అప్పుడప్పుడు
మైండ్ స్పేస్ దారుల్లో
నడవాలేమో.!
అప్పుడే…
ఆ దారి వెంట
ఎన్ని శకలాల అద్దాలు
ముక్కలు ముక్కలుగా
అతక పెట్టి ఉన్నాయో..
ఇంద్రచాపంలా కనిపిస్తాయి.
నీలం, ఆకుపచ్చ అంటూ
నింగిని తాకుతూ…
నిలుచున్న నిలువుటద్దాల వెనుక
ఎయిర్కండిషన్డ్ చెమట చుక్కల్ని ఆవిరి చేసే
ఊసుల వూగిసలాటల
గుండె చప్పుళ్లని ప్రతిధ్వనిస్తూ ఉంటాయి .
…
ఆ.. అద్దాల ఆవల ఓ ప్రపంచం
అక్కడ, ఎవరికీ ఎవరు సొంతం కాదు
మట్టి వాసనని కిటికీలకి కట్టుకొని
ఆర్గానిక్ నగరాలని నిర్మిస్తూ ఉంటారు.
మరక్కడ పాదచారులుండరు, కానీ!
పాతబస్తీ ఊసులకి
పల్లేరు కాయల రంగులద్ధి
హ్యాష్ ట్యాగులతో
ఎట్ ది రేట్ ప్రపంచం మాదంటారు.
సింఫనీ, క్వాల్కమ్ కళకళల నుండి
ఇనార్బిట్,.. మార్ట్స్ మార్గాలు
మాత్రమే తెలిసిన
పరాన్నజీవులన్నీ
ఒక్క దగ్గర చీమల కుప్పగా పోసిన
దశాబ్దపు చరిత్రకు
కాచిగూడ లేక్ ఎగురవేసిన ‘వి లవ్ స్పేస్’
హైడ్రోజన్ జంట బెలూన్లే సాక్షి
షేర్ మార్ట్ కి, వ్యవసాయ మార్కెట్ కి,
తేడాని ఎరుగకనే..,
అదాని అందలాల్ని
మినిట్ టూ మినిట్స్ అప్డేట్ వర్షన్ లో
వీవర్స్ అవుతూ…
మిల్లెట్ మీల్స్ ని
ఫాషనేట్ కవర్లో చుట్టి తింటూ…
ఉయ్ ఆర్ ప్రౌడ్ అఫ్ నేషన్ అంటారు.
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
బాగుంది రూపా…
Thank you maam☺️
Good poem
Thank you sir
కొత్త ఒరవడి లో
Thank you sir
👌బావుందండి 💐
Thank you☺️