పది హైకూలు

1

నా భుజం మీద
పిచ్చుకొచ్చి వాలింది
మీరూ చూడండి

2

నల్ల మబ్బులు
ఒకింత జరిగాక
ఓ చందమామ

3

నిద్ర గన్నేరు
రాత్రి నిద్ర పోలేదు
పొద్దున్నే పూలు

4

నాన్న ఎన్నడూ
తన గాయాలమూట
విప్పనే లేదు

5

నాన్న చెప్పులు
తిరగేసి చూసాను
వందల ముళ్ళు

6

ఆకాశానికి
ఏడురంగులు వేసి
వాన వెళ్ళింది

7

ఆమె రాత్రంతా
నిలువునా చీలిన
గాయమౌతోంది

8

బఠాణి పూలు
పాత పెంకుటింటికి
అందాన్నిచ్చాయి

9

బెల్లపు ముక్క
చేదు జ్ఞాపకాలని
తీపి చేసింది

10

ఇటుక రాయి
రేపటి భవనాన్ని
కలకంటోంది.

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం

పొట్లూరి మోహన రామ ప్రసాదు

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • హైకూలు కొత్తగా బావున్నాయి

  • మోహనా
    మొదటిది తప్ప తక్కినవన్నీ
    మోహనంగా వున్నాయ్
    చెప్పేదేముంది
    హైకూ ఆకసమై పరుచుకున్నావ్
    తరచూ ఎన్నెన్ని మెరుపులో…
    మబ్బుల నీళ్లు కళ్లాపులాగా
    నీ హైకూ చినుకుల చిద్విలాసం
    మదిమదినీ తడి చేస్తూ
    -డా. సశ్రీ

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు