నిగూఢ ధిక్కారం – చర్యాపదం

మనుషులను మనుషులుగా చూడాలి. ఉన్నత – తక్కువ బేధాలు ఉండవద్దు, కులం ఉండవద్దు అన్నందుకు ఇవి గొప్పవి.

ర్యాపదాలు. మహాయాన అనాత్మవాదపు తాత్విక పద్యాలు. బౌద్ధం బ్రాహ్మణవాద దాడికి గురి అయిన అనంతరం వచ్చిన నిగూఢ సాహిత్యం ఈ చర్యాపదాలు. ఇంతకీ చర్యా అంటే ఏమిటి? మహాయాన బౌద్ధులు తమ రహస్య పూజని చర్యా అన్నారు. ఆ రహస్య పూజలో రాగయుక్తంగా పాడుకునే ఈ పదాలను చర్యాపదాలు లేదా చర్యా గీతాలు అన్నారు. వీటిమీద నాగార్జునుడి ప్రభావం ఉంది. నాగార్జునుడి గురువు ఆశ్వఘోషుడి ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. ఆశ్వఘోషుడి ప్రభావం మరీ ఎక్కువ అనడానికి ప్రత్యేక కారణమున్నది. అశ్వఘోషుడు భౌద్ధాన్ని ప్రజలలో ప్రచారం చేసేందుకు తన కవిత్వాన్ని ఒక సాధనంగా చేసుకున్నాడు. అతడి కవిత్వంలో శాంతం, కరుణ, శృంగార రసాలు, భావాలంకరం ప్రధానంగా ఉన్నాయి అని తేల్చారు పరిశోధకులు. ఇందులోనూ కొన్ని కవితలు ‘నిగూఢ కామోద్దీపన’(ఈ మాట అనువాదకుడు ముకుంద రామారావుది) కవితల్లాగా అనిపిస్తాయి. అశ్వఘోషుడు అనుకున్నప్పుడు ఒకమాట చెప్పుకోవాలి. తొలి సంస్కృత నాటకం రాసింది బాసుడు అంటారు. కాదు ఆశ్వఘోషుడే అని పాశ్చాత్య పరిశోధకులు తేల్చారు. బాసుడు ఐదవ శతాబ్దానికి చెందివాడు అనే వాదన ఉన్నది. ఆశ్వఘోషుడి కాలం ఒకటో, రెండో శతాబ్దాలు. బాసుడి గురించి వినపడినంతగా సాహిత్యంలో ఆశ్వఘోషుడి గురించి వినపడదు. కారణం స్పష్టమే. అశ్వఘోషుడు బ్రాహ్మణుడే. కానీ, బౌద్ధుడు. బాసుడు అలా కాదు. బ్రాహ్మణ సాహిత్యాన్ని రాసినవాడు.. బాసుడి తర్వాత వచ్చిన కాళిదాసు కవిత్వానికీ ఆశ్వఘోషుడి కవిత్వానికీ దగ్గరి పోలికలు ఉంటాయి.

ఈ చర్యాపదాలు పదవ శతాబ్దపు కాలానివి అని చెప్పినా, అవి కేవలం పదవ శతాబ్దంలో రాసినవే కావు. వీళ్ళంతా ఎనిమిది నుండి పన్నెండవ శతాబ్దాల మధ్య జీవించిన వాళ్ళు అని వారు జీవించిన కాలాలను చూస్తే తెలుస్తుంది. అయితే ఇన్ని శతాబ్దాల మధ్యన ఈ మిస్టికల్ ప్రక్రియను నడిపింది ఏమై ఉంటుంది అనే ప్రశ్న తలెత్తక మానదు. ఈ కాలాన్ని కలిపిందీ, ఆ మిస్టికల్ ప్రక్రియను నడిపించేలా చేసిందీ బ్రాహ్మణ సామ్రాజ్యవాదం అనుకుంటాను. ఎనిమిదవ శతాబ్దంలో హిందూ మతం చేసిన ఊచకోతల వలన ఈ ప్రక్రియను వాళ్ళు ఎన్నుకొని ఉండవచ్చు. రాచరికంగా చూస్తే ఇవి పాల సామ్రాజ్యంలో రాసిన గీతాలు.

సాహిత్యం చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ చర్యాపదాలూ అంతే. ఇవి చదివితే ఆ కాలంలో ఉన్న పరిస్తితులు బోధపడతాయి. డోంబీ అనే అంటారని కన్య (ఈ పుస్తకంలో ఈ పదం ఈలాగే ఉంది గనుక పదాన్ని ఇలాగే వాడుతున్నాను) కోసం తపన పడుతుంటాడు కాన్హుపాద. డోంబీ కాన్హుపాదాలు చేసుకున్న పెండ్లి గురించి కాన్హుపాద ఒక చర్యా గీతాన్నీ రాసుకున్నాడు. అందులో అప్పుడున్న కట్న వ్యవస్థ గురించిన ప్రస్తావనా ఉంటుంది. భూసుకపాద కూడా అంటరాని మహిళనే పెళ్లి చేసుకున్నాడు. మరొక చర్యాగీతంలో స్త్రీ గర్భస్రావం చేసుకున్నా అని చెబుతుంది. స్త్రీ స్వేచ్చను ఈ గీతంలో మనం చూడొచ్చు. ఈ చర్యగీతాలన్నింటిలోనూ కింది కూలాల మహిళలు స్వేచ్చగా బతికినట్లు ఉంటుంది. కాటికాపరుల్లో వితంతు పునర్వివాహం ఉందని అంటాడు కాన్హుపాద. పదవ శతాబ్దం నాటికే వితంతు పునర్వివాహాలు ఉన్న నేలలో రాజ రామ్మోహన్ రాయ్ వాటికి ఆధ్యుడు అని చెప్పడం ఎంత చరిత్ర వక్రీకరణ.

సరహపాద బ్రాహ్మణుడు. అతడు పగలు బ్రాహ్మణ వృత్తిలోనూ, రాత్రి బౌద్ద జీవనంలోనూ గడిపేవాడు. ‘హిందూ సామ్రాజ్యవాద చరిత్ర’ రాసిన ధర్మతీర్థ కూడా బౌద్ధం మహాయానంగా మారినాక ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అంటాడు. ఈ చర్యాపదాలు రాసిన వారిలో లూయిపాద, శబరిపాద వీరిద్దరూ కింది కులాలకు చెందిన వారు. యాదృశ్చికంగా ఇద్దరూ చెరి రెండూగీతాలే రాశారు. లూయిపాద జాలరి అయితే, శబరిపాద సవర తెగకు చెందిన ఆదివాసి. లూయిపాద రాసినది చర్యాపదాలలో మొదటిదైతే, శబరపాద రాసినది చివరిది. లూయిపాద రాసినదాంట్లో లోతైన తాత్వికత ఉంటుంది. మొదటి గీతంలో ‘కేవలం ఐదు కొమ్మలున్న శ్రేష్టమైన చెట్టు ఈ దేహం’ అంటూ పంచేంద్రియాల గురించి చెబుతాడు లూయిపాద, అంతేకాదు, ధ్యానం వలన సుఖాలు, దుఃఖాలు ఏవీ దూరం కావు. ధ్యానం చేసినా మరణం తథ్యం అంటాడు. బుద్దుడికి బోధి చెట్టుకింద జ్ఞానోదయం అయింది అని మనం చదువుకున్నది. కానీ, ధ్యానం వాళ్ళ చిక్కి శల్యమైన బుద్ధుడు ధ్యానం వాళ్ళ జ్ఞానం రాదు అని తెలుసుకుంటాడు. ‘మర’అనే ఒక రుషితో వాదం గెలవడమే జ్ఞానోదయం అని ఎక్కడో చదివాను. (ఖమ్మం క్రాంతికార్ ప్రచురించే హేతువాదం మాసపత్రిక బుద్దుడి మీద ప్రచురించిన ప్రత్యేక సంచిక చూస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి. ప్రొఫెసర్ లక్ష్మినర్సు వేసిన పుస్తకాల్లోనూ దొరకవచ్చు). రెండో గీతంలో ‘అది భావమూ కాదు. అభావమూ కాదు. ఈ వివరణను ఎవరైనా ఎట్లా నమ్ముతారు’ అంటాడు. అంతేకాదు ‘రంగు రూపం ఆనవాలు లేనివాటిని ఆగమాలు వేదాలు ఎలా నిరుపించగలవు.’ అనీ ప్రశ్నిస్తాడు. లూయిపా లోతైన తాత్వికత కల్గిన బౌద్ధాన్ని తన గీతాల్లో రాస్తే, శబరపాద బతుకును రాస్తాడు. తాను రాసిన మొదటి గీతంలో శబర (సవర) బతుకు, ఆ తెగ ఆలూమగల ప్రేమనూ, ఆనుబందాన్ని రాస్తాడు. రెండో (చివరి) దాంట్లో దహన సంస్కారాల గురించి రాస్తాడు. అందులోనూ నిగూడంగా బౌద్ద తాత్వికతను చెప్తాడు.

ఈ పుస్తకంలో యాభై చర్యాపదాలే ఉన్నాయి. ఉన్నాయి అంటే అవే దొరికాయి. దాదాపు మూడు దశాబ్దాల కాలంలో కొన్ని వందల గీతాలు వాళ్ళు రాసి ఉండవచ్చు. బ్రాహ్మణా సామ్రాజ్యవాద దాడి నుండి తమనూ, బౌద్ద తత్వాన్ని మిస్టికల్ గా రాసి కాపాడుకున్నారు. పాల్ రాజుల అనంతరం హిందూ సేన్ రాజులు వచ్చాక ఆచార్యులు, సిద్దాచార్యులు నేపాల్, టిబెట్ వలసపోయారు. “ఏదైనా ఒక రాజవంశమో, రాజో బౌద్ద మతాన్ని ఆదరిస్తే, ఏదో ఒక దండయాత్రో, తిరుగుబాటో జరిగేది. రాజును తొలగించి బ్రాహ్మణులకు అనుకూలంగా ఉండే కొత్త రాజవంశం సింహాసనాన్ని అధిష్టించేది.” అంటాడు ధర్మతీర్థ తన రచన హిందూ సామ్రాజ్యవాద చరిత్రలో. అట్లా బౌద్ధాన్ని ఆదరించే రాజులు, రాజవంశాలు లేకపోయేసరికి బౌద్ధం దాడికి గురి అయి ఈ నేలనుండి తరిమేయబడింది. బృహదత్తుడిని చంపిన పుష్యమిత్ర శుంగుడి నుండి నలందను కాల్చిన భక్తియార్ ఖిల్జీ దాకా కొనసాగింది. భక్తియార్ ఖిల్జీ నలందను కాల్చినప్పుడు పోయిన వాటిలో ఇవీ ఉండవచ్చు. ఆది శంకరాచార్యుడు జరిపిన యాత్ర నెత్తుటిసాలల్లో ఇవీ దహనమో, ఖననమో అయి ఉండవచ్చు. ఇంకా మౌఖికంగా పోగొట్టుకున్న సాహిత్యానికైతే లెక్కే లేదు.

ఈ చర్యాగీతాలు ఒరిస్సా, బెంగాలీ, అస్సామీలో వచ్చిన సాహిత్యంపై, ముఖ్యంగా బెంగాలి బౌల్స్ పై వీటి ప్రభావం ఎక్కువగా ఉంది అంటాడు అనువాదకుడు ముకుంద రామారావు. అయితే బౌద్ధం నిలదొక్కుకోకపోవడానికిఆదిశంకరాచార్యులు చేసిన హిందూ ధర్మ ప్రచారవ్యాప్తి కూడా కారణం అనే మాటను వ్యతిరేకిస్తాను. ఆదిశంకరాచార్యులు చేసిన ధర్మ ప్రచారవ్యాప్తి అద్వానీ రథయాత్ర వంటిది. ఆదిశంకరాచార్యుడు బౌద్దుల నెత్తురు పారిస్తే, అద్వానీ ముస్లింల నెత్తురు పారించాడు. తుర్కుల దండయాత్రలకు పూర్వమే, బ్రాహ్మణ సామ్రాజ్యవాదం దాడికి దాదాపు అంతరించే దశకు వచ్చింది. ఆ తరువాత అది ఎట్లా బ్రాహ్మణీకరణకు గురి అయింది అనేది ధర్మతీర్థ రాశాడు. మహాయాన బౌద్ధం బ్రాహ్మణీకరించబడిన బౌద్డమే అయినా అందులో లూయిపాద, శబరిపాద లాంటి అట్టడుగు కులాల మనుషులు నిగూడంగా నైనా ఆది బౌద్ధాన్ని నిలబెట్టారు. అయితే మిగిలిన వాళ్ళూ, పగలు బ్రాహ్మణ వృత్తిలోనూ, రాత్రి బౌద్ద జీవనంలోనూ గడిపే సరహపాద లాంటి వాళ్ళూ మనుషులంతా సమానంగా ఉండాలనీ, ఉన్నత, నిమ్న వర్గ బేధాలు ఉండకూడదని రాశారు.

ఈ చర్యపదాల్లో గురు శిష్య పరంపర, ప్రతీది గురువు దగ్గరి నుండే నేర్చుకోవాలి, గురువునడిగి ధ్రువ పరచుకోవాలి అనేవి ‘నేను చెప్పాననో, గురువు చెప్పాడానోగాకుండా తర్కంతో అలోచించి నమ్మండి’ అని చెప్పిన బుద్దుడి తాత్విక బోధనలకు వ్యతిరేకం. మనుషులను మనుషులుగా చూడాలి. ఉన్నత – తక్కువ బేధాలు ఉండవద్దు, కులం ఉండవద్దు అన్నందుకు ఇవి గొప్పవి. బౌల్స్ లాంటి గొప్ప గీతాలకు, ఇప్పుడు సినిపరిశ్రమ కాపీ కొట్టి బతుకుతున్న అస్సామీ జానపదాలకు మూలమైనందుకు ఇవి గొప్పవి. వీటిని వెలికి తీసిన హరప్రసాదశాస్త్రికీ, తెలుగులో అనువాదం చేసిన ముకుంద రామారావుకు అభినందనలు. నాతో వెంటపడి మరీ రాయించిన మోహన్ ప్రేమకు నెనరు

(ఛాయ నిర్వహించిన చర్యాపదాలు పుస్తక పరిచయసభలో చేసిన ప్రసంగపాఠాన్ని కాస్త మెరుగుపరచి రాసిన వ్యాసం.)

అరుణాంక్ లత

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నాకు ఈ తరం కుర్రాళ్ళ మీద ముఖ్యంగా ఒకప్పుడు పేరు చెప్పుకోడానికి కూడా భయపడ్డ సమూహాల నుంచి వచ్చిన కుర్రాళ్ళ మీద అపారమైన నమ్మకం. ఇదిగో అరుణ్ లాంటి వాళ్ళు ఆ నమ్మకానికి ఆయువు పట్టు.

  • నేటి పుస్తక సమీక్షల పరిధిని దాటి నాలుగడుగులు ముందుకి నడిచిన విశ్లేషణాత్మక వ్యాసం. అభినందనలు, అరుణాంక్!!

  • There can be no doubt that the fall of Buddhism in India was due to the invasions of the Musalmans. Islam came out as the enemy of the ‘But’. The word ‘But’ as everybody knows, is the Arabic word and means an idol. Thus the origin of the word indicates that in the Moslem mind idol worship had come to be identified with the Religion of the Buddha. To the Muslims, they were one and the same thing. The mission to break the idols thus became the mission to destroy Buddhism. Islam destroyed Buddhism not only in India but wherever it went. Before Islam came into being Buddhism was the religion of Bactria, Parthia, Afghanistan, Gandhar, and Chinese Turkestan, as it was of the whole of Asia. In all these countries Islam destroyed Buddhism.
    B. R. Ambedkar, “The decline and fall of Buddhism,” Dr. Babasaheb Ambedkar: Writings and Speeches, Vol. III, Government of Maharashtra. 1987, p. 229-30
    The Mussalman invaders sacked the Buddhist universities of Nalanda, Vikramshila, Jagaddala, Odantapuri to name only a few. They razed to the ground Buddhist monasteries with which the country was studded. The monks fled away in thousands to Nepal, Tibet and other places outside India. A very large number were killed outright by the Muslim commanders. How the Buddhist priesthood perished by the sword of the Muslim invaders has been recorded by the Muslim historians themselves. Summarizing the evidence relating to the slaughter of the Buddhist Monks perpetrated by the Musalman General in the course of his invasion of Bihar in 1197 AD, Mr. Vincent Smith says, “The Musalman General, who had already made his name a terror by repeated plundering expeditions in Bihar, seized the capital by a daring stroke… Great quantities of plunder were obtained, and the slaughter of the ‘shaven headed Brahmans’, that is to say the Buddhist monks, was so thoroughly completed, that when the victor sought for someone capable of explaining the contents of the books in the libraries of the monasteries, not a living man could be found who was able to read them. ‘It was discovered,’ we are told, ‘that the whole of that fortress and city was a college, and in the Hindi tongue they call a college Bihar.’ “Such was the slaughter of the Buddhist priesthood perpetrated by the Islamic invaders. The axe was struck at the very root. For by killing the Buddhist priesthood, Islam killed Buddhism. This was the greatest disaster that befell the religion of the Buddha in India….
    B. R. Ambedkar, “The decline and fall of Buddhism,” Dr. Babasaheb Ambedkar: Writings and Speeches, Vol. III, Government of Maharashtra. 1987, p. 232-233 with quote from Vincent Smith
    Religion like any other ideology can be attained only by propaganda. If propaganda fails, religion must disappear. The priestly class, however detestable it may be, is necessary to the sustenance of religion. For it is by its propaganda that religion is kept up. Without the priestly class religion must disappear. The sword of Islam fell heavily upon the priestly class. It perished or it fled outside India. Nobody remained to keep the flame of Buddhism burning. It may be said that the same thing must have happened to the Brahmanical priesthood. It is possible, though not to the same extent. But there is this difference between the constitution of the two religions and the difference is so great that it contains the whole reason why Brahmanism survived the attack of Islam and why Buddhism did not. This difference relates to the constitution of the clergy. The Brahmin priesthood has a most elaborate organization. Every Brahmin is a potential priest of Brahmanism and be drafted in service when the need be. There is nothing to stop the rake’s life and progress. This is not possible in Buddhism. A person must be ordained in accordance with established rites by priests already ordained, before he can act as a priest. After the massacre of the Buddhist priests, ordination became impossible so that the priesthood almost ceased to exist. Some attempt was made to fill the depleted ranks of the Buddhist priests. New recruits for the priesthood had to be drawn from all available sources. They certainly were not the best.
    B. R. Ambedkar, “The decline and fall of Buddhism,” Dr. Babasaheb Ambedkar: Writings and Speeches, Vol. III, Government of Maharashtra. 1987, p. 233-235

  • బౌద్ధులు రాసుకున్న బూతులకి కూడా హిందువులే కారణమా!

    అసలు బుద్ధుడు
    తొలిదశలోనూ మలిదశలోనూ శుశ్రూష చేసినది ఎవరి దగ్గిర?హిందూ గురువుల దగ్గిరే కదా!బుద్ధుడి మూల చింతనలో వైదిక ధర్మంతో విభేదించినది యెక్కడ? “అహింసా ప్రధమో పుష్పః” అన్నది బుద్ధుడి కన్న ముందే ఉన్నది కద!

    వైద్యంలో సాధారణ వైద్యుడు హృద్రోగానికి వైద్యం చెయ్యలేనట్టు బుద్ధుదు అప్పటి సమాజానికి అహింసని ప్రత్యేక పరిష్కారం చేశాడు.అప్పటి రోగం నిదానం కాగానే బౌద్ధం యొక్క ప్రాధాన్యత కూడా తగ్గిపోయింది. ఇక్కడి నుంచి ఇతర ద్సెశాల్స్కు వెల్లిన బౌద్ధ మత ప్రచారకులు చెప్పినది మన దేశంలోని బౌద్ధానికి భిన్నమైనదని సాపేక్ష పరిశీలన చేస్తే మీకే తెలుస్తుంది!

    బౌద్ధమతాన్ని అణిచెయ్యాల్సిన అవసరం హిందువులకి ఏమిటి?బుద్ధుడి మహాపరినిర్వాణం తర్వాత అశోకుడు ప్రోత్సహించే వర్కు మూడు వందల సంవత్సరాల కాలం సుప్తావస్థలోనే ఉంది.హిందూమతంతో సహా దాదాపు ప్రపంచంలోని అన్ని మతాలూ రాజాశ్రయం కోసం తహతహలాడినవే!బౌద్ధమూ అందుకు మినహాయింపు కాదు. నిజానికి బౌద్ధారామాల అధిపతులు రాజులకి అప్పులు ఇచ్చి వాళ్ళ ముక్కు పిండి వసూలు చేసుకున్న సందర్భాలు చరిత్రలో రికార్డ్ అయి ఉన్నాయి. అదేదో అమాయకమైన మతం అయినట్టూ రంగులు పులమకండి.

    వాళ్ళలో వాళ్ళు హీనయానం,మయాయానం,వజ్రయానం లాంటి శాఖలుగా చీలి కొట్టుకు చచ్చిన చరిత్ర నాకు తెలుసు – లోకంలోని ప్రతి మంచికీ హైందవేతర మతాలు కారణం అనీ లోకంలోని ప్రతి చెడుకీ హిందూమతం కారణం అనీ పులిమెయ్యటం తగ్గించండి.

    బౌద్ధంలోని వజ్రయానపు బూతుల్నీ కనీసపు ఉనికిని కూడా తిరస్కరించి ప్రభాకరన్ అనే పులి పుట్టుకకి కారణమైన నేటి సింహళం లోని బౌద్ధుల జాత్యహంకారాన్నీ ఒప్పుకునే నిజాయితీ చూపించండి!

    • హిందూ అనే పదం విస్తృతార్థంలో వాడినా అప్పటికి ఉన్నది బ్రాహ్మణ మతమే. దాదాపు 16వ శతాబ్దం దాకా హిందూ అనే పదమే లేదు. బౌద్ధాన్ని హీనయాన, మహాయాన శాఖలుగా చీల్చిందే బ్రాహ్మణులు. విగ్రహారాధన లేని బౌద్ధంలో బుద్ధుడి విగ్రహం రావడానికి అదే కారణం. ఇక హిందుమత (నాటి బ్రాహ్మణ మత) ఉన్మాదం గురించి, ఎట్లా బౌద్ధరామాలను కూల్చి శైవ, వైష్ణవ దేవాలయాలు వచ్చినవీ అనే విషయాలు చరిత్ర గ్రంథస్థం చేసింది. బృహదత్తుడ్ని చంపిన పుష్య మిత్ర శుంగుడు బౌద్ధుడి తలకు వేయి వరహాలు ఇస్తా అని ప్రకటించాడు.

      బౌద్ధం పుట్టుకే వైదిక చింతనను ఖండిస్తూ వచ్చింది. బుద్ధుడి అనంతరమే యాగాల్లో క్రతువుల్లో జరిగే గో వధ తో పాటు, వందల రకాల జంతువుల వధ ఆగిపోయింది.

      మహా, వజ్రా, తంత్రయానాలను నేను వ్యతిరేకిస్తా, బుద్ధుడి కాలంలో ఉన్న మతంతో కూడా కొన్ని విషయాల్లో నాకు పేచీ ఉంది. ఆ విషయాలు వివిధ సందర్భాల్లో వేదికల మీద మాట్లాడాను, రాశాను . అన్నీ ఇక్కడే రాసి నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. భగ్వద్గీతలోనూ బౌద్ధం నుండి ఎత్తుకొచ్చిన విషయాలు ఉన్నాయని రాశాడు డీడీ కోసాంబి. ఒక్క సింహళ బౌద్ధ ఉన్మాదమే కాదు, మయన్మార్ బౌద్ధుల ఉన్మాదాన్నీ ఖండిచా.

      • how Hindus are responsible for the decay of Buddhism?Do you tell me that brahmins made buddhist schism of all those hinayaaba, mahaayaana and vajrayaannä sects?Then why Buddhist followers accepted them? Is it ignorance of Buddhist followers to follow vedic dharma upon which you claim buddhism revolted?

        As every historian and intellectual is trumpets that inherant ideological fallasies were the root cause of decay in hinduism, why you cannot apply the same to the decay of buddhism?

        Why this double standards are coming I knew perfectly! Who you mentioned as historians were buddhists and they coloured the history like that – Hindu kings killed buddhism to cover up Internal decay of Buddhist ideology.

        You are applying internal decay for Hinduism and external termination for the decay buddhism – is it be called as impartial approach towards history?

      • ఒక తమాషా విషయం చెబుతాను. తార్కికంగా ఆలోచించమని ఇతర్లకి చెప్పే బౌద్ధులు బుద్ధుడి గురించి తర్కానికి నిలవని అబద్ధాలు ఎందుకు చెప్పారో మీరు నాకు చెప్పాలి, ఓకేనా?

        గౌతముడు ఒక హంసను తన బంధువు బాణంతో కొడితే తను వైద్యం చేసి బతికించడమూ అది పెద్ద వివాదం అయ్యి రాజసభలో వాదోపవాదాలకి కారణం కావడమూ వాదనలో బుద్ధుడే గెలవడమూ అనేది నిజంగా జరిగిన సన్నివేశం అని నాకు అనిపించడం లేదు.

        ఎందుకంటే, బుద్ధుడు సర్వం త్యజించి సన్న్యాసం స్వీకరించి సత్యాన్వేషణకు బయలుదేరడం అనేది ఒకే రోజున కొన్ని ఘడియల/నిముషాల వ్యవధిలో అతడు చూసిన మూడు/నాలుగు దృశ్యాల వల్ల కలిగిన అలజడి వల్ల అని చెప్పే మరొక ముఖ్యమైన సన్నివేశం దీనిని ఖండిస్తున్నది.

        మొదట ఈ రెండు కధలూ మీరు ఆరోపిస్తున్న బ్రాహ్మణులు బుద్ధిజాన్ని చెడగొట్టిన తర్వాత కాలంలో రాసిన కధలా దానికి ముందుగానే రాసినవా అనేది సాక్ష్యాధారాలతో తేల్చి చెప్పండి.

        ఇక ఈ రెండు కధల్లోని వైరుద్ధ్యం ఏమిటో తెలుసా! హంస తనకే చెందుతుందని వాదించటంలో అంత గొప్ప స్థాయి పాండిత్యం ప్రదర్శించగలిగిన వాడు వార్ధక్యం ఎలా ఉంటుందో తండ్రి ముఖంలోని ముడతల్ని చూసి తెలుసుకోలేడా,మరణం అంటే ఏమిటో తాత బతికి లేకపోవటాన్ని చూసి తెలుసుకోలేడా?

        తెల్ల యేనుగు తల్లి కల్లోకి వస్తే బుద్ధుడు పుట్టడం లాంటి అతిశయోక్తులూ తమ మతానికి మూలపురుషుడు కాబట్టి అతన్ని హీరోని చెయ్యటానికి రాసుకున్న పసలేని పిట్టకధలూ – హిందూ పురాణకధల కన్న ఏమి వైవిధ్యం ఉంది!బౌద్ధులు చెప్పే ఇలాంటి కధల్లో కబుర్లలో ఎంత తార్కికత ఉంది?

        హిందూమతం బలంగా ఉన్నచోట హిందూమతానికి భిన్నంగా ఉన్నప్పుడు కొంత ఆకర్షణను కలిగి ఉండి సంచలనం పుట్టించి ఆదరణను తెచ్చుకుని, హిందూమతాన్ని కాపీ కొట్టడం మొదలయ్యాక ఆకర్షణ కోల్పోయి అంతరించి పోయింది – ఇంత సూటి నిజాన్ని ఒప్పుకోలేక అయినదానికీ కానిదానికీ హిందువుల మీద పడి ఏడవటం దేనికి?

  • పుష్యమిత్ర శుంగుడు అధారాలు లేకపోయినా దోషిగా తేల్చబడ్డాడు.
    After Ashoka’s lavish sponsorship of Buddhism, it is perfectly possible that Buddhist institutions fell on slightly harder times under the Sungas, but persecution is quite another matter. The famous historian of Buddhism Etienne Lamotte has observed: “To judge from the documents, Pushyamitra must be acquitted through lack of proof.”…The only reason to sustain the suspicion against Pushyamitra, once it has been levelled, is that “where there is smoke, there must be fire” – but that piece of received wisdom is presupposed in every act of slander as well.

    E. Lamotte: History of Indian Buddhism, Institut Orientaliste, Louvain-la-Neuve 1988 (1958), quoted in Elst, K. (2002). Who is a Hindu?: Hindu revivalist views of Animism, Buddhism, Sikhism, and other offshoots of
    Hinduism.

    Interestingly, she [Romila Thapar] has refrained from mentioning the persecution of Buddhists by Pushyamitra Shunga… and the melting of idols by king Harsha of Kashmir, which had so far figured most prominently in the writings of her school. I wonder whether she has realized that those allegations have no legs to stand upon, even though others of her school continue to harp on them.
    Sita Ram Goel, Hindu Temples – What Happened to Them?, Appendix IV

    https://en.wikiquote.org/wiki/Pushyamitra_Shunga

  • బౌద్ధం హీనయాన, మహాయాన శాఖలుగా చీల్చిందే బ్రాహ్మణులు అనడం కూడా ఆధార రహితం…

    ఎలా జరిగిందీ అన్నది భిక్కు సుజాతో తన Sects and Sectarinasm లో వ్రాసరు… file:///C:/Users/Sreenivas.Lenovo-PC/Downloads/Sects__Sectarianism_Bhikkhu_Sujato.pdf

  • బౌద్ధం గురించిన ఓ నాలుగు చారిత్రక అసత్యాలు…

    1) అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించిన తరువాత అహింసా మార్గాన్ని చేపట్టి మొదటి, చివరి లౌకిక ప్రభువుగా మారాడు.

    2) పుష్యమిత్రుడు హిందూ ఉన్మాది, బౌద్ధులను ఊచకోత కోసాడు.

    3) హిందూరాజులు ప్రణాళికాబద్ధంగా బౌద్ధాన్ని నిర్మూలించారు.

    4) ఆదిశంకరాచార్యుడు రాజులను ఉసిగొల్పి బౌద్ధాన్ని, బౌద్ధులను ఊచకోత కోయించి, దేశంలోనే లేకుండా చేసాడు.

    వీటిని ఖండిస్తూ ఇక్కడొక వివరణ వుంది.

    https://www.quora.com/How-true-was-that-Pushyamitra-Shunga-persecuted-Buddhists-on-a-large-scale

  • బౌద్ధాన్ని నిర్మూలించటానికి ప్రయత్నించిన వారిలో శంకరాచార్యుడినీ, భక్తియార్ ఖిల్జీనీ సమ వేదికపై పెట్టడమే గొప్ప విశా…ల దృక్పదం.
    కమ్యూనిస్టు మార్కు సెక్యులరిజం. (I don’t know anything about writer’s ideology, and I don’t bother about it)

    భక్తియార్ ఖిల్జీ సైన్యంతో జరిపిన నలందా విద్వంసాన్ని పర్షియన్ రచయితలు సగర్వంగా రాసుకున్నారు. చరిత్రకారులూ అందులో జరిగిన హింసకి సంబంధించిన గణాంకాలు దృవీకరించారు.

    మరి శంకరాచార్యుడు ఏసైన్యంతో ఏ బౌద్ధ గురుకులం మీద దాడిచేసి ఎంతమంది బౌద్ధ అచార్యులను చంపించాడో, ఎన్ని గ్రంధాలు కాల్పించాడో చారిత్రక ఆధారాలు ఉన్న వర్ణనలు ఇస్తే తెలుసుకోవాలని ఉంది.

    శంకరాచార్యుడిని పదో శతాబ్దానికి పరిమితం చేసినా ఆతరువాత రెండువందల ఏళ్ళకు గాని గాని నలందా విద్వంసం జరగలేదు. అంటే శంకరాచార్యుడి బౌద్ధ వ్యతిరేక చర్యల తర్వాత కూడా నలందా మనగలిగింది. మరికొంతమంది నమ్మకాలప్రకారం శంకరాచార్యుడి తర్వాత వెయ్యేళ్ళకి గాని భక్తియార్ ఖిల్జీ రాలేదు (ఈ వెయ్యేళ్ళ అంతరం నమ్మితే శంకరాచార్యుడి బౌద్ధ వ్యతిరేక ఫలితం ఇంకా తగ్గిపోతుంది).

    ఎలా చూసినా శంకరాచార్యుడివల్ల బౌద్ధం సైద్ధాంతిక దాడికి మాతమే లోను అవగలదు.
    32 రెండేళ్ళు మాత్రమే బ్రతికిన వ్యక్తి, కేరళాలో పుట్టీ కాశ్మీరువరకూ కాలినడకన తిరిగిన వ్యక్తి, పదహారో ఏటనుండీ బోధనలు మొదలుబెట్టినా, దగ్గరుండి ఎంతPhysical విద్వంసాన్ని అమలు పరచగలడు?

    బహుశః శంకరాచార్యుడి అనంతరం ఈసిద్ధాంతాల మోజులో పడ్డ శంకరాచార్యుడి అనుచరులూ వాతిని వ్యతిరేకించే బౌద్ధులూ వీధి పోరాటాలకు దిగటం వల్ల బౌద్ధానికి జరిగిన నహ్టానికీ, భారీ సైన్యంతో జరిపిన నలందా విద్వంసానికీ ఎక్కడ పోలిక.

    అబ్బే, శంకరాచార్యుడి శిష్యులు పాల్పడిన హింసని కూడా శంకరాచార్యుడి ఖాతాలోనే వేదామంటారా? అలా ఐతే అమెరికాలో రెడి ఇండియన్లని జంతువులని వేటాడినట్టు వేటాడిన వారి హింసని కూడా వారు నమ్మే విశ్వాసాన్ని స్తాపించేవారి ఖతాలో వెయ్యొచ్చా? పోనీ అమెరికాలో జరిగినది మతహింసకాదు ఆదిపత్య సామ్రాజ్యవాద హింస అందామంటే, అసలు భక్తియార్ ఖిల్జీ జరిపిన నలందా ఊచకోతను కూడా అతడి ఖాతాలో ఎలా వేస్తాం. అతడి విశ్వాసానికి ఆద్యుడి ఖాతాలో కదా వెయ్యవలసింది?

    చివరగా,

    “శంకరాచార్యుడీనీ భక్తియార్ ఖిల్జీనీ నేనెక్కడ సమవేదికపై నిలబెట్టాను?” అను రచయిత ప్రశ్నించటం, అలా ఒకే గాటన కట్టలేదని నిరూపించుకోవటం చాలా తేలిక.

    కానీ ఈ వ్యాసంలో ఆ ఉద్దేశ్యం ఖచ్చితంగా ఉంది.

    • http://bapumraut.blogspot.com/2013/02/how-adi-shankara-destroyed-buddhism-and.html?m=1

      During the Gupta dynasty (4th to 6th century), Mahayana Buddhism turned more ritualistic, while Buddhist ideas were adopted into Hindu schools. The differences between Buddhism and Hinduism blurred, and Vaishnavism, Shaivism and other Hindu traditions became increasingly popular, while Brahmins developed a new relationship with the state. (Randall Collins, The Sociology of Philosophies: A Global Theory of Intellectual Change. Harvard University Press, 2000, page 207-211.)

      At Nagarjunakonda, the Adi Sankara played a demon’s role in destroying the Buddhist statues and monuments. Longhurst who conducted excavations at Nagarjunakonda has recorded this in his book Memoirs of the Archaeological Survey of India No: 54, The Buddhist Antiquities of Nagarjunakonda (Delhi, 1938, p.6.).

      In Kerala, Sankaracharya and his close associate Kumarila Bhatta, an avowed enemy of Buddhism, organized a religious crusade against the Buddhists. We get a vivid description of the pleasure of Sankaracharya on seeing the people of non-Brahmanic faith being burnt to death from the book Sankara Digvijaya.
      And more you can get here
      http://velivada.com/2017/10/31/hindu-violence-buddhism-india-no-parallel/

  • **In Kerala, Sankaracharya and his close associate Kumarila Bhatta, an avowed enemy of Buddhism, organized a religious crusade against the Buddhists. We get a vivid description of the pleasure of Sankaracharya on seeing the people of non-Brahmanic faith being burnt to death from the book Sankara Digvijaya.**
    ఇంతకన్నా అసంబద్ధమైన వ్యాఖ్య ఇంకొకటి వుండదు. కుమారిల భట్టు శంకరుడి కంటే ముందువాడు, శంకరుడు అతడిని కేవలం ఒక్కసారే చితిమీద వుండగా కలుసుకున్నాడు. కుమారిల భట్టు బౌద్ధులని తార్కిక వాదనలో ఓడించాడని బౌద్ధులే వ్రాసుకున్నారు. అతడి రచనలు తాత్త్వికంగా బౌద్ధం క్షీణించడానికి కారణమయ్యారని చరిత్రకారుల పరిశీలన.
    https://en.wikipedia.org/wiki/Kum%C4%81rila_Bha%E1%B9%AD%E1%B9%ADa

    శంకరుడు బౌద్ధులని, బ్రాహ్మణ విశ్వాసేతరులని సజీవ దహనం చేసిన విషయం శంకర విజయం పుస్తకంలో ఎక్కడుందో ఆధారాలు చూపించకుండా ఉత్తి రెటోరిక్ దొర్లిస్తే ఏ ప్రయోజనమూ లేదు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు