మునిగాను ఈ నేత్ర ముఖంలోకి
ఎటువైపో
ఓ కల
చూసేది
వినేది
ఆ ఆశ్చర్యం ఏమిటో ఆ కల నీడ
ఎప్పుడూ చెప్పదు
ఖాళీ ప్లాస్టిక్ పదాలు. సైలెంట్ సుసైడ్ అంగాలు. ఉడకని కాలం. గాయాలు. ఊరే లేని వాక్యాలు. ఊరని పదబంధ పంచనామాలు.
ఎత్తుకోని కన్నీళ్లు. ఊయలలో.
చెవి లోపలి చెలి. చెలికాడు. వెల్లికిలా వల్లకాడులో. వినని శోకం. తెరిచే ఉండని గాలి.
చేపలోపల పొడవాటి చెట్లు. నవ్వుతూ. సన్నటి చీకటే, గెంతలేక. ఈదు. చేపా. దీపాలు రావు. ఆయువు వెంట. ఈదు. చేపా. నీ ౠజు డొక్కలు తెరువు. రెపరెపలాడే చీకటే మాటలపై తిరుగుతోంది. ఈదు. చేపా.
ఏ నిశ్శబ్దం
నీ నవ్వులో నవ్విందో.
నిజమైన ప్రేమ నీడ చూసే
కనులు నీకింకా రావేమో!
*
చిత్రం: సృజన్ రాజ్
ఈదు నాయుడూ ఈదు. దీపాలు ఆర్పేద్దాం.
‘చెవి లోపలి చెలి.
చెలికాడు.
వెల్లికిలా వల్లకాడులో.
వినని శోకం.
తెరిచే ఉండని గాలి.’
చీకటి సత్యాలు నాటే కవి పదాల ముళ్ళు