నమ్మకాలెగిరిపోతున్నాయి

హంతకుడి అహింసా సూత్రాలు

కసాయి కల్తీ ప్రేమ పారవశ్యంలో గొర్రెపిల్ల

అన్యాయ శాస్త్రంలో సెక్షన్లన్నీ

కంఠం చేస్తూ న్యాయాధీశులోరు

నేరస్తుల నిత్య రక్షణకై

థర్డ్ డిగ్రీ ప్రయోగశాలల్లో పోలీసుస్వామి

రాజ్యాంగం లేని రాజ్యం కోసం

ఏలికల పాకులాట

పాఠాల్లేని బల్లో

పిచ్చాపాటీ పంతులు

రాయని పరీక్షకి మార్కులేసుకుంటూ

రాని వుద్యోగం కోసం రికమెండేషన్ లెటర్

వేటలో స్టూడెంట్ కుర్రోడు

చీకటి వెలుగులో చలిగాసుకుంటూ

ఒట్టుతీసి గట్టున ప్రేమికుడు

ఇన్‌స్టాల్ మెంట్ స్కీమ్ లో ప్రేమికురాలు

సిన్మా కష్టాలూ, స్టంట్ సీన్లూ లేని

సుఖాంత కతలు

ప్రేమొక కన్వీనియంట్ కమిట్ మెంట్ గా

భయంలోంచి పుట్టిన దేవుడు

భక్తుడి బతుకు కోరికకి భయపడి

పూజారి డబ్బుల హుండీలో

రక్తం కక్కుకుని  దేవుడి ఆత్మహత్య

దేవుడూ, సూర్యుడూ

శాస్త్రమూ, చదువూ, సిద్ధాంతమూ

బాధలూ, భయాలూ, ప్రమేలూ

నమ్మకాలూ, నాగరికతలూ

వొక్కక్కటే…

సూర్యుడు రేవు

తూర్పునుదయించకపోవచ్చు

ఆకాశంలో ఎగురుతున్న గుర్రం

నమ్మకాలు వోడిన నాలాగా!

*

కేశవ కుమార్

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Dear Kesav, Good afternoon! The poem is excellent! Ignorance is more than wisdom! There are 4500 religions all over the world! Business rules the world & dominates Science! We increase our population but decrease plants & animals so we are punished by Corona & other disasters! The earth may vanish if we don’t improve plants & animals! Sex & violence spread all over the world! SARAT

  • అద్భుతమయిన కవితావేశం, మనసులో మొలకెత్తిన భావాలను శక్తివంతంగా భావ చిత్రాల లోకి మార్చ గలిగే శిల్ప చాతుర్యం — అన్నీ ఉన్నా ఎందుకీ నిరాశావాదం!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు