస్తారు. అలాగే రష్యన్ విప్లవానికి పూర్వ రష్యాలోని ప్రజల జీవన స్థితిగతులకు చెహోవ్ కథలు అద్దం పడితే,విప్లవ సమయంలోను- అనంతర తక్షణ కాలంలోని పరిస్థితిని గోర్కి కథలు చిత్రీకరించాయి.అక్టొబర్ విప్లవ అనంతర రష్యా పరివర్తన గురించి మైఖెల్ షోలహోవ్ కథలు తెలియజేస్తాయి.
తెలుగువారి విషయానికివస్తే, జాతీయోద్యమం అత్యంత ప్రతిభావంతంగా చిత్రీకరించిన నవల ఉప్పల లక్ష్మణరావుగారి “అతడు-ఆమె”. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణమంతా మహీధర రామమోహనరావు నవలల్లో కనిపిస్తుంది.వీరి నవలల్ని విశ్లేషిస్తూ ప్రఖ్యాత విమర్శకుడు రా.రా.వీటిని చారిత్రిక నవలలుగా కొనియాడిన సంగతి మనకు తెలిసిందే.
తెలంగాణకు సంబంధించి -రాజకీయార్థిక సామాజిక పునాదితో కూడిన తొలి తెలుగు నవల”ప్రజల మనిషి” . తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంపై ఇప్పటి వరకు 23 నవలలు వచ్చాయి.తెలంగాణ ఉద్యమకాలంలో సమకాలీనంగా వచ్చిన రెండు నవలలు ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చినవే.అవి బొల్లిముంత శివరామకృష్ణ “మృత్యుంజయులు” (1947), లక్ష్మీకాంత మోహన్” సిం హ గర్జన”(1950). “సిం హ గర్జన” యూనియన్ సైన్యం ప్రవేశించిన తర్వాత కూడా కొనసాగించిన సాయుధ పోరాటాన్ని బలపరిచిన ఏకైక నవల.తెలంగాణ సాయుధ పోరాటాన్ని మరింత కాల్పనికతతో,ఆదర్శవాదంతో నవలలు రాసిన వ్యక్తి దాశరథి రంగాచార్య.
“మా పల్లే” అని తొలి విప్లవోద్యమ నవల రాసింది చెరబండరాజు.తర్వాత “కొలిమంటుకున్నది” అల్లం రాజయ్య, రఘోత్తమరెడ్డి “నల్ల వజ్రం” నవలలున్నాయి.పి.చంద్ రాసినవన్నీ ఉద్యమ నవలలే. నల్లగొండ జిల్లా విప్లవోద్యమ నాయకుడు కిరణ్ ఎన్ కౌంటర్ అయ్యాక ఆయన జీవితం- పోరాటం ఆధారంగా ఆలూరి భుజంగరావు రాసిన “ప్రజలు అజేయులు” నవల బహుశా ఆఖరి విప్లవోద్యమ తెలంగాణ నవల
1969 తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిభావంతంగా చిత్రీకరించిన నవల అంపశయ్య నవీన్ గారి”ముళ్ళపొదలు”.జై తెలంగాణ-జై ఆంధ్ర ఉద్యమాల్ని చర్చిస్తూ రాసిన నవల పోరంకి దక్షిణామూర్తి “నీడలు-జాడలు” కాగా,మాదిరెడ్డి సులోచన “సంధ్యారాగం” లో కూడా 1969 తెలంగాణ ఉద్యమాన్ని చూడవచ్చు.
పూర్తి తెలంగాణ చరిత్రను తెలియజేస్తూ వచ్చిన వాటిలో పి.లోకేశ్వర్ “సలాం హైదరాబాద్” అంపశయ్య నవీన్ “కాలరేఖలు” చెప్పుకోదగినవి.మలి తెలంగాణ ఉద్యమం తర్వాత,తెలంగాణ సిద్ధించినాక వచ్చిన నవలల్లో రామా చంద్రమౌళి “కాలనాళిక” వేముగంటి శుక్తిమతి “మళ్ళీ పల్లే ఒడిలోకి” వసంతరావు దేశ్ పాండే “తెలంగాణ తల్లి” నవలలు వచ్చాయి.పి.చంద్ “సకలజనుల సమ్మె”, పెద్దింటి అశోక్ కుమార్ “లాంగ్ మార్చ్” అనే రెండు నవలలు ఆయా సంఘటనలు-వాటి పరిణామాలను చిత్రీకరించాయి.
పూర్తి చరిత్రను రాయడం వేరు.చరిత్రను మలుపు తిప్పిన ప్రధాన సంఘటలను ఆధారం చేసుకొని రాయడం వేరు.ఎంతో ప్రతిభ వున్న రచయిత తప్ప వేరేవాళ్ళు రాయలేరు.నిశితమైన పరిశీలన,సరియైన అవగాహన,సమ్యక్ దృక్పథం వున్న రచయితే సమకాలీన సంఘటనలకు సరియైన రూపం కల్పించగలడు.
తెలంగాణ ఉద్యమం వివిధ దశల్లో,వివిధ కార్యాచరణల ద్వారా సంఘటితమౌతూ వచ్చింది,బలపడుతూ వచ్చింది.తెలంగాణ ఉద్యమంలో కీలకమైన దశ”సకలజనుల సమ్మె”.ప్రత్యేక తెలంగాణతోనే తమ ఆకాంక్షలు, ప్రయోజనాలు ముడిపడివున్నాయని గమనించిన సింగరేణి కార్మిక వర్గం సకలజనుల సమ్మెలో పాల్గొన్నది.ఆంధ్ర పాలకుల కుట్రలవలన,నాయకత్వ వైఫల్యం వలన సమ్మె ఆశించిన ఫలితాలు నెరవేరకుండానే విరమించాల్సివచ్చింది. గోదావరి ఖనిలోని యైటింక్లెయిన్లోని కాలనీలోని తెలంగాణ చౌక్ కేంద్రంగా సింగరేణి కార్మిక వర్గం నడిపిన సకలజనుల సమ్మె వాస్తవ పరిస్థితిని సమ్మె కాలంలోనే నవలగా మలిచారు పి. చంద్ .సమ్మె కాలంలో కార్మికుల తక్షణ స్పందనలను, భావోద్వేగాలను,ఆనాటి పరిస్థితులను,కార్మికుల ఆకాంక్షలను ఈ నవల ప్రతిఫలించింది.అదే పెద్దింటి అశోక్ కుమార్ సహాయ నిరాకరణ నుండి మిలీనియం మార్చ్ వరకు జరిగిన సంఘటనలు,ఆయా సంఘటనలు ఎలా ఉత్తేజపరిచి సంఘటితపరిచాయో తమ నవల ద్వారా తెలియజేశారు.
“లాంగ్ మార్చ్” నవలలో రాయమల్లు ఒక సామాన్య రైతు.తెలంగాణ వీరాభిమాని.పైకి చాలా అమాయకంగా కనిపించినా మంచి ఆలోచనాపరుడు.రైతు కాబట్టి వ్యవసాయపనులు,పశుపోషణలో వున్నట్టు కనిపించినా,అతని ధ్యాస అంతా ఉద్యమం వైపే.అక్కడి గ్రామ రాజకీయాలు వీరికి వ్యతిరేకంగా వుంటాయి.అధికారపక్ష తొత్తులుగా మారిన స్థానిక నాయకులు ఉద్యమాన్ని అణచివేసి,పైవాళ్ళ మెప్పుపొందాలని ప్రయత్నిస్తుంటారు.అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమాన్ని ఊళ్ళో ఏర్పాటు చేసి,ప్రజలను తమవైపుకు తిప్పుకుంటే ఉద్యమాన్ని నీరుగార్చవచ్చనే తలంపుతో ఉంటారు.ఆ ఊరి ఉద్యమకారులు దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితిలో వున్నప్పుడు,రాయమల్లు ఇచ్చిన సలహా వల్ల రచ్చబండ కార్యక్రమం రసాభాస అవుతుంది.రాయమల్లు సర్పంచ్ ను,యంపిటిసి మెంబర్ ను రాజీనామా చేయమని నిలదీస్తాడు.”కొత్త మనిషిని జూత్తేనే గోషిలేరుక్కునే రాయమల్లుగాడు లీడరయిండా” అని అశ్చర్య పోతారు.
తెలంగాణ ఉద్యమ వార్తలకోసం టివి మీదనే ఆధారపడ్డ రాయమల్లు ఒకసారి ఛానెల్ తిప్పుతూ “జయప్రకాశ్ నారాయణపై ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కారు డ్రైవర్ దాడి” అనే ఫ్లాష్ న్యూస్ చూస్తాడు.తెలంగాణ మీద విలేఖరుల ముందు ఏదో అంటే కొట్టాడని అర్థమయ్యాక “అబ్బర కొడకా…ఇన్ని రోజులకు ఒక మంచి పనయింది.నువ్వు అవినీతి మీద కొట్లాడుతవుగదా,సారూ..మరి తెలంగాణకు జరిగే అవినీతి కనపడుతలేదా?మంచి పని చేసినవురా మల్లేశా..ఇట్ల తంతెనే బుద్ది వత్తది..” అనుకుంటాడు.టీవీలో ఈ సంఘటనమీదనే చర్చ జరుగుతుంటది.అది చీకటి రోజని ఒకరు,ప్రజాస్వామ్యంపై దాడి అని మరొకరు.ఇది తెలంగాణ గూండాయిజమని ఒకరు.రకరకాల మాటలు.మొత్తం మీద ఆంధ్రలోని చిన్నాచితక అన్ని పార్టీల వాళ్ళు అంతా ఒకటై దాడి మొదలుపెడతారు.రాయమల్లుకు బాధ అనిపిస్తుంది.”చూసినవా…చిన్నగ ఒకల మీద రెండు దెబ్బలు పడితేనే ఏదో కొంపలు అంటుకుపోయినట్టు అన్ని పార్టీలు ఒక్కటయినాయి.మరి మన పోరగాండ్లు అంత మంది సచ్చినా,అన్ని దెబ్బలు తిన్నా మన పార్తీల వాళ్ళు ఒక్కటి కాకపోయిరి.వాళ్ళయే ప్రాణాలు గాని మనయికావా..” అనుకుంటూ ఛానెల్ మారుస్తాడు.
2011 ఫిబ్రవరి పది హేడున ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ ప్రకటించాలని కోరుతూ ఉద్యోగులు సహాయ నిరాకరణ మొదలు పెట్టారు. వారికి సంఘీభావంగ్ని అన్ని వర్గాల నుంచి ర్యాలీలు నిరసనలు మొదలయ్యాయి. అటు పార్లమెంటులో ఇటు అసెంబ్లీలో తెలంగాణకు సంబంధించి వాడిగా వేడిగా చర్చ జరిగింది. మార్చ్ పదినాడు హైదరాబాద్ ముట్టడి జరపాలని కూడా నిర్ణయం జరిగింది. తెలంగాణ వచ్చేవరకు సహాయ నిరాకరణ కొనసాగుతుందని ఉద్యోగ్ని నాయకులు ప్రకటించారు.
కాని ఇక్కడనే ఉద్యోగ్ని నాయకుల అంచనాలను తలక్రిందులు చేస్తూ ఒక పని జరిగింది. ఉద్యోగుల సహాయ నిరాకరణకు తోడుగా రాజకీయ నాయకులు కూడా తోడవుతారని ఫలితంగా అది ప్రజా ఉద్యమమవుతుందని తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం దిగి వస్తుందని జేఏసీ తలచింది. కాని ప్రజలందరు సహకరించినా తెలంగాణ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు సహకరించలేదు. సహాకరించకపోగా ఉద్యమానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేసాయి. ఫలితంగా సహాయ నిరాకరణ ప్రజా ఉద్యమంగా కాకుండా ఉద్యోగాల నిరసనగానే మిగిలిపోయింది.
దానిని కనీసం మార్చ్ పదివరకైన కొనసాగించాలని చూసారు ఉద్యోయిలు. వీలుకాక నాలుగ్నివ తేదీననే ముగించారు. కాని సహాయ నిరాకరణ కిరణ్ కుమార్ ప్రభుత్వానికి ఇచ్చిన షాక్ ఇంతా అంతా కాదు. పరిపాలన పూర్తిగా స్థంబించిపోయింది. ఖజానలో జీతాలకే డబ్బులు లేవు.
కరంటు లేదు. పైళ్లు కదలవు. అంతా అయోమయం. ఒక దశలో సీఎం పదవికే ఎసరు వచ్చింది. చావు తప్పి కళ్లు లొట్టలు పోయినట్టు ఒక గండంలోంచి బయటపడిన కిరణ్ కుమార్ ప్రభుత్వానికి మిలియన్ మార్చ్ రూపంలో మరో గండం ఎదురయింది.
కథ అక్కడే మొదలయింది. అప్పటికే కేంద్రం చేత చీవాట్లు తిన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మిలియన్ మార్చ్ మీద ఉక్కుపాదం మోపింది. అనుమతి ఇవ్వకుండా అడ్డుకుంది. పిల్లలకు పరీక్షలున్నాయని విధ్వంసం చోటు చేసుకుంటుందని, అసెంబ్లీ సమావేశాలున్నాయని ఏవో కారణాలు చెప్పి అనుమతి ఇవ్వలేదు. కనీసం మూడుగంటలు నిరసన తెలుపుదామన్నా అనుమతి వ్వలేదు. కాని జేఏసీ పట్టుదలగా ఉంది. సహాయ నిరాకరణ విరమణతో నిరుత్సాహంగా ఉన్న ప్రజానికానికి మిలియన్ మార్చ్ తో పిడికెడు నమ్మకాన్ని ఇవ్వాలనుకుంది.
టాంక్ బండ్ మీదికి ఎవరు రావద్దని మిలియన్ మార్చ్ అనుమతి లేదని వస్తే క్రిమినల్ కేసులు తప్పవని ప్రభుత్వం భయపెట్టింది. దారులన్నింటిని దిగ్భందం చేసింది. వేలాదిమంది పోలీసులను కాపలా పెట్టింది. టాంక్ బండ్ చుట్టూ యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. రావడానికి పోవడానికి దారులను మూసింది. నగరాలకు పలు రైళ్లను, గ్రామాలకు ఎన్నో బస్సులను నిలిపివేసింది.
అలాంటి పరిస్థితుల్లో రాయమల్లు ఊరిలో పోలీసు నిఘా నుండి తప్పించుకుని, చాలా తెలివి గా వాళ్ళ కళ్ళు గ్నిప్పుతూ హైదరాబాద్‌లోని టాంక్ బండ్‌కు చేరుకోవడమే అసలైన విజయం. ఉద్యమ అవసరాలు, పరిస్థితుల ప్రభావం వల్ల సామాన్యులు కూడా నాయకులుగా పరిణమిస్తారని ఈ నవల లోని రాయమల్లు పాత్ర ద్వారా రచయిత నిరూపిస్తాడు. ఇందులొ రాయమల్లు సంసార బాధ్యతలు, ఉద్యమ నిబద్దతల మద్య కొట్టుమిట్టాడే వ్యక్తిత్వం, ప్రభుత్వ అణచివేత, పోలీసుల దమనకాండ, జేపిసిల ఏర్పాటు, వారి నాయకత్వ పటిమను, ఉద్యమ నేతల ప్రస్తావనలు, మీడియా పక్షపాతాన్ని సందర్భానుసారంగా వివరించడం బాగా వచ్చింది.
ముఖ్యంగా ఈ నవలలో అప్పటి సమాజం, వారి భావోద్వేగాలు, అప్పుడు పల్లెలు ఎలా ఉండేవి, ఉద్యమ నిర్మాణం ఎలా జరిగింది. పల్లెల్లో అన్ని పార్టీల నాయకులు ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఉద్యమ కాలంలో సాధరణ జనం మానసిక స్థితి ఎలా ఉండేది, వారి ఆలోచనలు ఎలా సాగేవి, నాయకులు ఇక్కడ ఒక పిలుపునిస్తే అక్కడ ఎలా స్పందించేవారు. పోలీసుల నిర్భంధం ఎలా సాగింది, సాధారణ పౌరులు తమ నిరసనను ఎలా తెలిపేవారు, ఒక్క పిలుపుతో రైలు పట్టాల పైకి రోడ్లపైకి జనం వేలాదిగా ఎలా తరలి వచ్చేవారు,వారికి ఎవరు నాయకత్వం వహించేవారు అనే అంశాలతో పాటు కుల మత వర్గ భేదం లేకుండా సబ్బండ జనం ఎలా ఏకమయ్యరు అన్న విషయాలను చర్చించారు.
రచయిత ‘లాంగ్ మార్చ్’ ను ఈజిప్ట్ రాజధాని కైరో నగ్నరంలోని తెహరీర్ స్క్వైర్ సంఫ ఎటనతో పోల్చిచెబుతుంటారు. అక్కడ ఇమికూడిన లక్షలాది జనం పోలీసులను, మిలటరీ ను ఎదురించి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటారు. దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న నియంతలు భయపడి పారిపోతారు. ఒక వేళ విఫలమైతే, చైనాలోని తియాన్మిన్ – స్క్వైర్ సంఘటన రిపీట్ అవు తుందని హెచ్చరిస్తారు.
ఫ్రెంచ్ విప్లవచరిత్ర, చరిత్ర పుస్తకాల్లో కన్నా రక్తమాంసాలతో బాల్నాక్ నవలల్లో తనకు దొరికిందని మార్క్స్ చెప్పినట్లు – తెలంగాణ వుద్యమ స్వరూపాన్ని ఇలాంటి నవలల ద్వారా తెలుసుకోగలుగుతాము.
*
Add comment