1
ఈసారి మరెవ్వరూ లేరు…
ఈ చీకటి సమయాన
నేనూ ఈ నదీ తీరమూ ఈ చికాకు పెట్టని గాలి
తప్ప
ఈ సారి నాతో తాను లేనందుకు
ఎవ్వరూ నన్ను వెలివేయలేదు
ఏదో మోటుపాట పాడుతూ తెడ్డు వేస్తున్న
జాలరి, చేపలకోసం కరకుగా విసరబడ్డ గాలమూ, దానికి గుచ్చుకున్న ఎరా
ఎవ్వరూ…. తాను లేదేమని ప్రశ్నించలేదు.
అంతా నిండుకున్న ఒక నిశ్శబ్దపు చలి
మరణించబోతున్న దేశంలా నిస్సత్తువగా
పారుతున్న నది
నాకు తోడుగా ఆమె గుర్తుగా ఉన్న ఒక బురఖా
దాని అంచుల మీద ఉన్న వో రక్తపు మరకా…
2
భూమినంతా పుక్కిట పట్టినట్టు
ఓ విషాద ఆకాశపు పాటలా కురుస్తున్న వర్షంలో
ఎవడికి వాడుగా ఓ యుద్ధక్షేత్రాన్ని తలమీద
మోస్తూ
వీధులన్నీ ఒంటరి జనాలతో నిండిపోయినప్పుడు
ఎవడి దేశాన్ని వాడు వెతుక్కుంటూ తిరుగుతున్నప్పుడు
నేనూ నాతో మరెవ్వరూ లేని ఓ మరో నేనూ
అదృశ్యాదృశ్యాలుగా జరుగుతున్న
ద్వందయుద్దాలలో
మరణించిన వారికి వాడిపోయిన పువ్వులతో
అశ్రద్ధాంజలి ఘటిస్తూ…
3
భయపడుతూ నేనూ
అధైర్యపడుతూ ఒక దేశమూ
ఎవడిలోపలికి
వాడిని నెడుతూ…. భూమి మొత్తం క్రిమిలా మారిపోయి
క్వారయింటైన్ కంటెయినర్లలో స్వీయ సమాధి
నిదురలు
లక్షల కఫీన్ బాక్సుల నడుమ ఓ పిచ్చి ఊహ
మనుషులంతా ఇపుడు కొత్తగా చావటం ఏమిటో
మనిషిని మనిషికాక
ఓ క్రిమి చంపటం ఎందుకో అర్థంకాలేదు
తనకూ, నాకూ…..
*
painting: Mandira Bhaduri
ఎవడికి వాడుగా ఓ యుద్ధక్షేత్రాన్ని తలమీద
మోస్తూ
భయపడుతూ నేనూ
అధైర్యపడుతూ ఒక దేశమూ
How grave the situation is! A precise representation of the current scenario.
ఎప్పటిలాగే నరేష్ ఓ గొప్ప కవి.
చాలా బావుంది సూఫీ…
ఎక్స్ లెంట్ పోయం.
‘ ఎవడి దేశాన్ని వాడు వెతుక్కుంటూ తిరుగుతున్నప్పుడు’
ఈ సమిష్టి ఒంటరితనంలో
అవతలి ఒడ్డున
లోలోపల సుడులు తిరుగుతూ
ఒక సూఫీ ఆలాపించిన
ఆద్యంతరహిత విషాద గీతం.
మనిషిని మనిషి చంపినపుడు ఏమీ అర్థంకానట్టు కళ్లారా చోద్యం చూశాం
మనుషుల్ని క్రిమి చంపుతున్నప్పుడు భయపడుతూ ఇంట్లో కూర్చుంటున్నాం
దేశంలో అలముకున్న ఆర్ద్రతంతా సూఫీ కవితాక్షరాల్లో కనిపిస్తుంది.
Thank you santhosh
ప్రాణాలకు తెగించే పోరాటం కూడా…. అదే ప్రాణభయంతో ఒక్క అడుగు వెనక్కి పడింది. రేపు ఎందరి మరణాలు చూడాలో 🙁
చాలా బాగుంది తమ్ముడు కనబడని క్రిమి ముందు ప్రపంచమంతా లొంగిపోతుంది…వణికిపోతుంది.
Thank you akkaa
కవిత,బాగుంది. నరేశ్ జీ!.మరీ ఎవరో లేని నాతో..!👌.
ఆమె అంటే ఎవరు, తాను అంటే ఎవరు?
ఆమె దేశమూ కావొచ్చు, ఒక సందర్భమూ కావొచ్చు..
తాను…. జెండర్ లేదు, ఆ కవే తనని రెండు ఆలోచనలుగా చూసుకుంటూ ఉండొచ్చు….
Bagundandi 👌
Thank you
చాలా బాగుంది సూఫీ. బతకడం తెలిసినవాడికే మరణం అనుభవంలోకి వస్తుంది. కదులుతున్న తిమ్మిరెక్కిన దేహాలకు జీవిత స్పర్శా తెలీదు, మరణ స్పర్శా తెలీదు.
వానికి ఆ పుక్కిట పట్టడం బలే నచ్చింది.
థాంక్ యు పరేశ్… మీకు ఇంతకుముందు చెప్పినట్టే. ఇప్పుడున్న మూడ్ ఇలాగే ముంచెత్తుతోంది. ఎక్కడో మునిగిపోకుండా ఈ సేఫ్టీ వాల్వ్ నుంచి రిలీఫ్ అవుతున్నా….