రెండు ప్రపంచాల మధ్య రైలు ప్రయాణం

చెప్పుకో లేనంత ఒంటరితనం , ఆగనన్ని మాటలు ఇంకా మిగిలిపోయాయి.

మియాపూర్ మెట్రో.

రోజూ ఉదయం ఏడున్నర కి ఎక్కి, అమీర్ పేట లో ట్రైన్ మారితే 8.10 కల్లా బేగంపేట చేరేదాన్ని.

పదిరోజులుగా ఇదే రొటీన్. ఇంకో పదిరోజుల్లో వర్క్షాప్ అయిపోతుంది. లేడీస్ కూపే లో సరిగ్గా డోర్ కి పక్కనున్న సీట్ లో ఆ అమ్మాయి కూర్చుంటుంది. మెట్రో బయలుదేరేది అక్కడే కనుక దాదాపుగా అదే సీట్ రోజూ కూడా, నేను తన ఎదురు సీట్లో . నాలుగు రోజులు అయ్యాక చిన్నగా నవ్వింది. ట్రైన్ ఎక్కగానే తనతో తెచ్చుకున్న కాఫీ మగ్ లో కాఫీ తాగుతూ మొబైల్ చెక్ చేసుకుంటుంది. పది నిముషాలు అయ్యాక అన్నీ మూసేసి బయటకు చూస్తూ ఉంటుంది. ఎక్కడకి వెళ్తుందో తెలీదు కానీ అమీర్ పేటలో మాత్రం దిగదు. వారం అయ్యాక ఆ అమ్మాయి నా రొటీన్ లో భాగమయ్యింది. ఆదివారం నాకు డ్యూటీ ఉంది, తను రాలేదు ఏదో వెలితి గా అనిపించింది.

మరునాడు కాఫీ వాసన రాగానే హాయిగా అనిపించింది. అనుకోకుండా కొన్ని చిన్నచిన్న విషయాలు తాత్కాలికంగా భాగం అయిపోతాయి. బట్ ఫర్ ఎవ్రిథింగ్ దట్ హాపెన్స్ దేర్ విల్ బి ఏ రీసన్ అనేది నా నమ్మకం….కొన్ని కొన్ని చూసాక అలా అనుకోవడం అలవాటైపోయింది.

ఈరోజు నాది తనపక్కనే సీటు. ట్రైన్ లో చదవడం లేక ఏదైనా నోట్ చేసుకోవడం అలవాటు.

How do I listen to others హఫీజ్ పోయెమ్ గుర్తొచ్చింది. నోట్ చేసుకుంటుంటే అడిగింది, “Do you write ani? ”

నా పుస్తకంలో చూస్తూ…

కొంచెం చిరాకు అనిపించినా….

“For myself”

అని నవ్వాను. తనేం మాట్లాడలేదు. చిన్నగా నవ్వింది.

“ఎంత నిజం కదా”అంది.

“ఏమిటి “అన్నాను

‘What హఫీజ్ says.”

“మీరు చదువుతారా?”

“Yeah, అప్పుడప్పుడు”అంది కాస్త మెల్లగా.

అమీర్ పేట వచ్చేసింది.

How do I listen to others?

As if everyone were my Master

speaking to me

his cherished last words.

Hafiz

ఆ రోజంతా మైండ్ లో తిరుగుతూనే ఉంది. కొన్నిసార్లు అంతే. ఏదో ఒక పాట, లేదా ఓ ఆలోచన రోజంతా నీడలా వెంటాడుతూ ఉంటుంది. కారణం ఏదీ ఉండదు. మరి సైకలాజికల్ గా ఏదైనా ఉంటుందేమో తెలీదు. మరునాడు ఆదివారం మెట్రో అమ్మాయి రాలేదు, ఆ పిల్ల నా రైలు ప్రయాణంలో భాగమైపోయింది.

సోమవారం కనిపించాక అమ్మయ్య అనుకున్నాను. ఈరోజు కాఫీ లేదు. “What happened? No coffee today. Were you in a hurry?”అన్నాను.

“Yeah, konchem హడావిడిగా “అంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి.

“నేనూ అమీర్ పేట దిగుతాను, shall we have coffee”

“ష్యూర్”

“ఎక్కడ పనిచేస్తారు”అడిగాను

“హైటెక్ సిటీ, బట్ మారి పోతున్నాను, నెక్స్ట్ వీక్. మూవింగ్ టు బెంగళూర్”

“ఓహ్”అన్నాను.

నా గురించి ఏమీ అడగలేదు. నేను చెప్పలేదు.

“థాంక్స్ ఫర్ ది కంపెనీ, నాకు ఎవరితో అయినా కలిసి కాఫీ షేర్ చేసుకోవడం ఇష్టం, చిన్నప్పటి నుంచి ,అంది”

“అవునా, నైస్”అన్నాను.

“యా, బట్ ఇట్ దాస్ నాట్ హాపెన్ ఆల్వేస్”అంది

“సరే మరి, సీ యు టుమరో”అన్నాను , నా ట్రైన్ వచ్చేసింది

ఆరోజు చాలా హడావిడిగా ఎక్కింది. దాదాపు ట్రైన్ కదిలే టైం లో.

“హాయ్”అన్నాను

“హాయ్, అంది. కొంచెం ఉత్సాహం గొంతులో”

“ఈ రోజు రిలీవ్ అవుతున్నాను, సాయంత్రం ఫ్లైట్ కు బెంగళూర్ అంది”

“ఓహ్, ఆల్ ద బెస్ట్, ఎప్పుడైనా పింగ్ చేయండి”

కాఫీ టైమ్ లో నంబర్లను తీసుకున్నాం.

“ష్యూర్, ”

అంది

ఆరోజు నేను కూడా హైటెక్ సిటీ లో పనుంది కనుక అక్కడిదాకా వెళ్ళాను.

“థాంక్స్ ఫర్ ద ప్లేసంట్ కంపెనీ ఆల్ దీస్ డేస్ “అంది

హడావిడిగా దిగుతూ.

“మీ టూ”అంటూ లేచాను.

క్రింద ఎదో కాగితం. ట్రైన్ ఖాళీ అవుతుంది. అది ఆ అమ్మాయి దగ్గరనుంచి జారి పడినట్లుంది,మెట్రో కార్డ్ తేసెప్పుడు. బట్ నాట్ ష్యూర్

పని చూసుకుని మళ్లీ రిటర్న్ అయేపుడు కాబ్ లో గుర్తొచ్చింది. ఓపెన్ చేశాను. హ్యాండ్ మెడ్ పేపర్ మీద చక్కటి చేతి వ్రాత, అలాంటి వ్రాత చూసే చాలా రోజులు అయింది, అన్నీ వాట్సాప్ మెసేజ్ లు ఫేస్ బుక్ పోస్ట్లు అయ్యాక, మనసు కాగితం కలం కలిపి భావాలకు రూపం ఇచ్చే మనుషులు మరీ తక్కువ ఈరోజుల్లో . ఇంతకీ ఎవరిదో నాట్ ష్యూర్, చదవక తప్పలేదు.

రెండు ప్రపంచాల మధ్య వారధి రైలు ప్రయాణం

బాధకి బాధకి మధ్య ఓదా ర్పు లాగా

రెండు సంతోషాల మధ్య దుఃఖం లాగా

రెండు ప్రేమల మధ్య కోల్పోయిన ప్రపంచం లాగా

రెండు పదా ల మధ్య నిశ్శబ్దం లాగా

స్థితికి స్తబ్ధత కి మధ్య ఉనికి

ఆలోచనకి ఆచరణకు మధ్య కాస్త సమయం

శ్వాస నిస్వాస ల మధ్య శూన్యం

చర్య ప్రతి చర్యలకి మధ్య విరామం

నువ్వు డ్రాప్ చేస్తానన్నా పిచ్చమొహం లా ట్రైన్ ఎందుకు అంటావు కదా. ఇదిగో ఇందుకు.

బట్ అది నీ వీలును బట్టి కదా. నీతో ఉన్న ప్రపంచం నుండి వర్క్ కి వెళ్ళే దారి లో నాకు దొరికే కాస్త స్పేస్.

ఇంతకు ముందు ఇలా మాట్లాడితే నీకు అద్భుతంగా ఉండేది.

ఎదురు చూపులకి నువ్వు రావడానికి మధ్య చిన్న ఖాళీ ఈ కప్పు కాఫీ అంటే, ఇంప్రెస్స్ అయ్యేవాడివి.

మన మధ్య ఏదో వాక్యూమ్ నిండుతోంది, నీకు కేవలం ఇన్వెస్ట్మెంట్ ఫారిన్ ట్రిప్ లు, రోల్స్ మార్పు, ఎదో మిస్ అవుతోంది. నాకు రోజు రోజుకి మాటలు తగ్గుతున్నాయి. ఎవరూ లేరు వినేందుకు. పొద్దున కలిసి కాఫీ తాగేందుకు కూడా నీ ప్రయత్నం ఉండదు, న్యూస్ పేపర్ తో టాయిలెట్ లోకి వెళ్ళిపోతావు, అంతా చిన్న అడ్జస్ట్మెంట్ కుదరట్లేదు.

కాఫీ మగ్ తో మెట్రో ఎక్కడం అలవాటు చేసుకున్నాను.

చెప్పుకో లేనంత ఒంటరితనం , ఆగనన్ని మాటలు ఇంకా మిగిలిపోయాయి. నాలుగు రోడ్ల మధ్య పరుగులుతీసే మనుషుల మధ్య కాకుండా పదినిముషాలు బయటపడాలి అనుందని చెప్పి వెళ్దామంటే, వచ్చే అవాంతరాల మధ్య, నీ జీవితంలో మనుషుల రోల్స్ వాళ్ళ డిస్తర్బెన్స్ మధ్య….బోల్డంత సంకోచం. అనిపిస్తోంది, Do you really look forward for my company?

Is my role in your life is over ani!

దగ్గర ఉండి నా ఫ్రస్ట్రేషన్ తో నిన్ను ఇబ్బంది పెట్టే కంటే నేనే దూరంగా వెళ్ళడం మంచిది అనిపించింది. రోల్ మారిందని ఫైనాన్సియల్ గా నువ్వు హాపీ కానీ కారణం ఇది. నిన్ను వదిలి ఉండలేక రెండేళ్ల నుండి వదులుకున్న రోల్.

సంతోషంగా కాదు. తప్పక వెళ్తాను.

నేను తప్ప నీకు ఎవరూ రాస్తారు హ్యాండ్ మెడ్ పేపర్ మీద హ్యాండ్ రిటెన్ ఉత్తరం 🙂

Stay well and happy, I know you will! Let’s see what’s in store for us.

తన నెంబర్ డయల్ చేసి అడ్రెస్ తీసుకుని క్రింద సెక్యూర్టీ కి ఇచ్చాను

“థాంక్యూ”వాట్సాప్ లో మెసేజ్!

“థాంక్స్ టు యూ”

“ఫర్?”

నా సమస్యకి కూడా సమాధానం దొరికింది అని చెప్పాలనిపించలేదు.

“ఫర్ ఎవ్రి థింగ్! టేక్ కేర్”

“యు టూ”

తిరిగి వస్తూ కార్లో ఏవో ఆర్టికల్స్ చదువుతుంటే, కనిపించింది…

“The Fal-e Hafiz, is an ancient tradition in which a reader asks Hafiz for advice when facing a difficulty or at an important juncture in their life – treating his books as an oracle and opening them with a deep wish from their soul for guidance.”

True! Either directly or indirectly!

 

శ్రీరంగవల్లి

చదవటం ఇష్టం. ఇలాంటివి అని చెప్పడం కష్టం - వాతావరణాన్ని బట్టి( బయటా లోపలా) ఏదైనా కావచ్చు: టాగూర్, రూమి, చలం ఇంకా చాలా. మనుషుల్ని చదవటం ఇంకా ఇష్టం - రోజువారీ జీవితంలో తారసపడే ప్రతి ఒక్కరి ప్రభావం మనమీద అంతో ఇంతో లేకుండా ఉండదు అని నమ్ముతాను. ఇలాంటి చాలా అద్దాల్లో కనిపించే మనల్ని పరీక్షగా చూసుకోవడానికి జె.కె ఫిలాసఫీ ఇంకా ఇష్టం. వృత్తి రీత్యా మాధమ్యాటిక్స్ ఫాకల్టీ, అప్పుడప్పుడు రాసుకున్న లైన్లు ఎప్పుడైనా ఇలా..బయట పడుతూ ఉంటాయి-

ఆమె( ఇమ్మే) చ్యూరు గా…..

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కొన్నంతే. చ‌దువుతోంటే.. ఓ మంచి భావ‌న క‌లుగుతుంది. చ‌దివాక … ఏదో కొత్త‌గా అనిపిస్తుంది. feel good write up madam

  • చదవడమే మరిచిపోతున్న ఈ  రోజుల్లో చేత్తో రాయడం నిజంగా ఓ సాహసమే. సాఫ్టువేర్ జీవితాల్లో స్పేస్ వెదకడం మరీ సాహసం . మళ్ళి చదవాలనిపించేట్టుగా ఉంది మీ రచన . ఈ compititive society మీ సృజనని చంపెయ్యకూడదని ఆశిస్తూ
     మురళీకృష్ణ 

  • హృదయం ద్రవించిపోయింది. కళ్ళలో నీల్లోచ్చ్చాయి.

     చిన్న కథ.. గొప్ప భావోద్వేగపు రచన. బాగుందండీ. 

  • Ardently expressed… Dreams Can come true …in part for that part to become a cushion for life.. hearty…thanks? Yes. To be always open to fellow citizens…not Netizens alone….

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు