దిక్కులన్నీ మూగ బోయాక
ఖాళీ చేతులు వెక్కిరించాక
ఆకలికి ఆత్మాభిమానం ఎక్కడుంది
పాదాలకు దూరం పనేముంది.
***
ఇనుప రాడ్లను పూల గీతల్లా తెంపినోళ్ళు
బండరాళ్ళను దూది దిండుల్లా మోసినోళ్ళు
చెమట చుక్కలతో పంట కాలువల్లా పారినోళ్ళు
ఆకాశం అంచులుదాకా అపార్టుమెంట్సు పేర్చినోళ్ళు
అంతెందుకు సూర్యచంద్రులను తలపై మోసే టోళ్ళు
***
దూరాలను దారాల్లా పాదాలకు కట్టుకొని
గాలిపటాల్లా సాగిపోతున్న వలస పక్షులు.
ఏ క్షణమైనా ఇంటి ముందు ఆకలి కేకై వినపడితే
రిక్త హస్తాలై తలవాకిలిలో నిలబడితే
గుప్పెడు మానవతను పంచుకుందాం
***
“దిక్కులన్నీ మూగ బోయాక, ఖాళీ చేతులు వెక్కిరించాక, ఆకలికి ఆత్మాభిమానం ఎక్కడుంది, పాదాలకు దూరం పనేముంది” చాలా బాగుందండి కవిత ‘వలస పిట్టలు’