రచయితలకు ఆహ్వానం – డయస్పోరా తెలుగు కథానిక-18

చనలు చేరవలసిన ఆఖరి తేదీ- సెప్టెంబర్ 15, 2024 (September 15, 2024)

మిత్రులారా,

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు ఆంధ్ర కళా వేదిక, దోహా, ఖతార్ సంయుక్త నిర్వహణలో నవంబర్ 22-23, 2024 (శుక్రవారం, శనివారం) తేదీలలో ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో జరుగుతున్న 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషా, సాహిత్యాభిమానులు అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మధ్య ప్రాచ్య దేశాలలో నివసిస్తున్నవారి సాహిత్యాభిమానానికి మొట్టమొదటిసారి ప్రపంచ స్థాయిలో గుర్తింపుగా ఖతార్ దేశంలో నిర్వహించబడడం ఈ ‘9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు’ ప్రత్యేకత.

ఈ సందర్భంగా మధ్య ప్రాచ్య దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా విదేశాలలో నివసిస్తున్న రచయితల సృజనాత్మకతను గుర్తిస్తూ “డయాస్పోరా తెలుగు కథానిక-18వ సంకలనం” అనే గ్రంధం ప్రచురించి దోహా సదస్సులో ఆవిష్కరించబడుతుంది. ఈ గ్రంధంలో ప్రచురించడానికి పరిశీలన కోసం విదేశాలలో నివసిస్తున్న రచయితల నుంచి కొత్త కథలు కానీ గత 1-2 సంవత్సరాలలో (2023-2024) ప్రచురించబడిన కథలు కానీ సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము.

కొన్ని సూచనలు, నిబంధనలు

1. భారతదేశానికి వెలుపల విదేశాలలో నివసించే డయాస్పోరా రచయితల కథలకి ఈ సంకలనం పరిమితం. అయినా డయాస్పోరా (విదేశాలలో జీవితాలకి సంబంధించిన) ఇతివృత్తాలతో భారత దేశ నివాసులు రచించిన కథలు కూడా పరిశీలించబడతాయి.

2. ఆయా దేశాల్లోని స్థానిక జీవితాలు, సంస్కృతులు, సంప్రదాయాలు, సమస్యలు మొదలైన వాటిని ప్రతిబింబించే కథా వస్తువులకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. స్థానికులు అంటే ఆ దేశ జాతీయులు కానీ, అక్కడ నివసిస్తున్న భారతీయులు, తెలుగు వారి సమాజం, ఇతర దేశాల నుంచి అక్కడకి వలస వచ్చిన వారు- ఇలా ఆ దేశంలో నివసిస్తున్న ఎవరైనా కావచ్చును.

3. అముద్రితమైన కొత్త కథలు, గత రెండేళ్ళలో (2023-2024) లో ప్రచురించబడిన కథలు మాత్రమే పరిశీలించబడతాయి. ఇది వరలో ముద్రించబడిన కథల తొలి ప్రచురణ తేదీలు, ఇతర వివరాలు (ప్రచురించిన పత్రిక, బ్లాగ్, వెబ్ సైట్, FB వివరాలు) విధిగా మాకు తెలియపరచాలి.

4. కొత్త కథలకి మేము సూచించే కొన్ని ఇతివృత్తాలు: విదేశాలకే ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు, రవాణా, పర్యాటక అంశాలు, పర్యావరణ జాగృతి, అనేక వృత్తులలో విభిన్నంగా ఉండే పని విధానాలలో గమనింపులు, ప్రవాసంలో చిత్రమైన అనుభవాలు, దృష్టిని దాటిపోని వివక్ష, ఇతర దేశాలలో కూడా ప్రవాస తెలుగు భారతీయులలో పాతుకుపోయిన కుల, వర్గ వ్యవస్థ, విదేశాలలో స్వదేశాల రాజకీయాల ప్రభావం, సినిమా ప్రభావం, సైన్స్ ఫిక్షన్, సాంస్కృతిక వైరుధ్యాలు, దేశాభిమానం, దురభిమానం మొదలైన అంశాలు.

5. ఒక్కొక్కరు ఒక కథ మాత్రమే పంపాలి.

6. కథల నిడివి సుమారు 3000 పదాలకి మించకూడదు.

7. రచన సొంతమని, మరి దేనికీ అనువాదం, అనుసరణ కాదని హామీ పత్రం జతపరచాలి.

8. రచనతో బాటూ ఒక ఫోటో, చిరునామా, 5-10 పంక్తులకి లోబడి క్లుప్తంగా తమ వివరాలు పంపాలి.

9. రచనలు వర్డ్/గూగుల్ డాక్యుమెంటుగా మాత్రమే పంపాలి. చేతివ్రాత, JPEG, PDF తదితర formats లో పంపిన కథలు స్వీకరించబడవు.

10. కథల ఎంపిక, ఇతరత్రా అన్ని విషయాలలోనూ సంపాదకులదే తుది నిర్ణయం. వాదోపవాదాలకి తావు లేదు.

రచనలు చేరవలసిన ఆఖరి తేదీ- సెప్టెంబర్ 15, 2024 (September 15, 2024)

రచనలు పంపించవలసిన చిరునామాలు:

deepthinivas22@gmail.com, sairacha@gmail.com

వివరాలకు సంప్రదించాల్సిన సంపాదకులు

శాయి రాచకొండ (వాట్సాప్: 1 281 235-6641), దీప్తి పెండ్యాల (వాట్సప్ -1 513-827-7790)

వంగూరి చిట్టెన్ రాజు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు