అట్లా
ఎట్లా వచ్చావో తెలియదు
అదాటుగా తలుపు తీసిన
తుంటరి గాలి లాగా
నువ్వు వచ్చాక
కొత్త భాష
పరిచయం చేశావ్
ఎలాంటి అనుమతి లేకుండా
ఆత్మలోకి సరాసరి
ఓ చిన్న సీతాకోకలా వాలి
గొప్ప సందడి చేస్తున్నావ్
నేను ఇప్పుడు
అడ్డుకోలేని తనం లో ఉన్నాను
నా
పరీవాహక ప్రాంతం
సారవంతం చేశావ్
అక్కడ ఇప్పుడు
నదులు పుడుతున్నాయ్
నడుస్తున్న పాదాల కు
పులకరింతల పూలు పూస్తున్నాయ్
దోసెడు నీటిలో
నీ నవ్వు వికసిస్తూ ఉంది
సరాగాల ఊరేగింపు
ఎడతెగని వాన లాగా పాడుతున్నావ్
పాట
మీగడ కట్టిన పాట
మార్మిక స్వరంలో
మిటుతున్న పాట
తేనేజల్లు లా
తడుపుతున్న పాట
అన్ని కాలాల్లో
చుట్టుకున్న పాట
అరణ్యాన్ని
ఉద్యాన వనం చేసిన పాట
నిర్మించు
నిర్మించు
లోన ఇల్లోకటి నిర్మించు
గుమ్మానికి ఆనుకొని
చీకటిని చేరిపేసి
వెలుగుబొమ్మను
చెక్కుదాం
అసలు
ఒక్క ఉత్తరం కూడా
రాయకుండానే వచ్చావ్ కదా
నాపాటికి నేను
వాక్యాలు ఏరుకుంటూ
బతుకుతుంటే
నెగడు రాజేసి
ఏమి తెలియనట్టు
పసిపాపలా నవ్వేసి
దేహాన్ని చుట్టుకున్నావ్
నువ్వు నాకు
ఏమి అవుతావు
నేను
నీకు
ఏమి అవుతాను?!
*
నడుస్తున్న పాదాలకు పులకరింతల పూలు
Tqq sir
మీ కవితలలో పదాలను వాక్యాలను మేము కూడ ఏరుకుంటున్నాము సార్
చాలా బాగుంది సర్
అది కవితా సరస్వతి అవుతుంది , గోపాల్ సార్……
Tqq sir
చాలా హృద్యంగా వుంది.
అందమైన ఒక సెలయేరులా ఉంది అయ్య ఈ మీ పాట
Chala bagundhi sir
చాలా బావుంది అన్న..అలతి అలతి పదాలతో…
చాలా బావుంది సర్💐
మిత్రమా కవిత చాలా బాగుంది
Very nice expression sir