కశ్మీర్ గురించి మొదటిసారి చదివి దాదాపు నలబై ఏళ్లవుతున్నది. అది నా హృదయంలో ఒక భాగం. అది నా ఆలోచనల్లో ఒక భాగం. మూడు వారాలకు పైగా మనసు మనసులో లేదు. నిత్యజీవితంలో అత్యవసరమైన పనులు తోసుకొచ్చి వాటికవి చేయించుకుంటున్నాయి గాని ముక్కలైన హృదయం అతుక్కొని ఆనందంగా రవరవలాడడం లేదు. చూపూ చెయ్యీ ఆలోచనా మనసూ కన్నీళ్లు స్రవిస్తున్నాయి.
కళ్ల ముందర ఇంత దుర్మార్గమా అన్నది ఒక దుఃఖమైతే, ఇంత దుర్మార్గాన్ని ఇంత నిర్లిప్తంగా, నిశ్శబ్దంగా, నిష్క్రియగా సహించడమా, అజ్ఞానమదోన్మత్త అసత్యప్రేలాపనలే సకల రాజలాంఛనాలతో ఊరేగడమా అనే దుఃఖం మరొక ఎత్తు.
‘దిల్ కె టుక్డే హజార్ హుయే, కోయి యహా గిరా కోయి వహా గిరా’ అని కవి స్త్రీపురుష ప్రేమానురాగ సందర్భంలోనే రాశాడేమో గాని, ఆ అక్షరాలు వెలువడిన 1948 ఆ కాలపు మహా విషాదానికి సూచిక అనీ, ఆ సందర్భమే ఆ అక్షరాలకు నిజమైన అజరామరత్వాన్ని ఇచ్చిందనీ ఎప్పుడూ అనుకునే మాట ఆగస్ట్ 5 ఉదయం నుంచి నిరంతర బాష్పధారలలో అనుక్షణం గుర్తుకొస్తున్నది.
ఇంతటి మహా ఆఘాతం, ఇంతటి మహా దహన కాండ, ఇంతటి పెను తుపాను, ఇంతటి భయానక భూకంపం. అయినా ఇంత అసాధారణత్వం భారత సమాజానికి ఎంత సాధారణమైపోయింది! ఎక్కడా దిక్కులు పిక్కటిల్లే ఆర్తారావమొకటి వినిపించడం లేదు. డెబ్బైలక్షల జనాల అసహాయ ఆక్రందనలకు చెవులు మూసుకుని కూచున్నది ప్రపంచం. ఎక్కడా ఒక ప్రశ్న లేదు. నినాదం లేదు. ఎక్కడా ఒక అనాలోచిత సద్యోస్పందనగానైనా ఒక ధిక్కార ప్రకటన లేదు. మాటలే వినబడనపుడు చేతలు కనబడే ప్రశ్నే లేదు.
అసాధారణమైన సందర్భాలను అతి సాధారణ సందర్భాలుగా పరిగణించేలా వ్యవస్థ మనను ఎలా సిద్ధం చేస్తున్నదో, మప్పుతున్నదో, మత్తుమందు తినిపిస్తున్నదో, సమ్మతి తయారీ సాగిస్తున్నదో చిన్న చిన్న సందర్భాల నుంచి చూపాలని ఈ శీర్షిక ప్రారంభించాను. పెద్దవాటి గురించి ఎలాగూ చెప్పనక్కరలేదని, అవి ఏదో ఒక లాగ ఆలోచనాపరుల దృష్టికి వస్తాయని పొరపడ్డాను. అటువంటి సందర్భాల్లో మానవ సహజ వివేచన ఉపయోగించి బుద్ధిజీవులు అసాధారణాన్ని అసాధారణంగా, అతి సాధారణాన్ని అతి సాధారణంగా సవ్యంగానే గుర్తిస్తారని నమ్మాను.
కాని ఇది కేవలం జ్ఞానేంద్రియాల సమస్య కాదు. మనం చూస్తున్నదీ, వింటున్నదీ, చదువుతున్నదీ కళ్లు తెరుచుకోవడానికీ, మెదడు వికసించడానికీ, హృదయం విశాలం కావడానికీ ఉపయోగపడడం లేదు. గుడ్డలు కక్కిన నోట్లో ప్రభంజనంలా ఎగసిపడుతున్న శోకపు మౌనాన్ని, నిర్జన వీథుల్లో, మూసుకున్న తలుపుల వెనుక, ముళ్లకంచెల మధ్య, తుపాకీ మొనల కింద అణగిపోతున్న సనసన్నని మూలుగులను, దారుణదమననీతి పదఘట్టనల కింద అణగిపోతున్న చీమల హాహాకారాల సవ్వడిని చూడగలిగే, వినగలిగే, అనుభవించగలిగే, సహానుభూతి వ్యక్తీకరించగలిగే సున్నితత్వం విద్యావికాసాల వల్ల అబ్బుతుందని పొరపడ్డాను. కాదు, మన జ్ఞానేంద్రియాలు, మన పాలకవర్గాలు, మన ప్రచార సాధనాలు మన హృదయాన్నీ మేధనూ మూసివేయడానికే, పక్కదారి పట్టించడానికే, పొరుగువారి వేదనను విస్మరించడానికే, వక్రీకరించడానికే పని చేస్తున్నాయని మరొకసారి తెలిసి వస్తున్నది.
ప్రపంచ చరిత్రలోనే ఒక జాతి పట్ల మరొక జాతి, ఒక పాలిత సమూహం పట్ల ఒక పాలక సమూహం, ఒక ప్రాంతం పట్ల మరొక ప్రాంతం, ఒక మతం పట్ల మరొక మతం సాగించగల అన్యాయాలకూ దౌర్జన్యాలకూ అది ఒక పాఠ్యపుస్తకపు ఉదాహరణ. అవన్నీ ఉమ్మడిగానూ కావచ్చు, విడివిడిగానూ కావచ్చు. ఏకకాలంలోనూ కావచ్చు, వేరువేరు కాలాల్లో స్థాయిల్లో కావచ్చు. పైగా మరొక అన్నప్పుడు, ముఖ్యంగా మరొక ప్రాంతం అన్నప్పుడు ఒక గుర్తించదగిన ప్రాంతమూ లేకపోవచ్చు. ఆ ప్రాంతంలోనుంచే ఆ పాలిత సమూహం లోనుంచే ఆ జాతి లోనుంచే ఆ మతం లోనుంచే దళారీలనూ తైనాతీలనూ తయారు చేసుకుని ఆ దుర్మార్గంలో వారికే గణనీయ పాత్ర ఇచ్చి ఉండవచ్చు. అన్నిటికీ పొరుగుదేశపు బూచి చూపి ఉండవచ్చు. దేశభక్తి మేలిముసుగు వేసి ఉండవచ్చు. ఊహాచిత్రపటంలో శిరసు స్థానాన్ని పెట్టి, ఆ శిరసు తెగిపోకుండా కాపాడుతున్నామనే అబద్ధాల మీద రాజ్యం చేసి ఉండవచ్చు. ఎన్ని మినహాయింపులు, మార్పు చేర్పులు ఉన్నప్పటికీ, ఒక జాతి హననకాండకు పాఠ్యపుస్తకప్రాయమైన ఉదాహరణ అది. అక్కడి ప్రజల చరిత్ర, సంస్కృతి, ఇష్టాయిష్టాలు, ఆకాంక్షలు అన్నీ ఉక్కుపాదంతో అణచిపెట్టి ఆ ప్రాంతాన్ని రెండు దేశాల సరిహద్దు యుద్ధభూమిగా, రియల్ ఎస్టేట్ గా, పర్యాటక ప్రాంతంగా, వనరుల దోపిడీకి ఆహ్వానిస్తున్న క్షేత్రంగా చూసిన చరిత్ర గతమంతా తడిసె రక్తమున, కాకుంటే కన్నీళులతో.
ఆ గతమంతా అలా ఉంచినా, ఇవాళ్టికివాళ అక్కడి మనుషుల కలలనూ ఆకాంక్షలనూ ఒక్కుమ్మడిగా గొడ్డలివేటుతో కూల్చివేశారు. ఆ గొడ్డలివేటు తిన్న బాధితులు తమ ఆక్రోశం వినిపించకుండా, కనీసం తమలో తాము ఓదార్చుకునే అవకాశం లేకుండా డెబ్బై లక్షల జనాల మీదికి పదిలక్షల సైనిక, అర్ధసైనిక బలగాలను తరలించారు. నిషేధాజ్ఞలు విధించారు. వాక్సభాస్వాతంత్ర్యాలను, రాజ్యాంగ స్ఫూర్తిని రద్దు చేశారు. ఎవరి మీద ఇంత భీకరమైన నిర్ణయం తీసుకున్నారో వారికి స్వరమే లేకుండా చేశారు. వారికి ఏడు దశాబ్దాలుగా ఇస్తూ వస్తున్న హామీలను, వారికి మాత్రమే కాదు మిగిలిన దేశం ముందరా, అంతర్జాతీయ సమాజం ముందరా చేసిన వాగ్దానాలను పూచిక పుల్లలాగ తీసి పడేశారు. తమ నేల మీద తమ సంస్కృతితో తమ అస్తిత్వం అని స్వాతంత్ర్య స్వప్నాలను కన్నందుకు, ఆ స్వప్నాలనూ, ఆ స్వప్నాలు కన్న కళ్లనూ, మనుషులనూ నిర్మూలించడానికి ప్రయత్నిస్తున్నారు. వలసవ్యతిరేక ఉద్యమంలో, రాజ్యాంగ నిర్ణయ సభ చర్చలలో వ్యక్తమైన సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచేలా రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తాం, మందబలంతో ఏమైనా చేయగలం అని మిగిలిన అన్ని రాష్ట్రాల నెత్తి మీద ఎప్పుడు తెగిపడుతుందో తెలియని కత్తి కట్టారు.
ఈ పరిణామం కాకపోతే మరే పరిణామం అసాధారణం అనే అభివర్ణనకు సరిపోతుంది? ఇంత అసాధారణ దమన, వాగ్దాన భంగ, అమానుష, అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక చర్యను కూడ అతిసాధారణమైనదన్నట్టుగా తీసుకుని దేశం యథావిధిగా సాగిపోతున్నదంటే, ఈ దేశానికి ఏ భయానక కాన్సర్ వ్యాధి సోకి ఉన్నదనుకోవాలి? సొంత ప్రయోజనం వల్లనో, స్వార్థం వల్లనో, అత్యాశ వల్లనో, అజ్ఞానం వల్లనో, అమాయకత్వం వల్లనో ఒక అసాధారణత్వాన్ని అతిసాధారణంగా భావించినట్టు నటించడం అలవాటు చేసుకున్నామేమో. కాని ఇక్కడ పిడికెడు మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, మరో రెండు పిడికిళ్ల రాజకీయ వ్యాపారులకు మినహా మరెవరికీ సొంత ప్రయోజనాలో, స్వార్థమో, అత్యాశలో కూడ లేవు గదా. ఈ అసాధారణ చర్యను అతిసాధారణంగా తీసుకుని నిమ్మకు నీరెత్తినట్టు కనబడడానికి కారణం అజ్ఞానమో, అమాయకత్వమో మాత్రమే కావాలి.
నిజానికి ఒక్క మీటతో ప్రపంచమే చేరువైన కుగ్రామంగా, ఎల్లలోకములొక్క ఇల్లుగా మారిన అత్యాధునిక ఇరవైఒకటో శతాబ్దిలో ఇంత స్థాయిలో అజ్ఞానం, అమాయకత్వం ఉండడమే అసాధారణం. అదే అతి సాధారణం అయిపోలేదూ?!
*
Well written
@@డెబ్బై లక్షల జనాల మీదికి పదిలక్షల సైనిక, అర్ధసైనిక బలగాలను తరలించారు. నిషేధాజ్ఞలు విధించారు.@@
భారతీయ సైన్య ం…. 14 లక్షల మంది క్రియాశీల సైనికులు, 21 లక్షల రిజర్వ్ సైనికులు, 13 లక్షలమంది పారా మిలిటరీ.
వీరిలో మీరు చెప్పిన ప్రకారం 10 లక్షలమందిని కష్మీర్ లోయలో మొహరించారు. అంతేనంటారా?
గత డెబ్భై ఏళ్లుగా తెలుగునాట మీరెందుకు నిత్య నిరంతరంగా విఫలమవుతున్నారో కారణం బహుశా ఈ ప్రవచనం బట్టి తెలుసుకోవచ్చు.
రష్యా, చైనా భూతల స్వర్గాలు అంటే నమ్మిన ఆ కాలం కాదనుకుంటాను ఇది. సమాచారం అత్యంత వేగంగా బూటకాలను ఛేదించే యుగం ఇది.
మీకొక సూటి ప్రశ్న. దాదాపు 3 లక్షలమంది కష్మీరీ పండిట్లని బయటకి పంపారు కదా. గుడారాల్లోకి నెట్టారు కదా. గత 70 ఏళ్త్ల నుండి తెలుగు ప్రసార మాధ్యమాలని ఏలుతూ, తాము చెప్పినవే సత్యాలని, ఏకపక్ష సమాచారాన్ని తెలుగు ప్రజలకు ఆవహింపజేసిన వామ, అతివామ, మహావామ, సెక్యులర్, లిబరల్, మానవతావాద, అభ్యుదయ మేధావులు, రచయితలు, కవులు, నిజ నిర్ధారణ కార్యకర్తలు ఏనాడైనా ఆ గుడారాల దగ్గరకి వెళ్లి ఆ ఆర్తనాదాలని ఒక్క పదమైనా తెలుగు ప్రజలకి తెలియజేసారా? ఆ ఆర్తనాదాల గురించి ఒక పదం, వాక్యం, కవిత, వ్యాసం, కథ వ్రాసారా? దీనిని కదా రేసిజం,, దుర్మార్గం, జాతివిద్వేషం అనేది?….. https://www.rediff.com/news/column/india-has-700000-troops-in-kashmir-false/20180717.htm (దయచేసి OPDR సెక్రెటరీ ఆంధ్రజ్యతిలో వ్రాసినట్లుగా మిలిటరీ ట్రక్కులో తరలించారన్న బూటకాన్ని మళ్ల ీచెప్పకండి).
ఒకవేళ మీకు ఇంకా విశ్వాసం కలగాలంటే పండిట్ల ప్రతినిధులు మీకు సప్రమాణంగా నిరూపిస్తారు. సుశీల్ పండిట్, అశోక్ పండిట్ లాంటివారు ీమీకు తెలిసేవుంటారు. వారితో బహిరంగ చర్చని ఏర్పాటు చేయమని కోరితే అది నా పరిధికి మించిదయినా ప్రయత్నిస్తాను.
కాశ్మీరుపై చదివిన పుస్తకాల ఆధారంగా నాకు తెలిసిన చరిత్ర
1947 కి ముందు కాశ్మీరులో ప్రజానాయకుడు షేక్ అబ్దుల్లా, గాంధీ నెహ్రూలకు ఆమోదయోగ్యమైన నాయకుడు. గాంధీ నెహ్రూల వొత్తిడివల్లే కాశ్మీరు మహారాజా హరిసింగు షేకు అబ్దుల్లాని జైలునుండి విడుదల చేసాడు.
జిన్నా కు సంబంధించినంతవరకూ కాశ్మీరు ఒక ముస్లిం మెజారిటి ప్రాంతం, మహారాజా అభిప్రాయంతో తో గాని, షేక్ అబ్దుల్లా అభిప్రాయంతో గాని ప్రమేయం లేకుండా పాకిస్తానులో కలవవలసిన ప్రాంతం (ఒక దశలో అనేకమంది భారతనాయకులు కూడా అందుకు సిద్ధపడిపోయారు). 1947 ఆగస్టు పదిహేనుకి ముందు షేక్ అబ్దుల్లా, జిన్నాని కలిసి, తాను కాశ్మీరు ప్రజల నాయకుడి హోదాలో, మహారాజు స్వతంత్ర్య కాంక్షకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి పాకిస్తానులో కలపగలననీ, ప్రతిగా తనకు రాజకీయ ప్రాధాన్యత కోరితే, జిన్నా చాలా నిర్లక్ష్యంగా షేక్ అందుల్లాకి తనతో చర్చలు జరిపే స్తాయి లేదని చెప్పి, కాశ్మీరుని పాకిస్తానులో ఎలాకలుపుకోవాలో నాకు తెలుసు అన్నాడు.
అక్కడితో ఊరుకోకుండా జిన్నా మరో అడుగు ముందుకేసి మత ప్రాతిపదికన కొన్ని తిరుగుబాటు ముఠాలని రహస్యంగా ప్రోత్సహించి 1947 ఆగస్టు పదిహేణు నాటికే సిద్ధం చేసుకొని పరిస్థితి గమనిస్తున్నాడు.
స్వాతంత్ర్యం నాటికి మహారాజా తన స్వాతంత్ర్య కాంక్షను వ్యక్తం చేయటంతో కాశ్మీరుపై పెద్దగా ఆశ లేని భారత నాయకులు ఊరుకున్నారు. జిన్నా ఊరుకోలేదు. జిన్నా పంపిన కిరాతక మూకలు కాశ్మీర్లోకి వెళ్ళటం మిగిలినవి అందరికీ తెలిసినవే.
కాశ్మీరుని భారతభూబాగంలో విలీనం చెయ్యటం మహారాజా విలీన పత్రం తో పాటు ప్రజల ప్రతినిధి ఐన షేక్ అబ్దుల్లా అమోదం కూడా ఉంది. నిజానికి పాక్ ఆక్రమిత కాశ్మీరుని పక్కనపెట్టి మిగతా ప్రాంతం లో ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఉంటే అప్పటి ప్రజాభిప్రాయం తొంబై శాతానికి పైఆ భారతదేశంలో విలీనానికి లభించేది. ఏప్రాంతంలోనైనా వేర్పాటువాదం ఎగదొయ్యాలంటే ఐదు పదేళ్ళపని (ఖలిస్తాన్ ఉద్యమం ఊపందుకుందికి అంతే పట్టింది).
తరువాతి దశాబ్దాలన్నీ నెహ్రూ (ఇందిరా)-షేక్ అబ్దులాలకు రాజీ కీ విబేధాలకీ మద్య ఉయ్యాల ఊగుతూ, రాజీ రోజుల్లో షేక్ అబ్దుల్లా అధికారం అనుభవిస్తూ, విబేధాలరోజుల్లో షేక్ అబ్దుల్లా భారతప్రభుత్వాన్ని నిందిస్తూ ఉంటే, పాక్ ప్రేరిత వేర్పాటువాదులు కాశ్మీరు ప్రజలిని మిగతా భారత దేశంపై ద్వేషం నింపనిచ్చారు. వేర్పాటువాదులకీ పాకిస్తాన్ ప్రభుత్వానికీ కావలసినంత స్వేచ్చ ఇచ్చిన రాజ్యాంగ చట్టం గురించి వ్రే చెప్పనవసరం లేదు.
1980 నాటికి షేక్ అబ్దులాతో విబేధించిన ఇందిరాగాంధీ, షేక్ అబ్దుల్లాని కేవలం లోయలో ఉండే ముస్లిం నాయకుడు అని, జమ్మూలో హిందువులకు కాంగ్రెస్ మాత్రమే రక్షణ ఇవ్వగలదు అని ప్రచారం చేసింది (వినడానికి బీజేపీ ప్రచారంలా ఉందా?).
మళ్ళీ రాజీవ్-ఫరూక్అబ్దుల్లా ల మద్య రాజకీయ అవగాహన కుదిరినా లోయకీ, జమ్మూకీ మద్య, ఇందిరా షేక్అబ్దుల్లాలు 1980లో సృష్టించిన మత విబేధాలు అలాగే ఉండిపోయి, పాకిస్తాన్ పని సుళువుచేసాయి. లోయలో పాకిస్తానుకి మద్దతుదారుల బలం పెరిగిపోయింది, అది నాలుగులక్షలమంది హిందువుల గెంటివేత గా మారింది. లోయలో ప్రాణాలతో తిరగాలంటే ఆ ధారుణాన్ని మొసలికన్నీరుతో ఖండించటమే గానీ, పూర్తిగా ఖండించలేని పరిస్థితిలో అబ్దుల్లాలూ, ముఫ్తీలూ, గులాం నభీ అజాద్ లూ తదితరులు ఉండిపోయారు.
చివరగా ఒక ఉదాహరణ. మన ఇంట్లో దొంగ దూరాడు. పూజగదిలో దాక్కొని, గది అంతా ఏసిడ్ పోసేసాడు. దొంగని పట్టూకోవాలంటే పూజగదిలోకి వెళ్ళాలి, చెప్పులు లేకుండా వెళ్ళలి (అది మన ఇంటి నిబంధనే). కానీ అది పాటిస్తే, మన కాళ్ళు ఏసిడ్ లో కాలి, దొంగచేతిలో మనమే దెబ్బలు తింటాం. అందుకని చెప్పులు వేసుకొని ఆగదిలోకి కర్రపట్టుకొని వెళితే, పొరుగువాడు మనకి మన చెప్పులు నిబంధన గుర్తు చేస్తున్నాడంటే ఆదొంగని పంపినది ఖచ్చితంగా పొరుగువాడే.
మన నిబంధన మనకే ప్రతిబంధకంగా మారినప్పుడు, మననిబంధన వల్ల మన చెడు కోరే పొరుగువాడు లాభపడుతున్నప్పుడు ఆనిబంధన (తాత్కాలికంగానైనా) పక్కన పెట్టటక తప్పదు.
చరిత్ర

కాశ్మీర్ గురించి ఇంత దుంఖం ఎందుకు కలిగింది వేణు గారూ ? 23 నిమిషాలు పార్లమెంట్ తలుపులు వేసి ఆంధ్రప్రదేశ్ ని విభజించినపుడు ఈ సోది గుర్తుకురాలేదా ?
కన్నీళ్ళ ఆనకట్టల గేట్లు ఎప్పుడుపడితే అప్పుడు తెరుచుకోవు. It’s a result of strategic and controlled release, after careful observation.