శివసాగరమై హోరెత్తు!

విప్లవ సాహిత్యమంటేనే శివసాగర్

ఆయన ఉద్యమాల నిర్మాణంలో అయినా

నిజ జీవితంలో అయినా కనిపించే నిజాయితీ అబ్బురంగా వుంటుంది

శివసాగర్ రాసిన జానపద బాణీలో వుద్యమ పాటలు వింటే వొంట్లో సత్తువ లేనోడైనా సరేలేచి నిలబడి తుపాకీ పట్టాల్సిందే

పీపుల్స్ వార్ అగ్రనేత  కె.జిసత్యమూర్తి గా ఆయన అందరికీ ఎరుక.

 శివసాగర్ పేరుమీద ఆయన సాహితీ ప్రయాణం దశాబ్దాల పాటూ కొనసాగింది

జాతీయంగాఅంతర్జాతీయంగా చోటుచేసుకున్న అనేక అంశాలు శివసాగర్ కవితల్లో రికార్డయ్యాయి.  

విప్లవ రచయితలసంఘం వ్యవస్థాపక సభ్యుడుదళిత సాహిత్యానికో మార్గదర్శి

పాటలైనావచన కవిత్వమైనా ఆయన అక్షరాలు చివరి వరకూ విప్లవాన్నే శ్వాసించాయి.  

దశాబ్దాల విప్లవోద్యమానికి శివసాగర్ సాహిత్యం ప్రత్యక్షసాక్షి.

 ‘ఉద్యమం నెలబాలుడు’ కవితలో “నీఓటి రథాన్ని పడమటి దిక్కుగా మళ్లిస్తూ తూర్పు వాకిళ్లకు ఎలా చేరుకుంటావ్?’ అని మందలిస్తూ ‘ఉద్యమం నెలబాలుడు పెరిగి పెద్దవాడై వినూత్న జీవిత మహాకావ్యాన్ని రచిస్తాడని నమ్ముతూ రాసిన బహిరంగ లేఖ ఒక సంచలనం సృష్టించింది.

 నాకోసం ఎదురుచూడు’ కవితలో ఎందరో నన్ను మరచి పోయిన వేళ తిరిగి వస్తాను” అని చెబుతూ, అట్టడుగునుండి తిరిగి లేస్తానని అమరులైన ఉద్యమకారుల తరపున వాగ్ధానం చేశాడు

 శివసాగర్ కవిత్వం ఒక్కటి చదవకపోయినా దశాబ్దాల చరిత్రను మరుగున పెట్టినట్టే!

 

ఝాన్సీ పాపుదేశి

6 comments

Leave a Reply to Tulasi Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • శివసాగరం హోరు లో,పరవశించి పోయాం.. చాలా సేపు!💐👌.కవిత్వసంద్రం లో,తడవడమే కాదు..ఆహారు విన్నడం కూడా. నాకు చాలా ఇష్టం.. అభివందనలు, ఝాన్సీ ji&Afsar ji!

  • శివసాగర్ కవిత్వం నిత్య నూతన ఉత్తుంగ తరంగం..
    చదివింది ఎవరైనా .. తుపాకీ తూటాల్లాంటి పదగుంఫనం … మర ఫిరంగి లో దట్టించిన మందు గుండు సరంజామా… వంటి విప్లవ కంటెంట్ ఉత్తేజితం చేయక మానదు.

    శివసాగర్ కవిత్వం.. అదో ..తీరం దాహం!

    అమర కామ్రేడ్ శివసాగర్ కు విప్లవ జేజేలు!

  • మీ కోసం, ఎదురుచూస్తూ,వేచి చూస్తానే ఉంటాము జీవితాంతం.. సర్🙏❤️…!అని చెప్పాలని ఉందిమాకు!ఝాన్సీ ji. మీ గొంతులో..కవిత్వం ,తేనె బిందువుగా, పంచదార పలుకలా మానోటికి, తగిలింది.. కృతజ్ఞతలు..💐ji. అభివందనలు.

  • అద్భుతమైన గాత్రం శతఘ్నులను సైతం ఉత్తేజపరిచే స్వరం.
    అద్భుత కావ్యం అద్భుత గానం. విప్లవానికి నిర్వచనం ఈ మహా కావ్యం. మహాశక్తులను నడిపించే ఇంధనం ఈ గాత్రం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు