1
అదే సూర్యుడు అదే చంద్రుడుఅదే కాంతి అదే చీకటిరోజులు ఖుషి గా కాలర్ ఎత్తుకు నడిచిపోతూ ఉండేవి… … …చిన్నప్పుడుబడికి గుడికి పోదాం అనుకున్నప్పుడు అరికాళ్ళలో ముల్లు విరిగి
విలవిలలాడి పోయానుకాళ్లకు చెప్పుల రక్షణ లేవు.
2
తరగతిలో చేతులకు
ఎప్పుడూ మైదాకు తో
మెహర్ ని సా బేగంమసీదులో రోజూ
మబ్బులమాజ్ చేసే యాకూబ్గమగమ జవ్వాజ
పొడిసువాసనతో
తెల్లని మల్లె పువ్వులా
నవనవలాడే స్వరాజ్యలక్ష్మిదేవుని స్తోత్రం లాటి జ్ఞానానంద రావు అందరం చీకటి బావిలోని
విజ్ఞానాన్ని తోడే చేంతాడు పురిలా
కరితో కలిసిమెలసి ఉండేవాళ్ళంనల్లబల్లపై తెల్ల గీతలా సహాధ్యాయులతో3ఇప్పుడు నా ఈడు 64సూర్యుడు చంద్రుడు ఎప్పటిలాగేకానీవెలుగు కంటిలో తమస్సు నలక పడింది మిత్రులంతా
ఎటు పోయేవాళ్ళు అటుపోతున్నారు శత్రువులాచేయి కలుపుతున్నారో చెయ్యి ఇస్తున్నారో తెలువది గాక తెలువది
ఏమైందో ఏమో గాని
లోపల మనుసుల్లో
అగ్గి పగ రాజుకుంటోందికాళ్లకు కళ్ళు చెవులు ఉన్నాయి
సర్కారు ములు చూసి
ఇప్పుడు గుండెల్లో దిగిందిచెప్పుకో లేని రానినొప్పి తడ తడ పెడుతుంది.*
Add comment