కల కాదు,
భ్రమ కాదు,
నీ గదిలో నువ్వు
నీలోకి ముడుచుకోపోయి
విప్ప పూ లల్లాంటి నీ పుస్తకాలు
నిన్ను ప్రశ్నిస్తున్నాయి!
పరుగులు తీయిస్తున్నాయ్
ఏ రాత్రి నిన్ను చక్కగా పలకరించటం లేదు
నిన్న వచ్చిన కల ప్రతిరోజు భయపెడుతుంది.
పడుకొంటావ్!
తల్లి తండ్రులు ప్రశ్నయి నిలబడుతారు
నీ భయానికి నువ్వు తాళం వేసుకుని
పుస్తకాల చుట్టూ వర్థులాకారంగా
పిచ్చిగా నర్తిస్తావ్!
నీ పొడుగాటి జుట్టులోకి
గోముగా వేళ్ళు పోనిచ్చి
ర్యాంక్, ర్యాంక్ అంటూ నవ్వుతుంది పెద్దరికం
నుదిటి పై చమట
జ్వలించే కోపం
అర్థంకాని చదువు, ఉన్మాదపు తత్త్వం
నీ చుట్టూ మంత్ర శక్తీ లాంటి
నినాదాలు
ర్యాంక్, ర్యాంక్, ర్యాంక్ అని
మీ అమ్మ ఇంద్ర ధనుస్సును
చూపెడుతుంది
నువ్వు జీవితం లోని అమావాస్యని
మాత్రమే ఉహిస్తుంటావ్!
నీ తలలో తిరుగుతున్న
నాగుపామును చంపెయ్!
బ్రతుకు పొరలు చిరిగి
ఎదుట నిలుస్తుంది
*
Add comment