యుద్ధమాగింది
కవులు మౌనంలోకి వెళ్లి పోయారు
చొరబాటుదారులకు
దోచుకుపోవడానికి
ఇంకేమీ మిగల్లేదు
నీ పేరు ప్రతిష్టలూ
నీ శవమూ
చివరకు నీ ఎముకలు కూడా
తండ్రి లేని, ఇల్లు లేని ,జాలి లేని
చలికాలం తిరిగొచ్చింది
చనిపోయిన వాళ్ళెవరూ తిరిగి రాలే
పాత చర్చిలలో
ప్రార్థనలు చిక్కుబడిపోయాయి
మృతజీవుల గొంతులో
విశ్వాసం చిక్కుబడిపోయింది
మృతుల హహాకారాలు
గాల్లో మార్మోగుతూనే ఉన్నాయి
గ్రామీణ స్త్రీలు
మేఘాల వీలునామా రాస్తున్నారు
అవతల వైపు
పచ్చ గడ్డి చచ్చిపోయింది
అవతల వైపు జీవితమే లేదు
వితంతువుల శోక గీతాల్లో
నది మునిగిపోయింది
ఈ రాత్రి గురించి
ఎవరూ రాయరు
ఈ పగలును
ఎవరూ చిత్రీకరించరు
యుద్ధమాగింది ,రద్దు గాలే
**
మహమ్మద్ మూసా (పాలస్తీనాకవి)
“The war has stopped but never ended” కు స్వేచ్ఛానువాదం








Add comment