ధార 

ధ్యాహ్నపు గాలులు
ఆకుల మీద గీసుకు పోతూ..
శాంతి లేని కాలంలో బరువుగా
చెదిరి పోయే దృశ్యాలు
నలత పడ్డ కంటి తడి.
చిత్రకారుడి చిత్రం లో
నిరాశ చేరితే
చిత్రమంతా
చీకటి మరకలు
విషాదం గా  కనిపిస్తాయి.
*
అయినా కూడా
మళ్ళీ  పగుళ్ల నుండి
పొడుచుకు వచ్చే జీవం
పచ్చని పూవుని పూస్తుంది.
చూశావు కదా!
ముగింపు లో కూడా
సన్నటి ధారకట్టి
చెవికింపుగా వినిపించే
సంగీతంలా అది జననం.
అందుకే,
మరణం దూరమే –

2

నిరాకారము

పూలు రాలే వేళ
చెట్టు కన్నీళ్ళు కార్చింది
చిత్రం గీస్తున్న చిత్రకారుడి గీత చెదిరింది.
హృదయం విషాదమైన వేళ
చీకటి చేరింది
దృశ్యం అదృశ్యం అయ్యింది
ప్రేమించిన పాట
ఒకటి
పలవరింతలా మారింది
మరి, నిద్రలేని ఆ రాత్రి
కలకు తావెక్కడిది
అంతా నిరాకారము.
*

లక్ష్మి కందిమళ్ళ

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా చాలా బాగున్నాయి రెండు కవితలు!
    ధార
    జనన మొక మరణం
    మరణమొక జననం
    నిరంతరం…
    నిరాకార ము
    ఆకార నిరాకారాల
    నిరంతర సాకారం!

    • మీ ఆత్మీయతకు చాలా ధన్యవాదాలు పెద్దనాన్న గారు. ❤

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు