మంటో మెరుపు కథలు

సౌమ్యవాదం

ఓ మనిషి తన వస్తువులన్నీ లారీలోకి ఎక్కించి మరొక నగరానికి వెళ్తూండగా దారి మధ్యలో అతనిని అడ్డగించారు.

లారీలో నిండిపోయివున్న వస్తువులనకేసి ఆశగా చూస్తూ గుంపులో ఇంకొకరితో “చూడరా ! దోచుకున్న వస్తువులతో ఎలా ఊరు విడిచి పారిపోతున్నాడో ” అన్నాడు.

వాటి యజమాని గర్వంగా నవ్వుతూ ” మీరు చూస్తున్న వస్తువులన్నీ నా వ్యక్తిగత ఆస్తులు” అన్నాడు.

గుంపులో కొందరు నవ్వుతూ “మాకు తెలుసులే” అన్నారు.

గుంపులోంచి ఓ అరుపు వినిపించింది ” ఈ పెట్టుబడిదారీని పోనివ్వకండి. అతడు లారీతో పాటు వున్న ఓ దోపిడీ దొంగ

తప్ప మరేం కాడు.”

 

అగ్యానం వలన లాభాలు

ట్రిగర్ నొక్కగానే బుల్లెట్టు వంకర్లు తిరుగుతూ దూసుకుపోయింది. 

కిటికీలోంచి చూస్తున్న మనిషి పల్టీ కొడుతూ చప్పుడు చెయ్యకుండా కిందికి పడిపోయాడు.

ట్రిగర్ రెండవసారి నొక్కబడింది. బుల్లెట్టు గాలిని చీల్చుకుంటూ ప్రయాణించి నీళ్లు తీసుకుని వెళ్తున్న వ్యక్తి గొర్రె తోలు తిత్తిని చిల్లు చేసేసింది. అతని ముఖం నేలను తాకగానే రక్తం నీళ్ళతో కలిసిపోయి రోడ్డుపై ప్రవహించసాగింది. మూడవ సారి ట్రిగ్గర్ నొక్కబడింది. కానీ ఈసారి బుల్లెట్టు గురితప్పి ఓ మట్టిగోడలోకి

యిరుక్కుపోయింది‌.

నాల్గవ బుల్లెట్టు ఓ ముదుసలిని నేలకూల్చింది. ఆమె కనీసం అరవలేకపోయింది.

అయిదొవ బుల్లెట్టు ఆరవ బుల్లెట్టూ కూడా వ్యర్ధమైపోయాయి. అవి ఎవరినీ చంపనూలేదు కనీసం గాయపరచనూలేదు.

గురిపెట్టేవాడికి విసుగు వచ్చినట్లు కనిపిస్తోంది, అప్పుడే హటాత్తుగా రోడ్డుపై  పరిగెడుతున్న ఓ పిల్లాడు కనిపించాడు.

అతడు తుపాకీని ఎత్తి గురి పెట్టాడు.

అతనికి తోడుగా వున్న వ్యక్తి “ఎం చేస్తున్నావు?” అని అడిగాడు.

“ఏం”

“నీ తుపాకీతో బుల్లెట్లు అయిపోయాయి”

“నువ్వు నోరు మూసుకో ! ఆ చిన్న పిల్లాడికి ఎం తెలుసు?”. ‌

 

సరైన ఉపయోగం

పది రౌండ్ల కాల్పుల్లో ముగ్గురిని చంపేసి తను కూడా ధైర్యవంతుల దండులో చేరిపోయానని భావించాడు పఠాను.

అంతా చాలా గందరగోళంగా వుంది. ప్రజలు అంటూ యిటూ పరిగెడుతున్నారు. కొందరు లూటీ చేయడంలోనూ మరి కొందరు కనిపించిన వారిని చంపడంలోనూ మునిగి వున్నారు. ఆ పఠాను గర్వంగా ఒక చేత్తో తుపాకీ పట్టుకుని లూటీ చేసే మూకలతో తానూ కలిసిపోయి పెనుగులాడుతూ ఒక గంట తరువాత ఓ బహుమతి దొరకబుచ్చుకున్నాడు- అది ఒక

థర్మాసు ఫ్లాస్కు.

పోలీసులు రంగంలోకి దిగిన వెంటనే పఠానుతో సహా అందరూ

పరుగు లంకించుకున్నారు.

వేగంగా  దూసుకొస్తూ తలలోకి దూరిపోవాల్సిన  తుపాకీ గుండును రెప్పపాటు కాలంలో తప్పించుకున్నా ఎర్రటి థర్మాసు ఫ్లాస్కును మాత్రం పఠాను చెయి జారనివ్వలేదు. 

పఠాను గర్వంగా  దాన్ని తన స్నేహితులకు చూపిస్తూ వుండగా

వాళ్ళలో ఒకడు నవ్వుతూ “ఖాన్ సాహెబూ ! అక్కడ నీకేం దొరికింది?” అని అడిగాడు.

ప్రేమ నిండిన కళ్ళతో మెరుస్తున్న ఫ్లాస్కు మూతకేసి చూస్తూ పఠాను “ఎందుకూ?” అని అడిగాడు.

“నీకు తెలియదా యిదేమిటో ?. ఇది ఓ ప్రత్యేకమైన సీసా లాంటిది చల్లని వస్తువులను చల్లగానూ వేడి వస్తువులను వేడిగా వుంచేది.” 

తన పెద్ద జేబులోకి దాన్ని దోపేసుకుంటూ పఠాను “మంచిదే !

సరైన ఉపయోగమే దీనితో. చలికాలంలో నా నశ్యాన్ని చల్లగానూ, ఎండాకాలంలో వేడిగా వుంచుతుంది” అన్నాడు. 

*

ఆర్ . ఎస్ . వెంకటేశ్వరన్ .

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు