దేవుడు ప్రత్యక్షమై
స్వర్గం కావాలో
నరకం కావాలో కోరుకోమన్నాడు
మరే ఆలోచన లేకుండా
నరకానికి చేరుకున్నాను
చిన్నప్పుడెప్పుడో
దారం తెంచుకొని
ఎగిరిపోయిన గాలిపటం
ఇపుడు దొరికింది
నన్ను ప్రేమించి
మరొకడ్ని పెళ్లి చేసుకున్న ప్రియురాలు
తిరిగి దక్కింది
హిమపాతపు లోయల్లో తప్పిపోయిన
రేపటి కలల కన్నులతో
స్నేహం కుదిరింది
చెరబండరాజు
సగం రాసి వదిలేసిన కవిత్వం
ఇవాళే పూర్తయ్యింది
నువ్వు దారితప్పిన గొర్రెవంటూ
అద్దాల మేడలో కులికే సైతాను
నను చూసి పళ్లికిలించింది.
*
నన్ను ప్రేమించి మరొకడ్ని పెళ్లి చేసుకున్న ప్రియురాలు తిరిగి దక్కింది
Good poem bhai
బాగుంది
Its awesome
నరకానికి వెళ్లాల్సివస్తుందన్న భయం ఎందుకు మనకింక?