ఇందు మూలంగా అందరికి తెలియజేయునది ఏమనగా “టోరుకు బీమువచ్చినాయి, రేపుపద్దన్నేఆరుగంటల నుండి ఇస్తారు.అందురుపోయితెచ్చుకోవాలం
ఆ సందులో నేను సోలిగ్గాఇని కూడా పక్కనింటి ఆయమ్మను “ఏదంటా” అని మల్ల అడిగితి. ఆయమ్మ ఉండుకొని “టోరుకు బీము వచ్చినాయంట అందరూ పోయితెచ్చుకోవాలంట”అనే. ఇంతలోమావొదిన ఉండుకొని “ఇదేంపోయేకాలమమ్మ,ఏడాదికి ఒకనాడే కిష్ణఅన్నట్టు,ఈమాదిరిదండోరాఏసి ఆ మరుసునాడు తెల్లగా తెల్లారకనే చెరువుకల్ల,ఏటికల్ల,గుట్లకల్ల ఆడమగా పిల్లాపెద్దాపోయి రెడ్డికి రూకలు కట్టి వస్తా ఉండారు.(రొంటేలకి(బైటికి)పోవడా ఇబ్బుడు ఇంకా ఈనడమున కంప్యూటర్ అనే కొత్త సిస్టన్ పెట్నారు. ఆ కంప్యూటర్ అనే డబ్బాల్ని గవర్నమెంట్ ఇచ్చినారు గదా మాంత్రికుని ప్రాణాలు చిలకలో ఉన్నట్టు మా జాతకాలు అన్నిఆ కంప్యూటర్లో ఉన్నాయంట. మేమునెలకు ఒక్కసారి పోయి మా జాతకాలు చెప్పించుకోవాల్సి వస్తాఉంది. ఆడబ్బాఅరచేతిగీత చూసిచెప్పదు.చేతిలోనిఏళ్ళకు ఉండేగీతలు సరిగ్గాఉంటేనే ఒప్పుకుంటుంది.అప్పుడేబీమువస్తా మా పెద్దమ్మ మొగుడు ఫుల్ తాగుబోతు. పెండ్లాం బిడ్డలు అనడు. దేశ దిమ్మరి. ‘పచ్చగా ఉన్న తావన తిని ఎచ్చగా ఉండే తావన పనుకొనే రకం.’ ఒగోసారి ఊర్ల మింద ఎల్లినాడు అంటే నెల రెండు నెలలు గాని ఇంటికి రాడు. ఆయమ్మ కాయకష్టం చేసేది . కొత్తగ కార్డులు ఇచ్చినపుడు వాల్ల ఇల్లాదులు ఏలుగుర్తులు తీసుకోను పోతే ఆయమ్మ మొగుని ఏలి గీతలు కంప్యూటర్లో పడినాయి ఆమె ఏలి గీతలు మట్టుకు పడలేదు . ఈ ఏలు గుర్తుల కోసం, బీము పోగొట్టుకోలేక మా పెద్దమ్మ అట్లాంటి పోరంబోకు మొగుణ్ణి బరిస్తా ఉండాది.
టోరు కాడికి నెలనెలా మగోళ్ళుఆడోళ్ళు వాళ్ళ ఈలుమానం కొద్దీ పోతారు. నేను ఎబుడూను పోను, నా మొగుడే పోయి తెస్తాడు. అందులోను ఆ ఏలి గురుతులు ఏసే డబ్బాకు సిగినేల్ అందాలంట లేదంటే ఆ సిగినేల్ తగిలిందాక నిలబడాలంట. ఇట్లాంటి పంచేటు పనులుంటాయని ఒకడుగుముందుగపోతారు.ఆరోజు నామొగుడు కూడా ఊరోళ్ళతోపాటు బండిఏసుకుని పాయ. నా మొగుడుపోయిన ఓ గంట కంతా బీము తీసుకొని వచ్చేస. నేను”ఏమి ఇంత బిరిన్న వచ్చేసినావే అంటి” “అయ్యో అదేల చెపుతావు తిండికి రొంటేలకి ముడేసినారు,మొరుగుదొడ్లు కట్టని వాళ్ళకు ఎవరికీ బీము ఈరంట, టోరు కాడికి వచ్చినవాళ్ళు సగానికి సగంమంది ఎనక్కి వచ్చేసినారు అనే” అయ్యో పోనీలే మనం ముందుగ కట్టింది కూడా మంచిదయ్యింది అని అంటి. ఆయాలకే ఊర్లో అందరూ దీనిపైనే మాట్లాడుకుంటా వుండారు. టోరు కాడికి పోయినోల్లల్లో ఒగ పది మంది తప్ప మిగిలిన వాళ్ళంతా ఉత్త సంచులు ఎత్తుకొని ఎనక్కి వచ్చేసిరి.. మేము దావలో నిలబడి ఏమి అని అడిగితే మాకు ఈలేదమ్మ అని ఒగాయమ్మ అంటే, మాయాడది ఇన్ల అనిఒగాయప్ప అంటే, నేను ఎబ్బుడో చెప్పితి బాతురూము కట్టమని నా మొగుడు ఇంటేగద అని మా వొదిన… ఇట్లా ఊరంతా టాము టాము అయిపోయింది. “ ఈ చంద్రబాబునాయుడు చేసే పండ్లుఅన్నీ ఇట్లాటివే! ఈ పల్లెల్లో ఏంటికి యాన్నో టవునుమార్గంలో వాళ్ళకి తావు ఉండదు ఆడ కట్టుకోవల్ల కావాలంటే,వాళ్ళు కూడాఈడికే వచ్చి కూసోని పోయేంత తావుఉంది మాకు”అని మాసిన్నమ్మ అంటాఉంది. ఊరుఊరంతా మొరుగుదొడ్ల గురించే మాట్లాడుకుంటా ఉండారు. మా ఊరుకి మొరుగుదొడ్లు కట్టించాలని ఇసుకూలుఅయివోర్లు, పోలీసులు,యండిఓ, యంఆర్ఓలు, ఎలుగోల్లు ఇంగా చిన్నచితక అధికారులంతా ప్రతి రోజూ జడి తిరిగినట్లు తిరగతా ఉన్నారు. వాల్లు తిరగడం చూసి ఇవి మన పాలిట పన్నాయేమో అనుకొని ఎబ్బుడు బీము నిలిపిరో అబుడు బయపడి కట్టే పని పట్టిరి. మా వదిన ఉండు కొని వాళ్ళు యిచ్చినారే గానీ ముందుగ పెట్టుబడి పెట్టేది ఎవరు మా దగ్గర డబ్బులేదు. ఎవరుఈ గవర్నమెంటును నమ్ముకొని ముందుకొచ్చి చేసేది అనే. ఇదే అదును అన్నట్లు ఇసకోల్లు,ఇటుకోల్లు,బేల్దారులు డబుల్ రేట్లు అడగతాఉండారు. మా సుట్టింటిపెద్దమ్మకి, పెదనాయనకి సుమారు అరవైఏండ్లు ఉంటాయి. వాళ్ళు ఊపలేరులేపలేరు.వాళ్ళకి ఆ టోరుబీమే ఆదారం. లెటిన్ రూము కట్టుకోకుంటే యాడవచ్చేబీము రావోఅని వాళ్ళుపడిన తాపత్రం ఇంతఅంతా కాదు. బేల్దారులు రాక ఇసుక,ఇటుక మొయ్యలేక వాళ్ళు పడిన అవస్త మాటల్లో సెప్పలేము. ఇంతలో మాఆడబిడ్డ ఉండుకోని”ఊర్లోఉండే బేల్దారులు ఊర్లోఉండేవాళ్ళకి పనిచేస్తారా’ఊరుకుక్కను ఊరుకుక్కే చెయ్యదన్నట్లు’ బయటపనికిబోతరు.ఏమన్నామాట్లాడితే పట్టెడుబంగారు చేతిలోఉన్నట్టు వాళ్ళఎచ్చులు చూడలేము.ఉండూర్లో మేము అడగలేము బయటైతె అడిగినంత యిస్తారంటారు . ఊర్లోవాళ్ళు బయటకుబోయి బయటోళ్ళుఊర్లోకి వచ్చి రోజుకుఅయిదునూర్లు నుండి ఎయ్యికిపైగా తీసుకుంటున్నారు.“గాలి వచ్చినబ్బుడే తూరుపు పోసుకోవాలంటారే అదేఇది” అనే . ఏదిఏమైనా పండగోపెండ్లో వస్తే ఊరందరిలోను తాపత్రంఉంటుందో, ఆమాదిరిగా ప్రతిఒకరినోట మొరుగుదొడ్ల గురించే.కనీసం చుట్టాలఊర్లకి కుడా పాలేక పోతున్నారు. చుట్టాలు ఏల రానిది అని అడిగితె మేము మొరుగుదొడ్లు కట్టుకోవల్ల అంటాఉండారు. *** పాత కత ఎత్తుకుంటే పల్లె పగైతుంది అన్నట్టు ఈడ మల్ల పాతకత ఎత్తుకుంటిమి. నాకుపెండ్లి అయిన కొత్తలో మాఊరిలో జలజారులు ఉండేవి. మా ఊర్లో ఎవురన్న బిడ్డను యియ్యలన్న, తెచ్చుకోవలన్న ముందుగా జలజారు ఉందా అని చూసి లేదంటే ఎట్లా మేము బిడ్డను యిచ్చేది అని అడిగే వాళ్ళు! బాగా జరుగుబాటు తనం ఉండే వాళ్ళు అనుకోండి మొన్నురాళ్ళతో మనిషి ఎత్తు మూడుగోడలు కట్టి దాంట్లో ఒగ పెద్దబండ వేసీ జలజారు తయారు చేసే వాళ్ళు! ఇంగా కొంచం సన్న బన్న వాళ్ళు అయితే అడివికి బోయి బందిరాకులు తెచ్చి తడికి మాదిరి కట్టి అది వాడేవారు. అదికూడా కట్టుకొలేని వారు ఇండ్లగోడల కింద, సూర్లకింద బండఏసీ, ఆడోల్లు రొమ్ముల పైదంక పావడ కట్టుకొని రవ్వంత మొరుగున నీళ్ళు పోసుకోనేది. మగోల్లు అయితే ఆరుబయటనే కాళ్ళ కిందకు ఒగ బండ ఏసుకొని పోసుకునే వాళ్ళు. బాలింతలకి ఐదురోజులు నీళ్లుబోసేటపుడు ఆ జలజారుబండకు పూజచేసి నన్నునాబిడ్డను కాపాడు జలజారమ్మ అని దణ్ణం పెట్టుకోమంటారు పెద్దోళ్ళు. ఈ జలజారలని నీళ్ళు పోసుకోను మాత్రమే వాడేది, రొంటేలకి బయటబోయే వాళ్ళు. ఒగటికి అయితే ఇంటి సుటకారం బోసుకునే వాళ్ళు. ఈ మాదిరిగా రొంటేలకి బోయి తెచ్చిన రంపులు కుడా ఎన్నో ఉన్నాయి,మా ఊర్లో మొన్నటికి మొన్న మా ఆడబిడ్డ, వాళ్ళ అన్న పెండ్లాము ఇద్దరు రొంటేలకి బోయినారంట ! పోయినోళ్ళు ఎదురుబదురు కూసోని మా ఆడబిడ్డ వాళ్ళ మరిది పెండ్లాముగురించి పుచ్చిన మాటలు చెప్పుకుంటా అది ఆట్లాడిది, ఇట్లాడిది, వాడితో ఉంది వీనితో ఉంది అని మాట్లాడుకుంటా ఉండారంట. వాల్ల యిద్దరికీ అడ్డంగా పెద్దగుండు ఉంది. మా ఆడబిడ్డమరిది ఆ గుంటికి ఆపక్క వానికితొందరైపోయి కూసోనిఉండాడు. వాళ్ళకి వాడు కనబడడు కాని వీళ్ళమాటలు విని ఈ గొంతు మా వొదినిదే కదా, వాళ్ళు నా పెండ్లాము గురించే చెప్పుకుంటా ఉండారు అని వాడు ఆడ ఏమి మాట్లాడలేక అదే వూకున ఇంటికి వచ్చి, వాని పెండ్లాన్ని పట్టుకొని, నీ గురించి మా వొదిన యేరిగే తావన చెప్పతా ఉంది. నువ్వు నా ఇంట్లో అవసరమే లేదు ఎల్లిపో అని పట్టుకొని కొట్నాడు , పెద్ద రంపు అయింది. ఊర్లో ఉన్నిబన్నోల్లు అంతా వచ్చి వాల్లిద్దరిని తిట్రి . యారగను బోయినోల్లు మీ పని చూసుకొని రావల్ల ఈల్లమాటలు వాల్లమాటలు ఎందుకు అని దండిచ్చిరి. మా మిడిగుడ్ల సిన్నమ్మమాట్లాడుతూ “ఈలెటిన్ రూములు కడత ఉండారు గాని ఎవ్వురమ్మ దాంట్లోకుసుండేది. ఇబ్బుడైతే యారిగేదాని మింద సొట్టు పెట్టి నా కోడాలు దానిజతకు మాయక్క కోడాలు ఇద్దురూ పొద్దు పుట్టక ముందు పోతారు, మల్ల పొద్దు బారేడు ఎక్కేదాకా నెత్తిన రాయి బెట్టుకొని కుసుంటారేమో, అవి ఏంటి అరువులో, కొంపలు కూల్సేసే అరువులు. యనకిటికి సామెత ఉంది ‘ బంగారట్ల తోడు, బాయి నీళ్ళకు పోతా ఉంటే కడవలో నీళ్ళు కల్లలో పోసి పాయనంట ‘ దీనట్లాడిదే ! గవర్నమెంట్ చేసేది కూడా మన మంచికేలే” అనే . ఇంతలోమా వదిన ఉండు కొని “ఆసీస ఎట్లమ్మ వాటల్లో యేరిగేది. ఇంట్లోతిని ఇంటెనకల యారగతార? వొళ్ళు బాగాలేక నేను టౌనుకు బోయి ఆసుపత్రిలో జేరితే గతిలేక కక్కసు రూములోకి పోవల్లా అంటేనే నాకు వచ్చేది కూడా రాదు,అట్లాంటిది పల్లిలో కుసోమంటే ఎట్లబ్బ, వాల్ల పోరుకు కడతా ఉండామే గాని బిల్లు అవతానే గుంతలు పూడ్చేసి బేసిని పెరికేయమా” అనే! ఇంతలో సిర్రెంటుకలాయమ్మ ఉండు కొని “మొన్న నాకు చానా అరిజెంటు అయ్యి దూరం బాలేక దావ లోనే కుసుంటి. దావలో కుసుంటే ఆ దావింటి కనీసంపదిమంది అయినపోయింటారు. గుంజిళ్ళు తీసినట్టుఅయింది నాపని. వాళ్ళు వచ్చినబ్బుడల్లా నిలబడేది, కుసుండేది, ఒగ వేల లేయ్యక పోతిమి అనుకో ‘ ఏమిరా నిన్ను చూస్తె ఏరిగే ఆడది కూడా లెయ్యలేదు’ అని అంటారు. ఆ కర్మ కన్నా అవసరానికి బాతురూము ఉంటె మేలే కదా” అనే! మాయక్క ఉండు కొని “నేను బేసిని పెరకనమ్మ మా యింట్లో ముసిల్ది ఉంది అయమ్మకి మూడు దినాలకు ఒగ సారి బేదులు. దూరం బాలేక గుడ్లలోనే కుసునేస్తుంది. అవి ఉతికేటబ్బుడు ఆ వాసనకి నాకు ప్రాణంబోయి వస్తా ఉంది. ఇబ్బుడైతే చిన్నగా తోడుకొనిబోయి లెటిన్ రూములో కూసోని బెడత” అనే. అదికూడా నిజమే. మొబ్బోమొడమో పడి కడుపు సుగ్గు ఎత్తుకుని బేదులు పట్టుకుంటే పనికొస్తుంది ఇంతలో మా ఆన్లు పెదనాయన ఉండు కొని “మొన్న గౌరీ పుట్టినింటికి ఎల్లి పోయింది కుడా దీని గురించే కదా అది రొంటేలకి చేరువులోకి పోయింది అది కుసోని వచ్చేటబ్బుడు దాని మింద దూరుబన్నోడు ఆ దారింటి వస్తా ఉండాడు. ఇద్దురు ఎనక ముందు వచ్చేది దానిమొగుడు చూసి నువ్వూవాడు ఒగటిగా వస్తాఉండారని “ నీయట్లాడిదె మొగునికి గిన్నిలోసంగటిబెట్టి యారగను పోయోస్తానని జెప్పి తప్పుజేసి వచ్చిందంట ” అని తిట్టి కొట్టి ఒట్టి నిందలుబెట్టి పెండ్లాన్నితరిమేసి ఇబ్బుడు దిక్కులేని సావు సస్తా వుండాడు” అనే. “అది సరేలే ఇబ్బుడైతె నీళ్ళు ఉండాయి ఇంగ వచ్చేది ఎండాకాలం ఊర్లో బోర్లు గాని నిలిసిపోతే నీళ్ళకు ఎంత దూరం పావల్ల . అబ్బుడెట్లమ్మ, అట్లాంటబ్బుడు పోయి బయట యారిగేసి రాయికో ఆకుకో తుడుసు కొని రాకుండా ఎవరుజెప్పిరి ఈబాధ అనే” మా యత్త . నేను యిన్నంతసేపు ఇని “అట్లని మీమాటలు ఎవురూయినరు. ముందుమాదిరి మొరుగుదొడ్లు వాడకుండా ఉన్నారంటే కొన్నిరోజులకిమనఊరికినాలుగుగంటల రేతిరిలోనే పోలీసోల్లువస్తారంట.నాలుగుదిక్ ***
అర్థాలు టోరు=స్టోరు రొంటేలకి = దొడ్డికి,బైటికి ఎలుగోళ్ళు =వెలుగుప్రాజెక్టువాళ్ళు దూరుబన్నోడు =లైoగిక సంబంధమున్నదని నింద పాలైన వాడు ఇల్లాదులు= కుటుంబసభ్యులు |
తిండికి రొంటేలకి ముడేసే !
యనకిటికి సామెత ఉంది ‘ బంగారట్ల తోడు, బాయి నీళ్ళకు పోతా ఉంటే కడవలో నీళ్ళు కల్లలో పోసి పాయనంట ‘ దీనట్లాడిదే !
చాలా బాగా అమ్మనుడిలో వ్రాసారు. అయితే, నాకొక సందేహం.. రోజంతా పనిపాటలు చేసుకునే కష్టజీవుల వేలిముద్రలు కనబడకుండా చేతులు అరిగిపోతాయా? అలా జరగదని సైన్స్ చెబుతుంది. మీ అనుభవం వేరు అయితే వివరించగలరు. మీ పరిశీలన తప్పయితే కథలో ఆ వాక్యం తొలగించవలసినదిగా మనవి.
Did finger prints change by time?
https://www.quora.com/Do-fingerprints-change-with-time
శ్రీనివాసుడు గారూ, అరిగిపోవడం వెనుక సైంటిఫిక్ రీజన్ నాకూ నిర్దిష్టంగా తెలీదు కానీ వర్కింగ్ క్లాస్ లో అలా అరిగిపోయి ఇలా ఇబ్బంది పడుతున్న వారైతే తెలుసు.
Dermatitis is an inflammation of the skin that causes itchy, red spots, blistering and scarring. Sometimes it can be so severe that it would make you unable to leave prints. Or the absence of fingerprints can be caused by trauma or burns or skin problems such as eczema, psoriasis, or something called scleroderma.
ఇంకొక సమాచారం… Can You Lose Your Fingerprints? – Scientific American…. https://www.scientificamerican.com/article/lose-your-fingerprints/
అరిగిపోవడానికి కారణాలు యిప్పటివరకూ తెలుసుకున్నవి అవి.
ఎండపల్లి భారతి గారూ, మీరు వ్రాసిన వాక్యాలలో వున్న అసత్యాన్ని గురించి వివరంగా చెప్పాను. ఇంతవరకూ మీరు స్పందించలేదు.
‘‘ఈకంప్యూటర్ పతిమొగోని ఏలిగుర్తులను ఒప్పుకుంటుంది. ఆడోళ్ళఏలిగుర్తులనుఒప్పుకోదు.ఎందుకంటే ఇరవైనాలుగుగంటలు ఆడోళ్ళు పనులు చేసిచేసి వాల్లఏలికుండేగీతలన్నీ అరిగిపోయినాయి. మేము ఎవరికి చెప్పుకోవల్ల .ఆ కంప్యూటర్ పెట్టికి కూడా మా చేతిలో రాతలు తలయాస్ట అయినాయి.’’
మీరు ప్రసిద్ధులైన రచయిత్రులు గనక, అమ్మనుడిలోమీరు వ్రాసిన ఈ కథ తమ పలుకులో మాట్లాడుకునే పీడిత జనుల కొరకు గనుక వారు ఈ కథ చదివినవారిలో కొందు తమ చేతిలో వున్న అరిగిపోయిన గీతలు (మగవాళ్లకి అరిగిపోవు, ఆడవాళ్లకి మాత్రమే అరిగిపోతాయని మీరు చెప్పారు) తీవ్రమైన పని ఒత్తిడివల్ల అని పొరబడే అవకాశం వుంది.
నిజానికి ఆ సమస్య చర్మవ్యాధులవల్ల కలిగే దుష్పరిణామం. అంతేగాని వేరేవిధమైనది, మీరు చెప్పినది కాదు. అలా పొరబడితే తమకున్న చర్మవ్యాధులకు చికిత్స తీసుకోకుండా వుండే అవకాశం వుంది. వైద్యచికిత్స అవసరమైన పరిస్థితిని గురించి మీరు చెప్పాలిగానీ పొరపాటు చెప్పకూడదు. మీ వ్రాత ద్వారా వాళ్లని చికిత్సకి దూరంచేసే అవకాశం వుంది.
నేను పై వ్యాఖ్యలలో యిచ్చిన శాస్త్రీయ కారణాలని చదివి మీరు ఆ వాక్యాలని తొలగిస్తారని ఆశిస్తున్నాన.
బాగుంది అని అనడం సరి కాదు. ఈ సబ్జెక్టు తీసుకోవడంతోనే సవాల్ మొదలయింది. సునాయాసంగా పల్లె భారత దృశ్యాన్ని మన భారతమ్మ చూపించింది. ప్రేమ, త్యాగం,పగ, నీతి, నిజాయితీ లాంటి అపద్దాల, ఆదర్శాల కహానీ కాదు ఈకథ. వాస్తవాల వ్యంగాస్త్రం. వూరూ వాడా చాటిస్తా
భారతి గారు, చాలా బావుంది కథ.. కథ అనడం కన్నా పల్లె జీవితం అనడం సబబు ఏమో.. నేను వేసవి సెలవుల్లో, మా నానమ్మ ఊరికి (కే.వి.పల్లె) వెళ్ళిన రోజులు గుర్తు వచ్చాయి.. the slang…. I still remember..
ఈ కతలో భారతి గారు మరుగు దొడ్ల విషయంలో గ్రామీణుల దృక్పధాన్ని చక్కగా చూపారు .ఐతేఈవిషయం లో గ్రామీణ శ్రామికుల ఆలోచనలలోనే కనబడే వైరుధ్యాలని వైవిధ్యాన్ని చూపడం ద్వారా పాఠకుల ఆలోచన పరిధి విస్తరించడానికి తోడ్పడ్డారు.
నిజానికి భారతి కతలు అన్నీ గ్రామాలూ,అక్కడి ప్రజలు,అక్కడి ప్రక్రుతి …అన్నిటి గురించి జ్ఞానాన్ని పెంచే పాఠ్యపుస్తకాలు. ఈ కతలో గ్రామీణ స్త్రీల ఐడెంటిటీని గుర్తు పట్టలేని కంప్యూటర్ యంత్రాలలాగే, గూగుల్ తల్లిని ఆరాధిస్తూ దానిలోనే జ్ఞానాన్ని వెతుకు కొనేవారు,ఆంగ్ల ఉటంకింపులనే జ్ఞానంగా భావించే మెకాలే మానసపుత్రులు భారతి అందిస్తున్న గ్రామీణవిజ్ఞానాన్ని అందుకోలేరు.అటువంటివాళ్ళు కోసంమాత్రమే కింది ఇంగిలీ[ఎంగిలి] పీచు ఉటంకింపు.
: People who work in the construction industry, especially bricklayers, can have their fingerprints worn out over a period of time. Similarly, people who frequently wash dishes with hands or work with chemicals (example: calcium oxide) can lose some of the detail in their fingerprints. However, once such activities are stopped, the worn out patterns (ridges and furrows) tend to grow back over time. So, even in such cases, the “change” in prints is temporary
ఎప్పుడూ విశ్రాంతి లేకుండా చేతులుఉపయోగించే శ్రామిక మహిళలకు వేలిముద్రలు ఎలా పడతాయి ? ఇలాంటి విషయాలు పూసగుచ్చినట్లు గ్రామీణ భారతి బోధించినా అర్థం చేసుకోలేని ఆధునికతావ్యాధికి నివారణ ఏది?
‘‘ఈకంప్యూటర్ పతిమొగోని ఏలిగుర్తులను ఒప్పుకుంటుంది. ఆడోళ్ళఏలిగుర్తులనుఒప్పుకోదు.ఎందుకంటే ఇరవైనాలుగుగంటలు ఆడోళ్ళు పనులు చేసిచేసి వాల్లఏలికుండేగీతలన్నీ అరిగిపోయినాయి. మేము ఎవరికి చెప్పుకోవల్ల .ఆ కంప్యూటర్ పెట్టికి కూడా మా చేతిలో రాతలు తలయాస్ట అయినాయి.’’
@ రాణి శివశంకర శర్మ
అది రచయితకు ఆ విషయం గురించిన పూర్తి అవగాహన లేకనో, లేక చెప్పే విషయాన్ని మరింత ప్రభావవంతంగా చెప్పడానికి చేసిన ప్రయత్నమో అయివుండగా, దానిని వక్రీకరించి పనిచేసే గ్రామీణ స్త్రీల చేతి వేలిముద్రలు మాత్రమే అరిగిపోతాయని, పురుషుల చేతులు అరిగిపోవనే విషయమే గొప్ప గ్రామీణ విజ్ఞానమని చెప్పడమే ‘‘మా వేదాల్లోనే అన్నీ యిన్నాయి’’ అని మూర్ఖించే పర్వర్టుల లక్షణం. వారు ఉటంకించిన ఎంగిలిపీచు వాక్యాలు కోరా.కామ్ లింక్ లోని వ్యాసానివి. దానిలోని మొదటి వాక్యమే ఇది.
Short Answer: No. Fingerprints are permanent and last a lifetime.
ఆ కోరా లింక్ ఇది.. https://www.quora.com/Do-fingerprints-change-with-time
కనీసం ఆ వ్యాసం అయినా, లేదా నేను యిచ్చిన మూడువ్యాసాలయినా పూర్తిగా చదవకుండా మనకు నచ్చిన, అవసరమైన రెండు వాక్యాలని పట్టుకొచ్చి ఇక్కడ అతికించడంలోనే మన మిడిమిడి జ్ఞాన మిడతం భొట్ల నైజం బయటపడింది. కోరా. కామ్ లో వ్రాసింది ఓ సాధారణ వ్యక్తి, శాస్త్రజ్ఞుడు కాడు. నేను యిచ్చిన సమాచారం ఆ విషయంలో సంపూర్ణ సాధికారత కలిగిన వైద్యులు, శాస్త్రజ్ఞులవి.
గ్రామీణ విజ్ఞానాన్ని గౌరవించుకోవాలంటే కావలసింది ఇలాంటి వితండవాదన కాదు. శాస్త్రానికి ప్రాచ్య, పాశ్చాత్య లక్షణాలని అంటగట్టడం అనేది మూర్ఖత్వం. ఈ సందర్భంగా ఓ ఋగ్వేద ఋక్కును యిస్తున్నాను. అది చదవుకొని అయినా మన మూర్ఖత్వాన్ని తగ్గించుకుంటే సమంజసంగా వుంటుంది.
आ नो भाः तवो यिवतोऽदासो अपरीतास उिदः (Rig Veda I–89)
ā no bhadrāḥ kratavo yantu viśvato adabdhāso aparītāsa udbhidaḥ
Let noble thoughts come to us from all sides, which harm no one; which are unimpeded and victorious over the forces of division.
వ్యక్తిగత కక్షలను తీర్చుకోడానికి ఎండపల్లి భారతి గారి కథను ఆధారంగా తీసుకోనక్కరలేదు. సామర్థ్యముంటే ఎవరికి తెలిసింది మిడిమిడి జ్ఞానమో తేల్చుకోడానికి తమరు ఇంతవరకూ వ్రాసిన నాలుగైదు పుస్తకాలలో ఏ విషయం గురించి అయినా చర్చకు సిద్ధపడాలి. లేదా XXXXXX >>>>>>>>>
పాఠకులకు ఒక విజ్ఞప్తి… మీ ఎరికలో ఎవరైనా అలా వేలిముద్రలు అరిగిపోయినవాళ్లుంటే దానిని ఒక వైద్యం అవసరమైన శారీరక స్థితిగా గుర్తించి దయచేసి చికిత్స చేసుకోవలసినదిగా చెప్పండి.
పైన ఋగ్వేద ఋక్కు తప్పుగా వ్రాసాను. దానికి సరియైన రూపం ఇది….
आ नो भद्राः करतवो कष्यन्तु विश्वतो.अदब्धासो अपरीतास उद्भिदः |
देवा नो यथा सदमिद वर्धे असन्नप्रायुवो रक्षितारो दिवे-दिवे ||
ఇది ఎండపల్లిభారతి తన స్నేహితురాలి ద్వారా పంపిన లేఖ
అయ్యా ,
మేము ఏగులేసి పొద్దుగుంకే వరకు చేతల కష్టంతో బతికే వాల్లం . నాకు తెలిసింది,నేను అనుబవించేదే చెప్పగలను.మా ఊర్లో కొంతమంది ఆడవాల్ల ఏలి గుర్తులు రాలేదు . ఆ ఏలిగుర్తులు తీసుకునే ఆయన మీ గీతలు అరిగిపోయినాయనే మాటే మాతో చెప్పినాడు .నేను కూడా నిజమే కదా నిద్దర లేసినప్పటి నుంచి చిటుకులు తొయ్యల్ల ,మసిబోకులు తోమల్ల. నల్లగా మాసిన కరుడుగట్టిన గుడ్లు ఉతకల్ల, రోకలి బండతో నూరల్ల,ఇంగా ఇంట్లో కాలుకి అడ్డం బడిన ప్రతి వస్తువునీ ఎత్తిపెట్టల్ల. ఆవుకి గడ్డి కోయల్ల,పాలుపిండల్ల. ఈ పనులన్నీ తొమ్మిది గంట్లకల్లా అయిపేసుకొని పొలంపన్లుకు పోతే ఆడ పిడికిలినిండా గుద్దిలికట్టి పట్టుకొని పదిగంటలు ఆపకుండా గడ్డి తవ్వాల . వరికోతలు కొయ్యను బోతే పిడికిలినిండా కొడవలి బట్టుకొని కోసికోసి ఎయ్యల్ల . వరినాట్లకు బోతే నీల్లలోనే వరిపగిరి పెరికి పెరికి కట్లుకట్టి ఎయ్యాల. వారి నాటే దానికి బోతే మోకాళ్ళ వరకు బురదలోనే కాలు దిగబడి ,నడుము తీరుమానం వంచి ఎడంచేత్తో పగిరి కట్ట పట్టుకొని కుడిచేత్తో పగిరి తీసుకొని లెక్కాచారంగా బురదలో నాటల్ల . పదిగంటలు నిలపకుండా నాటి బురదలో నుండి గడ్డకొచ్చి కడిగితే కాల్లుచేతులు లొత్తలై ,చవికిపోయింటాయి.నిద్రబోయేటప్పుడు తప్ప మా చేతులు కాలీగా ఉండవు . కష్టం చేసి చేసి మా చేతులు కాయలు గాసి వాటారి పొయ్యింటాయి . కష్టం చేసిన చేతులు కాల్లు శాగలు పారినాయి . మగవాళ్లపైన మాకు వ్యతిరేకం కాదు. సీత బాద సీతదయితే పీత బాద పీతది. అట్లా మా బాధలు మావి .
మీ లాంటి వాళ్ళు అందరూ కలిసి వీలయితే కంప్యూటర్ పెట్టుకుని మా ఏలుగుర్తులు తీసుకునే వాళ్లకు అవగాహన కల్పించాలని ,ఇంకా మాకు మేలు జరగల్ల అంటే మేము నెలనెలా స్టోరుకి పోతాం కదా ,
ఆడ ఒక డాక్టర్ని పెట్టి ఎవరి ఏలుగుర్తులు రాలేదో వారిని పరీక్షించి ,ఏముందో చెప్పి పరిష్కారం చూపించాలని ,వాటితో పాటు ఏలి గీతలు పడనివాల్లను ఏరే గుర్తులతో వారినిసులువుగా
గుర్తించే మిషన్లు సైన్స్ లో ఉంటే వాటి గురించి అధికారులకు తెలియజేయాలని కోరుకుంటున్నాను .
నాకు సైన్సు గురించి ఏమీ తెలియదు .అతి తక్కువచదువు నాది .అందుకని నాకు చెప్పే అర్హత లేదు . చేతగాని పని చేసి గాలి మాటలు చెప్పేవాళ్లను మా ఊర్లో వాళ్ళు ” ఇసక తక్కెడ మాటలు” చెప్పేవాళ్ళు అంటారు . అంతటి అపవాదు నాకొద్దు .
నేను మారుమూల పల్లెలో ఉంటాను. నా కథలు టౌన్ లో నాకు తెలిసిన వాళ్ళు టైపు చేసి పోస్ట్ చేస్తారు . మీ ప్రశ్న వాళ్ళు చెబితేనే నాకు తెలిసింది . దానికి జవాబివ్వాలన్నా నేను రాసి వాళ్లకి చేర్చాలి . వాళ్ళు టైపు చేసి పోస్ట్ చెయ్యాలి . అందుకని ఆలస్య మైంది .
ఇట్లు ,
ఎండపల్లిభారతి
అమ్మా, క్షమించండి. స్వయంగా మీరే వ్రాస్తున్నారనుకున్నానుగానీ మీ వ్రాత వెనక మరొకరి సాయం కచ్చితంగా అవసరమనే విషయం నాకు తెలియదు. మీ చిత్తశుద్ధిని నేనేమీ శంకించలేదు. నా మొదటి వ్యాఖ్యలోని మొదటి వాక్యంలో మీరు అమ్మనుడిలో కథను చాలాబాగా వ్రాసారనే చెప్పాను. మీకు ఆ ఒక్క విషయం గురించి అవగాహన లేకనే వ్రాసివుంటారు అన్నానుగాని మీ పట్ల ఏ విధమైన వ్యతిరేక భావాలూ నేను వెలిబుచ్చలేదు. పై వ్యాఖ్య మిమ్మల్ని ఉద్దేశించి వ్రాసినది ఎంతమాత్రమూ కాదు.
వేలిగుర్తులు చెరగిపోవడమూ నిజమే. అయితే, దానికి కారణం మీరు చెప్పినది కాదు. మీ దినచర్యలో రేయీ పగలూ మీరు పడుతున్న కష్టమూ వాటికి కారణం కాదు. అలా భావిస్తే వైద్యానికి దూరమయ్యే అవకాశం వుంది, వ్యాధి మరింత ముదిరే అవకాశం వుందని హెచ్చరించడం వరకే నా వివరణ. అంతకన్నా ఒక్క పిసరు కూడా ఆ విషయంలో మీ ప్రమేయాన్ని నేను ఎత్తిచూపడంలేదు.
ఇక, ప్రభుత్వపరంగా ఈ విషయమై పరిష్కారాలని మీరు సూచించారు. మీలాగా నేను కూడా అతి సామాన్యుడిని. ఏ విధమైన ఒత్తిడీ ప్రభుత్వవర్గాలమీద తీసుకురాలేను. నా ఫేస్ బుక్ పుటలో ఈ విషయం గురించి మీ సమస్యలను గురించి తీర్చమని టపా పెట్టగలను. నాకున్న మిత్రబృందంలో ఈ విషయం గురించి అవగామన కల్పించగలను. వారికి తెలిసినవారందరికీ మాధ్యమాల ద్వారా తెలియజేసి, తద్వారా ప్రభుత్వానికి చేరేటట్లుగా ప్రయత్నించగలను. అంతవరకే నా స్థాయి, సామర్థ్యం.
అమ్మాయ్ ఎండపల్లి భారతి, కింది ఇంగిలీ ( ఎంగిలి ) పీచు ఉటంకింపులు కంప్యూటర్ లోని గూగులమ్మ తల్లి దగ్గర దొంగిలించి, కాపీ సేసి, ఇక్కడ గీకేసానే గానీ నాకూ అర్తమవ్వలా. వివరాలు నీకు టెల్లిఫోను జేసి సెపతాలే. నామిని అన్నను, తిర్పతి ఆర్ ఎం ఉమామహేశ్వరావు ను ఇంకా మనోళ్లనందరినీ అడిగానని సెప్పు అమ్మాయ్.
Biometric verification ( either thro’ fingerprint or iris / retina scanning ), Aadhaar cards, internet connectivity at ration shops, are some of the problems faced by the people at the point of sale (POS) ration shops ( Public Distribution System -PDS, India’s food security system for distributing subsidized food and non-food items to India’s poor ).
There are about 5,00,000 fair price shops (FPS) across India. The system costs India’s treasury US$13.6 billion per year, almost one percent of the country’s GDP.
“You have to identify yourself by fingerprint recognition or you don’t get ration.
Unable to verify fingerprints, leprosy patients denied ration in Haryana CM’s constituency
Old persons and manual labourers who have calloused hands record weak fingerprints that do not register with biometric-scanners kept at the Electronic Point of Service (EPOS) of fair price shops (FPS) while issuing foodgrains to the ration-card holders.
“For such people, rations are issued by the inspector at the FPS outlets,” maintained an official from the Chief Rationing Officer’s (CRO) Hyderabad office.
.
For those without Aadhaar cards, enrolment ID
numbers are sought and these are entered in the network at the FPS outlet for the cardholder to get a one-time password . This is sent to his/ her mobile number registered with the CRO.
A smart ration card using Radio frequency identification (RFID) technique, biometrics and SMS gateway is another improvement method to overcome finger print reading problems.
రామయ్యగారూ, తెలుగులో ఈ సమాచారం దొరికింది.. ఇది నెలక్రితం వార్త. అయితే, ఎంతవరకూ అమలుజరుగుతోంది అనేది తెలియదు.
ఐరిస్‌తో అక్రమాలకు అడ్డుకట్ట
వేలిముద్రలు పడని వారికి ఊరట
జిల్లాకు చేరిన 200 పరికరాలు
గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : జిల్లాలోని కొన్ని మండలాల్లో పింఛన్ పంపిణీలో అక్కడక్కడ అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. పుల్లలచెరువు మండలంలో చనిపోయిన వారి పేర్లతో నెలల తరబడి పింఛన్లు కాజేసిన సంఘటనలు ఇటీవల సామాజిక తనిఖీలో బయటపడ్డాయి. ఇప్పటికే జిల్లా అధికారులు ఈ విషయంలో అక్రమాలకు పాల్పడిన నలుగురిని సస్పెండ్ చేశారు. వేలిముద్రలు పడని లబ్ధిదారులకు పీడీవోల వేలిముద్రలతో అందజేసే వెసులుబాటు కల్పించారు. దీన్ని అదనుగా భావించిన కొందరు పీడీవోలు మృతిచెందిన వారిని బతికి ఉన్నట్లు చూపించి నిధులు కాజేస్తున్నారు. ఈ సంఘటనలను తీవ్రంగా భావించిన రాష్ట్ర సెర్ఫ్ అధికారులు వేలిముద్రలు పడనివారికి ఐరిస్ యంత్రాలతో లబ్ధిదారుని కనుపాపలు పోల్చి పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టూరు. రాష్ట్ర సెర్ఫ్ అధికారులు జిల్లాకు ఈ నెలలో 200 ఐరిస్ యంత్రాలు అందజేయగా, వాటిని జిల్లా అధికారులు మండలానికి మూడు చొప్పున అందజేశారు. పురపాలికల్లో కూడా వీటిని ఇచ్చారు. ఈ నెలలో వీటిని ప్రయోగాత్మకంగా వినియోగించి అవి సత్ఫలితాలను ఇస్తే అన్ని పంచాయతీలకు వీటిని అందించే అవకాశం ఉంది.
వేలిముద్రలు పడని లబ్ధిదారులు 16 వేల మంది…
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద 3,53,155 మంది వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. వారిలో సుమారు 16 వేల మంది వేలిముద్రలు పడక పీడీవోల సహాయంతో పింఛను తీసుకుంటున్నారు. వేలిముద్రలు పడని లబ్ధిదారులు ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 10వ తేదీ వరకు పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరిగి ఇబ్బందులు పడాల్సివస్తోంది. పలు పంచాయతీల్లో వీరికి పీడీవోలు తమ వేలిముద్రలు వేసి కొన్ని నెలలుగా లబ్ధిదారులకు ఇవ్వకుండా సొమ్ము కాజేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం పీడీవో వేలిముద్రలతో నగదు పంపిణీ అయిదు శాతం మించి పంపిణీ చేయవద్దని ఆంక్షలు విధించారు. జిల్లా డీఆర్డీఏ అధికారులు అయిదు శాతానికి మించి పింఛన్లు పంపిణీ చేసిన పంచాయతీల్లో ప్రతి నెల క్షేత్రస్థాయిలో నగదు లబ్ధిదారులకు అందిందా లేదా అని తనిఖీలు చేపట్టాల్సి వస్తోంది. ఇలాంటి వ్యయప్రయాసలను తగ్గించేందుకు, పింఛన్ల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు వేలిముద్రలను పడని వారికి ఐరిస్ యంత్రాల ద్వారా పింఛను పంపిణీ చేసేందుకు సంకల్పించింది. అందులో భాగంగా ఈ నెలలో జిల్లాలోని ప్రతి మండలానికి మూడు యంత్రాలను అందజేశారు.
పారదర్శకత పెంచేందుకే…
ప్రభుత్వం పింఛన్ల అందజేతలో పారదర్శకత పెంచేందుకు సంకల్పించింది. అందులో భాగంగా జిల్లాకు రాష్ట్ర సెర్ఫ్ అధికారులు 200 ఐరిస్ యంత్రాలను అందజేసింది. ఇప్పటికే మండల కేంద్రాలకు వీటిని అందజేశాం. వేలిముద్రలు పడని వారికి ఐరిస్ యంత్రాలతో పింఛన్లు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
– జి.వి.వి.వరప్రసాద్, ఏపీడీ, డీఆర్డీఏ
ఇంకొక వార్త…
పడకపోయినా అదే ప్రామాణికం
రేషన్ డీలర్లతో ప్రత్తిపాటి
అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): రేషన్ పంపిణీలో వేలిముద్రలు పడక ఇబ్బందులు పడుతున్నవారికోసం కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రస్తుతం ప్రతినెలా వేలిముద్రలు వేసినా పడనివారికి 1100 ద్వారా సరుకులు ఇస్తున్నామని చెప్పారు. ఇకపై ఒకసారి వేలిముద్ర పడలేదని నిర్ధారణ అయితే అదే ప్రామాణికంగా ఆరు నెలల పాటు సరుకులు ఇచ్చేలా ఆలోచన చేస్తున్నామని వివరించారు.
All the discussion about the problem of finger print identification is distracting totally from the main theme of the story, Bharathi clearly made out in the title itself. The existing food problem is unjustifiably being linked to literally non-existing (at least in their village) shit-problem. People think our CM is aware and capable of answering all the problems faced by Andhra public with his digital solutions. Paradoxically he hails from the same geography, where Bharathi is born and brought up. But look at the stark angles of the vision they use in apprehension of reality of the problem, and we know what a gulf exists between the anticipations of the rulers and the ruled in terms of good-governance. Would the points of understanding ever meet. The finger print discussion is just an aside and unjustified distraction from the issue the story wants to focus. The response from the writer exposes it in all its nakedity.
ఇక్కడెవరూ సమస్యని ప్రక్కదోవ పట్టించే ప్రయత్నంచేయడంలేదు. అనవసరంగా మీ భ్రాంతులని అందరిపై రుద్దకండి. ఇప్పటి ముఖ్యమంత్రికి తొత్తులెవరూ కూడా వ్యాఖ్యానించినవారిలో లేరు. నేను చేసిన హెచ్చరిక అంత అసంబంద్ఘంగా వున్నదా? నేను అడిగింది ఒక వాక్యంలో. దానిని సాగదీయడం అంటారా? లేదా స్పందించడం అంటారా? ఒకరేమో గ్రామీణ విజ్ఞానం అంటారు, మరొకరేమో ప్రక్కదారి పట్టించడం అంటారు. మీకు అది ముఖ్యం కాదనుకుంటే మీ దృష్టిలోని అసలు విషయంపైన వ్యాఖ్యానించండి. అంతేగాని, ఇతరులపై బురద జల్లడానికి ప్రయత్నించకండి. అలా జల్లాలని ప్రయత్నిస్తే మీ చేతులకే అంటుతుంది ముందుగా ఆ బురద. అది గుర్తెరిగి ప్రవర్తించండి. మీ దగ్గర విషయం లేకపోతేనే వ్యక్తిగత ఆరోపణలు చేయడం అనేది జరుగుతుంది. అనవసరంగా ఈ విషయమై ఇక ఇక్కడ సాగదీయకండి. ఈ పత్రిక స్థలకాలాలని వృథా చేయకండి. మీకు అంతగా సాగదీయాలనివుంటే మీ ఫేస్ బుక్ టైమ్ లైన్ మీదకి వస్తాను. అక్కడ ప్రారంభిద్దాం.
చర్మవ్యాధుల వల్ల జరిగేదాన్ని అతిగా పనిచెయ్యటం వల్ల జరుగుతున్నదని చదువు లేనివాళ్ళు పొరపాటు పడుతుంటే వాళ్ళని సరిదిద్దాల్సింది పోయి “మా యింట్లో జంఝెం తెంపేసుకున్నవాడే ఆఖరు బ్రాహ్మడు!మేమే నిఖర్సైన బ్రాహ్మలం కాబట్టి ఆ తర్వాత బ్రాహ్మణ్యమే చచ్చిపోయింది!!” అని తనకి తనే “నేను పూర్ణకలశోధధి చంద్రుణ్ణి” అని మురుసుకునే రాణి శివశంకార శర్మ మెదడులో అమావాస్య చీకట్లని నింపుకుని మూఢనమ్మకాల్ని సమర్ధించడం దేనికో!
తను ద్వేషించే శ్రీనివాసుడు దేన్ని సమర్ధిస్తే దాన్ని ద్వేషించి పారెయ్యాలి అనే దురదలో శ్రామికులకి తెలియజెప్పి వారిని బాగు చెయ్యాలన్న ఇంగితజ్ఞానం కూడా ఎగిరిపోయిందా?
ఇలాంటి వాళ్ళ బ్రాహ్మణత్వాలూ పాండిత్యాలూ దేనికోసం?క్రెడినిలిటీ లేని పాప్యులారిటీ కోసం ఇంత నీచానికి దిగజారాలా?
Vishayam pakkadari pattindanee, asalu katha antharyam idanee na abhiprayam mathrame rasanu. Nenemee anledu thamarini. Akasmathuga Balakrishna puninatlu endukee prathapalu? Mallee ade antunna .. Vishaysm velimudra kaadu, thindiki, rentiki vesthunna asandarbhapu mudi.
Velimudrala charcha kadhamsanni pakkadari pattinchindani mathrame cheppanu. Prayathna purvakamani nenu analedu. Akasmathuga Balakridhna puninatlu endukee prathapalu. Malli ade antunnanu. Thindiki, rentikee anyayamga mudesthunna sarkaree julum prasninchalo vaddo mathrame thelchandi. Ikkadi vishayam idi. Naa timeline nindu khalee. Emi chustharakkada!
వేలిముద్రల గురించి అనవసరమైన చర్చ కథావిషయాన్ని గురించి చర్చని దారిమల్లించింది.[నరహరిగారు చెప్పింది నిజం.] కేవలం ఇంటర్నెట్ లో మనకి గల ప్రాథమిక పరిజ్ఞానం ఆధారంగా గ్రామీణ రచయిత్రిని అవాక్కు చేయాలనుకొనే నాగరిక అహంకారం క్షమార్హం కానిది.ఇది మొత్తంగా కథపై చర్చని దారి మల్లించింది.పొరపాటున ప్రమాదవశాత్తు ఈఅనవసర అసందర్భ వేలిముద్రల ప్రహసనంలోకి ప్రవేశించినందుకు క్షమించవలసినదిగా కోరుచున్నాను.
భారతి గారు గ్రామీణ సమస్యలపై గ్రామీణ శ్రామిక మహిళా దృక్పధంతో ,గ్రామీణ శ్రామిక భాషలో కతలు చెప్తారు,నాగరిక కృత్రిమ తెలుగు,ఎ౦గిలీసులని ఆశ్రయించి, ఇంటర్నెట్ లో విహరించేవాళ్ళకి ఆవిడ కథలు,ఆలోచనలు,ఆవిడ అందజేసే గ్రామీణ పరిజ్ఞానం అవగతం కావడం కష్టమే.అలాంటప్పుడు సందర్భం లేని చర్చలతో దారిమల్లించడం కంటే మౌనం శ్రేయస్కరం.ఈ అసందర్భ చర్చలోకి అనవసరంగా వేలు పెట్టడమే కాక, ఎ౦గిలీసు మాటలతో ఖరాబు చేసినందుకు క్షమించవలసినదిగా కోరుచున్నాను.
ఇంక లెంపలు వాయించుకొని కతపై చర్చిద్దామని మిత్రులు అందర్నీ ప్రార్థిస్తున్నాను.
‘‘కేవలం ఇంటర్నెట్ లో మనకి గల ప్రాథమిక పరిజ్ఞానం ఆధారంగా గ్రామీణ రచయిత్రిని అవాక్కు చేయాలనుకొనే నాగరిక అహంకారం క్షమార్హం కానిది.‘‘
పిచ్చిపిచ్చిగా మాట్లాడితే మర్యాద దక్కదు. నా వ్యాఖ్యలలో ఎక్కడైనా రచయిత్రి పట్ల కించిత్ అయినా తక్కువ భావాన్ని కనబరచానా? నాది నాగరిక అహంకారం అయితే మీదేమిటి? పర్వర్ట్ అహంకారమా? నా మొదటి వాక్యమే కథ చాలా బాగా అమ్మనుడిలో వ్రాసారు అని, అది రచయిత్రిని అవాక్కు చేయడమా? కించపరచడమా? అసలు కథపై చర్చ మొదలైందా? నేనేమీ మొదలుపెట్టలేదే. నేను కథ బాగుందని చెబుతూనే ఒక విషయం గురించిన పొరపాటు అభిప్రాయాన్ని రచయిత్రికి ఎత్తిచూపాను. అలా చూపించడం ప్రక్కదారి పట్టించడమా? చర్చ మొదలుపెట్టడమా?
విషయం వేలిముద్ర అని ఎవరైనా ఎక్కడైనా అన్నారా? దాన్ని తీసుకువెళ్లి గ్రామీణ విజ్ఞానానికి ముడిపెట్టి సాగదీసి ప్రక్కదారి పట్టించినదెవరు? కథాంశంపై చర్చ ఎక్కడ మొదలైంది? మొదలు కాని చర్చ ప్రక్కదారి పట్టడమేమిటి? కథాంశం చాలా బాగా వ్రాసారని చెప్పిన పిదప నేను దిద్దుకోవలసిన విషయం చెప్పాను. సర్కారీ జులం తేల్చమని తమరు చర్చ మొదలుపెడితే అలాగే స్పందించేవాళ్లం. ఇంగ్లీషులో తెలుగు వాక్యాలని వ్రాయడం చేతకానివాళ్లు కూడా ప్రతాపాల పేరెత్తడం. ఇక్కడి స్థలాన్ని కబ్జా చేయడం తప్పని నేను చెబితే ప్రతాపాల పేరెత్తడం, ఇదీ అసలైన ప్రక్కదారి పట్టించడం. నేనూ మళ్లీ చెబుతున్నాను, మన దగ్గర విషయం వుంటే వ్యక్తిగత వ్యాఖ్యలు రావు.
Sorry adi prathapam kadu. Veerangam. Ennatiki thelenu ee advaitham. Vishayamloki dukeyyandi. Kabja samasya Sarangaki vadileyandi. Kadha perulone samasya viswaroopam kanipimpajesina Bharathi kadhapai mee bhasha kanthini prasarinchandi. Memu amma nudi, English vodi theliyani varame. Thelisina meeru pragalbhinchandi.
అనవసరంగా వీరంగాలు వేసి ప్రగల్భాల పలకవద్దు. తమరు ఎప్పడు మొదలు పెట్టమంటే అప్పుడు చర్చ మొదలుపెట్టి, ఏది చర్చ అంటే అదే అని ఒప్పుకునేటంత తోలుబొమ్మలెవరూ యిక్కడ లేరు. ముందుగా బోడిగుండుకీ మోకాలుకీ ముడిపెట్టిన్నట్లు వ్యాఖ్యలు చేస్తూ, గ్రామీణ విజ్ఞానానికీ వేలిముద్రలు అరిగిపోడానికీ లంకెవేసిన కుటిల బుద్ధికి చెప్పండి మీ వీరంగ వ్యాఖ్యలు. ఒక పత్రిక నిర్వహణలో యాజమాన్యాినికి ఎంత బాధ్యత వుంటుందో పాఠకులకూ అంతే బాధ్యత వుంటుంది. కబ్జా విషయం వాళ్లకి వదిలేసి యిష్టం వచ్చినట్లు సాగదీయడం బాధ్యతారాహిత్యం అవుతుంది. భారతి గారు వ్రాసిన కథాంశంలో నేను వ్యతిరేకించవలసినది నాకు కించిత్ కూడా కనబడలేదు, వేలిముద్రల విషయం మినహా. అందుకే, అదొక్కటే ప్రస్తావించాను. లేదా ఈ కథ విషయమై నా అభిప్రాయంగురించి మీకేమైనా ముందస్తు అంచనాలుంటే అవి చెప్పండి, అప్పుడు చర్చ మొదలుపెడదాం.
Daari thapparanukuni dovalo pettajusina na prayathnam porabate. Meeru cheppaka thelisindi adi dari thappadam kadani morning walk leda evening shire ai vuntundani. Mee shikaru konasaginchandi. Nannu shikaree cheyakandi, please. Kadha mugisindi kabatti selavu theesukuntunnanu. Saranganu badhyathaga nirvahinchukondi.
దయచేసి మరీ స్మార్ట్ గా కనిపించే ప్రయత్నం చేయకండి. దారి ఎవరు తప్పించారో, ఎవరు ప్రక్కదారి పట్టించారో వారికి, పైన గ్రామీణ విజ్ఞానం అని మొదలు పెట్టిన వారికి, కుటిల ఆరోపణలు చేసినవారికి చెప్పండి మీ సుద్దులు. వాటికి స్పందనగానే నేను మాట్లాడానుగానీ నా అంతట నేను మొదలుపెట్టింది లేదు. అసలు వాటిలో మీకేం పని? మిగతా చదువరులు వారి అభిప్రాయాలని వారు చెప్పారు కదా, అలాగే మీరూ చెప్పుకోవచ్చు. కుటిల ఆరోపణలు చేసి, వాటిని సమర్థించుకోడానికి అడ్డగోలుగా ప్రయత్నిస్తున్నవారిని వదిలేసి నామీద ఆరోపణలు చేయడం మీ పక్షపాతవైఖరిని సూచిస్తుంది. చర్చ కథమీద కాదు, కుటిల ఆరోపణల మీద అని మీకు అర్థంకావడంలేదా? వాటిని మొదలుపెట్టినవారిని ఒక్క మాట కూడా అనలేని దుర్బలత దేనికి? పాఠకులకు కూడా బాధ్యత వుందంటే నిర్వహణ అంతా వారికే వదిలినట్లా? ఇది కదా వక్రీకరణ! నిజంగా చర్చను నిజాయితీగా కోరుకుంటున్నవారు ప్రవర్తించేది ఇలాగేనా?
I am not a layman. I am a post graduate with biology. I fully knew about thumb impressions. The skin over the tip of the fingers is continuously disposes into environment and will be recreated according to the genetic code for every few minutes.This will happen even though the person is not a labourer!
We are educated people, we need to educate those who are ignorant. How can you justify that idiotic R. S. S.S supporting illiterates as scientists and propagating fake science as genuine?
ఎండపల్లి భారతిగారు! మీ ఊరి ఆడవాళ్ళ బాధలను మీ కథలో గొప్పగా రాశారు. మీకు నా చప్పట్లు!
ఈ పల్లె కోకిలని సినిమా కోయిలలు గుర్తించి బానే చేరదీశాయి. తమదైన భాషనేర్పి రాటుదేలుస్తున్నాయి. ఎటొచ్చీ మీ రచయితల ముఠాలే భారతి కధలు రాత కథలా, నోటికథలా అని చర్చలు చేసి ఆమెకి అంటని ‘విద్యాగంధాన్నీ’ పొందలేని ‘డిగ్రీ’లని వెతుకుతున్నాయి కధని మాత్రం పక్కనిబెట్టి. రేషన్ గింజల న్యాయాన్ని ప్రశ్నిస్తే సైన్సుపాఠాలు నేర్పిస్తున్నాయి. కథల్ని కంప్యూటర్లో స్కాన్ చేసి మరీ చర్చకు పెడుతున్నాయి.
చెప్పింది చాలలేదనుకుంటాను. ఇంకో డోసు ఇవ్వమంటే యిస్తాను. నేను చర్చ మొదలుపెట్టలేదు. నేను చెప్పింది ఒక రచయిత తనకి అవగాహన లేని విషయం గురించి తప్పుగా వ్రాస్తే, దానిని సరిదిద్దుకోమని ఒక వాక్యం వ్రాసాను. దానిని వక్రీకరించి రచ్చ రచ్చ చేసింది ఓ పర్వర్ట్ అహంకారి. అతడిని ఆ విషయం నిలదీయకుండా సైన్స్ పాఠాలు చెబుతున్నారని వంకరగా మాట్లాడితే ఇక్కడ సహించేవారెవరూ లేరు. తెలియని విషయం ఎవరు చెప్పినా తెలుసుకోవాలి. అంతేగాని, గ్రామీణులే చెప్పాలి, చదువుకున్నవారికి చెప్పే అర్హత లేదనడం కూడా సమానమైన మూర్ఖత్వాన్ని సూచిస్తుంది. ఎవరు చేసారు రాతకథలా లేక నోటికథలా అనే చర్చలు? రేషన్ గింజల న్యాయాన్ని ప్రశ్నించడాన్ని ఎవరు తప్పుబట్టారు? ఎవరు కంప్యూటర్లో స్కాన్ చేసి చర్చకు పెట్టారు? మీ తప్పుడు వ్యాఖ్యానంతో రచయిత్రికి మీరు చేస్తున్న ద్రోహం, నష్టం మీకు అర్థం కావడంలేదు. వేలిముద్రలు చెరిగిపోవడం అనేది ఒక రోగ లక్షణం. దానికి చికిత్స తీసుకోవాలి. అంతేగాని అది చేసే పని పరిమాణం వల్ల రాదు.
సారూ!
మెదడు తిన్నగానే పని చేస్తుందా మీకు?పుణ్యానికి పొతే పాపమెదురైందన్నట్టు ఒక మంచి సులహా ఇఛ్చినందుకు ఇంత ఏడుస్తున్నారే!కదా బాగుంది అనే అన్నాడు కదా – అయినా అలా ఏడుస్తారేంటి?మెనూ కంప్యూటర్ పరిజ్ఞానంతో మాట్లాడుతున్నాం అని తప్పు పట్టేవాళ్ళు వెబ్ పత్రికలో ఎందుకు వేసినట్టో!అయ్యా బాబూ వేలిముద్రలు అరిగిపోవటం తాను అనుకుంటున్నట్టు పని ఎక్కువ కావటం వల్ల జరగదు ఆమెకి తెలియకపోతే మనం చదువుకున్నవాళ్లం చెప్పాలండీ అని మొత్తుకుంటుంటే మళ్ళీ మళ్ళీ ప్రపంచంలో ఉన్న జాలి మొత్తం మీకే ఉన్నట్టు పోజులు కొడతారేంటి?
పల్లె జీవితంలో కళ్ళక్కట్టే ఏ పార్శ్వాన్నీ వదలకుండా చిత్రించే కధల్లో చర్మరోగాలుంటే తప్పించుకుపోయేవా? అయినా అసలు విషయం పక్కనబెట్టి చర్మరోగవిజ్ఞానం ముందుకుతెచ్చే సంస్కార యత్నాల్ని ఏమి మెచ్చాలి! ఆమె దీనిని నొచ్చుకున్న తీరైనా రాయించిన లేఖలో కనబడలేదా? డిపోల పక్కన స్కిన్ క్లినిక్కులు పెట్టైనా మీ వేలిముద్రలు తీసుకు చావండి. మా నూకలు మాకు మిగల్చండి అని మొర్రో అంటుంటే పాచిపళ్ళ దాసర్లలా జాలి కబుర్లు ఆఫరీ! పైగా నీకా నాకా ఎక్కువ అన్న పోటీ. నా వల్ల కాదు గాక కాదు. చెయ్ తిరిగినవాళ్ళెవరన్నా చెయ్ చేసుకోండి బాబోయ్. రాత స్థలాన్ని రణస్థలంగా మారుస్తున్నారఱొయ్.
చెత్త మాటలు మాట్లాడవద్దు. సంస్కారయుతంగా ఊరుకుంటున్న కొద్దీ మితిమీరి పోతుంది. ఎవడు దేన్ని ప్రక్కనబెట్టాడు, ఎవడు ఏది ముందుకు తెచ్చాడు? కథ అంతా చాలా బాగుంది. ఇదొక్కటి తప్ప, దీన్ని దిద్దుకోవడం అవసరం. లేకపోతే వ్యాధి ముదురుతుంది అని వ్రాయడం కుసంస్కారమా? ప్రభుత్వం ఏనాడో ఐరిస్ టెస్ట్ లు పెట్టి, లేదా ఇతర టెస్టులు చేసి ఆరు నెలలు, సంవత్సరం పాటు ఆ టెస్ట్ నే ప్రామాణికంగా తీసుకుని సరుకులు యిస్తున్న విషయం దాదాపు వారం క్రితమే నేను వ్రాసినది కళ్లకు కనబడేలేదా? ఆవిడ నొచ్చుకున్నప్పటికిన్నీ ఆవిడ తెలియనితనం వల్ల ఆవిడకి, ఆవిడని చదివిన, విన్నవారికి వచ్చే సమస్యను గురించి హెచ్చరిస్తుంటే, కథ మొత్తం మీద అభిప్రాయమని కుటిల ముష్టి వాదనలు చేయడం చూస్తే మీ మానసిక స్థితి మీద కూడా నాకు అనుమానం వస్తోంది. ఇక చాలించి పనిచూసుకోండి.
రచయిత్రి స్పందించిన తరువాత, మా పరిస్థితి ప్రభుత్వానికి తెలియజేయండి అన్న తరువాత నా ముఖపుస్తక మిత్రులకి 30 మందికి ఈ కథ, మరియు వేలిముద్రలుపడనివారి పరిస్థితిని గురించి వివరిస్తూ ప్రభుత్వానికి తెలియజేయమన్నాను. వాళ్లు, ఇప్పటికే ప్రభుత్వం ఆ విషయాన్ని గమనించి విరుగుడు చర్యలు చేపట్టిందని, వాళ్ల ప్రాంతానికి అవి చేరాయోలేదో తెలియదని మాకు సాధ్యమైనంతగా ప్రచారం చేస్తామని చెప్పారు. అదే రోజు భారతిగారి కథలన్నీ జాలగూటిలో ఏమున్నాయో వెదికి దాదాపు 10 కథలని ప్రోగుచేసి, నా ఫేస్ బుక్ లో పోస్టు పెట్టి వాటి విశిష్టతని అందరికీ తెలియజేసే ప్రయత్నం చేసాను. ఒకరిద్దరికి పంపాను. వారు చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. నా ఫేస్ బుక్ పోస్ట్ లంకె ఇది.
https://www.facebook.com/Sreenivasudu/posts/2196953653926776
ఇకనైనా ముష్టి వాదలను ఆపి అహంకరించకుండా, చేసిన తప్పు ఒప్పుకొని చర్చను ఆపండి. లేకపోతే మాటకు మాట ఇవ్వడం మాకు బాగా తెలుసు. ఇదివరకి ఫేస్ బుక్ లో ఓ యాభై వ్యాఖ్యలు దాటిన వాదనని డెలిట్ చేసుకుని పోయినట్లు పోవడానికి ఇక్కడ అవకాశం తమకు లేదు.
కథకి పరిమితంకాకుండా ఎక్కడెక్కడి విషయాలు పోగేసి హుంకరింపులు అహంకరింపులు. 50 కామెంట్స్ తొలగింపు. ఏమి అసందర్భం. ఇప్పటికీ విషయానికి రాకుండా. ఆగ్రామానికి చర్మవ్యాధులే సమస్య అయినట్లు చర్చ పెట్టడం రేషన్తో టాయిలెట్లు నిర్మాణాన్ని ముడిపెట్టే కుంటి ప్రయత్నాలని సమర్ధించడమే. కథకి ఆధారభూతమైన విషయాన్ని పట్టించుకోకపోవడమే కాదు. మనకి మాత్రమే దృష్టికొచ్చిన విషయం చుట్టూ తిరుగుతూ పాఠక జనాన్నీ తరలించుకుపోయే ఉద్యమ ఉత్సాహం ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు అర్ధం కావడంలేదు. ఇక్కడ నా జ్ఞాన ప్రదర్శనా లేదు. అజ్ఞానపు దాచివేతా లేదు. అందువల్ల చెరిపేసే ప్రయత్నములేదు. పత్రికవారికి కూడా అలాటి ఉద్దేశ్యం ఉన్నట్లు లేదు. చేసినా అభ్యంతరంలేదు. కధా విషయం మీదికి సహృదయుల దృష్టి మళ్లించడమే ఉద్దేశ్యం. మీ రంకెలు మీరు వేసుకోవచ్చు. నాకు తలపడే ఉత్సాహము ఓపిక రెండూ లేవు. సెలవు.
రంకెలు మొదలుపెట్టింది కొనసాగిస్తున్నది ఎవరో జనానికి అర్థమవుతూనేవుంది. నేను యిచ్చిన ఒక వాక్యపు సలహాని రచ్చ రచ్చ చేసి, లేని దురుద్దేశాలు ఆపాదించి, కుటిల నీతిలో సుందోపసుందులు లాగా బురదజల్లి, రేషన్ కూ, టాయిలెట్లకూ ముడిపె్ట్టి, ముష్టివాదన మళ్లీ చేసి, తీరా నిలదీసేసరికి ఓపిక లేదనడమే పలాయనవాదం. అయినా, దానిని స్వాగతిస్తున్నాను. ఎందుకంటే స్థల, కాలాల వృథా ఇకనైనా ఆగుతుందని. భవిష్యత్తులో కూడా దయచేసి నా గురించి వ్యాఖ్యానించకండి. మీ విచక్షణపైన తొలిసారిగా నాకు నమ్మకం పోయింది. వ్యక్తిగత అక్కసుతో ఇద్దరూ కలసి ఆడిన నాటకమని జనానికి తెలిసిపోయింది.
వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళల జీవన చిత్రం గా అభివర్ణించవచ్చు.
బైటికి పోవడానిక, స్నానాలు చెయ్యడానికి ఆడవాళ్లు పడే కష్టాలు దళిత వాడల్లో నుండి చూస్తే మీ కధ కధకాదు జీవితం అని అర్ధం అవుతుంది.
21 వ శతాబ్దంలో బాత్ రూమ్ కూడా ఇంత పెద్ద యుద్ధం చెయ్యాల్సి వస్తుందంటే మనం ఇంకా ఎంత వెనకబడి ఉన్నామో కదా!
దేశ అభివృద్ధి, సంపద కొందరి జేబుల్లోనే కుక్కుకుంటున్నారు కదా!