బాలాంత్రపు రజనీకాంతరావు పాటల కొమ్మలు, సాహిత్యపు రెమ్మలు నిండుగా పరచుకొన్న ఓ మహా వృక్షం. ఆ వృక్షానికి ఆకాశవాణి ఆలంబనైతే, ఎన్నెన్ని పక్షులు ఆ కొమ్మల మీద, రెమ్మల మీద గొంతులు సవరించుకొన్నాయో.
నిండు నూరేళ్ళకు దగ్గరగా బతికిన ఆయన జీవితం నాలుగు చరణాల రాగమాలికతో లాంగ్ ప్లే రికార్డ్ లాంటిది. ఎన్నెన్ని జ్ఞాపకాలు, మాటలు, ఊసులు, ముచ్చట్లు ఆయన చుట్టూ అల్లుకున్నాయో. వందల కొద్దీ సన్నిహితులు, వేల కొద్దీ అభిమానులు ఆయన్ని గుర్తుచేసుకోని రోజే లేదు.
కొద్దిగా ఆలస్యంగానైనా ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులతో కల్సి పదిహేడు జూన్ 2018 సాయంత్రం ‘ఛాయా’ సంస్థ ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరిగింది.
వీడియో రూపశిల్పి: సమీరా
మంచి పని చేసావు సమీరా, అందుకో మా అందరి అభినందనలు
Thank Amarendra garu 🙂
సమీరమ్మా…! కేవలం ప్రోగ్రామ్ అనుకోలేం. ఒక అవసరమైన డాక్యుమెంటేషన్. థాంక్యూ బేటా
చక్కటి కంప్లిమెంట్ సూఫీ
రజని గారి పాటలా సాగిన ఆ సాయంత్రం .. ఒక చిరుగాలి తరగ లా తాకింది. వేడుకను దృశ్యమానం చేసి అందించిన సమర్పకులు ధన్యవాదాలు. మాట్లాడుతున్న వారి పేర్లను సబ్ టైటిల్గా వేసి ఉంటె వాళ్ళు ఎవరెవరో తెలిసేది .