నిట్టూర్పుల విస్ఫోటనాల్లో

నెత్తురు కన్నీళ్ళతో తడిసిన
జైలు గోడల మధ్య
కృశించిన దేహం ఆయుధాగారమై పిలుస్తుంది
ల్లని ఊచలు
ఘనీభవించిన ఆశయాల్ని
పలవరిస్తున్నాయి
నిట్టూర్పుల విస్ఫోటనాల్లో
బీటలు పడిన గోడల్లోంచి
నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి.
నేలమీది చిరుగుల దుప్పటి
కొత్తవేడిని రాజేస్తుంది
మూలకున్న ఖాళీకుండ
కల్లోల సముద్రాల్ని కుమ్మరిస్తుంది.
కిటికీలోకి తొంగి చూడలేని
సూర్యుడు మబ్బుచాటున
వ్యూహాత్మక కిరణమయ్యాడు
విచారణలన్నీ రాజులు రాసుకున్న ఏకాంకికలు
మూగవోయిన గొంతుకలో
ప్రత్యామ్నాయ స్వరప్రకంపనలు
భూమికి
సెగలు రేపుతున్న ఋతువులో
రాలిన ఎండుటాకులో
పురుడుపోసుకుంటున్న యోధుడు!
ద్యమాలు త్యాగాలతో
తడిసిన నేల
తొణికిన స్వప్నలిపితో
పదునెక్కిన
పోరాట గీతాన్ని లిఖిస్తుంది.

*

ఎస్.రఘు

2 comments

Leave a Reply to c.v.srinivas Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రాజుల ఏకపక్ష విచారణతో జైలు నాల్గుగోడల
    మధ్య కృషించి ఆయుధాగారం ఐన ఓ దేహం, కల్లోల సముద్రాల్ని పుక్కిట బంధించి,ఉద్యమాలని కమ్మిన మబ్బుల చాటు సూర్యుని వ్యూహాత్మక కిరణాల వెలుగులోపదునెక్కిన నూతన పోరాటగీతాన్ని లిఖిస్తున్న యోధుని స్వప్నాన్ని ఆవిష్కరించిన అద్భుతమైన కవిత..🙏

  • రఘూ! సాంద్రత, సంక్షిప్తత కలబోసిన వాడి, పదునైన కవిత. అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు