పాడెల్లాంటి పల్లకీలు
పల్లకీలను మించిన పాడెలు
ఎక్కినోడి గొప్పేమిటో
మోసేవాడి తక్కువేమిటో
అసలిదంతా చూసేవాడి తిక్కేమిటో .
Where do I efffffinggg stand ?
మోయించుకొనే వాడి
అసహాయ శూరత్వంలోనా
మోసేవాడి మానవత్వపు మూర్ఖత్వంలోనా
White and black shades
బుర్రకి తగిలించుకొని
గ్రే లైఫ్ లో ఈజ్
వెతుక్కోవడం స్లాష్ మర్చిపోవడం మధ్య confused souls కళ్ళు మూసుకొని కనే యుతోపియన్ కలలలోనా
Where do I stand corrected ?
Or
Should I even be corrected ?
ఇళ్ళు వొళ్ళు మరిపించిన
వేడి రక్తపు సిద్ధాంత కాలం ఒకటి
ఉద్వేగాలు భావోద్వేగాల
నడుమ ధైర్యాన్ని సవాలు
చేయమంటుంది ,
జైలుచువ్వల్ని సైతం స్నేహిస్తానంటుంది.
Do I stand there ?
పరుగాపని వయసు నడక
నడిసూర్యుడి వేడికి
ఈదరగా చుట్టూ ఈడ్చి కొట్టే
రాద్ధాంతం రాచకార్యం రమణీ గోచారం
హన్నన్నా ఎన్ననీ ఎన్నెన్ననీ
I stand there !
May be I stand here ?
Or should I ?
……..hmmmmmm!!!
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అంటూ humm చేసిన గొంతులు
రాసిన వేళ్ళని పాడిన గొంతుకలని
ఎత్తిన జెండాలను త్రాసులెక్కిస్తూ
అస్తమించే సూర్యుడు వంక నడవడానికి
జేబులు వెతుక్కొంటూ ఉంటాయి
మద్దెలెపుడూ ఓడే ….
ఆడలేకో..?
నెమలీకల మీద ఠాగూర్ రాతల్లా
రాచ ప్రభువు కంటి చూపుతో తల తెగే ప్రశాంతతల ముందు తలెత్తలేకో ?
Should I want to stand there ?
May be……. ..but no thanks !
కామన్ మ్యాన్కి
సిద్ధాంతాలు ఏమి ఉండవు . ఉండకూడదు.పీరియడ్ ….
అంటూ చిత్ర కారుడు ఆకాశానికి
నలుపు దిద్దే సమయానికి
నువ్వెక్కిన నావేమిటో
నీ గమ్యపు అర్థమేమిటో
నీ దారుల్లో మిగిలిన సత్యమేమిటో
వెతుక్కునే
హతవిధీ ! యే క్యా హు వా
కైసే హు వా ,కబ్ హు వా, క్యో హు వా అంటూ
కిషోర్ కుమార్ జీవిత గంటలు
గణ గణ మోగిస్తూ
ఉన్న ఆ unfortunate క్షణాన
….
….
నువ్వు నిలబడ్డ నేల
ఊబి స్లాష్ అగ్నిపర్వతం
అన్న రియలైజేషన్ ఏదయితే ఉందో చూడు భయ్యా……
That’s where life comes to a stand,
Just like a Perfect Still Picture .
కదలడానికి మెదలడానికి కన్రెప్ప సైతం
భయపడే క్షణాన
అసంకల్పిత ప్రతీకార చర్య గా కాళ్ళ మధ్య వెచ్చగా కారుతున్న ఉచ్చల మడుగు మీద సంకల్పిత
నేను ….నేనే
Yes sweet heart, I stand there .
పాడెల్లాంటి పల్లకీలు
పల్లకీలని మించిన పాడెలెక్కుతున్న విప్లవాలని
చూస్తూ మోస్తూ కూస్తూ నేనే
ప్రభువు భయంలో తలొంచుకొని మూగగా
వీలయితే ఊ ..కొడుతూ
వెన్ను మరింత జలదరించినపుడల్లా
జై…. కొడుతూ .
*
“Yes sweet heart, I stand there .
పాడెల్లాంటి పల్లకీలు
పల్లకీలని మించిన పాడెలెక్కుతున్న విప్లవాలని
చూస్తూ మోస్తూ కూస్తూ నేనే
ప్రభువు భయంలో తలొంచుకొని మూగగా”
బాగారాశారు. పాడేలాగే ఉందా పల్లకి
వెన్ను జలదరించినపుడు జై కొడుతూ..😭
ప్రభువు భయంలో తలొంచుకొని మూగగా
వీలయితే ఊ ..కొడుతూ
వెన్ను మరింత జలదరించినపుడల్లా
జై…. కొడుతూ .
అంతే అంతే