వెతికే చూపులేవో అందులో ఉండునేమో
దొరికే మాటలేవో అందులో ఉండవేమో
ఆలోచనలు కనిపించే ఆకాశంపై ఎగరగలవేమో
విరిగిపోయే వొరిగిపోయే వీడిపోయే
పారిపోయే ఆనందం ఎగరనీ
కనిపించనీయకు ఎప్పటికీ
నోరు తెరిచే అద్దాన్ని ఎవరికీ
ఆకలేస్తే ఎవరిని దేబరించాలో
ఈ చిందరవందర ఆత్మైనా దారి చూపుతుందా
విడదీసేది ఏదైనా
ఎక్కడుంటుందో చూసావా
చప్పుడు చేసే మాటలతో
ఓ వాక్యాన్ని
చప్పుడులేని నిశ్శబ్దంలో ఎలా బంధించాలి
ఓ అబందీ
బట్టలిప్పేసే పువ్వులు నిను చూస్తాయి
నీకెప్పటికీ తెలియదు నీ నగ్న హాసం
గోడలులేని గోడలు కావాలేమో
ఓ చనిపోయే సువాసనలో
ఎప్పటికో అక్కడెక్కడో
నీ కన్నీటి బొట్టు విగ్రహం ఉండనీ
*
చిత్రం: సృజన్ రాజ్
”’విరిగిపోయే వొరిగిపోయే వీడిపోయే
పారిపోయే ఆనందం ఎగరనీ
కనిపించనీయకు ఎప్పటికీ
నోరు తెరిచే అద్దాన్ని ఎవరికీ
ఆకలేస్తే ఎవరిని దేబరించాలో
——————————
ఓ చనిపోయే సువాసనలో
ఎప్పటికో అక్కడెక్కడో
నీ కన్నీటి బొట్టు విగ్రహం ఉండనీ”’- కోల్లెజ్ పోయెం బావుందండీ.