నిర్యాణం 

కరోజు మనం మిగలకపోవచ్చు
మరెప్పటికీ చేరుకోలేని దూరాలైపోవచ్చు
ఎవరికితెలుసు ఎవరెక్కడ దాగుంటారో చివరకు
ఇప్పుడున్న ఉషస్సులూ ఉపోద్ఘాతాలూ అప్పుడేమవుతాయో,
ఇప్పుడున్న పరిచయకథలన్నీ
మనతో వస్తాయో రావో,
 ఎలా తెలుస్తుందీ!
ఇక్కడపరుచుకుని మురిసే ఈ కాగితాలపై
రేపటి తుఫానుని ఊహిస్తే :
ఒకేఒక అక్షరవణుకు
నిండువాక్యాల పెనుగాలి
ఎవరికితెలుసు, ఎవరెక్కడ దాగుంటారో చివరకు!
ఎలా దాగుడుమూతలు ఆడుకుంటారో ఆఖరుకు!
*

అనురాధ బండి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు