3
సాయంత్రం కావడానికి ముందు
చికాగో కాఫ్టేరియా చాయ్ హౌస్ లో
వెనకాల వీపుని తాకుతున్న వాహనాల రద్దీ
చాయ్ హౌస్ లో గడబిడలు
కాస్త సిగరెట్టు పొగ
రోడ్డు మీద దుమ్ములో కలిసిపోతున్న ఎండ
ముసలితనం సోకినట్లు నగరంలో నలిగినతనం
పొలాల మధ్యగా షోకుగా వాలే ఈ ఎండ
నగరంలో ఎంత జీవరాహిత్యంతో కొట్టుకులాడుతుందో
చాయ్ కప్పు సన్నటి పొగలలో …ఎండవేడి
కడుపుని కొంత సమయం వరకూ నిద్రపుచ్చటానికి పనికొస్తుంది
వేడిని తాగి వేడిలో మగ్గటమే
నగరంలో మనం చేయగల పని
ఒక చల్లటి సాయంత్రం కోసం ఎదురుచూస్తూ కూర్చుంటే
నువ్వెక్కాల్సిన బస్సు
నగరపు ధ్వనుల్లో కలిసిపోతుంది
మళ్ళీ నువ్వు ఏదో చాయ్ హౌస్ లో చాయ్ తాగుతూ
పగటి ఎండంతా రాత్రికి కప్పుపై తేలే పొగలో కలిసిపోయి
నీకు నగరపు వేడినిస్తుంది
ఇక ఆ రాత్రి
నువ్వొక ఆరిపోవటానికి సిద్దంగా ఉన్న
సిగరెట్టు లాగా మారిపోతావు.
*
నువ్వు ఎక్కాల్సిన బస్సు నగరపు ధ్వనుల్లో కలసి పోతుంది
పొలాల మధ్య షోకుగా వాలే ఎండ
నగరంలో ఎంత జీవరాహిత్యంతో కొట్టుకులాడుతుందో- beautiful and at the same time terrible
ఎండ గురించి బాగా చెప్పావు తమ్ముడు.
మరిన్ని కవితలు రావాలి నీ నుంచి.