పుట్టమన్నులాంటి అక్షరం తగుళ్ళ గోపాల్

సమాజ అసమానతలను అతి జాగ్రత్తగా ఎత్తి చూపి, అంతే ఆర్ధ్రతగా ఆ అసమానతల వెనుక వేదనను పాఠకుడి కి రీచ్ అయ్యేలా చేసే లవ్లీ మెజిషియన్ గోపాల్!

“పరుపుమంచం మీద
పూలదుప్పటి కప్పుకుంటే వచ్చే నిద్ర 

గొప్పదనుకునేవు!

నీకైనా,నాకైనా
కాలం తయారు చేసిన
మట్టిఊయల సిద్దంగ  ఉందని
గుర్తెరగడం మర్చిపోకు” 
      పట్టుమని పాతికేళ్ళు లేని యువకుడు “కాలం తయారుగ ఉంచే మట్టి ఊయల” గురించి ఎలా మాట్లాడుతున్నాడు? ఇంతటి తాత్విక దార్శనికత ఈ అక్షరాల్లో ఎలా వచ్చింది?
ఈ యువ కవిత్వ తీరంలో విహరించి తన ఆలోచనల్ని ఇంత అర్థవంతంగా మలిచిన అతని అక్షరాల ప్రయాణంలోని కొన్ని అనుభూతుల గవ్వల్ని పరిశీలిస్తే….
“ఇదిగో అబ్బాయి…
కవిత్వంలో నీ బతుకు లేకపోతే
నిన్ను నీవు కోల్పోయినట్టే లెక్క” అని పుట్టమన్ను లాంటి అక్షరమొకటి చెప్పిందట.. అందుకే తన బతుకే తన కవిత్వంలో కనిపిస్తుంది. బతుకును కవిత్వం చేయటం అంత వీజీయా..!!
కడుపుల పేగుల్ని కుదిపేసే పేదరికం.. అమ్మ నాయిన ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుంటెనె ఇంట్లో పొయ్యి వెలిగే క్షణాలు.. బతుకు దారి పొంటి గుచ్చుకున్న ముళ్ళు.. అన్నింటినీ దాటి నాలుగు అక్షరం ముక్కలు నేర్చి నలుగురికీ చెప్పే టీచర్ అయిన తీరును.. తన దారంతా వెలుగు పూల నక్షత్రాలైన మనుషుల్ని అన్నింటినీ.. ఎంతో ఆప్యాయంగ అక్షరాల్లో కి తర్జుమా చేసుకున్నాడో ఈ ఆత్మగల్ల పద్యం.. “తీరొక్క పువ్వై” నానీల్లో చెప్పుకున్నాడు..  వచన కవిత్వమై ప్రవహిస్తున్నాడు.
కొన్ని చూద్దాం..
     అతి పేద కుటుంబం లో నుండి వచ్చాను. పేదరికాన్ని బొడ్డుకు కట్టుకొని ఆకలి తీర్చుకొనే కుటుంబం నాది. నేను ఎనిమిదో తరగతి లో చదువుతున్నప్పుడు నల్గొండ లో నాగార్జున సాగర్ బి.సి. హాస్టల్ లో ఉండేవాడిని. జోరున కుండ పోతగా వర్షం. ఆ సమయం లో, కనీసం పక్కవీధి కూడా తెలియని నా తల్లి నాకోసం ఒక చట్నీ డబ్బా (నూనె బాగా కారిపోతోంది) దాన్ని పట్టుకొని నా హాస్టల్ ముందు నిల్చొని ఉంది. చూసి, నా గుండె చలించి పోయింది……! అంటున్న ఈ కవి ఆ అనుభూతిని ఎలా కవిత్వం చేసాడో చూడండి..
“దారి తెల్వకున్నా.
ఎన్నో దూరాలు దాటి
నూనె కారిపోతున్న చట్నీ డబ్బా తో..
మా హాస్టల్ ముందు నిలబడ్డ
దేవగన్నేరు పువ్వు …అమ్మ !” అని రాసాడు..
“God pity the poor!” I shout,
And draw back my garment’s hem.
God pities the poor, no doubt;
But how am I pitying them?
           –  Amos Russel Wells
ఈ యువ కవి నాన్న పేరు కృష్ణయ్య! ఆయన బ్రతికినన్ని రోజులు కట్టెలు కొట్టి జీవితాన్ని దొర్లించాడు. ఈ కవి కి  ఉద్యోగం వచ్చిన మూడో రోజు తండ్రి చనిపోతే, తీవ్ర వేదనకు గురయ్యాడు. తండ్రి జీవితం లో సంతోషం అనేదే లేదేమో అన్న ఆలోచన తో కుమిలి పోయాడు. తన కుములుపాటును కవిత్వం చేసుకున్న తీరు చూడండి..
“మా ఇంట్లోని పేదరికాన్ని అంతా,
కొంచెం కొంచెం గా నరుక్కుంటూ వచ్చింది.
అందరూ నాన్న ఫోటో కు దండం పెడుతుంటే
నేను మాత్రం గొడ్డలి పక్కన కూర్చున్న
నాన్న రూపం గొడ్డలి లో కనిపించే సరికి”
..
   ఈ యువకవి అక్క పేరు హంసమ్మ. అతనికి పదేళ్ళ వయసున్నప్పుడు ఆ అక్క కిరోసిన్ పోసుకొని, కాల్చుకొని చనిపోయింది. చిన్నపిల్లాడిగా ఉన్న ఇతడిని ఆ  సంఘటన ను చూడనివ్వలేదు.. ఆ సందర్భాన్ని గుర్తు పెట్టుకొని .
“ఎక్కడి నుంచో రేగుపండ్ల వాసన
వచ్చేది మా హంస అక్కే అయ్యి ఉంటుంది.” అంటూ అక్కను కవిత్వంలో బతికించుకుండు.
***
“మా ఇంట్లో దొంగలు పడ్డారు. నా పేదరికాన్ని దోచుకు పోతే బావుండు”. అన్న నా కవితా వాక్యాలు చదివిన  ప్రతి సారీ, నాలో ఓ దుఃఖం నన్ను చుట్టేస్తుంది. నా పేదరికమే నా కవిత్వం అయ్యింది. నా వేదనను నాలో నుండి వొంపుకునేందుకు కవిత్వాన్ని ఎంచుకొన్నాను. నా చుట్టూ ఉన్న పేదరికాన్ని కవిత్వం గా మార్చాలని భావిస్తాను. కవిత్వం ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నాను. నా కవిత్వం తో ఈ సమాజం లో ఎక్కడైనా ఒక చిన్న చలనం వచ్చినా నా కవిత్వానికి ఓ సార్థకత. నేను రాసిన ఒక కవిత కు స్పందించి ,  మా ఇంటి దగ్గర ముసలి అవ్వ కు మానసా మేడం, యశస్వి సర్ ఆర్ధిక సహాయం చేసారు. దుస్తులు పంపినారు. చాలా సంతోషించాను.
    ఇవి ఆయనతో సారంగ మాట్లాడినప్పుడు చెప్పినవి.  ఆయన మాటల్లోనే ఒక వినమ్రత, ఒక  సాహిత్యాభిలాష కనిపిస్తుంది.  ఈ యువ కవి “తగుళ్ళ గోపాల్”. పట్టుమని ఇరవై ఐదు ఏళ్ళు కూడా నిండని ఈ గోపాల్ కలకొండ గ్రామం, మాడ్గుల మండలం, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా, తెలంగాణా  ప్రాంతానికి చెందినవాడు.
ఆయన తో మాట్లాడినప్పుడు …..” సారంగ లో నా కవిత వస్తుందని ఎన్నో సార్లు ఎదురు చూసాను. కానీ, ఈ రోజు సారంగ లో నా కవిత్వం గురించి, నన్ను కవిత్వ తీరాలకు పరిచయం చేయడం, నేను ఎంతో అదృష్టంగా భావిస్తాను ” అని ఎంతో సహజంగా చెప్పుకొచ్చాడు.
****
టి.టి.సి. కోర్స్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ త్యాగరాయగాన సభ లో  అస్తిత్వ పుష్పాలు అనే సభ జరిగింది. అది నారాయణ శర్మ గారు రాసింది.
అందులో ఒక నానీ..
నాది ఒంటరి ప్రయాణం,…
నాన్నకు దిగులు …
బాగులో
పుస్తకం వేసుకొన్న…..
       ఇది చదివాక, నేను కూడా రాయగలుగుతాను అని నానీ లు మొదలు పెట్టినాను. అప్పుడే నాకు ఈ సాహిత్యం మొదలైంది. జనరల్ గా రాసుకొన్నా, నానీ లు రాసే క్రమం లో గోపి సర్ సాహిత్యం చదివే అవకాశం దొరికింది. నాకు తెలియకుండానే, వచన కవిత్వం రాయడం మొదలు పెట్టినాను. సాహిత్య ప్రయాణం ఇలా మొదలైందని చెప్పుకొస్తాడు.
                    ****
తన చుట్టూ అలుముకున్న పేదరికాన్ని వస్తువుగా చేయడం వెనక సమాజ అసమానతలను అతి జాగ్రత్తగా ఎత్తి చూపి, అంతే ఆర్ధ్రతగా ఆ అసమానతల వెనుక వేదనను పాఠకుడి కి రీచ్ అయ్యేలా చేసే లవ్లీ మెజిషియన్ గోపాల్.
“గంజి” అనే కవిత లో,
“జరం తో పిల్లలు కాలి పోతుంటే..
లే నాయినా, గంజి తాగుదువాని,
గుడిసె లో అమ్మ వినిపించే పాత బతుకు పాట గంజి…
అమ్మా! బతుకు మీద ఆశ సస్తుంది.
వెచ్చని గంజి పోసి, ఇంత దొడ్డుప్పు కలిపి
మళ్ళీ నన్ను బతికించవే…”
    తన బ్రతుకు నుండి రాసిన కవిత్వం ఆత్మాశ్రయ కవిత్వమే అయినా దుర్మార్గమైన పేదరికపు జాడల్ని పరిచయం చేస్తాడు. ఆ పేదరికం లో మనల్ని తడిపి ముద్ద చేస్తాడు. చాలా సందర్భాల్లో వ్యక్తాశ్రయం లాగ అనిపిస్తుంది. కానీ, నిబద్దత, నిమగ్నత ఈ రెండూ గోపాల్ కవిత్వం లో అడుగడుగునా కనిపిస్తాయి. ఆయన లోని మానవ సంబంధాల విలువ గురించి చెపుతాయి.
చిన్నప్పటి నుండి  పశువులు కాసిన ఆ బాల్యపు జ్ఞాపకాలన్నీ “ముల్లు పాటం ‘ అనే కవిత రాసుకొన్నాడు.  అందులో..
“కంపల మీదంగా
వరికొయ్యల మీదంగా
ఎగిరి దుంకి ఆవుల్ని మర్లేసినాక
తూట్లు పడిన జల్లెడ లాగ అరికాళ్ళు
ఎక్కడ కూర్చుంటే అక్కడ,
కాళ్ళను ముందల వేసుకొని,  
ముళ్ళను తీయడం తోనే,
గడిచి పోయింది బాల్యం”
గోపాల్ తన తాత గొర్రెలు కాస్తున్నప్పుడు పడిన వేదనను, ఆయన బ్రతుకు ను కవిత్వం చేసాడు. అదే “దండ కడియం”  కవిత. ఒక గొర్ల కాపు కాసే వర్గ జీవితం ఎలాంటిదో పూర్తిగా తెలియచెప్పే కవిత ఈ కవిత..
“చెవిపోగును వీడని
సగం కాల్చిన కానుగాకుసుట్ట
బతుకుకు కొప్పెర వెట్టినట్టు గొంగడి
నిలువెడు గుంజంత మనిష” ని
నీ బొమ్మను ఎవరైనా మాటల్తో గీస్తుంటే
ఎట్లుంటడో ఒక్కసారైనా చూడాల్నని
పానమంతా తండ్లాడుతది.
నేను తొట్టెల్లో ఉన్నప్పుడే
నా పేరువెట్టి
నింగిలో చీకటిని మేస్తున్న
ఆ చుక్కలమందను కాసేటందుకు
ఎల్లిపోయినవంట
గోపిగా అన్న పిలుపు వినబడితే
ఏ లోకంలోనో నిలవడి
నువ్వే దీవెనలు ఇస్తున్నట్లుంటుంది తాతా!”
ఇది కూడా ఆత్మాశ్రయ కవిత్వమే,  అయితే ఈ అసమానతల వేదన రాజ్యాన్ని ప్రశ్నించినట్లే ఉంటుంది. తను పడిన బాధను ఇతర వర్గాల వాళ్ళు చదివినప్పుడు పేదరికం ఇంత దారుణంగా ఉంటుందా ?  అని ఒక్కసారి చలించి పోయిన సందర్భాలు రావాలని గోపాల్ ఆశయం. సమాజం లో ఎక్కడో ఒక చోట చలనం రావడం నా కవిత్వ అంతిమ లక్ష్యం అనుకొంటుంటాడు గోపాల్.
    అందులో భాగంగా గోపాల్ తన స్వరాన్ని చాల తీవ్రంగా వినిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. జరుగుతున్న దారుణాలపై రాజ్యాన్ని నిలువునా ప్రశ్నించిన వైనం “నెత్తుటి పాదాలకు “ అనే కవిత లో చూడొచ్చు.
“ఇంకెప్పుడైనా
రైతు ఊపిరి చెట్ల కొమ్మలకు వ్రేలాడితే,
తోలు చప్పుల సప్పుడే
దేశమంతా, జాతీయ గీతమై మారు మ్రోగుతుంది.”
రైతుల ఆత్మహత్యలను, రైతుల ధర్నాలను దృష్టి లో ఉంచుకొని,  రైతులు కేవలం పంట పండించడమే కాదు. వాళ్లకు ఉద్యమం చేయడం కూడా వచ్చు అని చెప్పడమే. ఆ కవిత యొక్క ఉద్దేశ్యం.
ఇదంతా.. ఒక ఎత్తు అయితే…
సమాజం లో అనేక మంది మహిళల పై జరుగుతున్న అకృత్యాలపై గోపాల్ స్పందించిన తీరు అద్భుతం. గాయపడ్డ మహిళలు తన స్వంత అక్క లాగా భావించి, రాసుకొన్న కవిత.. “ నా బంగారం కదూ”
“వాడిదేం పోయింది…
ఎక్కడికెళ్ళినా కాలరేగిరేసి,
నాలుగు మూరల ఆడ పూలను 
కొనుక్కొంటారు.
నిన్ను కన్న వాళ్ళను మాత్రం
నేల పై పొర్లాడి పొర్లాడి ఏడుస్తూ…
కళ్ళలో కోటి దీపాలు వెలిగించుకొని
నీకై జీవితాంతం వెతుకుతారు.
….
నిన్ను మోసం చేసిన వాళ్ళ మొఖం పై
ఉమ్మేసి పగలబడి నవ్వక్కా…!
నీ నవ్వుతో మా కన్నీళ్లను తుడిచెయ్..!”
ఈ కవితపై  గోపాల్ తో మాట్లాడితే, కవితలో తన అక్క కాదనీ, చాలా మంది బాధిత మహిళలను తన స్వంత అక్కలుగా భావించి రాసిన కవిత అని చెప్పినారు.
దేశమంతా ఉలిక్కిపడి.. కవులంతా స్పందించిన “ఆసిఫా” సంఘటనపై
“నిన్ను చూడనీక
దేశమంతా ఒక్కటై నడిచొస్తుంది
నా బిడ్డ కంటినిండ నిద్రపోతుందని
ఈ నోరుతో ఎట్లా జెప్పను ?…..” 
అంటూ ఆసిఫా తల్లి స్థానంలా ఆలోచించి ఈ కవి ఒకింత విలక్షణంగా స్పందించి రాసి పాఠకుల హృదయాలను చలింపజేశారు.
*****
ఊర్లో కులాల పట్టింపుల వల్ల ఇద్దరు ప్రేమికుల జంట చని పోవడం జరిగింది. ఆ సందర్భాన్ని ఎంత హృద్యంగా “నొసటి పై గాయం” అనే కవితలో చెప్పారో చూడాలి… తన మిత్రుడు మామిడి పండు ను కొట్టబోయి, రాయి విసిరితే, గోపాల్ తలకు గాయం అయ్యింది. ఆ మిత్రుడు, కుల పట్టింపుల వల్ల ఉరి వేసుకొని చనిపోతాడు. గోపాల్ తల పైన గాయాన్ని చనిపోయిన మిత్రుడి తల్లి వచ్చి గోపాల్ నుదిటి గాయాన్ని ముద్దాడటం ఎంత ఆర్ధ్రతగా చెప్పాడో చూడాలి.
 “కుల తుఫాను వీచి
వాడి ప్రేమ చెట్టు విరిగి పోతే,
అడ్డు గోడలు కట్టుకొన్న
ఈ మనుషుల మధ్య బతకలేక,
నా కొడుకు సల్లంగుండాలి అని
అమ్మ కట్టిన ముడుపు పక్కనే
ఆ లేత కొమ్మకు వ్రేలాడే !!!”
“వాళ్ళమ్మ మా ఇంటి దిక్కు వస్తే,
నా నొసటి పై గాయాన్ని ముద్దాడి పోతుంది.
ఎదపై రెండు కన్నీటి బొట్లు రాల్చి,
తడి కవితగా మారుస్తుంది.”
***
ఈ యువ సాహితీ కెరటం కొత్త కవిత్వ తీరానికి పరిచయం చేసే క్రమంలో ఆయనతో ఫోన్ మాట్లాడటం జరిగింది. ప్రతి క్షణం గోపాల్ చాలా శ్రద్ధతో సమాధానం ఇవ్వడం..ఉత్సాహంగా కవిత్వఅంశాలపై చర్చించడం..నిబద్ధత తో నిక్కచ్చిగా సమాధానం ఇవ్వడం చాలా సంతోషం అయ్యింది.
 “ఒకే ఆకాశాన్ని కప్పుకున్న వాళ్ళం” అంటూ అరచేతుల్ని ఆప్యాయంగా ముద్దాడే తగుళ్ళ గోపాల్ కవిత్వానికి  రెండు తెలుగు రాష్ట్రాల సాహిత్య చరిత్రలో ఒక పేజీ కేటాయించబడిందనడం లో ఎలాంటి సందేహం లేదు.
*

సి.వి. సురేష్

63 comments

Leave a Reply to thagulla gopal Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కవిత్వ తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. తగుళ్ళ గోపాల్ కవిత్వాన్ని విశ్లేషణాత్మకంగా తీరం చేర్చారు. అభినందనలు సురేష్ గారు!
    – ప్రగతి

  • మొదటగా సారంగా లో మీ శీర్షిక క్విహ్ఊఊస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది సర్…శుభాభినందనలు..
    కొత్త కవిత్వ తీరాలు..ఔత్సాహిక కవులను సాహితీ లోకానికి మీ శైలిలో పరిచయం చేయడం చాలా బాగుంది…కవిత్వంలో బతుకును చూపగల స్వచ్ఛత వారి కవిత్వానికి జీవాన్ని తెచ్చింది..మీరన్నట్టు..నిబద్ధత నిమగ్నత కలిగి..చాలా ఇష్టంగా బాధ్యతగా కవిత్వాన్ని రాస్తారనడానికి మీరు తీసుకున్న కవితా వాక్యాలు..నిదర్శనాలు..దండ కడియం..నాన్న గొడ్డలి..ఆసిఫా కవితలు అనుబంధాల్ని ఆర్ధ్రతను ఒలికిస్థాయి..
    మీ మొదటి వ్యాసానికి ఈ ఆత్మ గల్ల పద్యం వంటి తమ్ముడిని ఎంచుకున్నందుకు సంతోషం గా ఉంది..
    మీ సాహితీ ప్రయాణంలో సారంగా శీర్షిక మరో గొప్ప మైలురాయి కావాలని మనఃపూర్వకముగా కోరుకుంటూ….
    అభినందనలు CV సర్ కి….తమ్ముడు గోపాల్ కి..సారంగా నిర్వాహకులు అఫ్సర్ సర్ గారికి ..

    • అక్కా…మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు.సారంగ శీర్షికలో మొదటిగా నన్ను పరిచయం చేయడం ఎంతో ప్రోత్సాహాం.

    • Rajeswari…చాలా సంతోషంగా ఉంది మీ కామెంట్ ..ధన్యవాదాలు

  • Lovely,magicianగోపాల్ గారి కవిత్వం,బాగుంది, వారిని,ఇంటర్వ్యూ,+పరిచయం చేసిన.విధానం బాగుంది CV సర్💐👌.మీ ప్రోత్సాహం తో,ఇలాటి జాతి రత్నాలు మేలి సాహిత్య ముత్యాలు,పైకీ రా వాలి అనికోరుకొంటునం!👍.

    • నమస్కారం మేడం.చాలా సంతోషం.ధన్యవాదాలు మేడం.

  • కండ్లనిండా నీళ్ళు నిండినయి సార్ .ఏం మాట్లాడలేను.నా వాళ్ళందరిని,నా తొవ్వను,నా కవిత్వాన్ని గుర్తుచేసుకునేలా చేసిన మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పను.నా కవిత్వంలో వివిధ కోణాలను పరిచయం చేయడం నా అదృష్టం కాక మరేముంటుంది.సారంగకు వేల నమస్కారాలు.కొత్తకవిత్వ తీరాలలో నేను మొదటివాడిని కావడం చెప్పలేనంత ఆనందమనిపించింది సార్ .ఒకే ఆకాశాన్ని కప్పుకున్నవాళ్ళం కవితకు మీరు చేసిన అనువాదం ఎంతో గుండెధైర్యాన్నిచ్చింది.మళ్ళీ ఈ వ్యాసం .మీ ప్రేమకు అనేక ధన్యవాదాలు సార్ .

  • మట్టి వాసనలతో ఉండే తమ్ముడు తగుళ్ళ గోపాల్ కవిత్వం నాకూ ఇష్టం ..మంచి కవిగా తనకంటూ ఓ చోటు ఏర్పరుచుకున్న గోపాల్ కి చక్కని విశ్లేషణ చేసిన మీకూ అభినందనలు

    • అక్కా…మీ ప్రేమకు ధన్యవాదాలు.మీ ప్రేమను పొందడం నా అదృష్టం

  • Wov ..superb analysis..
    Good poet. Excellent review sir..

    గోపాల్ ను పట్టి చూపించారు…

  • సర్.. ‘కొత్త కవిత్వ తీరాలు’ ఎలా ఉండబోతోందో ఆరంభ ఎపిసోడ్ అంచనాలు పెంచేసింది. కొత్త కలాలను పరిచయం చేయాలని సంకల్పించిన అఫ్సర్ సర్ కు ముందుగా ధన్యవాదాలు. ఇది వారి భవిష్యత్తు కు ఇంధనంగా ఉంటుంది. ఈ శీర్షిక నిర్వహణకు మిమ్మల్ని ఎంచుకోవటం కొత్త కవులకు వేడుక. మొదటి భాగానికి ఆత్మ గల్ల పద్యం తమ్ముడు తగుళ్ళ గోపాల్ సమగ్ర పరిచయం శీర్షికకు వన్నె తెచ్చింది. ఏ వస్తువు ఎంచుకున్నా.. ఆర్థృత ఆప్యాయతలు నింపి అక్షరాలను ఆలోచనాత్మకంగా మలచగల ఈ యువకవి కవిత్వపు అంతరంగాన్ని ఎంతో గొప్పగా ఆవిష్కరించారు. హృదయపూర్వక శుభాకాంక్షలతో చాలా ధన్యవాదాలు సర్. Expecting more wonders from your golden pen.💐💐💐
    తమ్ముడూ గోపాల్ ఆత్మ గల్ల పద్యానివి you deserves it .. హృదయపూర్వక అభినందనలు తమ్మీ. 💐

    • సొంత తమ్ముడి లెక్క ప్రేమించే అక్కకు ధన్యవాదాలు చెప్పి ఆగిపోలేను అక్క.

  • గుండెల్ని తడిమే అక్షరాలు
    మీ విశ్లేషణకు అన్ని విధాల అర్హుడు
    గోపాల్, మంచికవిత్వానికి చిరునామాగా
    నిలిచిన ఈ యు‌వకవికి అభినందనలు 💐
    ఇలాంటి యువగళాలను ప్రోత్సహిస్తున్న
    మీ కలానికి నమస్సులు సురేష్ జీ 🙏🙏

  • యువ కెరటాన్ని చక్కగా వొడిసి పట్టారు సార్.

  • good reveiw sir
    brother thagulla gopal eligible poet to this type of reveiw.
    heartly congratilations both of you sir.
    thank u.

  • సహజత్వం ఉట్టిపడే కవిత్వాన్ని రాసిన తమ్ముడు గోపాల్ కి అభినందనలు..మీ విశ్లేషణ చాలా బాగుంది సర్..

  • కవి బాల్యాన్ని, కవిత్వపు మూలాలనూ హృద్యంగా ఆవిష్కరించారు Cv Suresh sir,
    వ్యాసం ఆద్యంతం కవి గుండె తడిని అనుభూతిలోకి తెచ్చింది…
    తమ గతాన్నీ & నేపధ్యాలనూ మరచిపోని, మరువలేని కళాకారులందరూ లోకానికి జీవితపు లోతుల్ని చూపుతారనటం నిస్సందేహమైన విషయం…
    తమ్ముడు Gopal గారికి అభినందనలు.

    • అన్నా…మీ ప్రేమకు వేల నెనర్లు.చాలా సంతోషం అన్న.

    • మీ ప్రోత్సాహానికి నమస్కారం అన్న.చాలా సంతోషం

  • హృదయ పూర్వక శుభాకాంక్షలు మిత్రమా…మీ కవిత్వానికి గొప్ప గౌరవం ఈ పరిచయం విశ్లేషణ…
    సర్ మీ కవితా ఆత్మను ఆవిష్కరించారు…శుభాకాంక్షలు💐💐💐💐💐

    • ధన్యవాదాలు సార్ .ఆ పేరుతో పిలువడం నాకు మరింత ఆనంద.

  • కంగ్రాట్స్ సురేష్ అన్నా. అరంగేట్రం బాగుంది.

  • విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది సర్. అతని జీవితాన్ని చదివుతున్నట్టనిపిస్తుంది. అతని ఔన్నత్యాన్ని అందనంత ఎత్తులో నిల్చోపెట్టేలా ఉంది సర్..🙏🙏

    • ధన్యవాదాలు సర్ రవి ప్రసాద్ గారు

  • తమ్ముడు గోపాల్ పేదరికానికి అర్థం చెప్పే డిక్షనరీ వయ్యావు…..నీ కవిత్వం అజరామరం…. అభినందనలు తమ్ముడు…
    సురేష్ సార్ తమ్మున్ని చాలా బాగా పరిచయం చేసిండ్రు….మీ ఓపికకు ధన్యవాదాలు… అభినందనలు.

  • ఇవాళ కవిత్వం రాస్తున్న తరం లో తమ్ముడు గోపాల్ ది అద్భుతమైన, విలక్షణమైన స్వరం. ఆ స్వరం లో మట్టి వాసనలున్నాయి, తెలంగాణ జీవితం వెలుగు నీడలున్నాయి, తనదైన ప్రత్యేక భాష ఉన్నది, తనకే సొంతమైన స్వరమది. ఇంతకన్నా ఎక్కువ ఇక్కడ నేను రాయలేను, రాయకూడదు కూడా 🙂 – గోపాల్ కవిత్వాన్ని పరిచయం చేసిన సురేష్ కు నెనర్లు అభినందనలు

    • అన్నా…మీ ప్రేమను పొందిన నేను చాలా అదృష్టవంతుడిని.మనల్ని కలిపిన ఈ అక్షరానికి నమస్కరిస్తున్న అన్న.

  • చాలా బాగుంది తగుళ్లగోపాల్ కవిత్వం మరియు మీ సముచిత సమీక్ష. కవిత్వం గోపాల్ జీవలక్షణం అని తెలుస్తున్నది. అనేక జీవన సందర్భాలని కవిత్వీకరించటంలో గోపాల్ ఆర్తి, తపన కనిపిస్తున్నది.మంచి కవిని పరిచయం చేసినందుకు అభినందనలు.

    • నమస్కారం సార్ .అనేక ధన్యవాదాలు సార్ .

  • తగుళ్ల గోపాల్ హృదయాన్ని మీరు అక్షరావిష్కరించారు. తగుళ్లను తుమ్మి పువ్వులా గుండెకు తగిలించారు. యువ కవుల భవిష్యత్తును తీర్చిదిద్దే మీ కృషి అనంత ‘సారంగ’ రాగంలా సాగాలని ఆకాంక్ష. అభినందనలు.

  • పిట్ట కొంచెం కోత ఘనం గోపాల్ గారికి అక్షరాలా వర్తించే సామెత. నిజంగా నన్ను మొదటి నుంచీ ఆశ్చర్యం లో ముచెత్తుతున్న ఈ నవ యువ కవికి అభినందనలు. 💐💐💐

  • తెలంగాణా మాండలికపు మట్టిలో తన కన్నీళ్లను కలిపి అందమైన ఆర్దత నోలికించే ”కవితా కుడ్యాలను” తయారు చేసాడు మన గోపాల్. జీవితంలో స్వానుభవమైన కష్టాల్ని దారాలుగా చేసి కవితా వస్త్రాలల్లాడు. చేనేత వస్త్రాల కున్న విలువ మెషిన్ మేడ్ వస్త్రాల కుండదుగా!! నాకిష్టమైన కవి…వారి కవిత్వాన్ని మీ లోతైన విశ్లేషణ తో వారి కవితా వస్త్రాలకు జరీ అంచు నేసినట్టుగా ఉంది.ఇరువురికీ శుభాభినందలు💐💐💐

    • నమస్కారం సార్ .మీ ఆత్మీయస్పందనకు నెనర్లు సార్ .

  • సోదరుడు గోపాల్ వ్యక్తిత్వాన్ని, కవిత్వాన్ని విశదీకరించినతీరు ఆద్యంతం అద్భుతంగా ఉంది
    సి.వి.సురేష్ గార్కి ప్రత్యేక ధన్యవాదాలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు