తుమ్మ ముల్లు

తుమ్మ ముల్లు

1

 అదే సూర్యుడు అదే చంద్రుడు
అదే కాంతి అదే చీకటి
 రోజులు ఖుషి గా కాలర్ ఎత్తుకు నడిచిపోతూ ఉండేవి
…    …    …
చిన్నప్పుడు
బడికి గుడికి పోదాం అనుకున్నప్పుడు అరికాళ్ళలో ముల్లు విరిగి
విలవిలలాడి పోయాను
కాళ్లకు చెప్పుల రక్షణ లేవు.
2
తరగతిలో చేతులకు
ఎప్పుడూ మైదాకు తో
మెహర్ ని సా బేగం
మసీదులో రోజూ
మబ్బులమాజ్ చేసే యాకూబ్
గమగమ జవ్వాజ
పొడిసువాసనతో
తెల్లని  మల్లె పువ్వులా
నవనవలాడే స్వరాజ్యలక్ష్మి
దేవుని  స్తోత్రం లాటి జ్ఞానానంద రావు అందరం చీకటి బావిలోని
విజ్ఞానాన్ని తోడే చేంతాడు పురిలా
కరితో కలిసిమెలసి ఉండేవాళ్ళం
నల్లబల్లపై తెల్ల గీతలా సహాధ్యాయులతో
3
ఇప్పుడు నా ఈడు 64
సూర్యుడు చంద్రుడు ఎప్పటిలాగే
కానీ
వెలుగు కంటిలో తమస్సు నలక పడింది మిత్రులంతా
ఎటు పోయేవాళ్ళు అటుపోతున్నారు శత్రువులా
చేయి కలుపుతున్నారో చెయ్యి ఇస్తున్నారో తెలువది గాక  తెలువది
ఏమైందో ఏమో గాని
లోపల మనుసుల్లో
అగ్గి పగ రాజుకుంటోంది
కాళ్లకు కళ్ళు చెవులు ఉన్నాయి
సర్కారు ములు చూసి
ఇప్పుడు గుండెల్లో దిగింది
 చెప్పుకో లేని రాని
నొప్పి తడ తడ పెడుతుంది.
*

జూకంటి జగన్నాథం

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు