నీకేదో చెప్పాలనుకుంటాను
నీకు తెలిసిన భాషేదో నాకు తెలియదు
బహుశా నీకు తెలిసిందంతా
యుద్ధ నినాదాలు, ఆర్తనాదాలే అనుకుంటా
ఒక కన్నీటి చుక్క రాల్చేందుకు కూడా
కాసింత ఏకాంతం కోసం ఎదురుచూడడం
నీకూ అలవాటే అనుకుంటా
అయినా ఇక కన్నీళ్ళు
రాకూడదనే కోరుకుంటాను
వెనక్కి తిరిగి చూడకూడదనే
మనసుకు చెప్పుకుంటాను
బూజూ, దుమ్మూ దులిపి
కాస్త గాలీ, వెలుతురూ రానిస్తేనైనా
ఊపిరాడుతుందేమోనని ఆశపడతాను
చిటికెడు శాంతి కోరుకున్నందుకు
యుద్ధరంగాలన్నీ దాటించిన కాలానికీ
ఒక్క పువ్వు పరిమళానికీ నోచుకోనందుకు
పూలతోటల్లోకి నడిపించిన జీవితానికీ
సాగిలపడుతూ ముందుకు నడుస్తానా!
మళ్ళీ ఆ గతమే ఎదురుపడి
యుద్ధానికి ఆహ్వానిస్తుంది
గూడు కట్టుకున్న పక్షి ఒకటి
అందులో ఉండలేనని
ఎక్కడికో ఎగిరిపోతుంది
*
యుద్ధరంగాలన్నీ దాటించిన కాలానికీ
Thank you
Excellent poem Bharathi garu
Thank you