తిమ్మాపురం బాలకృష్ణ రెడ్డి స్మారక రెండవ సాహిత్య పోటీకి ఆహ్వానం
(ఫిబ్రవరి 24, 1926 – నవంబర్ 1, 2015)
తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించే తిమ్మాపురం బాలకృష్ణ రెడ్డి స్మారక పోటీలు 2021లో నవలా ప్రక్రియ మీద జరుపుతున్నాము. ఈ నవలా పోటీకి తెలుగు రచయితలందరికి ఆహ్వానం.
ఒక్కో నవలకు 20,000 రూపాయలు చొప్పున రెండు ఉత్తమ నవలలకు బహుమతి.
నవలలు పంపించడానికి గడువు: నవంబరు 30, 2021
నవలలు పంపించాల్సిన ఈ- చిరునామా: tbkr.sahityam@gmail.com
ప్రచురణ: “సారంగ” పక్ష పత్రికలో వీలు వెంబడి— బహుమతి పొందిన రెండు నవలలు మాత్రమే
నవల ఇతివృత్తానికి పరిధులులేవు. రచన సొంతమనీ, దేనికి అనుకరణగాని, అనువాదంగాని కాదని, ఇంతకు ముందు ఎక్కడా ప్రచురణ కాలేదని, మరే సంస్థ పరిశీలనలో లేదని, ఈ పోటీ కొరకు ప్రత్యేక రచన అని హామీ పత్రాన్నివిధిగా జతపరచాలి. రచయిత వివరాలు హామీ పత్రములో మాత్రమే ఉండాలి. రచనలో ఎక్కడ రచయిత పేరు, అడ్రసు ఉండకూడదు. నవల 150 పేజీలకు మించరాదు (12 point, single space).
రచనలు యూనికోడ్ లేదా ఇతర వర్డ్ ఫైల్ తో పాటు పిడియఫ్ లో కూడా పంపాలి. చేతిరాతతో రాసేవారు ఎ4 సైజు పేపరులలో రాసి స్కాన్ డాక్యుమెంట్ గా పంపాలి.
బహుమతులపై నిర్వాహకులదే తుది నిర్ణయం. ఈ పోటీ విషయంలో ఏవిధమైన ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.
*
కొంతమంది మిత్రుల సలహా మేరకు ఫార్మటు నిబంధనలు సవరిస్తున్నాము.
రచనలు యూనికోడ్ లేదా ఇతర వర్డ్ ఫైల్ తో పాటు పిడియఫ్ లో కూడా పంపాలి. చేతిరాతతో రాసేవారు ఎ4 సైజు పేపరులలో రాసి స్కాన్ డాక్యుమెంట్ గా పంపాలి.
ప్రకాష్ తిమ్మాపురం
ఫలితాలు రావడానికి ఎన్నాళ్ళు పట్టవచ్చండి?
వచ్చిన నవలల సంఖ్యను బట్టి ఒకటి రెండు నెలలు పట్టవచ్చండి
చేతివ్రాతతో రాసేవారు ఆ ప్రతుల యొక్క scanned documents మాత్రమే పంపిస్తే సరిపోతుందా చెప్పగలరు! చేతివ్రాతతో రాసేవారికి నిబంధనలుంటే తెలియజేగలరు… ఉదా:- పేజీల సంఖ్య, పేపర్ సైజు, లైన్ల సంఖ్య మొదలైనవి.
ధన్యవాదములు🙏
scanned document సరిపోతుంది. మీ చేతివ్రాత మేము చదవగలిగేటట్లుగా ఉండాలి. ప్రింట్ లో సుమారు 150 పేజీలు ఉంటె బాగుంటుంది. Use your judgement!