సహజంగా జీవితంలో జరిగే ప్రతిదానికి ప్రత్యామ్నాయం ఉంటుంది.అలా ప్రత్యాన్మయం లేనిది ధోరకనిది బహుశా మరణం ఒక్కటే.చనిపోయినవాడు మళ్ళీ తిరిగివొస్తాడని అనుకున్నప్పుడు చావులు కేవలం విరామలే అవుతాయి.సర్వసాధారణ అంశాలు అవుతాయి.దుఃఖం బాధ దిగులు చావుపట్ల ఉండదు.చావంటే భయంకూడా కలగదు.రెండుసార్లు నువ్వు ఒకే నదిలో స్నానం చేయలేవులాగానే ఒకసారి లేదా అంతకు మించి ఎక్కువసార్లు నువ్వు మళ్ళీ పుట్టవు.మరోజన్మ ఉంటుంది. ఇంకో జన్మలో పాపాలనుబట్టి ,జీవించిన జీవితాన్నిబట్టి నువ్వు చెట్టుగానో చీమగానో కుక్కగానో మొక్కగానో పుడతావనో పుడతారనో మనకి ఒక అపనమ్మకాన్ని కూర్చీ పేర్చి నమ్మించి బ్రమల్లో తోస్తారు చాలామంది.
వాళ్ళని, వాళ్ల వ్యాఖ్యానాల్ని అపనమ్మక నమ్మకాల్ని ఎంతవరకు నమ్మాలి? నమ్మకూడదు అనేది కేవలం నీజ్ఞానం మీద ఆధారపడే విషయం.నువ్వుఎంత ఆలోచిస్తే అంత స్పష్టత వొస్తుంది అనేది దీనికి సంబంధించిన దగ్గరి సూత్రం. మరో జన్మలేదని చెప్పడానికి నేనేమి ఆ రహస్యాలు తెలిసినవాడ్ని కాదు.నేనేమి జాతకాలు చెప్పేవాడిని కాదు సంఖ్యాశాస్త్రన్ని అవపోసనపట్టినవాడ్ని కాదు.iam కేవల మానవుడ్ని.
ఉన్న ఈఒక్క జన్మనయినా సార్ధకం చేసుకొని జీవితానికి ఒక అర్థం చేకూర్చే ప్రయత్నం చేయటం ముఖ్యం.నువ్వేమీ కాగితానివి కాదు ఒట్టి గాలికే ఎగిరిపోవడానికి,నువ్వు కేవలం పొట్టువు కాదు ఊకుకేనే రాలిపోవడానికి.నీకళ్ళు సూర్యుళ్ళని నమ్ము.నీచేతులు మానవీయ మందిరాలనుకో.నీ మెదడు,నీ చెవులు, నీ జీవితం, నీ నోరు, మొత్తంగా నీ దేహమే, దేశ మనుకో. ప్రపంచం అనుకో.నువ్వు
అనుకుంటే నీ చేతుల్ని చలివేంద్రాలను చేయగలవు.కళ్ళని ఆదర్శమందిరాలుగా నిర్మించగలవు.గుండె ఒక వెచ్చని ఇంకుబెటర్ని చేయగలవు.అడుగుని ,నడతని, నడకని, మాటని, అర్డంకోసం ఆప్యాయతకోసం ఉపయోగించగలవు. నాదగ్గర ఏముందిలే అనుకోవడమే నీ పరాజయం.నేనేం చేయగలనులే అని భావించటమే నీ ఓటమి.ఎవరో ఒడిస్తే ఓటమి రాదు.మన నమ్మక అపనమ్మకాల వలనే ఓటమి ఎదురొస్తుంది.
మన చుట్టూరా చాలామంది జీవితం విలువ తెలియక
బహుశా అర్థంకాక, అర్థం చేసుకోలేక ఆత్మహత్యల జోలికిపోయి చావును ముందే ఆహ్వానిస్తారు. జీవిస్తున్న జీవితాన్ని మధ్యలోనే వదిలేసి శున్యంలోకి దేహాన్ని పార్సెల్ చేస్తారు.భర్తకొట్టాడని భార్య,
మార్కులు తక్కువొచ్చాయని అమ్మానాన్న తిట్టారని పిల్లలు.మాకుతురు ఎవర్నో ప్రేమించింది వాడితో నాకుతురు పెళ్లి జరిగితే నా పరువుపోతుందని అమ్మానాన్నలు.ఇటువంటివేవో కారణాలు పెట్టుకొని మరనిస్తున్న వారిని మనం చూస్తూనే ఉంటాం.నిజానికి ఆలోచిస్తే,చనిపోవడం తేలికైన పనా ?చనిపోయి మనల్ని నమ్మినవారిని ప్రేమించిన వారిని బాధపెట్టడం తేలికా?ప్రాణం గొప్పదా? పరువు గొప్పదా?
ఎందుకు బతుకుతున్నామో తెలిస్తే ఎందుకు బతకాలో తెలుస్తుంది.ఎందుకు చస్తున్నామో తెలిస్తే ఎందుకు చావకూడదో కూడా తెలుస్తుంది.నువ్వెక్కిన బస్సు ఎక్కడికెళుతుందో తెలిస్తే నువ్వు ఎక్కడ దిగాలో తెలుస్తుంది.కాయకోసేటప్పుడు చేయితెగితే
చెయ్యిని ఎందకు నరుక్కోవటం?తలనొప్పికి పరిస్కారం తలనరుక్కోవటం కాదు.
ఒక అమ్మానాన్న, ఒక కూతురు.ఇరవైఏళ్ళ కూతురుకి తండ్రితాగుడు వాగుడు నచ్చదు.తాగి ,
తండ్రి చేసే గోలని,తల్లిని తిట్టే మాటల్ని కూతురు తట్టుకోలేక పోతుంది.ఎన్నిసార్లు చెప్పినా విన్నట్టే విని వినని తండ్రి. మరో అవకాశం లేదు భరిచటమే.
తల్లిని రోతగా తిట్టి అందరిముందు గేలిచేసే తండ్రికి ఏమిచెప్పాలి?.ఎవరు చెప్పాలి.?కూతురు ఏమి చదువుతుంది,?ఎలా చదువుతుంది?తనకున్న సమస్యలేంటి?తన భవిష్యత్తు ఏంటి?తండ్రిగా తను ఎలాఉన్నాడు? ఎలా ఉండాలి? కూతురు ఏమనుకుంటుంది ?భార్య ఎంత సఫర్ అవుతుంది.?ఏమి తెలియని, తెలిసినా అర్థం చేసుకొని తండ్రికి ఏమి చెప్తేమాత్రం ఏమి అర్ధమౌతుంది?ఎం అర్థం చేసుకుంటాడు?చుట్టూరా నరకం.ప్రతిరోజు ప్రతిపూట
ఈ జీవితం ఇక అవసరమా అని ప్రశ్నించుకునే
పరిస్థితే.కూతురు ముందే తల్లిని అత్యాచారం చేసే తండ్రిని చూసి ఏమనాలో ఏమనుకోవాలో తెలియక
ఫెనాయిల్ తాగిన కూతురు.తన చావన్నా తండ్రిని మారిస్తే తన తల్లన్నా సుఖంగా ఉంటుందని ఒక ఆశ.
కూతురు లేకుండా తల్లి ఎలా ఆనందంగా ఉంటుంది?
ఫెనాయిల్ తాగి మరణించిన కూతురు చావు కూడా తండ్రి తాగడానికి ఒక వేదిక. ఒక సాకు.
ఇది చనిపోయిన అమ్మాయికి చిన్న సమస్యకాదు అందుకే చనిపోయింది.ఒక కోణంలోంచి చూస్తే ఆత్మహత్యలు అన్ని హత్యలే.కారణాలు ఏవైనా ,ఎంత కఠినంగా కాలమున్నా,నిన్ను ఎవరు ఎంతగా టార్చ్ చేసినా ,చీకట్లో టార్చ్ లైట్ వేసి పోయినవాటికోసం వెతికినట్టు ఆగాదంలోనుండి ఆత్మన్యూనతలోంచి జీవితాన్ని వేతకడమే, వెతుక్కోగలగటమే గొప్ప.
యుద్దాలు అనేకం
అబద్ధాలూ అనేకం
యుద్ధంలో బాణమై విరిగిపోవటం గొప్ప
అబద్దాల్లో నిజమై నిలబడటం గొప్ప
సత్యాలు అనేకం
సాయుధాలూ అనేకం
అసత్యం ముందు సత్యంగా శిరస్సు వొంచటం గొప్ప
సాహసమై సమిదయి సాయుదానికి తలనివ్వటం గొప్ప
విరిగిపోకుండా
రాలిపోకుండా
చావుని మింగకుండా
బతుకుని నవ్వుతూ తిరగటం
ఇంకా ఇంకా గొప్ప
Sir miru rasina e story chala bavundi…kani manushulu jeevitham villuva telika chanipovatledu…vallu chanipoye mundu chala sarlu valla kastalu gurinchi alochistaru..aa timelo vallani odarchee vari kante badhapette valle ekkuvuga untaru…anduloo mainga ammayelakythe first husband tarvatha atta and mammalu ..inka Pelli Kani ammayelani elantivi thagubothu thandrulu…anduke ontariga untu, adhe alochistu ontari thanamtho chachipothunnaru
Well written,living is important in any movement…..
జీవించిన జీవితాన్నిబట్టి నువ్వు చెట్టుగానో చీమగానో కుక్కగానో మొక్కగానో పుడతావనో పుడతారనో మనకి ఒక అపనమ్మకాన్ని కూర్చీ పేర్చి నమ్మించి బ్రమల్లో తోస్తారు చాలామంది……ఈ మాటల తో నేను విభేదిస్తాను. పునర్ జన్మ సిద్ధాంతం అస త్యం కాదు. అది ఎప్పుడూ పిరికి గా జీవించమని చెప్పదు.
జీవితం ప్రతి దశలోనూ క్లిష్టమైనదే. జీవితాన్ని ధైర్యంగా జీవించటం నేటి పిల్లలకు మనం నేర్పట్లేదు. అందుకే వివేకానంద బోధలు యువత కు ప్రతి విషయంలోనూ దారి చూపుతాయి.
నీకు వీలైతే ఆయన రచనలు చదివి పిల్లలకు మార్గదర్శనం చేయగలవు. సంచిక చాలా బాగుంది. ,,👌👌👌
.
Thank you sir
Rebirth undhi anadaaniki mulam undaa sir emainaa ..
జీవితంలో ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి,
కానీ మనం బ్రతకడానికి మాత్రం
ఈ జీవితం ఒకే ఒక్క ఆప్షన్.
తెలిసినవారు కష్టాలకు ఎదురుఈదుతారు,
తెలియనివారు కొట్టుకుపోతారు.
( ఇంకో జీవితం కోసం)
జీవిత సత్యాన్ని చెప్పారు పెద్దన్న