జవాబు

మీ ప్రశ్నకు జవాబు
నా మాటల్లో ఉండదు..
కనుక-
నేనిచ్చే సమాధానం
అర్ధరహితమే అవుతుంది..
అయినప్పటికీ మీకు,
జవాబు కావాలంటారు..?
ద్రాక్షా వర్ణపు పెదవులతో
దొరచుట్ట పొగ నూదుతూ
సముద్రపు వెన్నల వీధిలో
ఒంటరి జాబిల్లినైన
నన్నెవరూ చూసుండరు, కానీ..
వేకువనే
తీరానికి కొట్టుకొచ్చి
ఆదమరచి నిద్రిస్తున్న వేళ
కొందరు చూస్తుండవచ్చు..
అందుకే ఇలా జవాబుకై సాధిస్తున్నారు..!
ఏ రంగు విందులోనూ
ఇమడలేని నా అంతరంగాన్ని
దేవ దానవులై ఎంత చిలికినా
ప్రయోజనం ఏముంది..?
మీ పునరుత్థానపు
కధలకు
ఋజువుగా
పాతికేళ్ల క్రితం
చనిపోయిన
నా బాల్య స్నేహితుడ్ని
తెచ్చివ్వలేని మీతో..
ఓ నిజం చెబుతున్నాను, జవాబు కాదిది..
పచ్చని పూల వనంపైన
నీలాకాశపు నిశ్చలమైన ప్రేమను
దేవుళ్లూ, పవిత్ర గ్రంథాలూ తుంచేశాక..
ఇప్పటి సాహచర్యంలో ఉన్న దేనికీ
నా అభిమతం కానరానప్పుడు..
ఏటి ఒడ్డున, ఆ పచ్చని చిట్టడవితో పాటూ
నశిస్తున్న నా ప్రాణం మరేదీ ఆలోచించదు..
ఇంకా మీ ప్రశ్నకు అర్థం ఉందా..?
సరే, అంతో ఇంతో
విన్నారుగా
తిరిగి మిమ్మల్నే ప్రశ్నిస్తున్నాను-
మీలా నేనెందుకు లేను..?!
*

చిత్రం: చంద్రం

సొలోమోన్ విజయ్

21 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీలా నేనెందుకు లేను😢

  • పచ్చని పూలవనంపైన నీలాకాశపు నిశ్చలమైన ప్రేమను తుంచేశాక👍👍👍👌👌💐💐💐💐💐

  • బాగా రాశారు. కవిత!..అండి. ధన్యవాదాలు… మీరు మాలాగానే.. ఉన్నారు..!😊!

  • మామ..
    ఎంత చక్కని కూర్పు…
    కూర్పుకు తగిన చిత్రం….
    భేష్…

  • మీ కథ లింగ .
    ఒంటినిండా గుడ్డ కప్పికొన్న కతల్ని చదువుతా ఉండే నాబోటి వాడికి ఒక్కొప్పుడు సగం గుడ్డలు కట్టుకొన్న కతలు కూడా ఎదురు పడతాయి. మీ కత లింగ మాత్రం గుడ్డలేమి కట్టుకోకుండా ఉండాది ఉండట్టు చూపించింది. మన ఆకారం అయినా మన మనసు ఇకారం అయినా ఉన్నది ఉన్నట్టుగా తెలిస్తే గాబరా పుడతది . మన బాణ పొట్టలు జారిన స్తనాలు వాడిపోయిన అవయవాలు బయట పడేస్తే ఎట్లుంటదో మీ లింగ కత చదివితే అట్లా అనిపిచ్చింది. గుడ్డల్లేకుండా కుచ్చూన్న వేమన ఫోటో యాదికి తెచ్చింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు