ఉదయాన్నే పుట్టిన సూరీడు
మధ్యాహ్నానికి ఎండను ఏరులై పారిస్తున్నాడు
అప్పుడెప్పుడో పురుడోసుకున్న గాలి
మళ్లీ తిరిగి తనను కనమని
నిన్నా మొన్నటి మొక్కల్ని వేడుకుంటోంది
ఇన్ని కోట్ల మంది
ఇంటా ఒంటా ఉప్పటి ఉప్పై పుడుతూనే వున్నా
తానింకా ఇంకిపోలేదేమా!?
అని సంద్రం సాయంత్రం అయ్యేసరికి
ఆవిరి బీరువాల్లోకి దూరిపోతోంది
తోక తెగిన పువ్వొకటి
చెట్టు నుంచీ రాలుతూ
అక్కడే కుళ్లి కృశిస్తున్న
తన అక్కా తమ్ముళ్లను చూసి
నవ్వూ ఏడుపును రాల్చుకుంటోంది
తన చుట్టూ మూగిన ఈగలను
తరిమి కొట్టేటందుకు తోక లేదని
వగచి తియ్యదనం నీరుగారి పోతోంది.
*
చిత్రం: సృజన్ రాజ్
Title justification తెలియలేదు.
పర్యావరణానికి సంబంధించి అనుకుంటా!
ఎక్సలెంట్ పోయం అభినందనలండీ