మనకూ జెండర్ సెన్సిటివిటీ  ఉందా?

దళిత కోణం నుంచి సమకాలీనత!

ట్టపగలు నడిరోడ్డు మీద ఒక ఆడపిల్లను పొడిచి పొడిచి చంపుతాడొక దుర్మార్గుడు. అయినా ఎవ్వరం మాట్లాడం. ఫేస్ బుక్ లో మరో ఆడపిల్లను అడిగిన చిన్న ప్రశ్నకు మూకుమ్మడిగా దాడి చేస్తారు మరికొందరు మూర్ఖులు. ఎవ్వరం నోరు మెదపం. చూసీ చూడనట్టు దాటేస్తాం. గ్రామ దేవతలను కొలుస్తూ ఒక బంజారాబిడ్డ పాట పాడటం పాపమవుతుంది. ఫిర్యాదులు చేసి, కేసులు పెడతారు. అయినా మౌనాన్ని వీడం.

ఇదంతా సామన్యుల వరకే పరిమితమా? కాదు. నిండు సభలో దుశ్శాసనునిలా మరో మంత్రి, ప్రభుత్వ మహిళా అధికారిని హేళన చేస్తాడు. అయినా పట్టనట్టు ఎవ్వరి పనుల్లో వారు బిజీ. బాధితులెవ్వరు? బలవంతులెవ్వరో మనకెందుకు అనుకునే లోకం. అందుకే సమయమొచ్చినప్పుడు తనవంతు గాయాలు చేసి, నాలుగు రాళ్లు విసురుతుంది.

దీనికి మూలం ఎక్కడుంది…?

పట్టనట్టుగా తిరుగుతున్నం. మన మైండును ఇట్లా ట్యూన్ చేస్తున్న అదృశ్య హస్తాలు ఎవ్వరివి? దీనికి మూలం పాలించే పాలకుల నుండి పాలితులకు బట్వాడ అవుతున్న భావజాలంలోని ఏ పిత్రుస్వామ్య అహంకారానిది.

అదేంటి అన్నింటికి సర్కారే బాధ్యులా? ఏం కాదా, ఎందుకు కాదో చూద్దాం.

ప్రజలను రక్షించాల్సిన రక్షకభట నిలయాలు దళితుల మానప్రాణాలు హరించడం ఎవరి పుణ్యం? ఇంకెంత మంది మరియమ్మలు, రమ్యలు ఈ లోకంలో దగాపడాలి. కన్నకొడుకు ముందే తల్లిని కాళ్లతో తన్ని ఊపిరి తీసేశారు.

దీనికి కూడా ప్రభుత్వాల బాధ్యత లేదనుకుని కళ్లు మూసుకుందామా కాసేపు.
పోనీ అత్యున్నత స్థాయి ప్రజాప్రతినిధులేమైనా బాధ్యతగా మెలుగుతున్నారా?
ఆడవాళ్లను లెక్క చేస్తున్నారా? ఇవి అడగాల్సిన ప్రశ్నలు, నిలదీయాల్సిన ప్రశ్నలు.

నిండు అసెంబ్లీలో ఒక గిరిజన మహిళా ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు, స్వయంగా సీఎం హోదాలో పరిహాసాలాడి అవమానించి నవ్వుతుంటే, పాదరసంలా అహంకారం ఊళ్లు వాడలు దాటి గడపలకు చేరుతుంది.

అందుకే మహిళా హత్యలు, అత్యాచారాలు సర్వసాధారణమవుతున్నాయి.

ఇక రేప్ కు గురైంది, ప్రాణాలు కోల్పోయింది దళితురాలైతే మరీ మంచిది. అస్సలు ఎవ్వరికీ పట్టదు. ఎవ్వరి పనులు వారు చేసుకుంటూ కళ్లు మూసుకోవచ్చు. ఎందుకంటే ఆమెకు కులం లేదు. కాబట్టి ఆమె చచ్చినా బతికినా ఎవ్వరికీ పట్టదు.

ఆఖరికి మీడియా కూడా చూసి చూడనట్టు వెలుగులోకి రాకుండా పక్కదారి పట్టిస్తుంది. రేప్ కు గురై కోర్టుకు ఎక్కితే స్వయంగా జడ్జే ఈమె అంటరానిది ఈమెను ఎలా రేప్ చేస్తారని అడిగే దేశంలో హాయిగా బతికేస్తున్నాం మనం.

సారీ…. బాబా సాహెబ్ దేశప్రగతి ఆడవాళ్ల అభివృద్ధితో కాకుండా బంగ్లాలు, భవంతులతోనే కొలిచే ప్రభువుల రాజ్యంలో తలలు దించుకొని బ్రతుకుతున్నాం.

*

పసునూరి రవీందర్

33 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అన్నీ అడగాల్సిన ప్రశ్నలే..
    జవాబులు రావాల్సింది చట్టాన్ని అతిక్రమించే వారి నుంచి. సంజాయిషీ ఇచ్చుకోవాల్సింది పీడకులు..

    కాలమ్ షురువాత్ బాగుంది..

  • Good questions and excellent write up Ravinder. Though it is brief article, you covered length and breadth of ongoing issues. We must find ways to protect and defend women and their causes. No groups responded when women beaten and murder, sad state of affairs.

  • అన్నగారు 🙏బహుజనులకు ఒకప్పుడు తినడానికి తిండిలేదు ఎట్టిలు చేసి కుప్పలు ఉడిసి బతికిన జాతులు మనవి, ఆ రోజుల్లోఎదిరించారంటే
    కష్టాలనుండి శ్రమనుండి అణచివేత నుండి ఇలా 100 కారణాలు ఉన్నాయ్, కానీ డబ్బులేదు ఈరోజు కడుపునిండా తిండి దొరుకుతుంది చేతినిండా పని దొరుకుతుంది జేబుల ఇన్ని డబ్బులుంటుండే, ఇక ఎవరు ఎక్కడ పోతే వీళ్ళకెంటన్న, కరెన్సీ కోసం పరుగు తీస్తున్న సమాజమన్న పక్కోని ప్రాణం పోతున్న, సహాయం చేస్తే ఎక్కడ నా టైం వెస్ట్ ఐతదాని చూస్తూ పోయే జనాలన్న, అలంటి ఈ జనాలు ఎక్కడ తిరుగుబాటు చేయగలరన్న డబ్బు విలువ పెరిగింది మనిషి విలువ తగిందన్న ఈ రోజు ఆ కాగితాలే రాజ్యాలేలుతున్నాయ్, బాదున్నోడే బయటికి వొస్తాడన్న అదికూడా వాడి బాధ తీరేవరకే ఎదిరించి పోరాడే సత్తువ సచ్చిపోతుందన్న జనాలలో ఒకవేళ ఉన్నాకూడా దాన్ని చెంపేస్తన్రు, ఇది ఇపుడున్న ప్రజల జీవన విధానం 🙏🙏

    • తమ్ముడా కరెక్ట్ చెప్పినవ్. మన ప్రయత్నం మనది.

  • రవీందర్ … తిరగబడ్డ తెగువబిడ్డలా
    అదుపును కుదిపి కుప్పించిన పడ్డలా

    నిలదీసే నీ స్వరం
    ఎప్పటికీ నస్వరం

    వందలో ఒక గొంతువు కాదు
    వంద గొంతులు నీవు కాదూ

    మేమందుకోలేని వేదిక
    వేనమంది నివేదిక
    నీవొక్కడే సమధిక
    జాగృతివ్వు వైతాళిక

  • మీ వ్యాసాలు ఎప్పుడూ కండకావరం తో మూసుకుపోయున రాజ్యపు కళ్ళు తెరిపించేవే ఉంటాయి.. వ్యాసం ఇంకాస్త నిడివి కోసం నా మనసు తహతహ లాడింది.భయ్యా!! కుడొస్

  • ఇవన్నీ కాగితానికే పరిమితమైంది,నిజంగా ఒక అమ్మాయిని అర్థరాత్రి బయటికి పంపగలమా?అలా పంపితే అమ్మాయి సురక్షితంగా తిరిగి రాగలరా?ధైర్యం చేసి పంపిన హత్యలు మానబంగాలు, తల్లిదండ్రులకు తెలియదా ఆడపిల్లని అర్ధరాత్రి బయటికి పంపద్దని అనే సూటి పోటి మాటలు,ఎవరు మారాలి?స్ర్తీనా పురుషుడా?సమాజము?

  • Well analysed… such a passive attitude of the people is very dangerous to society. They are irresponsible, inefficient people and there must be change in human attitude and develop belongingness.

  • “మేరా భారత్ మహాన్ హే ” అని చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నా . అవును మన దేశం గొప్పది. మన భూతల్లీ తన సంతానాలను కడుపునిండా బువ్వ పెట్టే పచ్చని ప్రేమ పెన్నిధి.
    కాని ఇక్కడి మనుష్యుల ఆలోచనలే వేరువేరు.
    ఒకే భూతల్లీ ఒడిలో నివసిస్తున్నా మనలో కులరక్కసి చిచ్చు పెడుతుంది.ఇది అంటువ్యాధిలా అగ్రవర్ణాలకే వస్తుంది.
    దళితుల పై జరుగుతున్న అన్యాయాలకు న్యాయం ఇవ్వక పక్షపాతమనే రోగానికి గురైతున్నారు.దళితుల జీవితాల్లో పెను తుపాను వచ్చిన అగ్రవర్ణాల వారి హృదయాలు కరగని పెద్ద పెద్ద బండరాళ్ళలా స్థిరంగా ఉంటాయి.
    గీ దేశంలా న్యాయం కేవలం అగ్రవర్ణాలకే ఉంది. దళితులకు అడుగడుగున అవమానాలు, అటంకాలు ,అన్యాయాలే కాలి బొటనవేలుకు తగులుతూ ఉంటాయి……..
    మనువు గాడి మనుస్మృతిని చంపితే తప్ప కులరక్కసి చావదు. మాయ ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు కులరక్కసి ప్రాణం మనుస్మృతిలో ఉంది…
    దాని అంతం జరిగితే …..
    “ఈ దేశంలా కులం కాదు గుణం రాజ్యమేలుతుంది.”..
    మీ సహృదయతకు నేను సదా స్ఫూర్తిభావంతో మీ అడుగుజాడలో మేము సహయంగా ఉంటాము సార్,….

  • Gd article Sir. There’s disparity between SC ST, n others. Particularly in Rural areas n in case of women. There’s lot of in humanity against SC ST personal in d society.

  • మీ వ్యాసాలు నిశ్చలంగా వున్న నీటిలో ఒక రాయి పడితే కలిగే తరంగాల్లా స్వచ్చమైన మనసుల్లో అలలు అలలు గా చెలరేగుతూ తమ గమ్యం వైపు పయనిస్తూ వుంటాయి. ఈ వ్యాసం గురించి నా భావన, ఆధునిక కాలంలో కూడా కుల సమాజంలో అంతరాలు తగ్గక పోగా కుల ఘాడత పెరుగుతుంది. ప్రజాస్వామ్యానికి పునాదులైన న్యాయ వ్యవస్థ, చట్టసభలు, కార్యనిర్వాహక వ్వవస్థ, మీడియా లో వున్న వారంతా ఈ కుల సమాజం నుండి ఎదిగి వచ్చినవారే, ఎవరో కొంత మంది తప్పితే మిగతా వారు ఎంత ఉన్నత చదువులు చదివినా కూడా మన విద్యా వ్యవస్థ వారి కుల మత జాఢ్యం తొలగించి విశ్వమానవులుగా మార్చలేకున్నది. పైగా అణగారిన కులాలు ఆత్మగౌరవం కోసం పెట్టుకున్న పేర్లను చేసే ఉద్యమాలను కుల పోరాటాలుగా చిత్రిస్తూ వారు మరింత కుల ఉన్మాదులుగా మారిపోతున్నారు. ఇక్కడ జండర్ లో కూడా కులం ప్రభావం తీవ్రంగానే వుంది (పైన మీరు ఉదహారించిన సంఘటనలకు వ్యతిరేకంగా మాట్లాడకుండా మెజారిటీ ఆధిపత్య కులాల మహిళలు మౌనం దాల్చడం) . నేటికి కులానికి కవచంలా భూసంబంధాలు నిలబడే వున్నాయి. కుటిలనీతితో కొన్ని కులాలకు ప్రయోజనం కలిగించే ఆధిపత్య కులాల నాయకత్వానికి జైకొట్టే సమాజం, సమర్ధవంతంగా సకల కులాల శ్రేయస్సు కోసం పనిచేసే అణిచివేయబడ్డ కులాల నుండి ఎదుగుతున్న నాయకత్వానికి బాసటగా నిలబడలేక పోతున్నారు. బానిసలుగా బ్రతుకుతున్నా నిచ్ఛెన మెట్ల వ్యవస్థ లో మేము పైనున్నామనే భావదారిధ్ర్యం నుండి బయట పడలేక పోతున్నారు. పుట్టుకతో వచ్చిన కులం సచ్చినతరువాత కూడా వదలకుండా పిశాచంలా (నాకు వాటి మీద నమ్మకం లేదు ) పట్టి పీడిస్తుంది. జెండర్ సెన్సిటీవిటితో పాటు, అణగారిన కులాల, అణచివేయబడుతున్న మతాల, దోచుకోబడుతున్న వర్గాల సెన్సిటీవిటి లోపించిన సమాజంలో, మౌనంగా మూగరోధన ఒకవైపు జరుగుతుంటే మందహాసం చేస్తూ కొన్ని మందలు మరోవైపు వున్నాయి. ఆకలిచావులు, ఆత్మహత్యలు ఒకవైపు జరుగుతుంటే అందినకాడికి దోచుకునే పనిలో మరికొందరు వున్నారు. మొత్తంగా మానవత్వం అనే సెన్సిటీవిటి లోపించిన ఈ సమాజంలోని మనుషలను అసమాన ఆర్ధిక వ్యవస్థ ఆట బొమ్మలుగా మార్చివేసింది. మీరు సామాజిక డాక్టరుగా మీ రచనలను సమసమాజ ఆర్ధిక వ్యవస్థ కోసం, చక్కగా ప్రతిస్పందించే సమాజం కోసం అవసరం అయిన మందుకు ప్రిష్కిప్షన్ లా వ్రాస్తున్నందుకు ధన్యవాదాలు.

    – జంబూ నివాసి

  • Congratulations to Saaranga team and Dr Pasunoori Ravinder for initiating and writing this column respectively. I appreciate Ravinder garu for beginning this column by focusing on gender issue from a Dalit perspective. Looking forward to reading many more writings.

  • వర్తమాన సమాజ గమనాన్ని, దానిలో మహిళలకు ఎదురవుతున్న అవమానాల్ని, వాటి మూలాల్ని, నేటి విషాద భారత భావజాలాన్ని కండ్లకు కట్టినవ్ అన్నా…

  • రవిందరన్నకు….జై భీం
    మీరన్న సమాజం మారాలంటే” వ్యక్తిగత నిర్మాణం ” జరగాలి..అందుకు మనమే ముందు భాగస్వాములం కావాలి.
    …🙏
    మనవి కాని ఈ భౌతిక, బూర్జువా బంధనాల, భావజాలాల్లోంచి బైటికొచ్చినప్పుడే బాబాసాహెబ్ ఇచ్చిన మన చదువులకి సార్ధకత ఉంటది…. -కళాశంకర్ మహరాజ్
    …………… ———————————— …………….. 👇’వృత్తి’ బాధ్యత కావాలి. అది సధర్మమై వెలగాలి, ప్రకృతిలో భాగమై వుండాలి. మనం చేసే ఏ వృత్తులైన అవి మీ సొంతం కావు. అవి మనం సంపాదించిన ఆస్తులు కాదు.. అదేదో మన హక్కు కాదు.. అవి మన పాలిట నిర్భందపు బానిస బ్రతుకులకు చిహ్నలు మాత్రమే. అసలు మనం చేస్తున్న వృత్తులు మన తాత ముత్తాల అంతర్గత వారసత్వ కళా నైపుణ్యాలు..
    👇మనం ఈ సృష్టిలో ఒక “అద్భుతం”. మనలో నుండే ఎన్నెన్నో అద్భుత వస్తువులు-విలువలు సృజించబడ్డాయి. మనకు మనంగా నిర్మించుకున్న ఒక అద్భుతమైన కళా ఖండమే ఈ భారతదేశం(జంబూద్వీపం). మనలో సకల కళలు కల్గి ఎంతో నైపుణ్యంతో చాలా ఆనందంగా మన జీవితాలను గడిపినాము. ప్రతి జీవిని జీవింప చేసినాము. మనం మహాజ్ఞానులం. మహా అద్భుతమైన శక్తి వంతులం.
    పంచ భూతాలతో(గాలి, నీరు,నింగి,నేల,నిప్పు) మమేకమైన ప్రకృతి ప్రేమికులం..!!
    ప్రేమను పంచిన తాత్విక జీవులం..!!
    సంస్కృతి నేర్పి‌, సంఘం కట్టిన సంఘనిర్మాతలం..!!
    మనం ఈ భూమిపైన మొట్ట మొదట పరిణామం చెందిన మానవ జీవులం..!!సంఘనిర్మాతలం..!! మొట్టమొదట నాగరికతను ఏర్పరిన ఆది పాలకులం… మనమే *మహా బహుజనులం (Supreme)
    మొట్టమొదటి, ప్రారంభ
    ‘జ్ఞానవంతులు, వివేకవంతుల మన వారసత్వ ఘనమే ఈ దేశ మూలవాసులైన సబ్బండ (ST,BC,మైనారీటీస్)శూద్రజాతి సముహం.
    మనకున్న కళలకు నైపుణ్యత(వృత్తు)లకు.. దానికి తగ్గట్టు కులాలు అంటగట్టి,
    మనవాళ్ళ నుండి మనల్ని వేరుచేసి,
    మన ఐక్యతను దెబ్బగొట్టి,
    మన సంపదను కొళ్లగొట్టి,
    మన మేథస్సుతో, నైపుణ్యంతో సకలం ఏర్పర్చుకొని మనల్నీ బానిసలుగా మార్చి, విద్యకు,భూమికి,రాజ్యానికి, లోహానికి,వస్త్రానికి దూరం చేసి సంఘ బహిష్కరణ చేశారు ఈ హిందు పునాద సృష్టికర్తలు (యురేషియన్స్-ఆర్యులు-బ్రాహ్మణులు-పెత్తందారులు-సోమరులు)..
    మనల్ని మన వాళ్ళకు అంటరానివాళ్ళను చేసి, ఊరికి చివర్లో చచ్చిన జీవుల దగ్గర కుక్కాల్లాగా బ్రతికేలాగా చేసి మానసికంగా నిస్సహాయులుగా మార్చారు. మనల్ని మనం మర్చిపోయేలా, మనకంటూ ఒక ఆలోచననే లేకుండా.. మన ఆనవాళ్ళే లేకుండా చేసి ఊరికి చివర్లో ఊపిరి తీసి గెంటేశారు. కాళ్ళకింద పెట్టి తొక్కేసారు ఈ దుర్మార్గపు పాలకులు, మనుధర్మ వత్తాసులు.
    👉చాలా కాలం గడిచాక మనకుకు,…..
    మనవాళ్ళందరికి మళ్లీ ఊపిరి పోసి మనల్ని మనిషుల్ని చేశాడు మన తండ్రి *అంబేడ్కర్*. ఈ మహనీయుడు రాసిన రాజ్యాంగమే కదా ప్రస్తుత మన ఈ బౌతిక జీవనానికి కారణం. 👉కానీ నేడు ఆ రాజ్యాంగం ద్వారానే చదుకుని విద్యావంతులైన మనం ఈ సత్యాన్ని తెలుసుకోకుండా… పరధర్మమే మన ధర్మం గా భావించి అజ్ఞానంతో జీవిస్తున్నాము.ఇలాంటి అజ్ఞాన సమాజంతో ఒరిగేదేమీలేదు సొంత స్వార్థ జీవనం తప్ప.
    మన పునాదులు,చరిత్ర తెలుసుకోకుండా… ఆదమర్చి మత్తులో వూగుతున్న ఓనా విద్యావంతులారా….🙏🙏ఇకనైనా మోల్కొని మన స్వార్థపు జీవితాల నుండి విముక్తులం అవుదాం..మనం *మహారాజులం పాలకులం* అనే నిగూడ సత్యాన్ని తెలుసుకుందాం… భావసంఘర్షణ చెందుదాం.. మళ్ళీ మహాసైనికులం మవుదాం. విడిపోయన మన వాళ్ళు(బహుజనకులాలు-sc,bc/st&minorities) మన కళ్లముందే జీవిస్తున్నారు. ఒక్కసారి పలకరించి ఐక్యంగా ఉండేలా మన మహానీయుల చరిత్రను భోదించి సమీకరించి పోరాడుదాం..
    (వందల సంవత్సరాలుగా .. మనల్నీ ఐనక్యం చేసి ,విడదీస్తుండ్రు ఎందుకని ఎనాడైనా ఆలోచించామా..?? ఒక్కసారి మనకు మనం ప్రశ్నించుకుందాం.. ఆలోచించండి..🙏🙏🙏
    (ఒక్కసారే కాకుండా పదే పదే చదవండి.. ఇది ఏ పుస్తకాల్లో కూడా లభించదు..ఇది సత్యసమాచారం) జై భీం.

    _కళాశంకర్

  • చాలా బాగుంది. మీ లాంటి మేధావులు ఇలాంటి రచనలు చేయడం జాతికి గర్వకారణం.

  • నీవు రాసినది 100% వాస్తవం ఈ దోపిడీ రౌడీ గుండాల నుండి రక్షణ పొందాలి అంటే బహుజన రాజ్యాధికారం కావాలి అప్పుడే సగటు మనిషిని మనిషిలా ,ఒక స్త్రీ ని తన ఆడపడచులా ఒక తల్లి లాగా చూసే అవకాశం వస్తది అన్న లేకుంటే మనం ఈ రకంగా కూడా మాట్లాడుకోలేము

  • మీరు గుర్తు చేసిన ప్రతి సంఘటన గుండెల్ని పిండేసిందే…చూసి, చదివి బాధపడ్డం కానీ ఏం చేయలేకపోయాము… దీని కోసం ముక్యంగా మనుషుల ఆలోచన విధానం మారాలి, వాళ్ళను కట్టడి చేసే వ్యవస్థ మారాలి, వ్యవస్థ యొక్క సిద్ధాంతాలను రూపొంచే అధికారం మారాలి. అదే రాజ్యాధికారం… ఈ రాజ్యాధికారం బలహీనులకు కూడా న్యాయం చేయగలిగే వ్యక్తుల చేతుల్లో ఉండాలి….జై భీమ్

  • అవును అలానే తయారు అయ్యాం మనం. ఎవరికి వారు మనకెందుకులే అనుకోబట్టే, ప్రతి ఒక్కరూ బాద్యులే.. ఎవరికి తోచినట్టు వాళ్ళు ప్రశ్నిస్తే ప్రతి వెధవకి భయం పుడుతుంది దళిత బిడ్డని చూడడానికి.

  • nijalatho kudina e rachanalaki shabdham unte jivam leni parvathalu sitham bradhalayyevi kaani chalanam leni samajamlo aksharasyulu, manishi lo thanani chusukoleni adavi mrugalu samananga badhyatha vahinchalsina media okka kannutho chusthunte adhikaram ane emina cheyyagalam ane rakshasula ku banisaluga migilina voters thana chelli ki akka ki anyayam chesthunte inka niku nenu unna chelli akka ani kondharu avedhanatho mundhuku vasthu pranalu sitham lekkacheyyani ..Annalu Thammulu nikunnaramma edho oka roju vijayam sadhistham…Jai Bhim…

  • వర్తమాన భారతం.నంగి నంగి నాటకాల బాగోతం.
    రాజకీయ కీచకుల పరిహాసం.మెల్లమెల్లగా మధ్య యుగాల్లోకి,ఆదిమ యుగాల్లోకి..ముడుచుకు పోతున్న భారతం..కళ్ళముందు కుమిలిపోతున్న దృశ్యం మీ వాక్యాల్లో కనిపించింది అన్న…

  • ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. విపులంగా చాలా సంఘటనలు విశిదీకరిస్తే బాగుంటుంది.. వ్యాస నిడివి దృష్టిలో రాసినారేమో..ఏమైనా సరే బాగుంది రవిందర్. అభినందనలు. అసలే ఎవరూ మాట్లాడటo లేదని కాదూ.. కొందరు మహిళలు,కొన్ని మహిళా సంఘాలు మాత్రమే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా దళిత స్త్రీలపై జరుగుతున్న సందర్భాల్లో కనీసం దళిత పురుష మేథావులు కూడా మాట్లాడకుండా రాజకీయాలు చేయడం దుర్మార్గం.

  • అగ్రకుల భావజాలం musalu కొడుతున్న ఈ వేళ, ఈ రంగంలో చూసిన బహుజనుల అస్తిత్వం మీద ఆహారపు అలవాట్ల మీద సాహిత్యం మీద కచ్చితంగా దాడి జరుగుతుంది ఎందుకంటే రేపు వీళ్లే పాలకులు అయితే మాకు సేవ చేసేది ఎవరు?
    అని ఒక కుట్రతో ఆధిపత్య భావజాలం అనునిత్యం బహుజన దాడి జరుగుతూనే ఉంటుంది

    బహుజన లోకం చైతన్యం రానంత వరకు ఈ పరిస్థితి ఇదే విధంగా ఉంటది

    ఒక్కసారి ఎదురుతిరిగితే …..

    మైండ్ బ్లాక్ అవ్వడమే

    చీమలదండు పామును చంపినట్టు
    చెట్టుకొకరు పుట్టకొకరు వేరే చేసినట్టు ఉన్న బహుజనులు
    ఐక్యమయ్యే రోజులు వచ్చాయి
    అందుకు నిదర్శనమే ….

    పసునూరి అన్న ధిక్కార స్వరం

    ఈ దిక్కార స్వరం మెల్లగా పల్లెకు ప్రతి గడపకు చేరుతుంది
    బహుజన లోకం చైతన్యవంతమవుతుంది

    చాకలి మంగలి గొల్ల, కురుమ , గౌడ, మాల మాదిగ మాస్టర్ గోసంగి, ఆదివాసి సబ్బండ వర్ణాల జాతులు ఐక్యమయ్యే రోజులు దగ్గరపడుతున్నాయి

    ఇక సాగవు
    మీ ఆటలు
    మీకు కాలం చెల్లింది
    అనేకమంది బహుజన సాహితీవేత్తలు రచయితలు
    కళాకారులు ఒక జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నలు సంధిస్తారు
    ఈ సమాజాన్ని జాగృతం చేస్తారు
    సమతా మమతల కోసం సమాజాన్ని చైతన్య ము చేస్తారు

    దుఃఖము లేని రాజ్యం కోసం,

    ఆకలి లేని రాజ్యం కోసం ,

    వివక్షతలు లేని రాజ్యం కోసం,

    కదులుతారు

    పూలే అంబేద్కర్ కలలుగన్న రాజ్యం కోసం ముందుకు సాగుదాం

    మీ
    అర్జున్ మల్లారం

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు