విక్టర్ హార: అగ్గి రెక్కల పావురం

విక్టర్ హార పాడిన ఆ పాట ఒక యుద్ధగీతంలా చిలీ దేశ వీధుల్లో మారుమోగుతుంది.

విక్టర్ హార, మానవహక్కుల కోసం పిడికిలెత్తిన ఒక ముగింపులేని పాట. ఆ పాట మృదువైన పూల రేకుల్లా, రాజుకుంటున్న నిప్పులా హృదయాన్ని తాకుతుంది. అణువణువునూ గిటార్ తంత్రుల్లా మోగిస్తుంది.

50 ఏళ్ల  క్రితం, చిలీలో అయెందే ప్రభుత్వాన్ని కూలదోసేందుకు పినోచే జరిపిన కూప్ సందర్భంలో, తనను చిత్రహింసలు పెట్టి చంపేసినా, చిలీ దేశంలోనే కాదు ప్రపంచ నలుమూలల్లో ఆ పాట గుండె కొట్టుకుంటూనే ఉంది.

మానవ హక్కులకోసం చిలీలో వీధిపోరాటాలు చెలరేగినప్పుడల్లా, ‘ఎల్ దెరేచో దే వివిర్ ఎన్ పాజ్’ (శాంతితో జీవించే హక్కు ) అంటూ విక్టర్ హార పాడిన పాట ఒక యుద్ధగీతంలా చిలీ దేశ వీధుల్లో మారుమోగుతుంది. ఇంతకీ ఆ పాటను విక్టర్ హార, వియత్నాం వీర యోధుడూ, నాయకుడు హో చి మిన్ గురించి రాశాడు.

28 సెప్టెంబరు 2023 నాటికి విక్టర్ హార కు 91 ఏళ్లు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయనే రాసి పాడిన పాట:

 

శాంతితో జీవించే హక్కు

 

జీవించే హక్కు,

ఓ కవీ, హో చీ మిన్

వియత్నాం నుంచి

మానవళినంతటినీ స్పృశించినవాడా,

నువ్వు నాటిన వరి చాళ్లను

ఏ ఫిరంగీ ధ్వంసం చెయ్యలేదు.

శాంతితో జీవించే హక్కు అందరిదీ.

 

విశాలమైన సముద్రం అవతల

ఉన్నది ఇండో-చీనా అనే ప్రదేశం,

అక్కడ

హత్యాకాండతో, నాపాం బాంబుల్తో

పువ్వులను నాశనం చేశారు.

చందమామ ఒక విస్పోటం

అన్ని గొడవలను పేల్చివేసింది

శాంతితో జీవించే హక్కు అందరిదీ.

 

అంకుల్ హో, మా పాట

ఒక స్వచ్ఛమైన ప్రేమాగ్ని

ఇది పావురాల గూటిలోని పావురాయి

ఆలివ్ వనం నుంచి వచ్చిన ఆలివ్ కొమ్మ

ఈ ప్రపంచ ప్రజల పాటల గొలుసు

అంతిమ విజయం సాధించి తీరుతుంది.

శాంతితో జీవించే హక్కు అందరిదీ.

*

మమత, కె

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు