1.
సాయంత్రమవుతోంది-
పాత వార్తల మీద
పేపరువాడి నిద్ర
— ఏ.త్యాగరాజన్,ముంబయ్
2.
ఆస్పత్రి కిటికీల గుండా
నొప్పి మాయమవుతోంది –
చెర్రీలు వికసిస్తూ
— అమితవ దాస్ గుప్త, కోల్ కతా
3.
నాకూ
పర్వతశ్రేణికి నడుమ
రైలు పోతోంది.
— ఏ.సేతురామయ్య, ఢిల్లీ
4.
చర్చ్ శ్మశానం-
దగ్గర్లో ఎక్కడ్నుంచో
లిల్లీల సువాసన
— గౌతమ్ నాదకర్ణి, ముంబయ్
5.
రాత్రి వ్యాహాళి –
నెమ్మదిస్తాను
మల్లెపొదల దగ్గర
—- జొహన్నెస్ మంజ్రేకర్, మైసూర్
6.
దట్టమైన పొగమంచు-
దూరంగా వేసిన కూతలో
రైలు అదృశ్యమయింది.
— కళా రమేష్, పూణే
7.
ధ్యానం అయిపోయింది-
కొమ్మల మధ్యన
నిండు చంద్రుడు.
— కె.రమేష్, చెన్నై
8.
అడుగులేస్తున్నాను-
పిట్ట
ఉదయపు పిలుపు వైపు
— కామేశ్వర రావు, పూణే
9.
పక్షిపాట-
పాత వంతెన
గుండా వెళుతూ
— పూజా మలుస్థే, మహారాష్ట్ర
10.
వసంత వర్షం-
సంభాషణలో
తరువూ,నేను
— పురుషోత్తమరావు రావెల, గుంటూరు,
11.
నిండు చందమామ-
కారు పక్క యువతి
తన నీడ మీద నుంచుంది.
— ఆర్.జె.కల్పన,ముంబయ్
12.
ఆలయ శిథిలాలు-
గాలి మాత్రమే ఇంకా
పూలు అర్పిస్తోంది.
— రోహిణీ గుప్త, ముంబయ్
13.
కరెంట్ కోత-
ఈ రోజు నేను
పక్షుల కిలకిలు విన్నాను.
— ఉషా కిరణ్, బెంగుళూరు
14.
పంట పొలాల్నీ
పర్వతాలని మింగేసింది-
భారీ పొగమంచు
— సునిల్ ఉనియాల్ , లక్నో
*
కవిత రాసిన హైకూ రాసిన లేదా అనువదించిన మీకు మీరే సాటి అన్న…హృదయ పూర్వక అభినందనలు
మంచి హైకు ఎంచుకుని అనువదించారు. బావున్నాయి శ్రీనూ -మాకినీడి
అద్భుతమైన హైకూలు అందించిన మీకూ..
చదివించిన సారంగకు ధన్యవాదాలు అన్న…
శుభాకాంక్షలు
బావున్నాయి హైకూలు… సరళత్వానికి పెద్దపీట వేస్తూనే… సహజత్వంలోని భావుకత్వాన్ని వాస్తవదృశ్యాలుగా పరిచింది.
అభినందనలు మిత్రమా!