తిమ్మాపురం బాలకృష్ణ రెడ్డి- సారంగ కథల పోటీ విజేతలు వీరే!

మొదటి సారి నిర్వహించిన తిమ్మాపురం బాలకృష్ణ రెడ్డి కథల పోటీకి అపూర్వమైన స్పందన లభించింది.  ఇప్పుడే మొదలుపెట్టిన ఔత్సాహిక రచయితల దగ్గరనుంచి పేరుప్రఖ్యాతులు గాంచిన రచయితల వరకు మొత్తం 172 కథలు పంపించారు. వీరందరికీ మా మనస్సుపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కథలన్నిటినీ చదివి, వారి అమూల్యమైన సమయాన్ని ఈ పోటీ కోసం వెచ్చించి, అభిప్రాయాన్ని తెలిపిన న్యాయనిర్ణేతలందరికి–ముఖ్యంగా ఆర్. ఉమా మహేశ్వర రావు, వెల్డండి శ్రీధర్ గార్లకు-  మా కృతజ్ఞతలు.

చిత్తూరు నుంచి షికాగో వరకు అన్ని రంగాల్లోఉన్న (డాక్టర్లు , ఇంజినీర్లు, బ్యాంకర్లు , గృహిణులు) కథా విశ్లేషకులు పోటీకి వచ్చిన కథలను చదివి మొదటి రౌండ్ లో వడపోసిన తరువాత, మిగిలిన 76 కథలను రెండు తెలుగు రాష్ట్రాల్లోని  ప్రసిద్ధి పొందిన కథా రచయితలు, విమర్శకులు క్షుణ్ణంగా చదివి 10 కథలను చివరి రౌండ్ కి ఎంపిక చేసారు. చివరి రౌండ్లో సారంగ యజమాన్యం, బాలకృష్ణారెడ్డి తిమ్మాపురం సాహితీ కమిటీ సభ్యులు కూలంకుషంగా చర్చించి ఈ క్రింది కథలను ఎన్నుకున్నారు.

మూడు కథలకు బదులు ఆరు కథలకు బహుమతి ఇవ్వడం న్యాయంగా వుంటుందని న్యాయనిర్ణేతలు అభిప్రాయపడడంతో ఈ మొత్తం బహుమతిని ఆరుగురికి సమానంగా అందిస్తున్నాం.

బహుమతులు గెలుచుకున్న రచయితలందరికీ అభినందనలు. తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సహకరించిన సారంగ యాజమాన్యానికి, ఈ పోటీల్లో పాల్గొన్న  రచయితలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు.

ఈ క్రింది కథలన్నిటికి సమానమైన బహుమతి ఇవ్వడం జరిగింది కాబట్టి ఎటువంటి ర్యాంకు ఇవ్వడంలేదు.

 

నీళ్లచిలువ- సుంకోజి దేవేంద్రాచారి

పొలిమేరలు దాటిన న్యాయం- బి. వి. రమణ మూర్తి

ఏకత్వంలో భిన్నత్వం- ఎఱ్ఱాప్రగడ రవి ప్రసాద్

లాక్ డవున్ టైం- కంచర్ల శ్రీనివాస్

మరో కోణం- చింతపల్లి యమున

ఎదగవమ్మా  వెర్రితల్లి- శ్రీ చరణ్ మిత్ర

 

ఈ కథలన్నీ సారంగలో వీలు వెంబడి ప్రచురిస్తాం.

ఎడిటర్

3 comments

Leave a Reply to సాహితీ ‘లంకె’బిందువులు | వసుంధర అక్షరజాలం Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు