రంగుల్లో కలల చిత్ర “స్రవంతి”

“Art is the signature of civilization.”
-Jean Sibelius

నలో ఏదైనా ఒక కళా రూపం నిక్షిప్తం అయిఉంటే అది ఎప్పుడైనా మనలోనుంచిబయటప్రపంచానికిబహిర్గతమవచ్చు.దానికి వయసుతో సంబంధం లేదు. ఏదైనా సన్నివేశాన్ని చూసినప్పుడు  మనసులో ఉండే  భావావేశం మనల్ని మరో ప్రపంచం లోకి  లాకెళ్లినప్పుడో మనం ఆ  అలౌకిక ఆనందంలో నర్తించేదే కళ. అలాంటి కళని మనకి చిత్ర కళ ద్వారా అందిస్తున్నారు నెల్లూరుకు చెందిన  స్రవంతి  చతుర్వేదుల.

నెల్లూరు ఆంధ్రా కోస్తా ప్రాంతపు ఆకుపచ్చని జరీఅంచు .సింహపురి కళలకు, కళాకారులకు నెలవు. సంగీతం ఒక పక్క, సాహిత్యం ఒకపక్క, ఇలా ఏళ్ల నాటినుంచి నెల్లూరు  ఏదో ఒక అద్భుతానికి  జన్మ స్ధలం ఔతూనే ఉంది. ఆ కోవలోకి స్రవంతి గారి చిత్ర కళను చేర్చవచ్చు. బాల్యం నుంచే బొమ్మలు గీయడం మీద మక్కువ ఉంది స్రవంతి గారికి .  కళ ఎప్పుడు మనిషి హృదయంలో వికసిస్తుందో  అప్పుడు ఆ మనిషిని కుదురుగా నిలబడనీయదు. బడికెళ్లే సమయంలో ,  కాలేజీ కాలం లో , ఆ తర్వాత వైవాహిక జీవితం , ఇలా గడియారం వెంటబడి తరుముతూ ఉన్నా ఆమె లోపల ఉన్న కళ (కల)ఆమెని సమయ ప్రవాహం లో పడి కొట్టుకుపోనీయలేదు.తనలో తాను ఏ దృశ్యాన్ని చూసినా అది కాగితం మీద రంగుల్లో ఎలా ఉంటుందో అని తనలోనే ఒక చిత్తుప్రతిని గీసుకుని భద్రపరుచుకునే వారు.అది నిజంగా కాగింతంపై ఎప్పుడు వాలుతుందా అని ఎదురు చూసేవారు.

ఈకాలపు మనుషులకు సమయం చాలా తక్కువ దొరుకుతుంది.అందునా చాలా బాధ్యతలు, హాబీలు ఉన్న వ్యక్తి కావడం వల్ల అన్నింటినీ సమన్వయం చేసుకుని తనలోని ఆర్టిస్ట్ ని బయటకి తీసుకు రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నారు. అందువల్ల కాస్త ఆలస్యం అయితే జరిగింది తప్ప ఎక్కడా అలసత్వం జరగ లేదు. కాలం కళాకారులని తనవైపు లాక్కుంటుంది అన్నది నిజమైంది.ఆ సమయం స్రవంతి గారికి
లాక్ డౌన్ రూపంలో ఎదురైంది.కావాలనుకున్న  సమయం చాలా చేతికి అందింది. ఇంకేముంది మనసులో ఎప్పటినుంచో గూడుకట్టుకున్న  భావచిత్రాలు అన్నీ ఒకేసారి రంగులు పులుముకున్నాయి.

తెల్లకాగితాలు మీద  కుంచె వంపులు తిరగడం మొదలైంది.ఐనా ఎక్కడా ఏదీ ఒకపట్టనా నచ్చేది కాదు, నచ్చనివన్ని డస్టుబిన్ లోకి వెళ్లిపోయేవి.కానీ మనసు మాత్రం నిలకడగా అదే కాన్సెప్ట్ మీద నిలబడి ఉండేది. స్రవంతి గారు వాటర్ కలర్ లో బొమ్మలు గీయడం లో నిష్ణాతురాలు. వాటర్ కలర్ లో రంగుల ఎంపిక సరిగా లేకపోతే బొమ్మలో ఉండే మెజర్మెంట్స్ అన్ని కలిసిపోయినట్టు ఉండి బొమ్మకి అర్ధం మారిపోతుంది , కాబట్టి బొమ్మని ఎంత ఏకాగ్రత తో వేయాలో స్రవంతి గారికి తెల్సు. అందుకే ఆమె స్కెచ్కే ఎక్కువ సమయం తీసుకుంటారు. ఆమె గీసిన చిత్రాలు పరిశీలనగా గమనిస్తే దేవాలయం బొమ్మ కానివ్వండి, ఏటి ఒడ్డు కానివ్వండి, అలాగే ముడుతలు పడిన వృద్ధుడి ముఖం కానివ్వండి ,ఇలా ఎన్నెన్నో చిత్రాలు స్రవంతి గారినుంచి జాలువారాయి.

కాన్వాస్ మీద నీటిని గీయడం స్రవంతి గారికి బాగా ఇష్టం . సరస్సు అందులో ఆగి విశ్రాంతి తీసుకుంటున్న  పడవలు, ఎక్కడినుంచో ఎగిరివచ్చిన పక్షులు , రాళ్ళని ఒరుసుకుంటూ గల గల ప్రవహిస్తున్న ప్రవాహం ఇలా నీళ్ళని సహజసిద్ధమైన ప్రవాహంగా లేక స్థిరమైన  నీటిగా గీయడానికి తాను వాడే రంగులు, వాటిని మిక్స్ చేసి ప్రజంట్ చేసే విధానం మెప్పిస్తుంది. పడవ మీద కూర్చుని తన వలని శుభ్రం చేసుకుంటున్న చేపల వ్యక్తి బొమ్మని చూసి తీరాల్సిందే. చుట్టూ ఉండే పచ్చదనం మొత్తాన్ని కళ్ళకి ఇంపుగా గీయడం ఖచ్చితంగా చప్పట్లు కొట్టిస్తుంది. తన జీవితంలో కూడా పచ్చదనాన్ని ఆహ్లాదంగా ఆస్వాదిస్తాను  అన్న  భావన వల్ల కాబోలు అదంతా ఆ బొమ్మలో పరావర్తనం చెందుతుంది.  తామరాకుల మీద జారిపోతున్న నీటి బొట్టులని స్రవంతి గారి ఒడిసిపట్టిన విధానం ఆకట్టుకునేలా చేస్తుంది. రాళ్ళని నీళ్ళని తన రంగుల్లో వేరు చేసిన విధానానికి చాలా పేరు తెచ్చుకున్నారు.

తనకి ట్రైబల్  విమేన్ సిరీస్,భారతీయ నృత్య రీతులు చేయాలని ఆశ ఉంది.ప్రస్తుతానికి ఆపనిలో ఉన్నారు కూడా.భారత దేశంలో  ఉండే వివిధ ప్రాంతాల్లో ఉన్న గిరిజన ప్రాంతపు మహిళల్ని ఒక సిరీస్ గా  తన కుంచె లోనుంచి తీసుకురావాలి అని ఆలోచన లో ఉన్నారు.  చిన్నపిల్లలు అందరూ ఆర్టిస్టు లే అని “పాబ్లో పికాసో” అన్నమాట ని స్రవంతి బాగా నమ్ముతారు.

తన చుట్టూ ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరిలోనూ తనకి కావాల్సిన విషయాన్ని చాలా షార్ప్ గా పట్టుకుంటారు.అందులో జీవితాన్ని చూపించాలని ఆశ పడతారు, జీవితాన్ని ప్రతిబింబించే పని లో దొరికే తృప్తి కన్నా కళాకారులకు ఇంకేం కావాలి.గోడ మీద వాలిన పిచ్చుకల దగ్గర నుంచి ఆకాశం లో స్వేచ్ఛ గా ఎగిరే పక్షుల్లో ఆమె విశాల మైన భావాలని వెతుక్కుంటారు. వాటి ద్వారా ఎంత వరకు ఈ సమాజాన్ని ప్రభావితం చేయగలనో అని ఆలోచన చేస్తూ ఉంటారు.ఆ భాగం మొత్తాన్ని చాలా చోట్ల గీశారు ఇప్పటికే.. కానీ ఇంకా ఏదో చేయాలనే తపన ఉంది దాని కోసం తపన పడుతూనే ఉంటారీ ఆర్టిస్ట్.

ఎంత బాగా బొమ్మలు వేయగలరో. బాగా వేయలేని బొమ్మ కోసం కాగితం బలై పోతుంటే ఆవేదన చెందేంత సున్నిత మనస్కురాలు స్రవంతి గారు . మనస్సును ని తన హాబీతో క్లీన్ గా ఉంచుకునే స్రవంతి గారు తన శరీరాన్ని కూడా చాలా ఫిట్ గా ఉంచునేందుకు తన వంతు ప్రయత్నం గా హాబీగా ” బ్యాడ్మింటన్” ని ఆడుతూ శరీరాన్ని, మనసుని రెండింటిని చాలా అందంగా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అదొక్కటేనా ” ట్రెక్కింగ్”ని చాలా అమితంగా  ఇష్టపడతారు.తనకున్న హాబీల్లో దీనికి ఒక్కదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
ఒక పక్క ఫ్యామిలీ ని మరో చేత్తో కళ ని నడిపిస్తూ ఆమె తనని తాను గెలుస్తూపోతున్నారు. కరోనా వలన పోటీలు అన్ని ఆన్లైన్ లో జరిగే క్రమంలో చాలా పోటీల్లో స్రవంతి గారు పాల్గొన్నారు.అనేక ఆన్లైన్ చిత్ర కళా ప్రదర్శనలు ఇచ్చారు. భారతీయ చిత్రకళ పరంపరలో తాను ఒక భాగం కావాలని స్రవంతి నిత్యం తననితాను మెరుగు దిద్దుకుంటున్నారు.

No description available.

తెలుగు సాహిత్యం లో పాతూరి అన్నపూర్ణ గారి పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. అటు కధకురాలిగా, ఇటు కవయిత్రిగా అలాగే ” పాతూరి మాణిక్యమ్మ ట్రస్ట్” నిర్వాహకురాలిగా ఎన్నో బాద్యతలు నిర్వహిస్తున్న వ్యక్తిగా అందరికి తెలుసు.గత కొన్నేళ్లుగా వాళ్ళ అమ్మగారి పేరుమీద సాహితీ అవార్డులని ప్రదానం చేస్తున్నారు. అలాంటి అన్నపూర్ణ గారి కుమార్తె మన స్రవంతి గారు.కాబట్టి ఇక కుటుంబ ప్రోత్సాహం గురించి కొత్తగా చెప్పేపనేం లేదు.

ఆమెకి సాహిత్య వారసత్వం ఉంది.   తాను కొత్తగా చిత్ర కళా వారసత్వాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు. ఆమె నుంచి మరెన్నో గొప్పగొప్ప చిత్రాలు రావాలని, ఆమె భారతదేశం గర్వించే ఒక చిత్రకారిణి గా నిలబడాలని, అలాగే ఆమె కళ సామాన్యులకు ఆలంబనగా, వారి ఆశల్ని ప్రతిబింబించేదిగా ఉండాలని మనమూ కోరుకుందాం, ఆమెది ఎలాగూ అదే ఆశ కాబట్టి.అది త్వరలోనే నెరవేరాలని కోరుకుందాం.

స్రవంతి గారి గురించి అన్నపూర్ణ గారు రాసుకున్న నాలుగు మాటలు చూడండి.

“ఒక కళకి చేతనత్వం వచ్చింది
పురి విప్పిన భావాలు
మయూరిలా నర్తించాయి
రంగుల హరివిల్లు విరిసింది
చిత్రం ప్రాణం పోసుకుని
కళ్ళముందు నిలిచింది…”

*

అనిల్ డ్యాని

28 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • All the best Sravanti💐💐 Never know you were such a fine artist …I am following your work in Facebook off late and they are amazing …

  • Great article. It is always amazing to see her art work as each piece is filled with naturality, perfection and creativity. Such a great talent. Eagerly waiting to see her work recognised on many other national and international platforms. Congratulations and thank you Anil D for such a nice write up.

  • అనిల్ డానీ గారి రంగుల్లో కళ చిత్ర స్రవంతి అక్షరీకరించిన తీరు సహజంగా ఆ దృశ్యం చూస్తున్నట్లు గా వుంది..స్రవంతి చిత్రాలన్నీ చాలా సహజంగా వున్నాయి..కళకి కావలసింది ఆసక్తి.. మనో మధనం..ఇవి స్రవంతి లో ఉన్నాయని ఆమె చిత్రాలు చెప్తున్నాయి… అభినందనలు

  • I start with a quote from Aristotle “The aim of art is to represent not the outward appearance of things, but their inward significance.” And your art hold true to the saying. I have seen you from childhood, the drawings on math notebook papers, people called those scribbles are not going to take to places and they all stand corrected now. Like a picture speaks 1000 words your art showed it all. I wish you all the very success in future and may god bless you and bless us with your art.

    • Thanks puppy… that was a lovely note …. am very happy too to be part of this prestigious Web magazine… great to see ur appreciation

  • Excellent Arts Sravanthi, really amazing ones. You should do more Art exhibitions for the people to enjoy your paintings. Wish you all the best and congratulations on your work 💐.

  • Very nice article about your excellent art work Vadina. Congratulations. Wish you good luck and success for all your future projects.

  • Really nice paintings Sravanthi….
    God bless you and wish you good luck in all your endeavours…

  • స్పందించిన మిత్రులు అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు

  • స్రవంతి గారూ! మీ పేయింటింగ్స్ మీ అంత అందంగా ఉన్నాయి .మీ ఆలోచనలో కొత్తదనం ఉంది .ప్రతీ అంశాన్ని అందంగా చూడగలిగిన కళాత్మకత ఉంది . అందంగా చూపగలిగిన దృష్టి ఉంది . అద్భుతంగా మలచగల నైపుణ్యం ఉంది .చూపరులను కట్టి పడేయగల ఆకర్షణ ఉంది .మీరు ఎన్నెన్నో శిఖరాలు అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు