మనుష్యులందు నీ కధ… మహర్షిలాగ సాగదా…!

ఓ లక్ష్యంతో ముందుకెళ్ళేవాడు చీకటిని చిన్నపిల్లాడిని చేసి ఆడుకుంటాడు.

 ఓ పాటలో అల్లసాని వారి పద్యాన్ని అల్లాడు,ఓ పాటలో ఆరడుగుల బుల్లెట్టును పేల్చాడు,ఇంకో పాటలో మెల్లగా తెల్లారిందోయలా అని పల్లెను వదిలిన
మనుషులకు కనువిప్పును కలిగిస్తాడు.అతనే పాటల రచయిత,ఈనాటి మనం తీసుకున్న పాట”ఇదే కదా ఇదే కదా నీ కథ” రచయిత శ్రీమణి.అసలు పేరు పాగోల్ గిరీష్.శ్రీ అనేది అతనికి ఇష్టమైన పదం,మణి అనేది అమ్మపేరులో సగం.ఈ రెంటిని కలుపుకొని శ్రీమణిగా అవతరించాడి రచయిత.తల్లిదండ్రులు వెంకటాచలం,నాగమణి.ఈయన స్వస్థలం ప్రకాశం జిల్లా చీరాల. చిన్నతనం నుండే పాటల రచయిత కావాలనే కోరిక.అమ్మ,నాన్నలు తొందరగానే కాలం చేయటంతో
అమ్మమ్మ,తాతయ్యల దగ్గర పెరిగాడు.డిగ్రీ మొదటి సంవత్సరం కాగానే సినీపాటల రచయిత కావాలని సిటీ బాట పట్టాడు.మొదటగా ట్రాన్స్ ఫొర్ట్ లో గుమస్తాగా, కొద్దిరోజులు పిజ్జా డెలివరీ బాయ్ గా ఆ తర్వాత ఘోష్ట్ రైటర్ గా పనిచేశాడు.అలా పని చేస్తూనే వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకొని 100%లవ్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు.కళను ఎంత దాచిపెట్టినా,సంకెళ్ళతో బంధించి కట్టినా ఆగదనే ఉదాహరణ ఈయన జీవితానికి సరిపోతుంది.ఇంతలా పాటల్లో జీవితాన్ని దర్శింపజేసే గుణం అనుభవైక విద్యనే కావచ్చు.
ఓ కథగా మనిషి మారడమంటే అదో తపస్సు.వాస్తవానికి కథలన్ని మంచి ముగింపును కోరుకుంటాయి.ఇక్కడ రచయిత చెప్పేది ముగింపులేని మనిషి కథ.మనిషి మారడం సహజమే.మారిన మనిషి గురించి చర్చిస్తాము.మారని మనిషి గురించి చర్చిస్తాము.ఒకటి అధమం.మరొకటి ఉన్నతం.అంతే తేడా.ఇక్కడ రచయిత మనిషిని పాటలో మహర్షితో పోల్చాడు .మహర్షి అనే పదానికి  అన్ని తెలిసినవాడు,ఏకాగ్రత కలవాడు ఇలా కొన్ని అర్థాలను మనము గ్రహించవచ్చు.ఇప్పటి మనిషి తపస్సు చేస్తేనో ,క్షవరాలు పెంచుకుంటేనో మహర్షి కాలేడు.మనుష్యులలో జీవిస్తూ ఉన్నతమైన ఆలోచనలతో నలుగురికి సహాయపడే మనస్తత్వం కలవాడిగా ఉంటే సరిపోతుందన్న భావన పాటలో
తేటతెల్లమవుతుంది.
ఇదో ప్రేరణా గీతం.కొంత మనిషిని,మనసును తనవైపుకు లాక్కెళ్తుంది.నువ్వు ఓ మహర్షిలా మారిపో అన్నంతలా నీలో అనుభూతిని కలిగిస్తుంది.ఏదో రింగ్ టోనో ,కాలర్ ట్యూన్ వరకే ఈ పాటను పరిమితం చేయకుండా ప్రతి ఒక్కరు హార్ట్ బీట్ గా మార్చుకోవాలి.
ఈ పాటలో రచయిత హృదయస్పందన చాలా బలంగా కన్పిస్తుంది.
వ్యవస్థను బాగు పరచాలంటే ఏ ఒక్కడి వల్ల కాదు.ఎటు చూసినా అనంతం,శూన్యం.సముద్రమంతా విషాదమున్నచోట ఒక నీటిబిందువైనా మన పక్షం ఉంటే బాగుండు అనిపిస్తుంది.ఇక్కడ రచయిత కూడా అదే కోరుకుంటాడు.వ్యక్తికి శారీరక పరిణామం దృష్ట్యా వయసు పెరుగుతుంది.ఏ వ్యక్తికైనా మరణం తథ్యం.కానీ చేసే మంచి పని ఏదైతో ఉందో అది మనిషిని సజీవంగా కొన్ని కాలాలు నిలబెడుతుంది.రచయిత రాసిన “ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ళ ఆయువుందిగా” అనే వాక్యాల్లో ఎన్నో భావాలు స్ఫురిస్తాయి.పేరు,ప్రఖ్యాతుల కోసం దానం,ధర్మాలు చేసే వాడు హృదయం వెలుపల నిలుచుంటాడు.
పనినే,సేవనే దైవంగా భావించేవాడు హృదయమంతటా నిండిపోతాడు.చేసే పనిలో ఆనందాన్ని వెతుక్కునే వాడు ఓ చోటనే ఆగిపోడు.భూమండలాన్నంతా చాప చుట్టేస్తాడు.ఆ ప్రయత్నంలో అవనినంతా వెతుకుతూ సాగమని రచయిత రాసిన వాక్యాలు సుబోధకమైనవి.
ఒకదారిలో నడవటం ఎంతో కష్టం.వెతుక్కున్న దారినుంచి పక్కకు తప్పుకోకుండా ముందుకెళ్ళటమే లక్ష్యం.దారి పొడుగూతా పూలే ఉండకపోవచ్చు.ఎన్నో అవాంతరాలుండొచ్చు.సినారే గారు చెప్పినట్టుగా
“జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది “అనే విషయాన్ని మనసులో పెట్టుకొని మసలుకోవాలి.
నీకోసం ఓ దారినేర్పర్చుకొని ప్రయాణం చేయటం స్వార్థం.పదిమందికి ఉపయోగపడేలా దారిని నిర్మించటం నిస్వార్థం.వ్యక్తి వేసే ప్రతి అడుగు అతని పథాన్ని చెబుతుంది.కొన్ని సందర్భాలు మంచి జరుగొచ్చు.చెడు జరుగొచ్చు.ఇలాంటి పరిస్థితుల్లో మంచి అనేది సామూహికంగా జరుగుతుంది.చెడు మాత్రం వైయుక్తికమే.అన్నింటిని త్యజించిన వాడే ఆ మార్గాన్ని ఎన్నుకోగలుగుతాడు.నిస్వార్థమనేది మనిషిని మనిషిగా ఋజువు చేస్తుందన్న రచయిత వాక్య ప్రతిపాదన గొప్పగా ధ్వనిస్తుంది.
ఏ వ్యక్తి చరిత్రలో నిలిచిపోవాలని కోరుకోడు.అక్కడి పరిస్థితులే అతన్ని నాయకునిగా నిలబెడతాయి.ఓ గురి పెట్టుకొని లక్ష్యం దిశగా వెళ్ళేవాడు చివరిదాకా వెళ్తేనే ఫలితం.ఇందులో రకరకాల వ్యక్తులుంటారు.కొద్ది దూరం వెళ్ళే వాళ్ళుంటారు.మధ్యదాకా వెళ్ళే వారుంటారు.
చివరిదాకా వెళ్ళే వారుంటారు.గమ్యాన్ని చేరుకున్నవాడే చరిత్రలో చెరిగిపోని అక్షరమై నిలబడతాడు.అలా సుదూరంగా ప్రయాణించే వాడి ముందు చీకటి కూడా బెంబెలెత్తిపోతుంది.చీకటిని ఇక్కడ కష్టనష్టాలకు ప్రతీకగా తీసుకోవచ్చు.కొంత మంది చూపులో సాహసం ప్రతిధ్వనిస్తుంది.ఏదైనా సులభంగా సాధించొచ్చనే ధీమా కనిపిస్తుంది.అప్పుడు వెలుగు విశ్వవ్యాప్తమవుతుంది.
ఆ చోట చీకటి తోకముడుస్తుంది. ఓ లక్ష్యంతో ముందుకెళ్ళేవాడు చీకటిని చిన్నపిల్లాడిని చేసి ఆడుకుంటాడు.ఓ టార్చ్ లైట్ గా మార్చి నలుగురికి వెలుగు పంచుతాడు.సరిగ్గా ఈ భావాలు పొసగేలా రచయిత పాటను కూర్పుచేయటం వెనకాల ఎంతో శ్రమ దాగి ఉంది.అంతే కాకుండా అందరు పాటలో లీనమై తమ ఆత్మను అందులో జొప్పించి అక్షరాలను సొంతం చేసుకోవడమనేది రచయిత సృజనాత్మకతకు దక్కిన గౌరవంగా భావించవచ్చు.
ఈ పాటలో విలువలతో కూడిన సాహిత్యపు ఘుమఘుమలున్నాయి.
1.రెప్పల అంచున మనస్సు పొంగుతుందనడం
2. నీటిబిందువుతో సంపదను ముడిపెట్టడం
3.జ్ఞాపకాలకు ఆయువుంటుందని చెప్పటం
4.నిస్స్వార్థంతో కూడిన దారి నిజమనటం
5.లక్ష్యంతో పనిచేసేవాడు చెరగని అక్షరమై
    మిగిలిపోతాడనటం
6.చీకటిని కంటిచూపు చిన్నగా చేస్తుందనటం
ఈ పాటలో అలంకారాల ప్రయోగాన్ని గమనిస్తే
అంత్యాను ప్రాస గూర్చి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ప్రతి పాటలో తగిలేదే.
1.ఇందులో రచయిత మహర్షి “లాగ” అంటూ ఉపమవాచకం వాడారు.ఆ చోట ఉపమాలంకారం ప్రవేశ పెట్టాడు.
2.”ఇదే కదా ఇదే కదా నీ కథ”
ఈ వాక్యంలో వృత్యాను ప్రాస ప్రవేశపెట్టాడు.
“ద” అక్షరం మరల మరల వస్తుంది.
మొత్తంగా రచయిత అందరిని కదిలించే పాట రాశానడంలో ఎలాంటి సందేహంలేదు. శ్రీమణి గురించి ఒక విషయం కళ్ళుమూసుకొని స్పష్టంగా చెప్పొచ్చు
అదేంటంటే ఆయన టైటిల్ సాంగ్ రాయటంలో సిద్ధహస్తుడు.ఓ సారి పాటలోకి హాయిగా విహరిద్దాం.
పాట:
ఇదే కదా ఇదే కదా నీ కధ
ముగింపు లేనిదై సదా సాగదా
ఇదే కదా ఇదే కదా నీ కధ
ముగింపు లేనిదై సదా సాగదా
నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగినా
ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద
ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ళ ఆయువుందిగా
ఇంకెన్ని ముందు వేచెనో అవన్ని వెతుకుతూ పదా…
మనుష్యులందు నీ కధ… మహర్షిలాగ సాగదా…
మనుష్యులందు నీ కధ… మహర్షిలాగ సాగదా…
ఇదే కదా ఇదే కదా నీ కధ
ముగింపు లేనిదై సదా సాగదా
ఇదే కదా ఇదే కదా నీ కధ
ముగింపు లేనిదై సదా సాగదా
నిస్వార్థమెంత గొప్పదో ఈ పథము ఋజువు కట్టదా
సిరాను లక్ష్యమొంపదా చిరాక్షరాలు రాయదా
నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా
నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలాదా…
మనుష్యులందు నీ కధ… మహర్షిలాగ సాగదా…
మనుష్యులందు నీ కధ… మహర్షిలాగ సాగదా…
సినిమా:మహర్షి
రచయిత:శ్రీమణి
సంగీతం:దేవిశ్రీ ప్రసాద్
గానం:విజయ్ ప్రకాశ్
*

తండ హరీష్ గౌడ్

36 comments

Leave a Reply to Praveen Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కళను ఎంత దాచిపెట్టినా, సంకెళ్ళతో బంధించినా దాగదు. అలంకార సహితంగా చాలా బాగా విశ్లేషణ చేశావు హరీష్. ఈ శీర్షిక వినూత్నంగా ఉంది.

  • మంచి పాటలోని సాహిత్య విశేషాలు తెలియజేసిన తండ హరీష్ గారికి అభినందనలు… అఫ్సర్ సార్ కి నమస్కారాలు. ్్

  • రచయిత నేపథ్యం చెప్పడం ఒక ఎత్తైతే దానిని మిదైన దృష్టికోణంలో రాయడం మరొక ఎత్తు అన్న.పాటలోని సాహిత్యపు విలువలను అంచనా వేయడం అద్భుతంగ వుంది.మహర్షి అనే పదానికి స్పష్టమైన అర్థాన్ని చెప్పిన వ్యాసం అన్న…

  • సందేశాత్మకమైన పాటను ఎంతో విశ్లేషణాత్మకంగా వివరించావన్నా..చాలా బాగుంది..సినిమా పాట లోతుని పట్టుకొని,సారాన్ని వెలికి తీసి అందులోని సాహిత్య లక్షణాలను పట్టి చూపించి నేటి తరానికి అందించడం చాలా అవసరం..సినిమాను వ్యాపార దృష్టితో చూడడం వల్ల సినిమా పాట కూడా వ్యాపార వస్తువుగా కనబడుతున్న కాలమిది. ఒక్కో సినిమా పాట ఒక్కో పుస్తకంతో సమానం.,. సినిమాపాట గొప్పతనాన్ని చాటి చెప్పే లక్ష్యాన్ని కలానికెత్తుకుని ప్రయాణిస్తున్న నీ ప్రయత్నం ప్రశంసనీయం..అన్నా..అభినందనలు అన్నా..

  • పాట ఎంత గొప్పగా ఉందో విశ్లేషణ కూడా అంత గొప్పగా ఉంది

  • ఈ పాటలో అక్షరాల మణులను అలంకారాలతో పేర్చి తన ఆత్మతో ప్రాణం పోసారు శ్రీమణి గారు.వందేళ్ల జ్ఞాపకంలో ఇది కూడా ఉంటుంది. తమ్ముడు నువ్వు ఈ లిరిక్స్ లోని ప్రతీ పదాన్ని సొంతం చేసుకొని పాట నిర్మాణాన్ని నెమ్మదిగా …అందంగా విడదీసి విడదీసి రచయిత ఆత్మను సొంతం చేసుకున్నావు.ఎక్సలెంట్ రివ్యూ….అభినందనలు తమ్ముడు 💐💐💐

  • Its really fantastic analysis Mr Harish Garu..
    Going into the depth of someone else’s heart and vision is really tough … it’s more difficult than writing the original one.

    Kavi hrudayanni.. Biology subject lo laga vipuleekarinchi cheppaaru. Great.. keep doing the best as usual.

    All the best

  • Its really fantastic analysis Mr Harish Garu..
    Going into the depth of someone else’s heart and vision is really tough … it’s more difficult than writing the original one.

    Kavi hrudayanni.. Biology subject lo laga vipuleekarinchi cheppaaru. Great.. keep doing the best as usual.

    All the best

  • Thanks to radhika akka…&
    Naveen sir…

    Chala valuble comments chesaru..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు