చిక్కులు తీసినట్లు 

అందరిదీ అదే గొడవ
అందరిదీ అదే మాట
తెమలని పనులు
తలకెక్కని ఆలోచనలు
ఏది ముందు?
ఏది వెనక?
సున్నితపు త్రాసులో
కెరీర్, కుటుంబం
ఏది బరువు?
ఏది తేలిక?
కాలం
ఉరుకులు పెట్టే నది పాయ
దిక్కులు లేకుండా
పరుగులు పెట్టడం దాని నైజం
తెడ్డు వేసుకుని బయలుదేరండి
వేగం, దూరం వంటి
అంకగణిత ఫార్ములాలు అవసరం లేదు
బయలు దేరటమే ముఖ్యం
చిక్కులు పడిన జుట్టును దువ్వినట్లు
చేతికి చిక్కని కాలాన్ని
పాయలు పాయలుగా విడదీసి దువ్వండి
అప్పుడు జడ అయినా అల్లుకోవచ్చు
ముడి అయినా చుట్టుకోవచ్చు.
*

రెహానా

3 comments

Leave a Reply to Rehana Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు