నేను పిల్లప్పుడు–
మాయబ్బ రంజాను పండగకు సిమాపల్లెకు మసీదుకాడికి పోతాండ.
మా నాయిన పోతాండ మసీదుకు.
మా ఊర్లో ఉండే మా నాయిన పెదనాయిన కొడకులు.. ఉండే ఐదిండ్లోళ్లు పనులు సేచ్చారు. కష్టపడతారు. ఒక్క రంజాన్ పండగకే మసీదుకు అందురు నడుసుకుంటా, కలిసి పోతాండ్రి.
మా దేవుడు గూగూడు కుల్లాయసోమి. అనంతపురం జిల్లా నార్పల దగ్గర ఉండే గూగూటికి పీర్లపండగకు పతి సంవచ్చరం తప్పోకుండా పోతారు. యాటలు పెట్టుకుంటారు. కొందురు పిల్లోల్లకు ఎంటికలు ఆడనే తీయిచ్చాండ్రి. ఆడనే ఉండి సిన్న శెరిగిత్తు, పెద్ద శెరిగిత్తు చూసుకోని పీర్లు ఏటికి పోయినాక ఇంటిదావ పడతాన్యారు. గూగూడు రాజకులాయప్ప సోమి అంటే మా వాళ్లకు అంత పాణం. అయితే రంజాన్ పండగకూడా మీదే కదా అని మా పక్కనుండే సమాజం. ఊర్లో ఉండాకండి ఒక్కసారి మసీదుకు రాండి అని చెప్పే ఖాజీసాబ్‌ల మాటలు ఈళ్లను రంజాన్ పండగనా పొద్దు మసీదుకు పట్టక పోతాయి. ఈ ఇషయం మాయమ్మ చెప్పింది.
రంజాన్ పండగకి ముందు వక్కపొద్దులు ఉండటం మా ఇంటా వంటా కాదు. అసలు మా పక్క దూదేకులోళ్లు ఎవరూ ఉండరు. ఎవురయినా గడ్డాలు పెంచి, అరబిక్ చదివినోళ్లు ‘రోజా’ ఉంటాము అంటాంటిరి. ‘ఏంది.. మీరు ఉండరా. అల్లాను నమ్ముకోవాలి. అల్లా కోసం మనం మారాల’ అనేవాళ్లు. పెద్దోళ్లకు పనులు చేయందే ఇండ్లు గడవదు. పిల్లోల్లకు ఆకలి ఎక్కువ. ఆడోళ్ల కష్టాలు అలివిగావు. కూలి పనలకు పోనిదే కుదరదు. కరువు జిల్లాలో ఆకలి ఎక్కువై తినేవాళ్లు ఎక్కువుండారు కానీ ఆకలి దిగమింగుకోని, ఎంగిలికూడా ముయ్యకుండా, నీళ్లు తాగకుండా ఉండటం ఎవరి చేతా అయ్యేది కాదు. మా కల్ల రోజా ఉండే వాళ్లు ఆధునికులు. వక్కపొద్దు వొక్కరోజు కూడా ఉండనోళ్లు మొరటనాకొడుకులు.
రంజాన్ పండగొచ్చాందని క్యాలెండరులో డేటు సూసి, సిమాపల్లెకు పోయినపుడు పండగ ఎప్పుడు పడతాదో సెప్పించుకోని వచ్చాండ మా నాయిన. రంజాన్ పండగ ముందు రోజు ఊర్లో మేకపోతులు, పొట్టేల్లు మిద్దెసాయిబు వాళ్లు కోచ్చాండిరి. తలా ఇంత తీసుకుంటాంటిమి. ఒక్కోపారి పద్దన్నే సిమాపల్లెకు పోయి కోడిసీలు(చికను), పొట్లిసీలు (మటను) ఇంత తెచ్చి మల్ల నీళ్లు పోసుకోని మసీదుకు పోతాండ మా నాయిన. నన్ను పిల్చకపోతాడేమోనని బయట బయటే తిరుగుతాంటి తప్పించుకుంటా. చక్కా గుడ్డలు కుట్టే టైలరు దగ్గరికో పోతాంటి అట్ల బయటికి. మా నాయిన మసీదుకు అట్ల పోతానే కోడిసీలు, పొట్లిసీలు కురాక్కు పొయ్యి అంటించ్చాండ. మల్ల పాలు పోసి సేమాల కీరు చేసేది. తిరవాత బువ్వ, ఉత్తబువ్వ ఇంత సేచ్చాండ. మా నాయిన మసీదుకు పోయి వచ్చినాక కీరు తిందువులే. సదింపులు సేయాల అని మాయమ్మ అంటాండ. తింటే ఏమయితాది అని అలిగి నులక మంచంమీద పనుకుంటాంటి. చూడలేక మాయమ్మ నాకు కీరు పెట్టేది. అది తియ్యగుంటాదని తినకపోయేవాన్ని. రోంత తిన్యాక నాకొద్దుపో అనే వాడ్ని.
మసీదుకాడనుంచి ఇంటికి పదకొండుకు వచ్చానే సదింపులు సేచ్చాండ మా నాయిన. నేను సీలు తిననని మాయమ్మ అదే పనిగా నా కోసరం పొప్పు, సెనగకట్టు సేచ్చాండ. సీలు తినమని బతిమాలినా తినేవాడ్ని కాదు. జీవహింస పాపం అంటాంటి. సీలవాసన పడేది కాదు. నేను పప్పుతో తిన్యాక ‘ఇంగ పోయి గొల్లోల్లను, బడికాడ అయివార్లను పిల్చకరాపో’ అంటాండె. మాయమ్మ, మా నాయిన మా బజార్లో వాళ్లను రెండుమూడు మాట్లు పిలిచ్చే కదిలేవాళ్లు. అందరితో పాటే మా నాయిన తింటాండె. అందురూ తిన్యాక *మీరు రంజాన్ పండగ బాగా సేచ్చారు. పర్వాల* అంటా వాళ్లు పోతాండిరి. వాళ్లు ఇంటికి పోయినాక మాయమ్మ తింటాండేది. ఒక్కోసారి మాయమ్మకు తినటానికి సీలు కూడా ఉండేవికావు. పుల్చుతో తింటాండ. అట్లాంటి బీదరికపు రోజులయి.
‘ఏమో నా నాకు బయం* అన్యా.
పులిందలకు రమ్మని మా మామ సెప్పంపిచ్చే జమ్మంగా పోతాంటి.
పులిందల్లో ఉన్యప్పుడు రంజాన్ రోజున పద్దన్నే లేచి మా పెద్దమ్మ కొడుకు ఈరయ్య, మా చిన్నమ్మల కొడుకులు రియాజు, బాబా షరీఫు ఇట్ల అందరం కలిసి శ్రీరామ హాలుకాడ ఉండే పెద్ద మసీదుకు పోతాంటిమి. సిరిచాపలు, బంతలు, రగ్గులు తీసకపోతాంటిమి మట్టి అయితాదని. ఆటికి పోయినాక బయట చెప్పులు ఇడిచ్చే యాడపోతాయోనని అందరం ఒకే చాట ఇడుచ్చాంటిమి. కొత్త చెప్పులు పోతాయేమోనని బయపడతాంటి నేను. మాటి మాటికి అట్ల ఓ కన్నేచ్చాంటి. మా మామ బాబు బంగారు పనివాడు. తన స్నేహితులైన బంగారు అంగళ్లోళ్లు అందరం ఒకచాటనే కూకుంటాంటిమి.
మైకులో నమాజు చదువే ఖాజీసాబు *కూర్చోండి బెరీన, ఆడ తలం ఉంది. అక్కడ లైను సొట్ట ఉంది. దూరంగా కూర్చోవాకండి. వరసలు పూర్తయినాక ఎనక్కి పోండి* అంటాండిరి.
బెరీన నమాజు అయిపజేసుకోని ఇంటికి పోవాలని లేదా అని మైకులో అరుచ్చాండిరి.
తర్వాత నా పెండ్లి నాలుగేండ్లకు అయినాది. పెండ్లయినాక అత్తగారింటికి రంజాన్ పండగకు పోయేవాణ్ని.
ఈడ ఎందుకులే పులిందలకే పో అంటాడె మాయమ్మనాయిన. ఒకట్రెండు మాట్లు హైదరాబాద్‌లో ఉన్యాం. రెండేండ్ల కిందట మాయమ్మ పాణం ఇడిచినాది. మాయమ్మతో కలిసి పక్షపాతవాయి వచ్చినాక రంజాన్ సమయాన్ని గడిపే అవకాశం రాల నాకు. మాయమ్మ పోయినాక రంజాన్ అంటే బాల్యంలో మాయమ్మ వండిన వంటలే గుర్తొచ్చాయి. ఇప్పుడు తింటాన సీలు. అయితే వండిపెట్టడానికి మాయమ్మ లేదు. ఇప్పుడు మసీదు బయం పోయింది. మసీదుకు పోతాన.
మా నాయినా నా పిల్లప్పటినుంచి మసీదుకు సిమాపల్లెకు పోతానాడు. ఆడ మా చెల్లెలు రజియా ఇంటికి పోతాంటాడు. నేను రమజాన్ పండగకు యాడుంటానో నాకే తెల్దు.
మసీదుకు పో.. మసీదుకు పో అని మాయమ్మ బంగపోతాండ.
పెద్దయినాక .. మాయమ్మ సూడంగ.. నేను మసీదుకు పోలాక పోతినే అనే బాధ నన్ను జీవితాంతం వేధిచ్చాంటాది.
అందుకే రంజాన్ పండగంటే మాయమ్మ గుర్తుకొచ్చాది.
మాయమ్మ గురించి ఆలోసిచ్చే ఏడుపు, భయమూ తన్నుకోనివచ్చాయి.
*
Memories are the real and permanent assets which will be with us forever. Memories are mix of good and bad. Of course we have some regrets too.
Festival means sharing joy with near and dears.
Bro, your narration of the past events and happenings is emotional and heart touching.
Your mother,though uneducated,seems a great philosopher. From your writings ,I understand that your mother is everything to you. You are more attached to your mother.
From this ,one thing is clear that you are secular in your thoughts. You are one such secular among a few.
It was heartening that the neighbors didn’t attend Ramjan feast when your mother was ill.
On the whole ,the narration reflected your thoughts around festival,mother,and delicious food ,mosque etc. Keep going ,Bro!
Thankive so much sir. నాలోని ఆలోచనను అందుకున్నారు. మీ లాంటి గొప్ప పాఠకుడు దొరకడం నా అదృష్టం!
మనుషులు బాగుంటేనే పలకరిస్తారు మంచమీదుంటే పంకియ్యరు👍👍👌👌అమ్మ చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాల పందిరి.. ఆర్థతను దృశ్యామానం చేసిన మంచి కధనం… రంజాన్ శుభాకాంక్షలు రాజా💐💐💐💐💐💐
ధన్యవాదాలు సర్ . మీ స్పందనకు
Kadapa yaasa bagundhi .. mee katha manasuku hathukundhi..
Thankive so much Vijaya garu !
Ranjan panduga gurichi & madyatargathi kutunbalu paristitulu ela untayi baga chepav valli. Mee Amma garu mankunna Danilo naluguriki bojanalu pettalani cheppindi ayamma ku manchi manasu undi.
Thankive so much jagan
రాజమవలి గారు మీరు చెప్పే పద్ధతి చాలా అద్భుతంగా ఉందండి. మా చిన్నప్పటి స్నేహితుల్ని కలుసుకున్నట్లు ఉంది మీ మాండలీకం,
మీ అమ్మ గారు చెప్పిన సత్యాలు…. ఇప్పటికే కాదు ఎప్పటికీ నిత్య సత్యాలు. నలుగురికి పెట్టాలి మనం తినాలి, డబ్బుంటేనే ఎవరైనా గౌరవిస్తారు – కాలము ఏ మాత్రం మారలేదు. –
మొత్తం మీద అ చాలా మంచి కథను చదివామన్న భావనను కలిగించారు. సారీ.. కథ కాదు సంఘటనలను గుర్తుకు తెచ్చారు. – మోహన్ కృష్ణ
ధన్యవాదాలు సర్ . మీ స్పందనకు.
రాజా నీకో రోజా🌷🌹
Thanks sir ..
కథ చాల బాగుంది
Thanks andi
Padmavathi Vuduthala తిన్నది అరిగి పోత ది, మంచితనం మానవత్వం మిగిలి పోతది అని నమ్ముకున్న అమ్మకి ఆరోగ్యం బాలేనప్పుడు చూడటానికి ఎవరు రాకపోవడం ఆమె ప్రేమతో చేసిన వంట తినడానికి భయపడటం విషాదం అమ్మని మానసికంగా ఎంత కృంగ దీసి ఉంటది ఆరోగ్యం బాలెనప్పుడు మన వాళ్ళు బంధువులు స్నేహితులు చూపించే ఆదరణనే మనిషికి గొప్ప ఔషధం కాదా.
బాగున్నపుడు పాలు, పెరుగు, నెయ్యి, సీలు, చనక్కాయలు తీసుకపోయినోళ్లు.. బాగలేనపుడు మరిచిపోయినారు madam . లోకరీతి చూసి మాయమ్మ చానా బాధపడినాది
గూగూడు జిల్లా పరిషత్ స్కూల్లో ఐదేళ్ళు టీచరుగా పనిచేశా. కానీ ఏ సంవత్సరమూ పీర్ల పండుగ చూసే అవకాశం రాలేదు. ఎండాకాలం సెలవుల్లో వచ్చేది మొహరం. అక్కడి పిల్లలు ఇప్పటికీ రమ్మని పిలుస్తుంటారు. పులివెందుల మ్యూజింగ్స్ నాక్కూడా ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి.
ధన్యవాదాలు అక్కా మీ స్పందనకు. నేను పిల్లపుడెపుడో పీర్లపండగ చూసినా .