కవి నిత్యసత్యాగ్రహి అన్నాడు శేషేంద్ర. కాలం కవిని తయారు చేస్తే కవి కవిత్వంతో కాలాన్ని శాసిస్తాడు. మూలాల్లోంచి పెల్లుబికే చైతన్యంతో కవిత్వం ఈనాడు పరిఢవిల్లుతోంది. ఇటీవలికాలంలో తెలుగు కవితా లోకంలో సుంకర గోపాలయ్య కవిత్వం పరిచయం లేని వారు అరుదనే చెప్పాలి. 38 ఏళ్ళ ఈ యువ కవి గత 17 సంవత్సరాలుగా కవిత్వంలో మునిగితేలుతున్నాడు. అతి సామాన్య పరిస్థితి లోంచి అనన్య సామాన్య కవిత్వాన్ని సృష్టిస్తున్నాడు. నెల్లూరు జిల్లా నాయుడు పేట సమీపంలో సువర్ణముఖి నదికి ఉత్తర భాగాన రాచపాలెం అనే అతి చిన్న పల్లెటూర్లో పుట్టిన గోపాలయ్య తెలుగు సాహిత్యాన్ని టెలిస్కోప్ కళ్ళతో దర్శించాడు. పుట్టి పెరిగిన ఊరిని వాతావరణాన్ని ఎక్కడికెళ్లినా ఎంత ఎదిగినా వీపున మోస్తూనే ఉన్నాడు.అందుకే తన కవిత్వం నిండా వూరి కలవరింతలు పలవరింతలు,ఆశలు ఆక్రోశాలు క్యూ కడుతుంటాయి. ఐదుగురు పిల్లల్లో ఒకడిగా పెరిగిన వాడు కనుకనే మానవ సంబంధాల పట్ల అతనికంత గుఱుతు. చెరువులో చేప పిల్లై,తోటల్లో సీతాకోకచిలుకై, చిరిగిన సంచిలో విరిగిన పలకై తిరిగిన వాడు కాబట్టే అతని కవిత్వంలో అంత పచ్చదనం.
మొదట్నుంచి ప్రతిభావంతుడైన గోపాలయ్యలో కవిత్వం విత్తనంలో మొలకల లా ఉన్నప్పుడు ఆ విత్తనం పై నాలుగు చినుకులు చల్లి మొలకెత్తేలా చేశారు రాధేయ . ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి మధ్యలో ఉన్నత పాఠశాల లో కొంతకాలం కాలు మోపి అక్కడినుంచి ఒకేసారి డిగ్రీ కాలేజీ అధ్యాపకుడిగా గోపాలయ్య సాగించిన ప్రయాణం అనితర సాధ్యం.

విశేషంగా చదివే గుణం గల గోపాల్ అంతే విస్తృతంగా కవిత్వము రాయగలడు. లోతుల్లోని కవితా అంశాలను పసిగట్టగలిగిన ఇతను అంతే లోతుగానూ ప్రసంగించగలడు. నగరం లో జీవిస్తున్నా అచ్చు జానపదుడిలా అనిపించడానికి అతని పల్లెమూలాలే కారణం. జేబులో ఎప్పుడూ పదాలనిప్పులు వేసుకుని తిరుగుతుంటాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నాలుగు నిప్పులు రాజేసి వాక్యాలకు అగ్ని సుగంధాలు అద్దుతుంటాడు.
మనుషుల్లో మెలిగిన వాడు కాబట్టే మనిషి మిగిల్చిపోయిన ఖాళీని సుతారంగా తడిమి చూసుకుంటాడు. అది ఎంతవరకు వెళ్లిందంటే స్మృతి కవిత్వం మీద పరిశోధన చేసి డాక్టరేటు పొందేంతవరకు. నిలబడిన నేలని నడిచివచ్చిన దారిని ఎప్పటికప్పుడు తన కవితా వాక్యాలతో కళ్ళకద్దుకుంటూనే ఉంటాడు.
ఇతడు ఒక వాదం వైపు గాని ఒక వర్గం వైపుగాని ఒరిగి పోయేవాడు కాదు వెన్నెముక నిటారుగా నిలబెట్టి అన్యాయాన్ని నిలదీయ గలిగిన నిక్కచ్చితనం ఉన్నవాడు. అతని కవిత్వం ఏంటో అందులోని పదును ఏంటో నేను ఇప్పుడు చెప్పబోవడం లేదు. ఎందుకంటే “హోరు ప్రచురణ సంస్థ” వారు మా నాయన పాట పుస్తకాన్ని త్వరలోనే మీ ముందుకు తేబోతున్నారు. గోపాలయ్యకు, హోరు వారికి అభినందనలు తెలుపుతూ మా నాయన పాట కు స్వాగతం పలుకుదాం.
*
Tqq సునీల్
అఫ్సర్ గారు
Telugu Thalliki koduku putti unte neelaage undevaademo Gopal Sir.
బాగుంది అన్నా
మిత్రుడి నేపధ్యాన్ని చక్కగా అందించారు సునీల్…మా నాయిన పాట కోసం అంతా ఎదురుచూస్తున్నారు…..చక్కని కవిత్వంతో
అలరారే ఆ పుస్తకం ముందు ముందు హోరెత్తిస్తుందనడంలో సందేహమే లేదు..మిత్రులిద్దరికీ అభినందనలు
ధన్యవాదములు నేస్తమా
సారంగ వారికి ధన్యవాదాలు
గోపాలయ్య గారి గురించి సునీల్ గారు చెబుతుంటే రజనీకాంత్ గారి గురించి కమల్ హాసన్ గారు చెప్తున్నట్లే నాకు అనిపిస్తోంది…. అయితే తన కవితా సంపుటి ‘ మా నాయన పాట’ లోని తేనె ఊటలు ఆస్వాదించడానికి ఇక్కడ శానా మందిమి ఎదురుచూస్తున్నాము…..
ధన్యవాదాలు సార్
హహ బలేవోడివబయా
గోపాల్
మా నాయన పాట
సంచిక రావటం
సంతోషన్నిచ్చింది..
చిన్నప్పట్నుంచి చలి మంట వెచ్చదనం లో
బడి బాట నడకల్లో
స్నేహితుల కబురుల్లో
గోపాల్ కవిత్వం వింటూనే వున్న..
ఆరోగ్య కారం గా తడుస్తూనే వున్న..
గోపాల్ ప్రాస కవిత్వం నుంచి
తనకంటూ ఓ బాస ని
ఆవిష్కరణ శైలి ని
సూది మొన లాంటి
కవిత శిల్పాన్ని అందుకొని
ఇప్పటి మా నాయన పాట కోసం
సంచిక వరకు
నేనో పాఠకుడ్ని…
గోపాల్ కవితలో అక్షరాలు
జీరో గ్రావిటి లో ఉన్నంత తేలిగ్గా
ఉంటాయి..
కానీ
కవిత గా కుదిరాక
వాటి భావం తాలూకు భారం
భరించటం న్యూటన్ సూత్రం సరిపోదు..
మనిషి మనసు ముసుగుని
సమాజ సహజత్వాన్ని x ray తీసి
ఇంటిగుమ్మం ముందు
అందం గా
ఎర్రని రంగవల్లి లా ముద్రిస్తుంది..
గోపాల్
నాయన పాట..మాట..
చెప్పిన కథ..పద్యం
తిట్టు..ప్రేమ
జీవితం అన్ని నా జీవితం లో భాగమే..
గోపాల్
ఈ సంచిక లో కవిత లు అన్ని చదివాను..
కచ్చితంగా చెప్తాను..
పుస్తకం పేజీ తెరావటం మాత్రమే మన పని
చివరి పేజీ వరకు మిమ్మల్ని చదివిస్తుంది..
కొన్ని సార్లు ఇంటి పిట్ట గోడపై..
చెట్టు కొమ్మ పై..
పక్షి రెక్కల పై.
.ఆకాశంలో
గ్రద్ద కాలి గొర్ల కింద
నిప్పుల సోఫాలో
కూర్చొ పెట్టి చదివిస్తుంది..
చదివిస్తుంది..
పుస్తకమే పాఠకుడ్ని చదివిస్తే..
ఆహా ఇంకేం చెప్పాలి..
అదే
మా నాయన పాట..
థాంక్స్ గోపాల్
నన్ను పాఠకుడ్ని చేసినందుకు
మంచి వివరణతో కూడిన ఎదురు చూస్తున్న నాయన పాట నన్నెంతో ఆకట్టుకుంది….






When poem became simple it’s more beautiful
గోపాల్ కవిత్వం లో పదాలలో సరళత భావాలలో గాఢత ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి అటువంటి గోపాల్ కవిత్వాన్ని వెనకున్న నేపథ్యాన్ని సునీల్ చక్కగా ఆవిష్కరించారు ఒక మనిషి నేపథ్యం అతని కవిత్వానికి ఒక నిర్దిష్ట వ్యక్తిత్వాన్ని ఆపాదిస్తుంది
మా నాయన పాట కోసం ఎదురు చూస్తూ……
Super sir
♥️
గోపాల్
మా నాయన పాట
కవిత సంచిక రావటం సంతోషం…
గోపాల్ ప్రాస కవితలు నుంచి..
ఇప్పటి ఈ సంకలనం వరకు
నేను పాఠకుడ్ని.
గోపాల్ కవిత్వం లో
ఆరోగ్య కారం తడుస్తూనే వున్న..
వేకువ చలి మంట వెచ్చదనంలో
బడి నడకల్లో
స్నేహాతుల కబురుల్లో..
ఆటల్లో… ఆకల్లో..
గోపాల్ కవిత మా వెంట ఉండేది..
గోపాల్ ఓ ప్రత్యేకం..
తనదైనా ఆవిష్కరణ శైలి..
సూది మొన లాంటి శిల్పం..
హంగుళ్ళేని ప్రకృతి..
ఆర్భాటం లేని సహజo
కవిత నిర్మాణo తనది…
గోపాల్ కవిత లో అక్షరాలు
జీరో గ్రావిటి ఉన్నట్లు తేలిగ్గా ఉంటాయి..
కానీ
కవిత మన మనస్సుల్లో పెట్టె భారంకి
న్యూటన్ సూత్రం సరిపోదు..
గోపాల్ వాళ్ళ నాన్న
గొంతు.. గుండె..
పాట..
కథ..
ప్రేమ..
తెలిసిన వాడ్ని..
ఈ సంచిక లో అన్ని కవితలు చదివివుంటా అనుకుంట..
పుస్తకం తెరచి చూడ్డం వరకే
మన చేతుల్లో ఉంటుంది..
మిమ్మల్ని చదివిస్తుంది…
మళ్ళీ మళ్ళీ చదివిస్తుంది…
నా నమ్మకం…
మా మిత్రుడి పై నమ్మకం..
గోపాల్… కి అభినందనలు…
తెలుపుతున్నాను…
బాగా చెప్పావు శివుడు
చాలా మంచి పరిచయం సార్
ధన్యవాదాలు
గోపాల్ గారి “నాయిన పాట”వినాలని ఎదురుకళ్ళతో…..