ఈ ఫోటోనీ, ఫోటోలోని అద్దాన్ని, అద్దం లోపల నిండు లంబాడీ స్త్రీని చూసిన వెంటనే నా మనసు గతంలోకి జారుకుంది.
ఏవేవో జ్ఞాపకాలు నా ప్రస్థుతాన్ని పక్కకు నెట్టి గతంలోపల, గుండెని తొలిచిన సంఘటనేదో మనసు పొరల్లోంచి ఎగజిమ్మకొచ్చింది.ఎవరెవరో మనుషులు కళ్ళముందు మెదులుతూ నా ముందుకొచ్చి నిలబడ్డారు.అప్పుడే మరిచిపోయావా అంటూ నా ఉహాల్ని పట్టుకొని నిలదీసాయి.నా మెమోరీకి పరీక్షపెట్టాయి.ఈ ఫోటోని ఎక్కడో చూసాను.ఎవరితోనో ఇటువంటి ఫొటో గురించి మాట్లాడాను.ఇటువంటి బొమ్మ గీసిన మనిషిని గురించి ఆలోచించానే అని అవలోకించుకుంటూ ఉండగానే,కళ్ళముందుకి రంగు డబ్బతీసుకొని చిరిగినచొక్కా చింపిరి జుట్టుతో నా కళ్ళముందు కూర్చున్నాడు యాదగిరి.
అయ్యో యాదగిరిని ఎలా మరిచిపోయానో అనే ఆశ్చర్యం ,ఆవేదన కలగలిసి ఒకానొక నిర్వేదం.యాదగిరి నా పాత విద్యార్థి.నేను పాఠాలు చెప్పిన ,చెప్పిన పాఠాల్ని గుర్తుంచుకోమని నేను హితవులు బోధించిన విద్యార్థి. చదువుమీద శ్రద్దలేదు బొమ్మలంటేనే ఇష్టం సర్ అన్న యాదగిరి మాటలు అమ్మానాన్నలులాగే పట్టించుకోకుండా వాడినేదో ఉద్దరిద్దాం అని ఇష్టంలేని పనుల్ని నాకోసం చేసిన అద్భుత విద్యార్థి .ఒక గంపకింద కోడిని చూస్తాడు దానిని బొమ్మగా మారుస్తాడు.ఒక గర్భిణీ స్త్రీని చూస్తాడు, ఆమెకి తానేసే చిత్రంలో ఒక అందమైన ఉయ్యాల బహుమతిగా ఇస్తాడు.అరక దున్నే రైతుని చూస్తాడు,పచ్చనిపోలాల్ని తెల్లని కొంగల్ని అందంగా గీస్తాడు.వాగుల్ని అడవుల్ని సరస్సుల్ని వాడ్నికన్న తల్లిని చుట్టూరా ప్రపంచాన్ని బొమ్మలుగా మార్చే alchemist వాడు.
తండ్రికి మార్కులు కావాలి.తల్లికి ఉద్యోగంకావాలి.ఉపాధ్యాయులకు ర్యాంకులు కావాలి. ఇవన్నీ చేయలేని యాదగిరి పదిపరీక్షలో ఫెయిల్ అయ్యాడు. వాడు ఏ బొమ్మ గీసిన అది మనకు బువ్వపెట్టాదురా అనే వాళ్ళ మధ్యలో యాదగిరి మాత్రం ఎన్నాళ్ళు ఆ బొమ్మల్నే ప్రేమిస్తాడు? పిల్లలు చేసే పనులు ఎంతగొప్పవయినా మనకు నచ్చకపోతే మానుకోవాలి.వాళ్ళమాట మనం వినకపోయినా మనమాట వాళ్ళు వినాలి.ఎంతటి సంస్కారామో..మనది.బొమ్మల్ని గీసే యాదగిరి ముల్టీఫ్లేక్ షాపుల ముందు బొమ్మగా నిలబడ్డాడు.బతుకు దేరువుకోసం ఓపెద్ద బట్టలషాప్ ముందు సెక్యూరిటీగా నిలబడ్డాడు.
వాడునాకు చివరిసారి కలిసినప్పుడు నువ్వు చిత్రించిన చివరి బొమ్మ ఏంటి యాదగిరి అంటే తనని విడిచివెళ్లిన తన తల్లి బొమ్మని చూపించాడు….అచ్చంగా వాడితల్లి పైన ఫోటోలో మనిషిలానే ఉంది. వాడితల్లి వాడ్ని విడిచివెళ్లిపోయింది, వాడు తన బొమ్మల్ని విడిచేశాడు.మనిషి నుండి మనిషిని, మమతల్నoడి మనిషిని,బొమ్మలనుండి చిత్రకారుల్ని పాటలనుండి పాటగాళ్లని విడగొడుతూ వూడగొడుతూ…రాలగొడుతూ మనం..అను మనుషులం..
*
మనం.. అనుమనుషులం, సుపెర్బ్ సర్,కవిత.మనసును కదిలించింది..!ధన్యవాదాలు!.
Thank you
Dear friend so nice story. Every movement we will come across our life such a characters. Write many more stories. All the best…:)
Thank you
ఎంత బాధకరం సర్…..ఈ బాబు స్టొరీ….చివరిగా తన అమ్మతోనే( బొమ్మతోనె) తన కళని కుడా వదిలేసుకున్నడు….చాల మంచి స్టొరీ సర్…చాల బావుంది పెద్దన్న గారు…
Nice story…. An interesting story… It shows the attachment of mother an son…
అన్న హృదయాన్ని కదిలించేలా రాస్తున్నందుకు ధన్యవాదాలు…. చాలా బాగుంది అన్న💐💐💐💐👌👌👌👌😍😍😍