రాట్నం మొదలవగానే
వొక శైశవం.
మోటారు తిరుగుతూ
పైకి తీసుకెళ్లేపుడు
ప్రశ్నలు మొలకెత్తుతాయ్.ఆకాశాన్ని చుంబిచేప్పుడు
సింహాసనం విక్రమాదిత్య.అహం అప్పుడే అనుకుంటాం
మొగ్గ తొడుగుతుంది.
పైకి తీసుకెళ్లేపుడు
ప్రశ్నలు మొలకెత్తుతాయ్.ఆకాశాన్ని చుంబిచేప్పుడు
సింహాసనం విక్రమాదిత్య.అహం అప్పుడే అనుకుంటాం
మొగ్గ తొడుగుతుంది.
పక్కకి వాలు జారి పడే సమయంలో
యెక్కడో భయం తాలూకు బెదురు.
మళ్లీ రాట్నం తిరుగుప్రయాణంలో
ప్రశ్నలన్నీ ఆవిరయిపోతాయ్,
అహం కూడా…
తుఫానుని తనలో కలుపుకున్న శాంతి లాగా
మెల్లిగా రాట్నం కిందకు దిగుతుంది,
ఆకాశాన్ని వొదిలిన వొంటరి చినుకులాగా.
యిది రంగులరాట్నం
జీవరాట్నం
జీవనాట్యం
జీవన్మరణం.
*
చిత్రం: సృజన్ రాజ్
Thank You సృజన్ రాజ్ sir, for your valuable painting and Afsar sir.