నాలో కొన్ని నదులు దాగున్నాయి!

నా పేరు పేర్ల రాము. మా సొంతూరు వి.యస్. లక్ష్మీపురం.జిల్లా ,మండలం మహబూబాబాద్. పది వరకు ఊర్లో చదివి ,ఐదు సంవత్సరాల నుండి ఖమ్మంలోనే ఉంటున్న.  వ్యవసాయంలో నాన్నపడే కష్టాన్ని చూసి చిన్న చిన్న లైన్లు రాసుకునే వాడిని  ఆ కాస్త రాసిన లైన్ల వాళ్ళనే ఇవ్వాళ ఎంతో కొంత కవిత్వంలా రాయగలుగుతున్నాను. అనేక సందర్భాలలో నాలో నేను తడిసిపోయిన వాటిని కవిత్వం చేస్తుంటాను.కవిత్వమే మనిషిని మనిషిలా మారుస్తుందని, మనిషిని అందంగా తయారు చేయగలగుతుందని నమ్ముతాను. కవిత్వం చదవడం అంటే ఇష్టం రాయడమంటే ఇంకా ప్రేమ ఆ ప్రేమే ఇవ్వాళ నన్ను కవిత్వం వైపు నడిపిస్తుంది. కవిత్వంలో నడవడమంటే కలల్లో తడుస్తూ నడవడమే.
ప్రస్తుతం ఎస్.ఆర్.అండ్ .బి.జి.ఎన్. ఆర్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చివరి సెమిస్టర్ చదువుతున్నాను.

1.ఎర్రపూల పరిమళం

 

1.తెలియకనే అడుగుతున్న

ఆకాశాన్ని కొడవలితో ఎవరూ

కోయగలరూ??

నక్షత్రాలను నిచ్చెనేసుకొని

ఎవరూ తెంపగలరూ

 

2.ఏమో దారంతా చీకటితో నింపాలని

చూస్తున్నవేమో

ఒక్క మిణుగురు పురుగైనా చాలదా

వెలుగునింపడానికి

అంతెందుకు ఒక్కపూట చీకటైతే

మరొపూట వెలుగురాక మానుతుందా..

 

3.బయట ఎవరో నిప్పునుపట్టుకొని

నాలుగు కడ్డీలా మధ్య వదిలేశారంటా

ఇనుపకడ్డీలు వేడిని తట్టుకోలేక విరిగిపోయాయి

 

4.వాన చినుకుని దోసిట్లో పట్టుకొని

వర్షాన్ని మొత్తాన్ని పట్టుకున్న అనుకున్నడంటా.

ఒక్కసారే బలబల కురిసిన వానకి

తడిసి  వోణుకుపుట్టింది.

ఒక గది లో వెలిగించిన కొవ్వొత్తిని ఆర్పేసి

ఇక అంతా చికటే అని కళ్ళుమూసుకున్నడంటా

తెల్లారేసరికి సూర్యుని వెలుగొచ్చింది

 

5.ఎన్నటికైనా దోసిట్లో మట్టిని పట్టుకోగలవేమో

గానీ భూమినంతా తవ్వుకోలేవని

మనిషిని బంధించ గలవేమో గానీ

ఆలోచనని బంధించలేవని

ఇకనైనా తెలుసుకోని

 

6.బంధించిన సీతాకోకల్ని విడిపించూ

ఊపిరాడకుండా దాచిన ఫిరంగులను ఇచ్చెయ్

ఎత్తుకుపోయి దాచుకున్న

ఎర్రపూల పరిమళాన్ని  వదిలేయ్

లేకుంటే ఏ వానచినుకో , నిప్పుతునకో

ఏక్షణమైనా నిన్ను తవ్వడానికి రావొచ్చు.

 

*

 

2.

రెండు నదుల తడి

 

నది వాక్యాలు

రాయాలనిపించింది

నాలో కొన్ని నదులు దాగున్నాయి

అవి నాలో అనేక విధాలుగా ప్రవహిస్తాయి

అనేక సార్లు సంభాషిస్తాయి

కొన్నిసార్లు వాటి పరుగుల్లో ఒరుసుకోపోతాను

కొన్నిసార్లు వాటిల్లాగే ఎగిసిపడతాను.

 

అవి అచ్చం బయట గోదావరి ,కృష్ణ నదుల్లానే ఉన్న

లోపల మరో మనిషిలా నన్ను  కాపాడుకుంటాయి

ఎప్పుడైనా బాధనిపించినప్పుడూ

నన్ను తడి చేతులతో ఓదార్చుతుంటాయి.

 

నదుల్ని నా మనసులో

గట్లు గట్లుగా కట్టుకొని మరీ దాచుకున్న

జీవనదుల్ని జీవితపు కాలువల్లో వదిలేసా

పిల్లనదుల్ని స్వేదరంద్రాల ద్వారా బయటికొదులుతా

మోటార్ పైపుతో తడారిపోయిన ఎడారి కళ్ళను

తడుపుకుంటా.

 

నదులేం చేస్తాయో తెలుసా

అవి నాకు యుద్ధాన్ని నేర్పిస్తాయి

నాతో నదులేం చేయిస్తాయో తెలుసా

నాతో కవిత్వాన్ని రాయిస్తాయి

 

నిజానికి కొన్ని సార్లు నా  రెండు కళ్ళే

రెండు నదులౌతాయి

అప్పుడప్పుడు హృదయం ఒక నదిగా

మారిపోతుంది.

*

పేర్ల రాము

24 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఈ సారంగ లో నలుగురిని చదుకోవడమే గానీ నన్ను నేను చదువుకోవడం ఇదే మొదటి సారి. అందులో మా ఊరి పేరును చూసుకోవడం ఇంకా ఆనందాన్ని ఇస్తుంది. అక్షరాలు నన్నింత దూరం నెట్టుకొచ్చాయి అని బలంగా నమ్ముతున్న. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన సారంగ పత్రికకు మరియు అఫ్సర్ సర్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు💐💐💐

    • డియర్ రాము..
      హృదయపూర్వక అభినందనలు..
      రెండు కవితలు చాలా బాగున్నాయి..
      కీప్ గోయింగ్..💐💐💐

      • చాలా చాలా సంతోషం …ధన్యవాదాలు సర్💐💐

  • నీ కవిత్వం అద్భుతం రాము

    • అక్క….చాలా సంతోషం. ధన్యవాదాలు💐💐

  • చాలా బాగున్నాయి రాము నీ కవితలు. మొదటి కవితలో ఆసాంతం ప్రతిధ్వనించిన hope నచ్చింది. రెండవ కవితలో నీలోని నదులు నీకు యుద్ధం చేయడం నేర్పిస్తాయని చెప్పడం చాలా నచ్చింది. ఈ వాక్యం గుర్తుండిపోతుంది. Keep reading and keep writing. My best wishes.

    • ఇంతటి మీ ఆత్మీయ స్పందనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు💐💐💐

      • రామూగారూ! మీ రెండు కవితలూ రెండు ఆణిముత్యాలు. మొదటిది జైల్లో బంధించబడిన మేథో సూర్యుల్ని అరచేతులు అడ్డుపెట్టి ఆపలేరని హెచ్చరిస్తూ రాసిన కవిత. రెండోది గుండెల్ని తడిపేసే ,కళ్ళల్లో కన్నీటి నదుల్ని పొంగించే గొప్ప మానవీయ కవిత. వండ్రఫుల్ రామూగారూ…ఇలాగే ముందుకు సాగండి. మీకు మంచి భవిష్యత్త్ ఉంది. హృదయ పూర్వక శుభాభినందనలు🌹🌼🌺🌸🌹

  • వరవరరావు,సాయిబాబా మొదలైన మేధావులను వెంటనే విడుదల చేయాలనే విషయాన్ని కవిత్వం చేసిన తీరు బాగా నచ్చింది.రెండవ కవిత మరింత నచ్చింది.మనలోపలి సంఘర్షణలను చిత్రించిన గొప్ప కవిత.నీదైన వాక్యం పదునుదేరింది రామూ…ముందుకు సాగిపోవాలనీ మనసారా కోరుకుంటున్న.

    • అన్నా….. ధన్యవాదాలు
      చాలా చాలా సంతోషం. నీ ఆత్మీయ ప్రేమకు లవ్యూలు…💐💐

  • రామూగారూ! మీ రెండు కవితలూ రెండు ఆణిముత్యాలు. మొదటిది జైల్లో బంధించబడిన మేథో సూర్యుల్ని అరచేతులు అడ్డుపెట్టి ఆపలేరని హెచ్చరిస్తూ రాసిన కవిత. రెండోది గుండెల్ని తడిపేసే ,కళ్ళల్లో కన్నీటి నదుల్ని పొంగించే గొప్ప మానవీయ కవిత. వండ్రఫుల్ రామూగారూ…ఇలాగే ముందుకు సాగండి. మీకు మంచి భవిష్యత్త్ ఉంది. హృదయ పూర్వక శుభాభినందనలు🌹🌼🌺🌸🌹

  • రెండు కవితలూ బాగున్నాయి.

    వాన చినుకుని దోసిట్లో పట్టుకొని

    వర్షాన్ని మొత్తాన్ని పట్టుకున్న అనుకున్నడంటా.

    ఒక్కసారే బలబల కురిసిన వానకి

    తడిసి వోణుకుపుట్టింది.

    👏👏

  • చాలా బాగా వర్ణించావు అన్న చాలా బాగున్నాయి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు