ఎడారి ఎద లోగిలిలో
అవిరామ ఎలుక
గర్జించే ఏనుగై
ఊటబావి కలలో ఈదుతోంది
…
తుంటరి కాలేని
తాబేలు తొందరపాటుకు
గత భుజాన్ని చరచడం తప్ప
మజ్జనం ఒక అనాలోచిత సుకర్మ
…
గుర్రప్పరుగు దీక్షలో
గోళ యుగాల అనిద్రాణ పురుగు
లోకానికి ఒంటరి నిటారు మధ్యస్థ
…
సమయ లిప్తల
ఆదా కనుమోడ్పుల వివశ మేను
గాలి వీస్తుండగా తెరలు రేగే
వంత ఇసుకమేట
…
మైకపు ముసాబు కమ్మితే
గొడుగు విచ్చిన విసురు జల్లుల
సుతిమెత్తని తుళ్ళింత
…
పులకించే ముక్కు పంపే
పూల ఆవిరికి
నిచ్చెన మొలకెత్తిన అగాధం
కొండ కెలకుల మెల్లని రహస్య నడక వాగు
…
దిగులుదిక్కులో
ముసిమూతి చేయితీసి
ఆచ్ఛాదించని స్వైరం
కంపిత మొల మొగదల
మైదాన గోడలకి తెరలు కుట్టకుండా
అనుకోకుండానే చెంపిన్నీసు చేజారుతుంది
సీనా ఒళ్ళు పాకే చీమ.
*
Add comment