పెద్ద ప్రహరీ గోడకు వేళ్లాడదీసిన బోర్డు. వెడల్పుగా నాలుగడుగుల రేకు మీద తెల్లటి పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన బోర్డు శ్రీ శారదా ట్యుటోరియల్స్. దాని క్రింద ఒక తెల్లటి గీత. ఆ గీత క్రింద “ ఇచ్చట మెట్రిక్, పీయూసీ, డిగ్రీ తరగతులకు అకౌంట్స్… ఇంగ్లీష్ ప్రయివేట్లు చెప్పబడును ”అని ఎర్రటి మెరిసే అక్షరాలతో ఆ బోర్డు చూపరులను ఆకట్టుకునేది. రెండు సిమెంటు సింహాలు ఎదురెదురుగా నిలుచుని యుద్ధానికి సై అంటున్నట్టుగా ఆ ప్రహరీ మెయిన్ గేటు మీద ఉండేవి. కుడి వైపు ఉన్న సింహపు బొమ్మ ప్రక్కన ఓ మూడడుగుల దూరంలో ఈ బోర్డు ఉండేది. అంతకు ముందు అగ్రహారంలో రెండు, మూడు అద్దె ఇళ్లు మారినా బోర్డు పెట్టుకోవడానికి మాత్రం అవకాశం దొరికింది వాడ్రేవు రాజబాబు ఇంట్లోనే. అద్దెకు దిగే ముందు ట్యూషన్లే తమ వృత్తి అని, తొమ్మిది మంది సంతానానికి రెండు పూటలా కడుపు నింపేది ఈ ట్యుటోరియల్స్ అని ఇంటి యజమాని వాడ్రేవు రాజబాబుకి మా అక్కలు చెప్పలేదు. అద్దె ఇల్లు ఐదు గదులతో, ఆ ఇంటి పెద్ద మామ్మగారి హృదయంలా విశాలంగా ఉందని తలంచారే తప్ప, మా నాన్నగారి వృత్తిని ఆ పెద్దావిడకు చెప్పలేదు. ఇంట్లో సామాన్లతో దిగిన రెండు రోజుల తర్వాత మామ్మగారి ఆఖరి కుమారుడు, నిరంతరం కాసింత కోపంగా ఉండే వాడ్రేవు రాజబాబు దగ్గరకి చెవిటి మాష్టారుగా పిలవబడే మా నాన్నముక్కామల భాస్కర కామేశ్వరరావు వెళ్లారు.
మా స్వగ్రామం ముంగండ అగ్రహారంలో మా నాన్న భానుడు
పొట్ట చేత పట్టుకుని వచ్చిన కూచిమంచి అగ్రహారంలో మా నాన్నకొందరికి చెవిటి మాస్టారు… మరికొందరికి ముక్కామల మాస్టారు…
మా నాన్న ఆరు అడుగుల పొడవుకు దగ్గరగా… సన్నంగా రివటలా ఉండే వారు…
ఆయన వొంటి మీద ఖద్దరు బట్టలు తప్ప మరే బట్ట వేసుకునే వారు కాదు. భుజాన సన్నంచు ఎర్రటి… ఆకుపచ్చ కలయికతో ఉన్న కండువా వేసుకునే వారు. ఒక్కోసారి కండువా కనిపించకపోతే చిన్న పిల్లాడిలా నానా యాగీ చేసే వారు.
“ ఈ ఒక్కరోజుకీ కండువా వేసుకోకపోతేనేం. అంత గొడవ చేస్తున్నారు“ అని మా అమ్మ అంటే “కండువా అంటే ఓ గుడ్డ పీలక కాదు. నిత్యం వెన్నంటి ఉండే భార్య. అది బాధ్యతలని గుర్తు చేసే నా కుటుంబం“ అని సమాధానమిచ్చే వారు.
ముఖాన కుంకుమ బొట్టు ఉండేది కాదు కాని మనసులో దైవ భక్తి ఎక్కువగా ఉండేది
రాత్రిళ్లు నేను మా నాన్నదగ్గరే పడుకునే వాడిని. ఆ సమయంలో మా నాన్న దగ్గర నుంచి ముక్కు పొడుం వాసన వచ్చేది. బహుశా యవ్వనంలో నేను సిగరెట్లు కాల్చడానికి కారణం ఆనాటి ముక్కు పొడుం వాసనే.
మా నాన్న ఖద్దరు చొక్కా గుండెల మీద… ఎడమ వైపున్న జేబు దగ్గర లేత పొగాకు రంగులో ముక్కుపొడుం మచ్చలుండేవి.
ఆయన ఇంటి యజమాని రాజబాబు దగ్గరకు వెళ్లి… “ నేను ప్రయివేట్లు చెప్పుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. కోనసీమ సెంట్రల్ బ్యాంక్ లో ఉద్యోగం తీసేసిన తర్వాత ఇదే నా జీవనాధారం. మీరు అంగీకరిస్తే బోర్డు పెట్టుకుంటాను. నలుగురుకీ తెలియడం కోసం ” అని చాలా వినమ్రంగా అడిగారు. ఆ సమయంలో మా నాన్నగారి ప్రక్కనే నేను, మా పెద్దక్క ఉన్నాం. మా నాన్న అలా అడుగుతున్నప్పుడు ఆయన గొంతులో ఓ జీర నాకు స్పష్టంగా వినిపించింది.
ఆ జీర…. మధ్య తరగతి జీవితాల ప్రతిబింబం.
ఆ జీర …. ఓ కుటుంబ పెద్ద గొంతులో కొట్టుకుంటున్న జీవన పోరాటం
ఆ జీర…. తొమ్మిది మంది సంతానాన్ని సాకే ప్రాణ వాయువు
ఆ జీర…. మా నాన్న గొంతులో కదలాడే పదకొండు మంది ప్రాణం
చెవిటి మాస్టారు చెప్పింది కళ్లు మూసుకుని విన్నారు వాడ్రేవు రాజబాబు. నాకు, మా అక్కకి కాళ్లూ చేతులు ఆడడం లేదు. వాడ్రేవు రాజబాబు కోపిష్టి అని, ఆ ఇంట్లో ఉండడం కష్టమని, అక్కడ అనేకానేక షరతులుంటాయని మా ఇంట్లో పనిచేసిన పనిమనుషులు చెప్పడంతో ఆయన పట్ల మా కుటుంబం అందరికి ఓ భయం వెంటాడింది.
మా అమ్మ ఇదే విషయాన్ని మా నాన్నకి చెబుతూ “ ఆ రాజబాబు కోపిష్టి అట అయితే మంచివాడట లెండి. పెద్దవాళ్లంటే గౌరవం అట. మీరు మంచిగా, నెమ్మదిగా చెబితే వింటాడని ఆ ఇంట్లో అద్దెకున్నవాళ్లు చెప్పారు. మనం బతికాలి కదా… వింటాడు. కాకపోతే రవ్వంత కోపం అయ్యుండచ్చు” అని మా అమ్మ నాన్నకి ముందే జాగ్రత్తలు చెప్పింది.
అగ్రహారంలో ఎవ్వరితోను మాట పడని, ఎవ్వరిని మాట అనని మా నాన్న ఆ ఇంట్లోకి వెళ్లగానే లోలోపల భయం భయంగానే తన జీవిక గురించి వాడ్రేవు రాజబాబుకు చెప్పారు.
అప్పటి వరకూ పడక్కుర్చీలో కూర్చున్న వాడ్రేవు రాజబాబు ఒక్కసారిగా లేచి మా నాన్న ఎడమ చెవి దగ్గరకు వచ్చి “ అయ్యో… మీరు ట్యూషన్లు చెప్పుకోండి. మాకేం పర్వాలేదు. అయితే బోర్డు పెడితే మునిసిపాలిటీ వాళ్లు పన్నువేస్తారు. అదే ఆలోచిస్తున్నా. అది నే చూసుకుంటా. మీరిబ్బంది పడకండి మాస్టారు అన్నారు. ” మా నాన్న రాజబాబు రెండు చేతులు పట్టుకుని కృతజ్ఞత పూర్వకంగా కళ్లు మూసుకున్నారు.
****** ****** ****
మా అద్దె ఇంటి ముఖద్వారం ముందు ఉన్న సిమెంటు గచ్చు మీద కుడివైపు ఐదు, ఎడమ వైపు ఐదు బెంచీలు. వాటికి ముందు గోడ మీద ఓ బ్లాక్ బోర్డు. బెంచీలకి, బ్లాక్ బోర్డుకి మధ్యలో ఓ టేబుల్, కుర్చీ.
మా నాన్న డిగ్రీ కుర్రాళ్లకి నాన్ డిటైల్ పాఠ్యాంశాలుగా ఉన్న షేక్ స్పియర్ హేమ్లేట్, మేక్ బెత్ నాటకాలను అర్ధాలు, సీన్ లతో సహా బోధిస్తుంటే చివరాఖరి బెంచీ మీద షేక్ స్పియర్ కూర్చుని శ్రద్దగా వింటున్నట్లుగా ఉండేది.
డెఫడెల్స్ కవిత రాసిన విలియమ్ వర్డ్స్ వర్త్, ఓడ్ టూ నైటింగేల్ రాసిన జాన్ కీట్స్, ప్యారడైజ్ లాస్ట్ రచయిత జాన్ మిల్టన్ మా ఇంట్లో తిరుగుతున్నట్లుగా ఉండేవారు. వీళ్లందరి రచనలను మా నాన్న చాలా శ్రద్ధగా… ఎంతో భక్తితో చెప్పేవారు. ప్యారడైజ్ లాస్ట్ పాఠం చెబుతూండగా మా నాన్న కన్నీళ్లు పెట్టుకోవడం నేను చాలాసార్లు చూశాను.
To be, or not to be, that is the question:
Whether ‘t is nobler in the mind to suffer,
The slings and arrows of outrageous fortune,
Or to take arms against a sea of troubles
And by opposing …. To die .. to sleep
హెమ్లెట్ నాటకానికి ప్రాణమైన ఈ వాక్యాలను విద్యార్దులకు వివరించే సమయంలో మా నాన్నగారి కళ్ల నుంచి కన్నీటి బొట్లు రాలేవి. బహుశా తనని తాను హెమ్లట్ పాత్రధారిగా మా నాన్నగారి భ్రమించేవారు. ఆ నాటకాలను, ఆ ఇంగ్లీష్ కవిత్వాన్ని విద్యార్థులకు బోధిస్తున్నప్పుడు ఆ పాత్రలు, ఆ కవిత్వము తానే అన్నంత వాస్తవంలో ఉండేవారు.
అకౌంట్స్ పాఠాల కంటే ఇంగ్లీష్ చెప్పడం పైనే మా నాన్నకు మక్కువ ఎక్కువ.
*** *** ***
క్యాస్ట్ ఫీలింగ్ కారణంగా కోనసీమ సెంట్రల్ బ్యాంకులో మా నాన్న ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయనప్పటి నుంచి చెవిటి మాష్టారికి రెండే రెండు వ్యాపకాలు. శ్రీ శారదా ట్యుటోరియల్స్ లో విద్యార్ధులకు పాఠాలు చెప్పడం ఒక వ్యాపకమైతే, తాను కోల్పోయిన ఉద్యోగాన్ని తిరిగి తెచ్చుకోవడం కోసం..లేదూ నష్టపరిహారం రాబట్టుకోవడం కోసమో కోర్టుల చుట్టూ తిరగడం మరో వ్యాపకం. ఈ రెండో వ్యాపకంతో ఆయనకు, ఆయన పేర్లకు “కోర్టు పక్షి” అనే మరో నామధ్యేయం కూడా కలిసింది.
కోనసీమ సెంట్రల్ బ్యాంకుపై నష్టపరిహారం కోసం దావా వేసిన చెవిటి మాష్టారు పట్టాలేని న్యాయవాదిగా మారారు. కేసు గెలవడం కోసం బహుశా ఏ న్యాయవాది చదవని లా పుస్తకాలు చదివారు. ఆ సమయంలో…
ముక్కామల మాష్టారు… నడిచే సుప్రీం కోర్టులా ఉండేవారు
ముక్కామల మాష్టారు… కళ్లకు గంతలు కట్టుకోని న్యాయదేవతలా ఉండేవారు
ముక్కామల మాష్టారు…న్యాయమూర్తి చేతిలో ఆర్డర్.. ఆర్డర్ అంటూ బల్ల చరిచే కర్రలా ఉండేవారు
ముక్కామల మాష్టారు….న్యాయవాదులు, న్యాయమూర్తులు వేసుకునే నల్లటి కోటులా ఉండేవారు.
**** ***** ****
“ పంతులు మీద గెలవాలి.. గెలిచి తీరాలి. గెల్లేకపోతే ఊళ్లవోలందరికి సులకన అయిపోతాం. ఉద్యోగం తీసేసిన పతోడు కోర్టుకెల్లిపోతారు. ఈణ్ని ఇక్కడ ఆపేయాలి” కోనసీమ సెంట్రల్ బ్యాంక్ బోర్డు మీటింగ్ లో చైర్మన్ రాజుగారు ఆవేశంగా మాట్లాడుతున్నారు.
చైర్మన్, ఇతర బోర్డు సభ్యులు కలిపి ఓ 12 మంది ఉంటారు. ఆ రోజు బోర్డు సమావేశంలో ఎజెండా చెవిటి మాస్టారి కేసే. సభ్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. కొందరు ఆవేశంగా ఉన్నారు. ఇంకొందరు సాలోచనగా ఉన్నారు. బోర్డు సభ్యులతో పాటు బ్యాంకు ప్లీడర్ కూచిమంచి ప్రకాశంగారు అక్కడే ఉన్నారు.
చైర్మన్, బోర్డు సభ్యులు మాట్లాడుతున్నదంతా ప్రకాశం గారు శ్రద్దగా విన్నారు. వాళ్ల ఆవేశకావేశాలు పరికించారు. తన వెంట తెచ్చుకున్న వెండి మరచెంబులో ఉన్న నీళ్లను వెండి గ్లాసులో పోసుకున్నారు. ఆ నీళ్లను తాగి వెండి మరచెంబును ప్రేమగా చూసుకున్నారు.
“ ఈ కేసులో గెలవాలంటే బలమైన సాక్ష్యం కావాలి. ముక్కామల మాస్టారు ఉద్యోగం పోవడం వల్ల జీవికకు ఇబ్బంది వచ్చిందని, కుటుంబ పోషణ కష్టంగా ఉందని చాలా బలంగా వాదిస్తున్నాడు. ఈ కేసు గెలవాలంటే అతడి కుటుంబ పోషణకు వచ్చిన ఢోకా లేదని, ప్రత్యామ్నాయంగా ప్రయివేట్లు చెప్పుకుంటున్నాడని మనం కోర్టుకి సాక్ష్యం చూపించాలి. ఆ ప్రయత్నాలు చేయండి” అని చైర్మన్ కి, బోర్డు సభ్యులకి ఓ సలహా ఇచ్చారు.
“అంటే ఏం చేద్దాం ” అని బోర్డు సభ్యులందరూ ముక్త కంఠంతో అడిగారు. “ఏం లేదు ముక్కామల మాస్టారు ప్రయివేట్లు చెబుతున్నప్పుడు ఓ ఫొటో తీయించండి. ఆ ఫొటోని కోర్టులో ఎలిబీగా ఇద్దాం. ఈ కేసులో మనం గెలుస్తామని” అని సలహా ఇచ్చారు.
బోర్డు సమావేశం ముగిసింది. కూచిమంచి ప్రకాశంగారు తన జట్కా బండిలో ఇంటికి బయలుదేరారు. వాడ్రేవు రాజబాబు ఇల్లు దాటాక జట్కా బండిని ఆపమన్నారు. బండి తోలుతున్న జట్కావాడితో “ ముక్కామల మాస్టారింటికి వెళ్లి రాత్రి పొద్దుపోయిన తర్వాత మనింటికి రమ్మని చెప్పు ” అని పురమాయించారు.
జట్కా అతను మా ఇంటికి వచ్చి “ పేకాశం బాబు గారు రాత్రి పొద్దోంయిం తర్వాత ఆరింటికి (వారింటికి) రమ్మన్నారు ” అని చెప్పి తూటాలా వెళ్లిపోయాడు.
ఎందుకు రమ్మన్నారో, ఏం జరిగిందో తెలియక రాత్రి తొమ్మిదింటి వరకూ మా ఇంట్లో అందరూ ఆందోళనగా ఉన్నారు.
*** ***** ***
అప్పటికీ అగ్రహారం ఉన్న అమలాపురంలో విజయా ఫొటో స్టూడియో ఒక్కటే ఉంది. ఆ స్టూడియో యజమానిని బ్యాంకు సిబ్బంది కలసి “ ముక్కామల మాస్టారు ట్యూషన్లు చెబుతున్న ఫొటో తీయాలి ఆయనకు తెలియకుండా ” అని అడిగారు.
దానికి విజయా ఫొటో స్టూడియో యజమాని నాయుడు గారు అంగీకరించలేదు.
“ఇలా కడుపులు కొట్టడం నేను చేయను ” అన్నారు.
“ బ్రాహ్మలను ఇబ్బంది పెడితే మనకే తగులుతుంది ” అని కూడా అన్నారు.
“ఇదేం బుద్దీ ఓ కుటుంబాన్ని రోడ్డున పడేస్తారా.దానికి నేను సహాయం చేయాలా. మీరెంత ఇచ్చినా ఈ పని చేయను. ఆ బ్రాహ్మడి కడుపు కొట్టను” అని నాయుడు గారు బ్యాంకు అధికారులకు సమాధానం చెప్పారు.
**** ***** ****
రాత్రి తొమ్మిది గంటలయింది. చీకటిగా ఉంది. నేను, మా నాన్న అగ్రహారంలోని ప్రకాశం వీధిలో ఉన్న కూచిమంచి ప్రకాశంగారింటికి వెళ్లాం. లా పుస్తకాలు చదువుకుంటున్న ప్రకాశంగారు నన్ను, మా నాన్నని ఇంటి పెరటిలో ఉన్న పాకలోకి తీసుకెళ్లేరు.
కోనసీమ బ్యాంకు బోర్డు మీటింగులో జరిగిన సంగతి మా నాన్న చెవిలో చెప్పేరు.
“ నువ్వూ ఓ పదిరోజులు ప్రయివేట్లకు సెలవులిచ్చేయి. బ్యాంకు వాళ్లు నువ్వు ప్రయివేట్లు చెబుతుండగా ఫొటో తీయాలనుకుంటున్నారు. బ్యాంకు లాయర్ని కదా నేనే ఆ సలహా ఇచ్చా. తప్పే అనుకో. కాని వృత్తి ధర్మం కదా తప్పదు” అన్నారు.
“ అయ్యో పిల్లలకి పరీక్షలు, ఇప్పుడు చెప్పకపోతే అన్యాయం అయిపోతారు. ఏం చేయడం ” అని మా నాన్నగారు అయోమయంగా అడిగారు.
“ అన్నట్లు మీ మనవడు ప్రకాశం కూడా పరీక్షలు రాస్తున్నాడు. వాడికి ఎలా చెప్పడం ” అంటూ తన సందేహాన్ని వెలిబుచ్చారు.
ఇద్దరి మధ్య మాటలు లేవు. ఆ పాకలో ఓ నిశబ్దం రాజ్యమేలుతోంది. ఓ సమస్య వాళిద్దరి మధ్య తిరుగుతోంది. ఓ పరిష్కారం కోసం ఆ ఇద్దరి మెదళ్లూ ఆలోచిస్తున్నాయి. పావుగంట గడిచింది.
“ పోనీ ఓ పనిచేయి ఈ పాకలోనే ప్రయివేట్లు కానీ. బ్యాంకు లాయర్ని కదా ఎవరి చూపు మా ఇంటి మీద పడదు. కాపోతే కుర్రాళ్ల సైకిళ్లు ఎక్కడైనా పెట్టుకోమను ”
అని సలహా ఇచ్చారు లాయర్ ప్రకాశంగారు.
మా నాన్నగారు ఆనందపడ్డారు గాని ఒకింత భయం వెంటాడింది. ఇంటికొచ్చి మా అమ్మకి విషయం చెప్పారు.
మా అమ్మ “ పెద్ద మనిషి కుటుంబాల గురించి తెలిసినాయన మోసం చేయడు. ప్రకాశం గారు అన్నట్లుగా అక్కడే ఈ పదిరోజులు కానివ్వండి. పైన దేవుడున్నాడు ” అంది.
ఓ పదిహేను రోజుల పాటు ప్లీడర్ ప్రకాశంగారిల్లు బోర్డు లేని శ్రీ శారదా ట్యుటోరయల్స్ అయ్యింది. ఈ విషయం ప్రకాశం గారి కుటుంబానికి, మా కుటుంబానికి, స్టూడెంట్స్ కి తప్ప మిగతా ప్రపంచానికి తెలీదు.
ఫొటో తీయాలనుకున్న బ్యాంకు అధికారుల శ్రమ వృధా అయ్యింది.
**** *** ***
పద్దెనిమిదేళ్ల తర్వాత హైదరాబాద్ హైకోర్టులో తుది తీర్పు. అంతటా ఉత్కంఠ. హైకోర్టులో మా నాన్న, ఆయన స్నేహితుడు దూర్వాసుల ఆంజనేయులు ఉన్నారు.
అగ్రహారంలో ఉదయం ఆరుగంటల నుంచి దేవుడి ముందు మా అమ్మ.
తుఫాను ముందు ప్రశాంతత. ఏమవుతుందోనని ఆందోళన. “ మనకి మేలు జరుగుతుందని నమ్మకం ”
సాయంత్రం వరకూ అదే ఆవేదన. అదే ఆందోళన. అదే సంఘర్షణ.
*** **** ***
రాత్రి పదిగంటల తర్వాత వాడ్రేవు రాజబాబు ఇంటికి ఫోన్ వచ్చింది.
ఆయన చెల్లెలు చంటి మా ఇంటి తలుపులు తడుతూ హైదరాబాద్ నుంచి ఫోను వచ్చింది గబగబ రండీ అంటూ అరచింది.
అంతవరకూ కంటి మీద కునుకు లేకుండా, కడుపుకింత తిండి లేకుండా ఆందోళనగా ఉన్న మేమంతా పరుగు లాంటి నడకతో ఫోన్ దగ్గరకి వెళ్లాం.
మా పెద్దక్క వణుకుతున్న చేతులతో “ హలో ” అంది.
అవతల నుంచి “ హలో ప్రభావతా” అని ప్రశ్న.
“ అవును నేనే ఏమైంది”
“ నేను ఆంజనేయులను మాట్లాడుతున్నా”
“ ఆంజనేయులుగారూ మా నాన్నగారు ఎలా ఉన్నారు. కేసేమైంది.”
“మీ నాన్న బాగున్నాడమ్మా. ప్రక్కనే ఉన్నాడు. శుభవార్త. మనం గెలిచాం. ఇరవై ఏళ్ల జీతభత్యాల్ని బ్యాంకు ఇవ్వాల్సిందేనని హైకోర్టు తీర్పు చెప్పింది. కామేశ్వర రావు గెలిచాడు, ముక్కామల మాష్టారు విజయం సాధించాడు ”
ఫోనులో మాటలు విన్న తర్వాత మా పెద్దక్క కళ్ల నుంచి జలజల కన్నీళ్లు రాలేయి.
ప్రక్కనే ఉన్న మా ఇంటిలోకి ఒక గెంతుతో వచ్చి మా అమ్మను వాటేసుకుని “నాన్న గెలిచారు. మనం గెలిచాం ” అని అరిచింది.
మా అమ్మ కన్నీళ్లతో ఆకాశం వైపు చూస్తూ రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ
“ మొండిఘటం గెలిచారు ” అంటూ ఓ మందారపు నవ్వు నవ్వింది.
*
Prathi 15 rojulaki Amalapuram theesukelthunnaru …Adbhutham ga vundi .. Mukkamala Master garu permission adagadaniki padda ibbandi , Court lo gelavadaniki padda kastam aayana responsibility gurthuchesayi ..Kanduva andukenomo … Agraharam Brahmins madhya vunna anubandhalu , valla manchi thananiki andaru mosam cheyyalanikokapovadam ivi malli choodagalama ?
Ippudu Agraharam ane kanna Bank street ane antunnaru …ala vinnappudalla Amma ni Mummy annatlu vuntundi Bujji garu
Before reading this I had one question in my mind which was not having answer for since several years and Today I got the answer.Why pedannana used to come Hyderabad? I asked several times and never disclosed.Today i got it my peddanana’s secret of coming to hyderabad for 18 years constantly and finally won the case regarding his job which was removed basing on casteism..He is such a great pedananna for me , who taught mathematics to me wonderfully.He laid the foundation in me of thinking deeply.He was english mastero..Super pedananna and super anna(mukkamala chakradahr c/o Bujji anna)…One more beautiful hearttouching writings has come out.Thank you so much.Feel priveleged to be mukkamala..
Uncle మీ కథ చాలా బాగుంది. ధర్మం పక్కన ఎప్పుడు విజయమే ఉంటుందని మీరు మీ నాన్నగారి కథ ద్వారా మాకు చూపించినందుకు ఎంతో సంతోషం.
Chakradhar Garu eppudu dharmame gelustundani mee naana Garu katha cheppadam chaala santosham
కథ బాగుంది అని చెప్పడంకంటే చెప్పిన విధానం చాలా బాగుంది. పాఠకుడిని కూచిమంచి తీసుకుపోవడమే కాకుండా అందులో ఒక పాత్రదారున్ని చేశావు అదీ రచయిత యొక్క టాలెంట్ ‘ఆ జీర…. మధ్య తరగతి జీవితాల ప్రతిబింబం’ అనే వాక్యం మరొక్క సారి మానాన్నను గుర్తు చేశావురా బుజ్జీ అలాగే కోర్టులో గెలిచినపుడు సంతోషంతో ఆనందబాష్పాలు రాలాయి!
Dharmo rakshati rakshitaha:
చక్రధర్ గారూ….. మిమ్మల్ని ఏమని పొగడాలో అర్థం కావడం లేదు.. కూచిమంచి అగ్రహారం కథను చదివించేలా చేస్తున్నందుకు… కథ చదువుతున్నంత సేపు మీ అగ్రహారానికి నన్ను తీసుకెళుతున్నందుకు మీకు ధన్యవాదాలు…. నిజంగా మరో కథ ఎప్పుడొస్తుందా అని ఎదురు చేసేలా చేస్తున్నందుకు మీకు మరోసారి ధన్యవాదాలు చెప్పలేకుండా ఉండలేక పోతున్నా….
– పటేల్ మధుసూదన్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు, రచయిత, హైదరాబాద్
వారానికోసారి రాయరాదూ….
ముక్కామల మాస్టారు అకౌంట్స్ ఒకటే చెబుతారు అనుకునే వాడిని. కొన్నాళ్ళు మా ఇంటి ఎదురుగానే ఉండేవారు. ఆయన బహుముఖ వ్యక్తిత్వాన్ని కళ్లకు కట్టినట్టు ఆవిష్కరించవు. ఆయన బ్యాంకు మీద జరిపిన కోర్టు కేసు ఒక చరిత్ర. అంత మంది పిల్లలతో ధైర్యం గా ఎదుర్కోవడం సామాన్యం కాదు. మరొకరయితే వాళ్ళ కాళ్ల మీద పడేవారు. ఆయన తెలివితేటలు అమోఘం. నువ్వు మంచి రచయిత అయ్యావని గుర్తించే దాక ఆయన ఉన్నారని అనుకుంట. Looking forward for more
సత్తె కాలం అంటే ఇదేనేమో విపక్షంలో ఉన్నాను గట్టెక్కే దారి చూపడం మనిషికి ఎన్ని కష్టాలు వచ్చినా ఏకాకి ఐనా మధ్యతరగతి ఐనా కృషితో సాధించవచ్చని సత్ఫలితం పొందవచ్చని కష్టాల సమయంలో కుటుంబ నడుమ ఆదరఅభిమానఆప్యాయతలు ప్రాముఖ్యంగా ఉంటాయని అందరి ఆశ ఆకాంక్ష లక్ష్య సాధన పదపయనమౌతుందని కధ ఆసాంతం అంతర్లీనంగా నడుస్తూ యధార్దతను చవి చూస్తూ అందరికీ ఉదాహరణమై ఉత్తేజ కారణమై ఉత్ప్రేరకమై నడిచిన నడిపిన ఓ కధా రచయిత వంశఋణావిమూక్తి గావిఅంచిన సాహితీవేత్త కధ ఆద్యంతం ఆసక్తికరంగా నడిపిన ప్రజ్ఞాశాలి యైన రచయిత కు నమస్సులు
కథనం చాలా బాగుంది.అగ్రహారం లో జరిగిన విషయాలన్నీ
మళ్లీ కళ్లకు కట్టినట్టుగా వస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.
.మాస్టారు వెనుక ఇంత కథ ఉంది అని తెలియదు.🏆🏆🏆🙏🙏🙏
Chakri babu (garu), idehe kadhante. Shakesphere tutionlo paatam vinadam, mee Ammagari mandara navvu Yentha baagunnayo.
Vijaya Studio owner payru Naidu kaadu, Satyanarayana.
Mee Naannagaru, maa Naanna garu yedureetha gaallu. Gurram Prakasarao gari inti mundu meerunde vaaru. Adi naaku gurthumdi.
Hrudayam kadili, Kallu thadi ayyayi.
Oka goppa kadhakudu Telugu sahityaniki dorukuthunnadu. Saanabettukuntuune vundamdi. Subhamasthu..
-Pemmaraju Gopalakrishna, Hyd
చాలా బాగుంది. చదివే నాక్కుాడా మీఇంట్లో సభ్యుడైనట్లు, ఆసమయంలోని మానసిక సంఘర్షణ అనుభవించినట్లనిపించింది.
చాలా బాగుంది. వాస్తవ సంఘటన లు మనసును కదిలిస్తాయి. మిత్రుడు చక్రధర్ ఒక దృశ్యాన్ని కళ్లముందు ఆవిష్కరించారు.
చాలా బాగుంది , చదువుతూ నేను లీనమైపోయాను . ఈ మధ్య కాలం లో ఇలా లీనమైపోయి చదవడం ఇదే . కేస్టయిజం కారణంగా ఉద్యోగం పోయినా , కథ లో అది తక్కువ చేసి, ఒక మధ్య తరగతి వ్యక్తి పోరాటం గా రాయడం చాలా బాగుంది . కొత్తగా రాసే రచయత/త్రు లు కి మీ రచనలు ఒక పాఠం .
కథ చాలా చక్కగా వివరించారు. చదువుతూ ఉంటే ఇంకా చదవాలి, ఇంకా కథ ఉంటే బావుండు అనిపిస్తుంది…
పుట్టి పెరిగిన అగ్రహారం లొ కాస్త తెలిసిన కుటుంబాల గురించిన
కథ. చక్రధర్ గారి సైలి ఎప్పటి లాగానె కట్టి పడే స్తుంది
Please keep it up
Sorry my name is AS Dasu
పెద్దాయన కు నమస్కారాలు 🙏 ఇంతకు ముందే చదివాను. Honesty and integrity makes one a towering personality that money and mediocre society can not measure.
jarigina Kadha, Nice narration,Keep it up.
ఆ జీర………………..No words to explain this…
అన్న…ఇంత కధ ఉందా….మీ ఇంటి వెనుక, నిజంగా నాకు కొద్దిగా కూడా తెలియదు. ఎంత కష్టం…..ఎంత సహనం…ఎంత పట్టుదల….మీ నాన్నగారి నిలువెత్తు రూపం నేను చూడలేదు కానీ బహుశా ఉంటే వీటి సందేహం లేకుండా వీటి కలయికే. మీ అన్నదమ్ములు, అక్కయ్యలను చూసాను గానీ ,ఈ నిజమైన కధ తెలియదు. ఏమైనా చెప్పండి మన బ్రాహ్మలు బ్రతుకులు , ఎన్నో జీవితాలు, ఎలా జీవితాన్ని గడిపేవారో, ఎలా సంసారాన్ని ఈడ్చుకువచ్చేవారో……శతకోటి వందనాలు. చాలా బాగా , చాలా హృద్యంగా చెప్పా వన్నా…. ఎంతైనా మన ఇంట్లో జీవితమే కదా…మీ నాన్న గారికి అంజలి ఘటిస్తూ. ఇంతబాగా మన అగ్రహారం జ్ఞాపకాలను రాస్తున్న నీకు చిన్న సలహా ఏమిటంటే.. ఒక ఊహాచిత్రంతో ,లేదా ఒక ఫోటో కూడా జతపరిస్తే బాగుంటుందేమో….అని అనిపించింది…. ధన్యోస్మి. మరిన్ని రచనలు మీ కలం నుండి ఎదురు చూస్తూ….
బాగుందయ్యా మళ్లీ మీ నాన్నగారిని స్మరింప చేశావు….law points anni చాలా passionate gaa మీ నాన్న గారు మీ అన్నయ్య కి చెవులో చెపుతూ ఉండేవారు..మే అన్న కేవీబీ లో అనుకుంటాను పని చేసావాడు. అమలాపురం వచ్చినప్పు డల్లా
ఇద్దరు తండ్రి కొడుకులు భుజం మీద చేతులు వేసుకుని గడియార స్తభం దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తూంటే వింత గా చూసే వాళ్ళం మా ఇంట్లో నాన్న అంటే భయం మరియు చనువు…కానీ భుజం మీద చేతులు వేసుకుని…..చాలా కాలం తరవాత అర్థం అయ్యింది అది ఎందుకో….😀 బాగా రాసావు బుజ్జి
Em cheppa mantav kutubam aavedana vijyotsaham
Maa Munganda lo Bhanudu gaari gurinchi maa generation vallandariki thelusu. Marokka saari childhood memories lo ki theesukellaru.