115బ్రాడ్వే ట్రినిటీ బార్
బ్యాంక్ వాల్ట్ లో కూర్చుని
రిజర్వ్ మాల్ట్ బాటిల్ల మధ్య
బానిసగా మారిన నరుడా
ఎప్పుడో మధ్యంపై నిషేధం ఎత్తేసారు
ఇంకా ఈ రహస్య సహచర్యం ఎందుకు?
రెండు శతాబ్దాల
డోయర్స్ స్ట్రీట్ బ్రోతల్ హౌస్‌లకు
చెల్లుచీటీ రాసే యుగం వచ్చేసింది
ఇప్పుడిది
ది ఫియర్ లెస్ గర్ల్ తరం
ఫిక్షన్ సినిమాల్లో పైప్ లైన్ లోంచి
హీరో వస్తే ఈలలతో లొల్లి చెయ్యకు
ఈ నగరంలో దశాబ్దాల క్రితమే
ఎయిర్ ప్రెషర్ ఓ పోస్ట్ మ్యాన్
C.O.Bigelow చిత్రగుప్తుని పద్దుల పుస్తకం తిరగేస్తే
ఎడిసన్ పరిశోధనలో కాలిన వేళ్లకు
మార్క్ ట్వైన్ కు ఇదే చికిత్సా నిలయం
విశ్వనగరాల్లో మట్టిని చూడడం
ఓ కల
ఈ నగరంలో ఎర్త్ రూమ్
ఓ కళ
Hmm అంటూ రిప్లై ఇచ్చే వాళ్లకు
టైమ్స్ స్క్వేర్ హమ్ వినిపిస్తుందా?
ది గ్రాండ్ సెంట్రల్ టర్మినల్
విస్పరింగ్ వాల్ మీద చెవిని వాల్చు
ప్రేయసి వినిపిస్తుంది
నమ్మవా!
Pier54 దగ్గర నిల్చుని
ఇంకా టైటానిక్ రాకకోసం
ఎదురుచూసే ప్రేమికులున్నారు
న్యూయార్క్
ఈజ్ నాట్ ఫర్
లవ్ & లేబుల్స్
ఇట్స్ సోల్ టూ రీబిల్ట్
(న్యూయార్క్ రహస్యానికి..)
*
పెయింటింగ్: సత్యా బిరుదరాజు
బాగుంది కొత్తగా..
ధన్యవాదాలు మహమ్మద్ గారు
“విశ్వనగరాల్లో మట్టిని చూడడం
ఓ కల
ఈ నగరంలో ఎర్త్ రూమ్
ఓ కళ”
పై లైన్లకి చప్పట్లు!
ధన్యవాదాలు లలిత గారు
అద్బుతం మీ కవిత్వం ..బొమ్మ కూడా చాలా బావుంది. సురేంద్ర గారూ
ధన్యవాదాలు మణీందర్ గారు
సూపర్బ్. అనే చెప్పవచ్చు, మీ కవిత, దేవ్. కొత్తగా ఉంది !