ధనికొండ రచనలకు ఆహ్వానం

                                    

ధనికొండ హనుమంతరావు (1919-1989)

ఆధునిక తెలుగు సాహిత్యచరిత్రలో ధనికొండ హనుమంతరావుకు ప్రత్యేక స్థానముంది. కథలు, నవలలు, నాటకాలు, ఇత్యాది సాహిత్య ప్రక్రియల్లో చెయ్యి తిరిగిన రచయిత ఆయన. తీసుకున్న వస్తువుద్వారా, శైలి ద్వారా, ఉపయోగించే భాష ద్వారా, పాత్రలను తీర్చిదిద్దే విధానంద్వారా ఆయన సాహిత్యరంగంలో ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నారు. హాస్యానికీ, వ్యంగ్యానికీ, చమత్కారానికీ ధనికొండ పెట్టింది పేరు.  ఈరోజు ప్రముఖస్థానంలో ఉన్న రచయితలెందరో ఆయన ప్రభావంతో రాస్తున్నవాళ్ళే.

ధనికొండ హనుమంతరావు 1919 మార్చి 4న గుంటూరు జిల్లా ఇంటూరులో జన్మించారు. బి.ఏ. దాకా చదివిన ఆయన రచనావ్యాసంగం విద్యార్థి దశలోనే మొదలయింది. 1938నుంచి ఆయన కథలు, నవలలు రాయడం ప్రారంభించారు. సుమారు 120 కథలు, నాలుగు నవలలు, పది నవలికలు, రెండు నాటకాలు, నాలుగు నాటికలు, వందకు పైగా వ్యాసాలు ప్రచురించారు. మొపాసా కథలతో సహా అనేక అనువాదాలు చేశారు. ఇంద్రజిత్ అనే కలం పేరుతో కూడా రచనలు చేశారు. వివిధ పత్రికలకు సంపాదకుడిగా పనిచేశారు. స్వయంగా అభిసారిక, చిత్రసీమ, జ్యోతి పత్రికలను స్థాపించారు. క్రాంతి ప్రెస్ ద్వారా అనేక గ్రంధాలను ప్రచురించారు. ఇలా సాహిత్యరంగంలో బహుముఖీనమైన ప్రతిభద్వారా, కార్యక్రమాలద్వారా, వ్యక్తిత్వంద్వారా నిలదొక్కుకున్న వ్యక్తి, శక్తి ధనికొండ హనుమంతరావు. జీవితంలో నిరాశనిస్పృహలు ఎదురైనప్పుడల్లా వాటిని ధైర్యంగా ఎదుర్కొని, జీవితాంతం తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తిత్వం ఆయనది. సినీరంగం ఆహ్వానించినా మనస్సాక్షికి కట్టుబడి దూరంగా ఉండిపోయారు.

సాహిత్యలోకంలో అరుదైన లక్షణాలతో విలక్షణమైన వ్యక్తిత్వంతో జీవితాన్ని కొనసాగించిన ధనికొండ శతజయంతి సందర్భంగా ఆయన రచనలన్నిటినీ పునర్ముద్రించే బృహత్తర కార్యక్రమాన్ని ఆయన కుమారులు భుజానికెత్తుకున్నారు. గుడ్డివాడు, ఎర్రబుట్టలు, స్వార్థపరులు,మొపాసా కథలు, ప్రియురాలు, గళ్ళరుమాలు, దేవకన్య మొదలైన రచనాసర్వస్వం సుమారు ఏడు సంపుటాలుగా 2019 జనవరిలో విజయవాడలో జరిగే పుస్తక మహోత్సవంలోను, హైదరాబాదు, చెన్నై, ఢిల్లీ, తెనాలి తదితర నగరాల్లోనూ ఆవిష్కరణకు సిద్ధమవుతున్నాయి. మరోసారి సాహిత్యలోకం ఆయన రచనలను ఆదరిస్తుందని ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా ధనికొండ అభిమానులైన మీరు, మీకు తెలిసిన ధనికొండ రచనలకు సంబంధించిన విశేషాలను తెలియజేయవలసిందిగా కోరుతున్నాం.

ధనికొండ నరసింహారావు                                                                                                         ఆచార్య మాడభూషి సంపత్ కుమార్

Mobile: +91 9841021266                                                                        తెలుగు శాఖాధ్యక్షులు,

Email: rao@betmedical.com                                                                     మద్రాసు విశ్వవిద్యాలయం, చెన్నై-600005

Mobile: +91 9444075128

Email: madabhushisk@gmail.com

ఎడిటర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు